నా దారి తీరు -66
సభ సమాప్తం
చోడవరపు వారి పెద్దబ్బాయి ,మామయ్యా కలిసి ఎంన్నో ఆశయాలతో నెలకొల్పిన శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ సుమారు పది హేనేళ్లు నిర్విఘ్నం గా నడిచింది .ఆ తర్వాత చోడవరపు వారు పెద్దగా సభ పై ఆసక్తి చూప లేదు అతని మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు .మామయ్యే ఒంటరి గా కార్య క్రమాలు నిర్వహించాడు .ఆయన అనుకోకుండా పక్ష వాతానికి గురై నాడు .కదలలేక పోయాడు ఆయన కు ఆ జబ్బు వచ్చిందంటే ఇనుముకు చేద పట్టి నట్లుఅని పించింది . మంచి ఆరోగ్యం ఆయనది రాళ్ళు తిన్నా హరిన్చుకొనే వాడు .కష్టపడే వాడు .పాలేళ్ళ తో కలిసి కట్టెలు కొట్టేవాడు .పొలం వెళ్లి పాలేళ్ళ తో సమానం గా నాగలి దున్నేవాడు .వ్యవసాయ పనుల్లో ఆయనకు రానిది లేదు అన్నిటా హుషారుగా పని చేసేవాడు .పోత పోసేవాడు బస్తాలు కుట్టే వాడు .బస్తాలు పాలేళ్ళ నెత్తి కేత్తే వాడు .బాల్ బాద్మింటన్ బ్రహ్మాండం గా ఆడేవాడు చెస్ లో మాంచి దిట్ట .ఒకటేమిటి సమస్తం తెలుసు ,చేసేవాడు కూడా .అలాగే ఎవరింట్లో ఏ కార్యక్రమం వచ్చినా నిలబడి సాయం చేసేవాడు వంట వండిమ్చటం, వడ్డించటం ,మర్యాదలు చేయటం ఒక ప్లాన్ ప్రకారం అన్నీ జరిపించటం .ఆయనకు అలవాటు భోజనాలు యెంత ఒత్తిడి కార్యక్రమం అయినా పదకొండున్నరకు ఎత్తాపెట్టాల్సిందే .అంత టైం మెయింటైన్ చేసేవాడు .అలాంటి వాడికి బి.పి.అకస్మాత్తుగా పెరిగి పెరాలిసిస్ వచ్చింది మంచం లోనే ఉండాల్సి వచ్చింది మాట స్పుటం గా వచ్చేది కాదు .ఉచ్చైస్వరంతో వేదం చదివేవాడు అద్భుతం గా శ్లోకాలు రాగ యుక్తం గా చదివే వాడికి ఇలా రావటం మా అందరికి మహా బాధ గా ఉండేది .
ఇలా ఇబ్బందులు పడుతున్న మామయ్య వైదిక సభ ను నిర్వహించటం కష్టం గా ఉండేది .అప్పుడు మామయ్య చెప్పినట్లు రెండో కొడుకు నరసింహం ఆ కార్యక్రమాలను చే బట్టి జరిపాడు .ఇలా కొంత కాలం జరిగింది మామయ్యకొడుకు ‘’మోహనాయ్’’అనే వాడు బందర్లో ఏం కాం చదువుతూ వారానికో సారి ఇంటికి వస్తూ తండ్రిని జాగ్రత్త గా చూసుకొంటూ ఉండేవాడు .అలాంటి మోహనాయ్ ఒక రోజు రాత్రి ఉయ్యూరు సెంటర్ కు వెళ్లి సైకిల్ మీద ఇంటికి తిరిగి వస్తూ ఉండగా లారీ దీకొని అక్కడికక్కడే చని పోయాడు దీంతో మామయ్యా మరీ కుంగి పోయాడు .ఆరోగ్యం మరింత క్షీణించింది .ఉత్సాహం పోయింది కళ్ళంబడి ఎప్పుడూ కన్నీరు కారుతూ ఉండేది ఆయన్ను చూస్తె గుండె తరుక్కు పోయేది .ఆయనకు కొడుకులు ఏ లోపం చేయకుండా గాజు ళా చూసుకొన్నారు .మొహనాయ్ చని పోయిన నాలుగేళ్ళకు మామయ్య 1987మార్చ్ లో నేను గండ్రాయి లో పని చేస్తుండగా చని పోయాడు .మా కుటుంబానికి కొండంత అండ పోయింది. మా బాధ వర్ణనా తీతం
.
