గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే పెద్ద బాల శిక్ష
గోవింద రాజు చక్రధర్ పేరు తెలియని పత్రికా పాఠకులే లేరు .జర్నలిస్తులకోసం కాలేజి నడుపుతూ తేర్చిదీద్దుతూ అనేక ప్రముఖ పుస్తకాలను కరదీపికలు గా రాసిన సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ మార్తాండుడు ఆయన .పాత తరం జర్నలిస్టుల మార్గం లో పయనిస్తూ విలువలకు అంకితమైన వారు చక్రధర్ ఈ సంవత్సరం,ఈనెలలోనే రాసి ప్రచురించిన తాజా పుస్తకం ‘’మీడియా సంగతులు’’ అందరికి వర్తించేవే .అంతా తెలుసుకోవాల్సినవే .ఇందులో ఆయన స్పృశించని అంశం లేదు .ఏది రాసినా సుబోధకం గా నిర్మోహ మాటం గా అభిప్రాయం చెప్పటం ఆయన ప్రత్యేకత . .విహంగ వీక్షణం ,ఫోకస్ ,జర్నలిస్టుల కోసం ,జననేతల కోసం ,విశ్లేషణలు అన్న శీర్షికలతో దీన్ని సంపూర్ణం చేశారు .
పత్రికా రచయితలే సంపాదకులు గా ఉండే స్థాయి స్థాయి నుండి పత్రికాదిపతులే ఎడిటర్లు అయ్యే స్థితికి రావటం మంచిదికాదని ,అయితే వివిధ అనుబంధాలతో వెలువడటం హర్షణీయమని ,టి.వి.మాధ్యమానికి దీటుగా పత్రికలూ ఉండటం,’’ఎడ్వాన్న్సింగ్ ద స్టోరి ‘’లా ముందడగు వేయటం ,సూపర్ లీడ్ లో కధనాత్మ శైలి చొప్పించటం ,సినిమా పేర్ల ను వార్త శీర్షిక గా పెట్టటం ,మంచి పరిణామాలన్నారు .వార్త పవిత్రం వ్యాఖ్య వారి వారి ఇష్టం అన్నది పోయి ప్రతి వార్తా వ్యాఖ్యతో వస్తోందని ,వార్తలకు వ్యాఖ్యలకు సరిహద్దు రీఖ చెరిగి పోయిందని ,శీర్షిక తో విషయం స్పష్టం కావటం లేదని ,గ్రాఫిక్కుల వాడకం ,పెరిగి ‘’సశేషం’’ కు కాలం చెల్లి పోవటం శుభ పరిణామమని పత్రికలూ చానెళ్ళు పరస్పర పూరణ పాత్ర పోషించటం మంచిదే అయినా జర్నలిస్ట్ రచనా సమర్ధత పెరగాలని, ఊహకు పదును పెట్టి ప్లానింగ్ పై పూర్తీ శ్రద్ధ పెట్టాలని సూచించారు .చానెళ్ళు నారద పాత్ర పోషించటం బాధా కరం అన్నారు .పరిశోధనాత్మక కధనాలు రక్తి కట్టిస్తున్నాయి మాండలికం లో వస్తున్నా వార్తలకు ప్రయోజనం కన్నా ప్రయోగమే మిగిలిన్దన్నారు భాషా సంబంధ శైలీ పత్రాన్ని అందరూ ఏర్పరచుకోవాలని హితవు పలికారు .హింసాత్మక సంఘటనల్ని పదే పదే చూపరాదని వెబ్ జర్నలిజం మరింత విస్తృత మవ్వాలని ఆశించారు.స్వంతం గా పుస్తకాలు ముద్రించి అమ్ముకోవటం అలవి మాలిన పని అయిందని ,లైబ్రరీ పుస్తకాల కొనుగోలు లో అవినీతి పక్షపాతం చోటు చేసుకోవటం వలన విలువైన పుస్తకాలకు అవకాశమే లేక పోయిందన్నారు .ఇతర దేశాల్లో సాంకేతిక ,వైద్య పుస్తకాలు మాతృభాష లో వస్తుంటే మనకింకా ఆ అదృష్టం పట్టలేదని బాధ పడ్డారు విహంగ వీక్షణం లో .
