గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్రజ్ఞుడు –ఇమాన్యుల్ కాంట్ -4
కాంట్ యవ్వనం, ఉన్నత విద్య , సంపాదన
సాధారణం గా యవ్వన ప్రాదుర్భావం లో శరీరం లో అనేక మార్పులు వచ్చి రూపు రేఖలు ఏర్పడి స్తిరత్వాన్ని పొందుతాయి .కాంట్ రూపు రేఖలేలా ఉన్నాయో తెలుసు కొందాం .కాంట్ అందమైన వాడని ఏ చరిత్ర కారుడూ చెప్ప లేదు .వికార స్వరూపుడు గానే అందరూ రాశారు అయిదు అడుగుల ఎత్తు మాత్రమె ఉన్న వామనా కారి కాంట్ .చాలా బలహీనం గా ఉండేవాడు .అందుకే అర్భకుడు అన్నారు .పొట్ట లావు గా ఉండేది .చాతీ సిమెంటు బల్లలా ఉండేది .వీటికి తోడు భుజం వంకర గా ఉండటం తో ‘’అష్టా వక్రుడు ‘’గా కనీ పించే వాడు .మహా వేదాంతి,గ్రీకు తత్వ వేత్త సోక్రటీస్ కూడా ఇదే ఆకారం లో ఉండే వాడట .ఇలాంటి మహాను భావులకు అందం తో ఏమి పని ? వారి హృదయం, మనసు మేధా సంపత్తి అన్నీ ఎంతో అందమైనవి .కనుక వారినేమీ బాహ్య రూపం బాధించలేదు అంతస్సౌన్దర్యం నిండిన మహాత్ములీ ఇద్దరు .ఇమాన్యుల్ కాంట్ మాట్లాడుతుంటే అదొక వాక్ ప్రవాహమే .మంత్రం ముగ్ధులై శ్రోతలు ఆ ఝరీ ప్రవాహం లో కొట్టుకొని పోయే వారు .అప్పుడాయన బాహ్య రూపం ఏమీ వారికి కనీ పించేదికాదు అసలు దాని పై వారికి దృష్టే ఉండేదికాదట .వికారానికి ఆయన మాటల్లో ఉండే చెణుకులు హాస్యాం మందుగా పని చేసిందేమో నని పించేది .నవ్విస్తూ చతురోక్తులతో ,చక్కని సంభాషణా చాతుర్యం తో ,శైలితో శ్రోతలను కాంట్ ఆకర్షించే వాడు .ఎంత కష్టమైన విషయాన్నైనా అలవోకగా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పగల నైపుణ్యం, నేర్పూ ఉన్న వాడు వాగ్ధాటి ,పాండిత్యం ప్రతిభ అవగాహనా ,పూర్వాపరాలతో మనసుల్ని దోచుకొనే ముగ్ధ మనోహర ఉపన్యాసకుడని పించుకొన్నాడు . .ఆడపిల్లల్ని ఆకర్షించే శారీరక సౌందర్యం లేక పోవటం వల్ల కాంట్ ను వలచి వచ్చిన కన్య ఎవరూ లేక పోయారు .ఇది తీరని వెలితిగానే మిగిలి పోయింది .ఈయన కూడా ఏ అమ్మాయిని ప్రేమించినా అడుగు కూడా ముందుకేసే సాహసం చేయ లేక పోయాడు .కనుక జీవితాంతం పెళ్లి కాని బ్రహ్మ చారి గానే ఉండి పోవాల్సి వచ్చింది .
కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి లో పదహారవ ఏట 1740 లో కాంట్ చేరాడు .తత్వ శాస్త్రం ఫిజిక్స్ ,జామెట్రీ ,ఆల్జీబ్రా ,సైకాలజీ ,ఆస్ట్రానమి ,లాజిక్ సబ్జెక్టులు చదివాడు .కాంట్ చదువు కోసం తండ్రి చేసిన సాయం ఏమీ లేదు .తనతో చదివే,చదువులో వెనక బడిన విద్యార్ధులకు ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదించి దాంతో చదువుకొనే వాడు ,జీవించే వాడు ..ఇప్పుడే మొదటి విలియం మరణించి అయన కొడుకు రెండవ విలియం రాజయ్యాడు .యూని వర్సిటి లో చేరిన తర్వాత కాంట్ జీవితం లో గొప్ప మార్పు వచ్చింది .తనకు కావలసిన సబ్జెక్ట్ తీసుకొనే స్వేచ్చా ,రోజంతా తనకిస్ట మై నట్లు గడిపే స్వాతంత్రం లభించటం వల్ల హాయిగా ఉందని పించింది .ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో చెప్పే వారే లేరు .తండ్రితో ఉన్న ఇంటిని వదిలేసి వచ్చేశాడు .స్వంత గదినొక దాన్ని ఏర్పరచుకొని ,యూని వర్సిటి కి బయటే ఉన్నాడు .యూని వర్సిటి మెంబర్ అవటం వల్లా ,ఎకడమిక్ సిటిజన్ అవటం వల్లా కొనిగ్స్బర్గ్ సిటీ అధికారుల ,అధికారాలకు లోను కావలసిన అవసరం లేకుండా పోయి పూర్తీ స్వేచ్చా జీవి అయ్యాడు .కాని యూని వర్సిటి అధికారులకు మాత్రం తల వంచక తప్పలేదు .అందువల్ల కాంట్ కు అనేక రకాల ప్రయోజనాలు అధికారాలు లభించాయి .ముఖ్యం గా నిర్బంధం గా సైన్యం లో చేరాల్సిన పని తప్పింది ..ఈ యూని వర్సిటి లో చేరటం తో జీవితాంతం దానితో శాశ్వత అను బంధమేర్పడింది .
1940 సెప్టెంబర్ 24 న కాంట్ తన పేరు ‘’Emanuel Kant ‘’గా యూని వర్సిటి రికార్డులలో రిజిస్టర్ అయింది .ఇక్కడ చేరటాన్ని కాంట్ సరదాగా ‘’టౌన్ లో నుంచి ‘’గౌన్ ‘’లోకి ప్రవేశించటం ‘’అని చమత్కరించాడు .దీనితో ఉన్నత గౌరవాలు పొందే అర్హత ఏర్పడింది .సరిగ్గా పదహారేళ్ళ వయసులో ఇంత అద్భుత మైన మార్పు తన జీవితం లో జరిగిందని ఏంతో సంబర పడి పోయాడుకాంట్. .’’కోలీజియం ఫ్రేడ రీషి యం ‘’నుంచి పట్టా పుచ్చుకొన్న తర్వాత ఇక్కడ పెట్టిన ప్రాధమిక పరీక్షలో అతి తేలికగా గట్టేక్కేశాడు .కాంట్ కోలీజియం లో స్తైఫండ్డ్ కాని ,ఫెలోషిప్ కాని తీసుకో లేదు .బోధనా కూడా చేయక పోవటం కూడా ప్రత్యేకతే .తన దారేదో తానూ ఏర్పరచుకొన్నాడు క్లాసిక్స్ నే వృత్తి గా తీసుకోవాలని మొదట భావించినా ఫిలాసఫీ ని మొదటి విషయం గా ఎన్నుకొని చదివాడు .