మామయ్యా కొడుకు నరసయ్య కొంతకాలం వైదిక సభను లాగాడు తర్వాత వాడూ కాడి పారేశాడు అందరూ కట్టిన శాశ్వత చందాలెంయ్యాయో ఎవరికి తెలియదు .ఇలా ఉజ్వలం గా వెలిగిన సభ పరి సమాప్తమయింది చరిత్ర లో నిలిచి పోయింది .
పేకాట రాయుళ్ళ ఆటకట్టు
మా మామయ్య గంగయ్య గారు ,పక్కింటి బెల్లం కొండ ల్సక్ష్మీ నారాయణ ,ఆయన తమ్ముడు హను మంతం ,వాళ్ళ బావ తాగు బోతూ సుబ్బారావు ,వెంట్రాప్రగడ వెంకటేశ్వర్లు మొదలైన వాళ్ళంతా సాయంత్రం నాలుగు అయేసరికి బెల్లం కొండ వారి వాకిట్లో నేల మీద చాపలు వేసుకొని సరదాగా పేకాట ఆడే వారు .ఇది ఎవరికీ అభ్యంతరం కాదు కాని ఆటలో అరుపులు కేకలు ,బూతులు ఒక్కో సారి ఇబ్బంది కల్గించేవి .ఏదో కాలక్షేపం కోసం ఆడుకున్తున్నారని చాలా ఏళ్ళు సర్దుకు పోయి ఓపిక పట్టాను. చాలా సార్లు హెచ్చరించాను .వానాకాలం అయినా చలికాలం అయినా వేసవి అయినా దీన్ని ఇలానే సాగించారు ‘’ఆడుకుంటే ఆడుకున్నారు కాని ఆ అరుపులేమిటి ?ఆ గోల ఏమిటి ?చుట్టూ పక్కల వాళ్లకు ఇబ్బందిగా ఉంటుందని తెలుసుకో లేరా ?ఎవరికైనా సహనం ఒక హద్దు వరకే ఉంటుంది దాటితే ఎవర్నీ ఆపలేరు .అయినా రాత్రి ఎదింటి దాకా ఆడాలా ? మీ పిల్లలకు మీరేం చెబుతారు వాళ్ళు కూడా మీ లాగే పేక ఆడుతూంటే ఊరుకొంటారా ?“’అని ఎన్నో సార్లు చెప్పాను .మామయ్య సంధ్య వార్చుకోవటానికి ఒక పావు గంట ఇంటికి వచ్చి అది పూర్తీ చేసి మళ్ళీ అక్కడికి చేరే వాడు .దాదాపు ఏడెనిమిదేళ్ళు ఇలా గడిచాయి .ఒక రోజు రాత్రి ఏడు అయింది .వీళ్ళు మహా జోరుగా రంజుగా ఆడుతున్నారు .కేకలు తిట్లు భరించలేక పోయాను .ఒక్క సారిగా అక్కడికి వెళ్లి అందరి చేతుల్లోని పేక ముక్కల్నిలాక్కుని కింద ఉన్న ముక్కల్ని చేత్తో తీసుకొని చింపి అవతల పారేశాను ఇక చేసేదీమీ లేక ఎవరికి వారు నెమ్మదిగా జారుకొన్నారు నన్ను ఏమీ అన లేదు .అంతే మర్నాటి నుంచి బెల్లం కొండ వారి వాకిట్లో పేకాట బంద్ అయింది .ఇదంతా మామయ్య బాగా ఆరోగ్యం గా తిరుగుతున్నా రోజుల్లో జరిగిన సంఘటన .మా అమ్మ నన్ను ఏంతో మెచ్చుకోన్నది .విన్న వాళ్ళంతా ‘’భలే బుద్ధి చెప్పావ్ ‘’అని నన్ను పొగిడారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-14-ఉయ్యూరు

