రాచకీయ ద్విప్లేట్స్ -8
1-పెద్దల సభకు సీటిచ్చినా రాముడు ,ఇవ్వక నరసింహుడు ,అవమానం అని రాజూ ఏడుపు
నామినేషన్ల ముందే ఇంత జరిగితే ,ఎన్నికప్పుడు కోట్లు పోయి సీట్లూ పోయి లబో దిబో నేనా ముగింపు?
2-బెజవాడలో మోడీ విజయం కోసం సభ పెట్టిన వెంకయ్య
బానే జనాన్ని సమీకరించి విజయాన్ని సాధించినందుకు మెచ్చిన రజ్జూ భయ్యా .
3- కరుణ ఇంట్లో విభేదాల కుంపటి
జనం నడుస్తారా అలగిరి వెంబటి ?
4-స్టాలిన్ ను వారసుడిగా ప్రకటించి చేద్దామనుకొంటే డిక్టేటర్
వెంట పడి గెలిపిస్తాడా గుడ్డిరాజుతో కేడర్ తో బాటు ఓటర్ ?
5-లాస్ట్ బాల్ విసరకుండానే విసిరాడు సి.ఏం కిరణ్ సవాల్
వ్యూహం అర్ధం కాక జనం చేస్తున్నారు అనేక ఊహాగానాల్ .
6-అందర్నీ దులిపేసి హీరో అనుకొన్నాడు నటుడు ఓవర్ యాక్షన్ తో మోహన్ బాబు
పాప ప్రక్షాళనం చేసే మరో పోపు ననుకొంటున్నాడేమో టింగిరి డింగిరి మాటల నవాబు .
7-ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఆపే హక్కు ఉంది బి.జే.పి.కి మాత్రమే
అన్న ఆశ తో ఉన్నారు పాపం దింపుడు కళ్ళం ఆశతో కొద్ది మంది మాత్రమే.
8-మళ్ళీ పొడుస్తుంది దిన పత్రిక ఉదయం
దాసరిమాటకు పడాలి కార్డు శుభోదయం .
9-అత్యంత సమర్ధ భావి భారత ప్రధాని అవుతాడని మోడీ
‘’నమో’’ ‘’నమో’’ అని ఎదురు చూస్తున్నారు బాబు తో జోడీ .
10-తెలుగు దేశం సీటు కోసం పాటు తెగ పాటు పడుతున్నాడు వేణు మాధవ్
నవ్వులు పూయించి చట్ట సభ టెన్షన్ తగ్గించి అవుతాడా క్రేజీ మాధవ్ ?
11-శాసన సభలో వ్యూహాత్మకం గా పావులు కదిపి తీర్మానాన్ని ఓడించిన కిరణ్ ,మనోహర్
ఇప్పుడే విన్న ఈ వార్తకు సీమాంధ్రుల తొలివిజయం గా జరుపుకుంటున్న తీరు నయన మనోహరం .
12-రెండు కళ్ళ సిద్ధాంతం తో ఇరకాటం లో అప్పుడు సందిగ్ధం లో చంద్ర బాబు పడ్డాడు
కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు బిల్లు తిరస్కరణ తో ఇప్పుడు సేఫ్ జోన్ లో పడ్డాడు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-14-ఉయ్యూరు