ఇక్కడే కాంట్ కు Christoph Freidrich Heilsberg .,అనే ఆయన సహాధ్యాయి అయ్యాడు .మంచి స్నేహితుడూ అయ్యాడు .కాంట్ కు ఒక ఏడాది జూనియర్ ఈయన .ఇద్దరూ ఒకే క్వార్టర్ లో ఉండే వారు .Wolmer ‘ఆదేశం మేరకు హీల్స్ బెర్గ్ మొదలైన వారికి కాంట్ ఫిలాసఫీ పుస్తకాలు ఇచ్చాడు .వారికి స్వయం గా బోధనా చేశాడు .క్రమంగా డబ్బు సంపాదన కోసం ఇతర విద్యార్ధులకూ బోధించటం ప్రారంభించాడు .వారందరూ కాంట్ కు అనేక రకాలుగా సాయం చేసి కృతజ్ఞత తెలుపు కొన్నారు .కాంట్ కు కావలసిన సదుపాయాలూ కల్పించారు .కాఫీ ,రొట్టెలను అంద జేసే వారు . ..వోల్మార్ బెర్లిన్ కు చేరడం తో ఆయన స్తానం లో ఉన్న Bellan Kallenberg ‘’కాంట్ కు ఉచిత క్వార్టర్ ను ఏర్పరచి అవసరమైన సాయం చేశాడు .కాంట్ తండ్రి చని పోయిన తర్వాత బాబాయి ‘’Richter ‘’ అనే చెప్పులు కుట్టే ఆయన చిన్న తమ్ముడిని దగ్గరకు తీసుకొని పోషించాడు .కాంట్ బయటికి వెళ్ళే టప్పుడు అరువు తెచ్చుకొన్న కోటు ,పాంటు, చెప్పులు వేసుకొని వెళ్ళే వాడు అంత బీదరికం అనుభవించాడుకాంట్ .ఇవేవైనా చిరిగి పోయి పాడై పోతే స్నేహ బృందం డబ్బులు వసూలు చేసి కొత్తవి కొనిచ్చే వారు .ఇదే కాంట్ కున్న గొప్ప ‘’ఫ్రేటర్నిటి’’అంటే స్నేహ బృందం ..ఆ రోజుల్లో యూని వర్సిటి విద్యార్ధులు తాగుడు ,ఫైటింగ్ మొదలైన వ్యసనాలకు పూర్తిగా బానిసలై పోయే వారు .కాంట్ వీటన్నిటికి దూరం గా జీవించి తన ప్రత్యేకత ను రుజువు చేసుకొన్నాడు .ఆదర్శం గా జీవించాడు మార్గ దర్శీ అయ్యాడు .
కాంట్ –యువ విద్యార్ధులకు సబ్జెక్టులు బోధించటం మాత్రమె కాదు ,వారి శీల ప్రవర్తనల లో గణనీయ ప్రభావం కలిగించాడు .కాంట్ నే విద్యార్ధులు ‘’నైతిక గురువు ‘’గా భావించి గౌర వించే వారు .అక్కడాయన పని చేసినంత కాలం వారిపై కాంట్ ప్రభావం ఉండేది .కాంట్ గారు’’ నవ్వటాన్ని’’ ఎవ్వరూ చూడలేదట .ఈ విషయాన్ని ఆయనే స్వయం గా వెల్లడించాడు కూడా .’’ఎరాస్మస్ ,రోటే న్ డాం ,మాంటేగ్ ‘’ లరచనలు చదివి ప్రపంచం లో ఉన్న మంచిని పెంచుకోమని విద్యార్ధులకు సలహా ఇచ్చేవాడు కాంట్ . ఆట స్తలం లో పెద్దగా కాంట్ ఆడిన ట్లు లేదు .కాని ‘’బిలియర్డ్స్ ‘’మాత్రం చాలా ఇష్టం గా ఆడే వాడని హీల్స్ బెర్గ్ చెప్పాడు .
1700 ప్రాంతం లో జర్మని లో 28 యూని వర్సిటి లున్దేవట .దాదాపు అన్నీ చిన్నవే .మొత్తం 900 మంది విద్యార్దులుందే వారు .1760 లో సంఖ్య ఏడు వేలకు పడి పోయింది .ఆ తర్వాతా అయిదు కొత్త వర్సిటీలు వచ్చినా పరిస్తితి మారలేదు .ప్రష్యా లోని ‘’ఆల్బెర్ర్తినా ‘యూని వర్సిటి ఉన్న రెండు పెద్ద వాటిలో ఒకటి .కొనిగ్స్ బర్గ్ లో ఇతర దేశీయ విద్యార్ధులూ చేరి చదివే వారు .పోలాండ్ ,లుదివేనియాల నుండి వచ్చి చేరే వారు .’ఇక్కడ వేదాంతం చదివే వారికి హాలీ యూని వర్సిటీ లో రెండేళ్ళు చదవాల్సిన అవసరం ఉండేది కాదు .అంటే అంత ఉన్నత ప్రమాణం లో దీన్ని బోధించే వారన్న మాట . సశేషం
మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -13-8-13- ఉయ్యూరు