హోమర్ నుండి జేమ్స్ జాయిస్ దాకా -1
వాలెస్ గ్రే అనే ఆంగ్ల ప్రొఫెసర్ రాసిన పై పుస్తకం లో ఉన్న అనేక విషయాలు ఆసక్తి కరం గా ఉన్నాయి వీటిని అందించటం నేను చేస్తున్న పని .
హోమర్
పరమేశ్వ రుడికి మానవ రూపం ఇవ్వటం అంటే ‘’anthropomorphism ‘’కు హోమర్ విలువ ఇచ్చాడు .దేవతలే సంఘటనలను నియంత్రిస్తారు .నాయకుల భయాలు కోరికలకు మారు రూపాలే హోమర్ సృష్టించిన దేవతలు .ఇలియడ్ లో సెక్సువల్ ఎక్సైట్ మెంట్ తో బాటు గ్రీకుయువకులకు విద్య కూడా ఉంటుంది .ఇది ఇతిహాసమే కాని చారిత్రిక ప్రాధాన్యత తక్కువే .దేవుళ్ళకు దుఖం ఉండదు బాగా నిద్రా పోతారు . Zeus దేవతకు చెడు చేయటం ఆశీర్వదించటం అనే రెండు స్వభావాలున్నాయి .మానవ ప్రవర్తన మంచీ చెడు అనుభవమిశ్రమం గా ఉంటుంది .పుట్టిన ప్రతివాడూ చావాల్సిందే ననే సిద్ధాంతం ఉంది .వీరోచితం గా ప్రవర్తించే హీరో లు చావు లేదనే ధైర్యం తో ముందుకు దూసుకు పోయినా చివరికి తాము మర్త్యులమే నన్నది గ్రహిస్తారు .యుద్ధ వీరుల అనుభవం సాధారణం గా శక్తి కి లేక అవకాశానికి చెందింది గా కనీ పిస్తుంది .ఇలియడ్ లో చావు కోసం కుక్కల్ని రాబందు లను ఉసి కొల్పటం కని పిస్తుంది

‘
ఒడిస్సీ లో మాత్రం మనిషి తనకేది కావాలో దాన్నే చేస్తాడు .ఇందులో ఓడిస్సియస్ పాశ్చాత్య సాహిత్య చరిత్రలో మొదటి సంపూర్ణ మానవుడిగా కని పిస్తాడు .ఓడిస్సియస్ అంటేనే బాధ ,శ్రమ లమిశ్రమం .ఇందులో మనిషి శ్రమతో జీవించి పునర్జన్మ ను తప్పించుకోవటానికి కాలిప్సో అనే మాత్రుగర్భం లాంటి గుహ లోఅమరత్వాన్ని పొందుతాడు .జీవించటానికి ఏకీకృత ఏకాగ్ర మైన వ్యక్తిత్వం ,కోరికలపై ఆరాధనతో ఉండాలి .తనకెలాంటి ప్రపంచం కావాలో దాన్ని పొందటా నికి తీవ్ర ప్రయత్నం చేస్తాడు .దీనికే గ్రీకు కు భాషలో ‘’టిసియస్’’అని పేరు .దీనినే ఓడిస్సియస్ అవలంబించి సాధిస్తాడు .’’నేను ఈశరీరాన్ని కాను ‘’అనేదే ఇందులో సిద్ధాంతం .అంటే నిరంతర అన్వేషణమే .ఓడిస్సియస్ ప్రయాణా లన్నీ ఆత్మను వె దకటం కోసం చేసేవే .బయట కని పించే వ్యతిరేకతలు అన్నీ అతని మానసిక స్థితి గతులకే అడ్డం పడుతాయి .’’human soul must ,confront and control itself ‘’అని తాత్పర్యం మా నవ బలహీనతలన్నిటిని నియంత్రిన్చాలనడమే ఓడిస్సియస్ లక్ష్యం .ఇక్కడి ‘’time and narrative fold ,unfold and fold back ‘’ లా ఉండటం విశేషం అంటాడు రచయిత .భవిష్యత్తే వర్తమానాన్ని నిర్దేశిస్తుంది .కళ సమస్తం నిర్దేశతను వ్యక్త పరుస్తుంది .ఇందులో ‘’rhapsodic fashion ‘’అంటే అన్వయించటానికి వీలుకాని అసంబద్ధమైన వైఖరి ఉందన్నమాట .ఇంకోరకం గా చెప్పాలంటే అనేక ముడులు చిక్కులు తో కధకుడు అల్లిన నేత లా కద ఉంటుంది .చివరి దారం పోగు ను విప్పెదాకా అది పూర్తీ అయినట్లు అని పించదు .హోమర్ కు ఈ కదా విధానం పై పూర్తీ అవగాహన ఉండటం తో బాటు తన శ్రోతలకేది కావాలో సంపూర్ణం గా తెలుసుకూడా .ఎందరినో ఎదిరించిన వారిని చంపటం చంపటం తో ప్రారంభమై ,భార్యకు రక్షకుడు గా ,గొప్ప తండ్రిగా మారి పోవటం ఓడిస్సియస్ సుదీర్ఘ సఫల ప్రయాణం ఉంది.ఇందులో ‘’నోటోస్’’అంటే ‘ఇంటికి చేరటం ‘’ అనేది చాలా ముఖ్యమైన విషయం .
ఇలియడ్ ఇప్పటి టర్కీ అయిన ఏసియా మైనర్అనే తూర్పు భాగం లో జరిగిన కద .ఒక నగర విచ్చేదనమూ ,గతపునాదుల్ని కూల్చి కొత్త నిర్మాణం చేయటం ఇందులో కనిపిస్తుంది .ఒడిస్సీ పశ్చిమానికి ప్రయాణం .అది ట్రాయ్ నగరం తో ప్రారంభమవుతుంది .ఇది పునర్నిర్మాణ ప్రక్రియ .కొత్త నగర నిర్మాణానికి నాన్దీవాచాకమై దాని సర్వతో భద్ర స్తితికి ,సంపూర్ణత్వానికి ప్రతీకగా నిలుస్తుంది .నవీన నాగరకతకు అంకురార్పణ చేయటమే .ఇలియడ్ యదార్ధ గాఢ అయితే ఒడిస్సీ భ్రమ ,ఊహ లకు ప్రాతిపదిక గా నిర్మించిన కళాత్మక రచన .మొదటి దానిలో వర్తమానం చిరంజీవి .రెండవదానిలో జ్ఞాపకాల దొంతర ఉంది గుర్తు పెట్టుకుంటేనే కాని ముందుకు అడుగు పడదు .ఇది రొమాంటిక్ గాద .మొదటిది యదార్ధానికి ప్రతీక .రెండో దానిలో పరిశుద్ధ పరచే విధానమూ పునర్జన్మా ఉన్నాయి .ఇందులో కుక్కలు రక్షిస్తూ విశ్వాసం తో ఉంటాయి .మొదటిది వర్గ ప్రయోజనాలకు సంబంధించి ఉంటె రెండోది వ్యక్తీ గతం గా కనీ పిస్తుంది మొదటిది ‘’abstract social structure ‘’అయితే రెండోది ‘’complex social structure ‘’.హోమర్ చెప్పేది మంచి ప్రవర్తన అది శల్యగతం అవాలని .రెండూ చివరికి తండ్రులా కొడుకుల ఎడుపులతోనే అంతమవుతాయి
సశేషం
7-10-2002సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-14-ఉయ్యూరు

