హఠాత్తుగా అస్తమించిన ఉదయ కిరణం
బుల్లి మూతి బుల్లి గడ్డం ,ముద్దు మాటలు ,చిరు నవ్వు దాని వెనుక కొండను ఢీ కొట్టే గంభీరత ,డాడీ వైజాగ్ ప్రసాద్ ను కూడా కంగు తినిపించిన ధైర్యం కలుపు కోలు తనం ,మాటలు పెదవి మీంచే వచ్చినా గుండెల్లోకి దూసుకు పోయే మెత్తని కత్తి పదును ,చూడ ముచ్చటైన యువకిరణం ,ఏ బాక్ గ్రౌండూ లేకుండానే ‘’చిత్రం ‘’తో తెరంగేట్రం చేసి తేజ బలం తో నట తేజాన్ని మిరుమిట్లు గోల్పెట్లు చేసి ,సినీ పరిశ్రమకు ‘’నువ్వూ –నేనూ ‘’అని భరోసా ఇచ్చి ,యువతులకు ‘’మనసంతా నువ్వే ‘’అని నిద్రపట్ట కుండా చేసి మూడు సినిమాలను హాట్రిక్ గా హిట్ కొట్టి ,తనంతటి వాడు లేడని పించుకొని ,ఒకసినీ చరిత్ర సృష్టించి ,లవ్ బాయ్ ,డ్రీం బాయ్ ,క్రేజీ బాయ్ ,హంటింగ్ బాయ్ అని పించుకొని ,సినీ మాయా బజారు లో ఓవెలుగు వెలిగచించి ఆశా కిరణమై ,అక్కడి పాకుడు రాళ్ళ ,జారుడు నిచ్చెనల ప్రమాదం ఊహించుకో కుండా కొండంత ధైర్యం తో నిలబడి హిట్ కూ ఫట్ కూ ఒకే రీతిగా స్పందించి ,కొంతకాలం గా అంతా చీకటేనా ,వెలుగింక రాదా?ఆశా నిరాశేనా “’అని నిట్టూరుస్తూ ,ఎదురు తెన్నులు చూసి ,విసిగి వేసారి ,ఏ దారీ గమ్యమూ కనిపించక ,బతుకు బండీ ని ఈడ్చే ధైర్యం కొరవడి ,ఇంక శుభోదయ ఆశాకిరణ సంస్పర్శ రాదనీ ,తనకా అదృష్టం లేదని ఇక ఆ కిరణానికి హఠాత్తు అస్తమయమే ననినిర్ణయించుకొని నిండు ప్రాణాలను బలి చేసుకొన్నాడు యువ నటుడు ఉదయ కిరణ్ .అతని ఆత్మకు శాంతి కలిగించమని భగవంతుడిని ప్రార్దిస్తున్నా .
మెగా స్టార్ తో బంధం బల పడి ,మార్గ దర్శకమవు తుందని ఆశించిన కిరణానికి పరిస్తితుల చీకటి కాటేసి శూన్యం మిగిల్చింది .అయినా గంభీరం గా అడుగులు వేసినా అవి తప్పటడుగులే అయ్యాయి తప్ప నిలబడేవి గా మారలేదు .సినీ మాయా ప్రపంచం లో ఆడించే వాడూ ఎగ దోసె వాడు జుట్టు పట్టి పైకి ఈడ్చుకోచ్చేవాడు లేక పొతే ,యెంత గట్టి పింమైనా విచ్చ్చిన్నం అవాల్సిందే .హిట్ ని చూస్తె వచ్చే క్రేజ్ ఫట్ ని చూస్తె రాదనీ తెలియని అవివేకమో అజ్ఞానమో ,అతన్ని విధి వెక్కి రించి వేసిన చోటే గొంగళి ని చేసింది .ఇన్ని తట్టుకొని ప్రయత్నం మాత్రం మాన లేదు ఇక్కడ కాకుంటే అక్కడ అని ‘’తంబి దేశం ‘’వెళ్ళినా సక్సెస్ దర్శకుడు బాల చంద్రుని కరుణ ఉన్నా అక్కడా బంతి బౌన్స్ అయి మళ్ళీ’’నువ్వే ‘’అనుకొన్న సినీ ప్రపంచం మనసంతా నిరాశే అలముకొనేట్లు చేసి నువ్వూ నేనూ ‘’అని మమైకం అయిన చోట నువ్వు –నువ్వే –నేను నేనే ‘’అని తిప్పి కొడితే ,’’చిత్రం’’ చిత్ర రంగం అని తెలుసుకొని కుమిలి ,నలిగి ,అలసి విసిగి వేసారి తన కిరణాలను తానె ఉపసంహరించుకొన్నాడు .’’నీ స్నేహం ‘’ అంటూ అర్రులు చాచినా స్నేహ హస్తం ఏ వైపు నుండీ రాక పొతే ,’’జై శ్రీరాం ‘’అని దిగ్విజయ గర్వం తో ఊగి పోదామను కొంటె అదీ ‘’పీచే మూడ్ ‘’’’అయితే ఇక భరించలేక రాలిన కిరణం .,యువకిరణం .మధ్యాహ్న మార్తాన్డుడై భాసించాల్సిన కిరణం తరుణాదిత్య కిరణం గా నే రాలి పోయాడు .మంచి వాడు మనసున్న వాడు ,స్నేహ శీలి ,నొప్పింపక తానోవ్వని వాడు ,తనకున్న ప్రతిభను పూర్తిగా ఆవిష్కరించిన వాడు కిరణ్ ఉదయ్ –మళ్ళీ ఆకిరణ ప్రదాత దగ్గరకే చెప్పా పెట్టకుండా చేరుకొన్నాడు .మరో జన్మ లో నైనా పూర్తీ ఆశా కిరణం గా రూపు దాలుస్తాడని ఆశిద్దాం
తెలుగు సినీ పరిశ్రమ కేదో చేటు దాపురించినదని పిస్తోంది .ఈ మధ్య శ్రీ హరి తో ప్రారంభించి నెల కొకరుగా ఏ.వి.ఎస్ ,ధర్మ వరపు ల దాకా సినీ జగత్ నుండి మాయమై పోయారు .అక్కడితో ఫుల్ స్టాప్ అనుకొంటే ఇప్పుడు మరో యువ తార ఉదయ్ కిరణ్ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. ‘’మే దెయిర్ సోల్స్ లివ్ ఇన్ పీస్ ‘’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-14-ఉయ్యూరు

