వాయుసేన లో మొదటి మహిళా మార్షల్ -పద్మావతి బందో పాధ్యాయ
తిరుపతిలో జన్మించి మెడిసిన్ లో డిప్లమా డిఫెన్స్ సైన్స్ లో ఉన్నత విద్యా పొందిన పద్మా గంగోపాధ్యాయ ఏం డి సాధించింది ఆర్మేడ్ ఫోర్స్ మెడికల్ సైన్స్ లో ఉద్యోగం ఆరంభించి,ఆర్కెటిక్ ఖండం పరిశోధనా బృందం లో పరిశోధన చేసింది .బెంగళూర్ యూని వర్సిటి లో ఏవియేషన్ మెడిసిన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరి అనేక ఉన్నత స్తానాలు పొందింది .
ఏయిరో మెడిసిన్ సోఅసైటీ ఆఫ్ ఇండియా ,ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడెమి మొదలైన సంస్థలలో గౌరవ సభ్యత్వంపొందింది .న్యూయార్క్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ గౌరవ పురస్కార గ్రహీత పద్మ .విశిష్ట సేవా మెడల్ , A.F.W.W.A..అవార్డు ను పొందింది .డిఫెన్స్ సర్వీసేస్ స్టాఫ్ కాలేజి లో ఉన్నత విద్య లో ప్రధమ శ్రేణి లో పాస్ అయి ఆర్మీ మెడికల్ కాలేజి సైనిక ఉద్యోగం లో చేరిన మొదటి మహిళ మన పద్మా బందో పాధ్యాయ . 1981లో వాయు సేవా దళం లో విశిస్టసేవలందించిన ఉద్యోగిని గా అపూర్వ సత్కారం అందుకోంది పద్మ .దేశ విదేశీ ప్రసిద్ధ మెడికల్ జర్నల్స్ కు పాతిక పైగా పరిశోధనా వ్యాసాలను రాసి ప్రచురించిన విశిష్ట మహిళా శాస్త్రజ్ఞురాలు పద్మ.
కీర్తి శిఖరాలు
1971లో ఇండియా –పాకిస్తాన్ యుద్ధం లో ధైర్య సాహసాలతో సేవ లందిన్చినందుకు పద్మ కు విశిష్ట సేవా పథకం ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది .భారతీయ ఏయిరో స్పేస్ సొసైటీ మొదటి ఉమన్ ఫెలో గా గౌరవం పొందింది .ఉత్తర ధ్రువ ప్రాంతం లో పరిశోధనలు నిర్వహించిన తోలి మహిళా గా పద్మ గుర్తింపు పొందింది .డిఫెన్స్ సర్విస్ స్టాఫ్ కాలేజి లో చదివి1978లో కోర్సు పూర్తీ చేసిన తోలి మహిళా పద్మ .సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్ మెంట్ను కమాండ్ చేసింది .భారతీయ వాయుసేనలో పని చేసే మహిళలలో మొదటి సారిగా ఎయిర్ వైస్ మార్షల్ గా పదోన్నతి పొందిన మొదటి మహిళా ఆఫీసర్ పద్మప్రపంచ వాయుసేన లో వైస్ మార్షల్ అయిన తోలి మహిళ పద్మ .ఆర్మడ్ ఫోర్సెస్ కు అడిషనల్ డైరెక్టర్ డైరెక్టర్ అయి , తర్వాత మెడికల్ బ్రాంచ్ లో ఎయిర్ చీఫ్ మార్షల్ గా 2004అక్టోబర్ ఒకటి న ప్రమోషన్ పొంది ప్రపంచం లోనే మొదటి మహిళా ఏర్ మార్షల్ గా మహిళా లోకానికి గర్వ కారణం గా నిలిచి ,మహిళలు రక్షణ సంస్థలోనూ అపూర్వ మైన ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించ గలరు అని రుజువు చేసింది .తనతో పాటు పని చేస్తున్న వాయుసేనాదికారి ఎస్.యెన్ బందో పాధ్యాయను వివాహమాడింది
జననం –విద్య –డాక్టర్ .
