పూర్వ ఆంగ్ల కవుల ముచ్చ్చట్లు -35
చారిత్రిక బలి
జార్జి గార్డన్ లార్డ్ బైరన్
జార్జి గార్డన్ రొమాంటిక్ ఉద్యమ హీరో .నిజమైన బైరానిక్ వ్యక్తీ ,.అందగాడు ,దేన్నీ లెక్క చేయని వాడు .అంగవైకల్యం ఉన్నా అరిస్తోక్రాట్ గా వెలిగాడు .స్వేచ్చను కోరి ,కలల్లో తేలి ,మేధావి అయిన ప్రేమికుడు .
అడ్మిరల్ జాన్ బైరన్ బైరాన్ కవి తాత .తీవ్రస్వభావి కనుక ‘’ఫౌల్ వెదర్ జాక్ ‘’అని మారు పేరుతో పిలిచే వారు .కవి బైరన్ అంకుల్ ఒకడు హత్య కేసులో ఉన్నాడు .ఈ స్వభావాలు వారసత్వం గా పొందిన బైరన్ కవి చిన్నప్పుడే స్నేహితుడితో ద్వంద్వ యుద్ధం చేశాడు .తండ్రిని ‘’మాడ్ జాక్ ‘’అనే వారు .తండ్రి ఒక వివాహితను లేపుకు పోయి ఆమె మొగుడికి విడాకులిచ్చిన తర్వాత పెళ్లి చేసుకొన్నాడు .అగస్తా అనే కూతురు పుట్టింది .ఆమె డబ్బు అంతా హరించాడు.మొదటి జేమ్స్ రాజు బంధువులమ్మాయిని చేసుకొన్నాడు .ఈమె తండ్రి గర్వి ,తీవ్ర మనస్తత్వం ఉన్నవాడు ..ఆత్మ హత్య చేసుకొన్నాడు .
ఇక జార్జి గార్డన్ విషయానికొస్తే 22-1-1788లో కాలు వంకర తో పుట్టి ఎన్ని ఆపరేషన్లు జరిగినా సరికాక ,తల్లి విపరీత ధోరణులకు బాధ పడుతూ చాలా కాలం గడిపాడు .కొడుకును ఈ తల్లి ‘’చిన్నారి కుంటి కుంక ‘’అని పిలిచేది .తండ్రి డబ్బు జల్సాగా ఖర్చు చేసి తాగుడు తో చచ్చాడు .బైరన్ కు నర్సుగా ఉన్న మేరీ గ్రే తొమ్మిదేళ్లప్పుడు పాపం చేయవద్దని బోధిస్తూనే సెక్స్ లో మెకానిజం నూ బాగా నేర్పింది .ఇదే తర్వాత విజ్రుమ్భించింది .తండ్రి మరణం తో జార్జి గార్దన్ ఆస్తికి వారసుడైనాడు ఈయన చనిపోవటం తో బైరన్ కు తోమ్మిది ఏళ్ళ ప్పుడే లార్డ్ అయ్యాడు .న్యు స్తేడ్ ఆబ్బే లోని స్వంత ఎస్టేట్ కు తల్లి బైరన్ ను తీసుకు వెళ్ళింది .హారో స్కూల్ లో చదివాడు .స్వతంత్రుడు అవటం తో ఎవరినీ లెక్క చేసే వాడు కాదు .పదహారేళ్ళ వయసులో కజిన్ మేరీ చావర్త్ ను ప్రేమిస్తే ఆమె కూడా ప్రేమాయణం సాగించి చివరికి ఒక భూస్వామిని పెళ్లి చేసుకొన్నది .గుండె జారి గల్లంతైన బైరన్ విరహం తో ఎన్నో కవితలు ‘’వైడ్ –దిడ్రీం ‘’రాశాడు .సాహిత్యం లో మేటి అనిపించుకొన్నాడు .
పది హేడేళ్ళల్లప్పుడు ట్రినిటి కాలేజి లో చేరాడు. అయిదు వందల డాలర్ల అలవెన్స్ వచ్చేది .రూం ను అందం గా తీర్చి దిద్దుకోవటానికి దీన్ని ఖర్చు చేశాడు .యువ రాజు దర్జా వెలిగించాడు .అప్పుల అప్పారావు అయ్యాడు .కాలేజి నీతిని కాని డబ్బును కాని ఇవ్వదు అని స్నేహితుడికి ఉత్తరం రాశాడు .కొంత కవిత్వం గిలికాడు .కాని ఎవరూ మెచ్చ్చ లేదు ..ఉండలేక బయటికొచ్చాడు . మళ్ళీ చేరినా చదువు మీద శ్రద్ధ పెట్ట లేదు .రొమాంటిక్ నవలలు చదువుతూ ఫెన్సింగ్ వేస్తూ చదువు ఎగాగొట్టి కాల క్షేపం చేశాడు .కొందరు మంచి స్నేహితుల్ని సంపాదించుకొన్నాడు అందులో జాన్ కాం హాబ్ హౌస్ బైరన్ కు ఎక్సి క్యూటర్అయ్యాడు .గాంబ్లింగ్ లో ఆరితేరాడు .మొత్తం మీద ‘’ముక్కి’’ డిగ్రీ సాధించాడు .హౌస్ ఆఫ్ లార్డ్స్ లో స్థానం పొందాడు .’’ఇంగ్లీష్ బార్డ్స్ అండ్ స్కాచ్ రేవ్యూయర్స్ ‘’రాసి ప్రచురించాడు .ఇది పోప్ రచనా స్తాయిని పొందింది .పోప్ అంటే బైరాన్ కు మహా ఇష్టం .’’దంసియాడ్ ‘’రాసినా పేరు రాలేదు .
