నా దారి తీరు -67
పునః పూనా ప్రయాణం
మా తమ్ముడు మోహన్ పూనా లో ఒక అపార్ట్ మెంట్ కొనుక్కున్నాడు .సిపోరేక్స్ క్వార్తర్స్ నుంచి ఇక్కడికి మారుతాన్న మాట .అది గుడివాడ కు చెందినా డాక్టర్ గారిదే .గృహ ప్రవేశానికి మమ్మల్ని రమ్మని చాలా సార్లు చెప్పాడు .పూర్వం మొదటి సారి వెళ్ళినప్పటి అనుభవాన్ని మా ఆవిడ మర్చి పోలేదు అందుకని తానూ రానన కుండా అత్త గారిని అంటే మా అమ్మను ప్రయాణం చేయించింది .అమ్మకూ అంత ఇష్టం గా ఉన్నట్లు లేదు .వెళ్ళక పోతే చిన్న కొడుకు ఏమను కొంటాడో నని లోపల ఉంది .అయిష్టం గానే సరే నంది నాకు ఎటూ తప్పడు కదా మా నాలుగో వాడు రమణ మాతో వస్తానన్నాడు ఇదివరకు మాతో వాడు రాలేదు అందుకని ఒప్పు కొన్నాను .టికెట్స్ బెజవాడ వెళ్లి రిజర్వ్ చేయించుకొని వచ్చాను .బహుశా అప్పుడు కోణార్క్ ఎక్స్ప్రెస్ కొత్తగా వచ్చింది హైదరాబాద్ లో ట్రెయిన్ మారాల్సిన వసరం తప్పింది .కట్నాలు ఎవరికి ఏమేమి పెట్టాలో అన్నీ ప్రభావతే సర్దింది .ప్రయాణ ఏర్పాట్లన్నీ జాగ్రత్త గా చూసి అత్తగారికి ధైర్యం చెప్పి గృహ ప్రవేశం తర్వాతా కూడా ఒక నెల రోజులు అక్కడే ఉండి రమ్మని ఆవిడకు చెప్పింది అప్పటికే ఆవిడ బి.పి.తో బాధ పడుతోంది .మందులన్నీ కొని తీసుకొన్నాను .దారి లో తిన టానికి అన్నీ ఏర్పాటు చేసింది ప్రభ .
ముగ్గ్గురం ట్రెయిన్ ఎక్కి పూనా చేరాం .అక్కడ స్టేషన్ కు వచ్చి మమ్మల్ని మోహన్ రిసీవ్ చేసుకొన్నాడు అమ్మ ఎంతోసంతోషించింది .మేము వెళ్ళిన రెండు రోజులకు ముహూర్తం అని జ్ఞాపకం .మోహన్ వాళ్ళు హడావిడి గా ఉన్నాడు భార్య కూడా .మా చిన్నక్కయ్యా మేనకోడలు అప్పటికే వచ్చారు పెద్దక్కయ్య మద్రాస్ నుండి రావాలి నన్ను స్టేషన్ కు వెళ్లి రిసీవ్ చేసుకొని ఇంటికి వాళ్ళను తీసుకొని రమ్మని నాకు చెప్పాడు నేను స్టేషన్ కు వెళ్లాను .ట్రెయిన్ వచ్చింది వాళ్ళెవరూ నాకు కన బడలేదు .అక్కయ్యా మేనకోడలు కళా యెంత వెదకినా నాకు కానీ పించలేదు నేను వెదకటం సరిగ్గా చేయలేదేమో నని బాధ పడ్డాను .ఒక రెండు గంటలు అక్కడే చూసి చూసి ,చివరికి విసిగి పోయి ఇంటికి చేరుకొన్నారు ..అద్దె ఇంటి నుంచి సామాన్లు చేరవేయటం సర్దటం ,ఆటో లో అటూఇటూ తిరగటం తో పగలల్లా సరి పోయింది .రాత్రి ముహూర్తం .అక్కయ్య లిద్దరూ ఆడపడుచులుగా పాలు పొంగించారు .వాళ్లకు కూడా తగిన లాంచనాలు ఇవ్వలేదని గునుస్తున్నారు .మర్యాదలూ సరిగ్గా లేవని బాధ రమణ పరిస్తితి అంతే .నేను మాత్రం ముళ్ళ మీద ఉన్నట్లే గడిపాను .మొత్తం మీద గృహ ప్రవేశం బాగా జరిగింది .
.ఒక వారం పూనా లో ఉన్నాం నేను రమణా.వీలు ను బట్టి ఇంట్లోంచి ‘’జంప్ జిలానీ ‘’గా ఉంటూ ,ట్రెయిన్ ఎక్కి’’ లోనా వాలా ‘’వెళ్లి తిరిగి వస్తూ భోజనాల సమయానికి కొంపకు చేరే వాడిని .ఎక్కడికి వెళ్ళావు అని అడిగితె నవ్వుతూ లోనా వాలా అని చెప్పే వాడిని ఒక రోజు చెప్పకుండా అమితాబ్ నటించిన ‘’త్రిశూల్ ‘’హిందీ సినిమా కు వెళ్లి రాత్రి తొమ్మిదింటికి వచ్చాను .చెప్పకుండా ఎందుకు వెళ్ళావని గోల నవ్వే నా సమాధానం .గృహ ప్రవేశం రోజు సామాన్లు పాత ఇంటి నుంచి ఆటో లో తెస్తుండగా వెండి దీపారాధన కుందులు కొన్ని వెండి సామాన్లు అకనపడ లేదు .అమ్మ నాతోనే వచ్చేస్తా నంది వద్దు అని చెప్పి ఒక నెల ఇక్కడే ఉండిరమ్మని చెప్పి నేనూ రమణా బయల్దేరి ఉయ్యూరు వచ్చేశాం .
అమ్మ స్వంతంగా మడితోవంట చేసుకొని తింటుంది ఉయ్యూరులో ప్రభావతి మడి కట్టి వంట చేసేది కనుక ఇబ్బంది ఉండేది కాదు .కుంపటి బొగ్గులు తో వంట అన్నీ అమరిస్తే వంట చేసుకొనేది అమ్మ కు చిక్కని ఫిల్టర్ కాఫీ చేసుకొని తాగేది మేమూ అంతే .కాని ఇక్కడ అది కుదరలేడను కొంటాను .అమ్మ ‘’ధనియాల కాఫీ ‘’కూడా కాచుకొని తాగేది ధనియాలు వేయించి పొడి కొట్టి ఫిల్టర్ లో డికాక్షన్ తీసి పాలు పంచదారా కలిపి చేసేదే దానియాల కాఫీ బానే ఉండేది మా మూలు కాఫీ తాగినా నేను రెండు చుక్కలు అమ్మనడిగి ధనియాల కాఫీ తాగే వాడిని .సరదాగా ఉండేది .అమ్మ నెల రోజులు ముళ్ళ మీదే గడిపి నట్లు వచ్చిన తర్వాత చెప్పింది .ఇలా మా రెండో సారి పూనా ప్రయాణం ప్రహసనమే అయింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-14-ఉయ్యూరు