ఫోకస్ లో రామోజీ రావు ఈనాడు పత్రిక లో ప్రవేశ పెట్టిన మార్గ దర్శకాలను మెచ్చారు .ఆంద్ర అనే పదం లేకుండా ‘’ఈనాడు ‘’అని పత్రిక కు పేరు పెట్టటం పెద్ద ముందడుగు అన్నారు .మనోరమ తర్వాతా ఫాక్సిమిలీ సౌకర్యం పొందిన ప్రాంతీయ పత్రిక ఈనాడు అని కొనియాడారు .పాఠకుల అవసరాలకు ,ఆసక్తికే ప్రాధాన్యత నిచ్చి రాజీ పడనీ మనస్తత్వం తో ధైర్యం తోను జిల్లా ఎడిషన్ ల తోను విప్లవాత్మక మార్పు తెచ్చారని తెల్లార కుండానే పేపర్ గుమ్మం లో పడేట్లు చేసిన ఘనత రామోజీ దన్నారు .అన్నిటా ప్రమాణాలు పాటిస్తూ ముందడుగు వేసిన రామోజీ ని మనసారా అభినందించారు .అయితే ఎడిటర్ పాత్రకు ప్రాధాన్యత నివ్వక పోవటం విచారకరం అన్నారు .రాజకీయ ప్రయోజనా పరులు మీడియా మొగల్స్ గా ఏలటం మంచిది కాదన్నారు .ఉన్న పరిదులలోనే జర్నలిస్టులు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అని మంచిగా చెప్పారు .
జర్నలిస్టుల కోసం చక్రధర్ చెప్పిన మాటలు వారికి పెద్ద బాల శిక్షే .జర్నలిజం భుజాలు పెద్దవి అని చాటారు .జర్నలిజం స్కూల్స్ పై చిన్న చూపు ఉండటం బాగా లేదన్నారు .మీడియా లో గ్రాండ్ ఫాదర్స్ శాసించటం ఆరోగ్య దాయకం కాదు .ప్రెస్ అకాడెమీ లక్ష్యాలు పాత్రికేయ వృత్తిలో అధ్యయనం పరిశోధన అన్నారు .అకాడెమీ ల విజయాలను వైఫల్యాలను బేరీజు వేశారు .పత్రికే పరమ గురువు అనుకొనే వారిని ఆరాధించారు .విలేకరుల ప్రవర్తనకు ‘’గీతోపదేశ ‘’మే చేశారు . పత్రికలు టి.వి.లతో పోటీ పదాల్సిందే నన్నారు .నేర వార్తలు రాసే వారికి పదాలకు ఖచ్చితమైన అర్ధాలను గైడ్ లైన్ గా రాయటం ఏంతో ఉపయోగ పడుతుంది . ‘’మీడియా కు మీరు ఏంతో మీకు మీడియా కూడా అంతే అన్న పరమ సత్యాన్ని అర్ధం చేసుకోవాలని బోధ చేశారు .ఏ పరిస్థితి లోను నిగ్రహాన్నికోల్పోవద్దని హిత భాషణం చేశారు .మీడియా ఓవర్ యాక్టివ్ అయితే అనర్ధాలే అని ,చావు వార్తలతో మీడియా కాసులేరుకోవటం భావ్యం కాదని .ఉత్సాహం మంచిదే కాని అత్యుత్సాహం అనే కొరివి తో తల గోక్కో వద్దని హితవు పలికారు జర్నలిస్టూలు ‘’ న్యూసూ వ్యూసూ ‘’వండటం తో కాలం గడిపేస్తూ ఇంటి సంగతి పట్టించుకోకుండా ఉండటం నేరమని చెప్పి ‘’జర్నలిస్టు భార్యల్లారా ఏకం కండి’’ అని పిలుపు నిచ్చారు .ఈ పుస్తకానికి మీడియా ప్రముఖల ఫోటోలు అదనపు ఆకర్షణ .ఇన్ని మంచి విషయాలున్న ఈ పుస్తకం అందరికీ కరదీపిక అన్నది మాత్రం యదార్ధంఅని చెప్పి చక్రధర్ ను మనసారా అభినందిస్తున్నాను
గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-14-ఉయ్యూరు