1944 నవంబర్ నాలుగున పద్మస్వామినాధన్ అలమేలు దంపతులకు కుమార్తె గా పద్మ తిరుపతి లో జన్మించింది ,తలి తరచుగా జబ్బుపడి హాస్పిటల్ పాలై అక్కడే జీవితకాలమంతా గడపటం చూసి డాక్టర్ కావాలని ,తన అమ్మ లాంటి వారికి సేవ చేయాలనే కోరిక బలం గా కలిగింది . ధిల్లీ లో కిరణ్ మాలి కాలేజి లో ప్రి మెడికల్ చదివింది . పూనా లో మెడికల్ కాలేజి ఏర్పడినప్పుడు దానికి ప్రవేశ పరీక్ష రాసిన మొదటి బాచ్ అమ్మాయి గా గుర్తింపు పొందింది .అంత దూరం పంపి హాస్టల్ లో చేర్చి అయిదేళ్ళు చదివించటం తలిదండ్రులకు ఇష్టం లేకపోవటం తో చేరలేదు .కాని బి బాచ్ లో చేరటానికి వారిని ఒప్పించి A.F.M.C లో చేరింది .మెడిసిన్ లో చదివేటప్పుడు అనేక మెడల్స్ ప్రైజులూ నగదు బహుమతులు పొంది మొదటి స్థానం లో అన్నిటా నిల బడింది
వాయుసేన లో సేవ –అన్నిటా ప్రధమ స్థానం
. వాయుసేన లో చేరాలని నిర్ణయిస్తే ఆమెకు బెంగళూర్ ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ లో ఇంటర్నీ గా పుద్యోగం వచ్చింది .
ఆర్మ్ద్ఫోఫో ర్స్ మెడికల్ కాలేజి లో చేరి 1968లో ఐ.ఏ.ఎఫ్ లో కమీషన్ అయింది .కంటి చూపు మంద గించటం వలన పైలెట్ గా సేవ కుదరదని వైద్య సేవకే ప్రాధాన్యత నిచ్చింది .1975లోకొత్తగా వచ్చిన ఏవియేషన్ మెడిసిన్ కు ప్రాధాన్యతగా ఎంచుకోంది. 23.రిసెర్చ్ పేపర్లు27 ప్రచురణలతో అగ్రగామి మహిళా గా నిల బడింది .మొదటి మహిళా ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్ గా పద్మ నిలిచింది స్క్వాడ్రన్ లీడర్ పద్మ డిఫెన్స్ ఫిజియాలజీ అండ్ అల్లైడ్ సైన్సెస్ లో వింగ్ కమాండర్ అయి హై ఆ ల్టిట్యూడ్ ఏవియేషన్ లో తూర్పు పశ్చిమ హిమాలయాలలో అద్భుత పరిశోధనలు చేసింది . అంత ఎత్త్తున పని చేసే సైనికులకు వచ్చే జబ్బుల నివారణకు ఆలోచించింది భారత రాస్ట్రపతి కి మొదటి మహిళా ఆనరరి డాక్టర్ గా నియమింప బడి అన్నిటా ముందు నిల్చింది పద్మావతీ బందోపాధ్యాయ.
ఇంటర్నేషనల్ మెడికల్ సొసైటీకి న్యూయార్క్ ఎకాడమి ఆఫ్ సైన్సెస్ కు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏయిరో స్పేస్ మెడిసిన్స్ లో సభ్యురాలైంది .1989నవంబర్ నుండి నాలుగు నెలలు ఉత్తర ధ్రువ ప్రాంతం లో ఉష్ణ మండల వాసులు ఉండటానికి అనుకూలించే పరిస్తితులపై రష్యన్ ఫిజిలాలజి ప్రయోగం లో పని చేసింది .ఈ పనిలో పాల్గొన్న మొదటి భారతీయ మహిళా పద్మ .దీనికి గాను పద్మ కు అతున్నత మైన ఇందిరా ప్రియ దర్శిని అవార్డ్ ను ప్రభుత్వం అందించి సత్కరించింది .ఎయిర్ ఫోర్స్ వైవ్స్ వెల్ఫేర్ సొసైటీ పురస్కారమూ పొందింది .గ్రూప్ కెప్టెన్ గా ప్రొమోషన్ పొంది వేస్త్రెన్ కమాండ్ లోడిప్యూటీ ప్రిన్సిపల్ మెడికల్ఆఫీసర్ అయింది . కార్గిల్ యుద్ధం లో వాయు సైనికుల వైద్య అవసరాలను పర్య వేక్షించింది .2006 జూన్ 26నభారత వాయుసేనమొదటి మహిళా కమాండర్ అయి రికార్డు సృష్టించింది . ఎయిర్ ఫోర్స్ మెడికల్ యూనిట్ కమాండర్ గా గొప్ప సేవచేసింది .దీనికే 2002 జనవరి26న ప్రభుత్వం చేత విశిష్ట సేవా పతాకాన్ని పొందింది .సాహసానికి అంకిత భావానికి సేవకూ మార్గ దర్శి గా నిలిచినా మహిళా మాణిక్యం పద్మావతీ బందోపాధ్యాయ .