1809బైరాన్ కు మెజారిటీ వయసు వచ్చింది .దానితో బాటు అదృష్టమూ వరించింది .పన్నెండు వేల పౌండ్ల అప్పులు తీర్చాడు .ఆదాయం తగ్గింది రౌడీ పార్టీ తో కలిశాడు .ఈ బృందం లో ప్రతివాడు ఒక సన్యాసి వేషం వేసుకొనే సన్నాసే ..విందు ,మందు, చిందు లతో కాలం గడిపారు .ఇది లేడీ బైరన్ కు నచ్చలేదు .భార్యను వదిలేసి యూరప్ వెళ్లాడు .లిస్బన్ లో ఉన్నాడు .అక్కడి నుండి అయిదు వందల మైళ్ళు గుర్రం మీద ప్రయాణించి ‘’పెర్ఫెక్ట్ సైబీరియా ‘’చేరుకొన్నాడు మాల్టా వెళ్లి అల్బేనియా చేరాడు . కాం స్టంట్ నోపిల్ వెళ్లి హేల్లెస్ పాయింట్ లో ఈత కొట్టి ఏథెన్స్ కు వచ్చాడు .ఆర్ధర్ ఎడ్లిస్తాన్ తో స్నేహం చేశాడు .గ్రీస్ వెళ్లి ‘’పాఫియాన్ ప్లెజర్ ‘’అనుభవించి లండన్ చేరాడు .ఆస్తిని పర్య వేక్షించేవారి అలసత వలన రాబడి బాగా తగ్గిపోయింది బొగ్గుగనుల్లో బొగ్గు కాదుకదా సుఖమూ రాలేదని రాసుకొన్నాడు .తల్లి చని పోయింది .ఏదో పాపం తనను కుటుంబాన్ని పీడిస్తోందని గ్రహించాడు .ఐర్లాండ్ జాతీయ గాయకుడు కవి టాం మూర్ తో పరిచయమైంది .హౌస్ ఆఫ్ లార్డ్స్ లో మొదటి ప్రసంగం చేశాడు బైరన్ .ఆధునిక యంత్ర సామగ్రి రావటం తో వర్కర్లను తీసి వేయక తప్పలేదు .వాళ్లకు కోపం వచ్చి అన్నీ ధ్వంసం చేశారు .’’మెషీన్ రెకర్స్ ‘’అనే నాటకాన్ని జర్మన్ నాటక కర్త ‘’ఎర్నెస్ట్ టోల్లెర్ ‘’రాశాడు .ప్రభుత్వం ‘’ఫ్రెం బ్రేకర్స్ బిల్ ‘’ప్రవేశపెడితే బైరన్ వ్యతిరేకించాడు .పని చేసే వారిలో బైరన్ కు స్నేహితులెవరూ లేరు .
యూరప్ పర్యటన లో ఉండగానే బైరాన్ దీర్ఘ కవిత ను స్పెన్సర్ స్తాన్జాలతో రాయటం ప్రారంభించాడు .గ్రీసు దేశం లో పూర్తీ చేశాడు .రెండు కాంటోలను 1818లో ముద్రించాడు.ఆ విషయాన్ని బైరన్ ‘’ Byron awoke one morning and found myself famous ‘’అని రాసుకొన్నాడు .ఇందులో విషయం బైరన్ దే.రొమాంటిక్ టచ్ ఇచ్చాడు అంతే..బైరన్ కు ఉన్న పురుషత్వం స్త్రీ మనస్సు ఆడవాళ్ళకు విపరీతమైన ఆకర్షణ అయింది చుట్టూ మూగే వారు .ఇతనికంటే ముందే వాళ్ళు అతన్ని ‘’ముగ్గులోకి దించే వారు ‘’.అప్పుడు పురుష సింహమే అయిపోయేవాడు .వల పన్ని పడేసేవాళ్ళు .అందం ఆకర్షణ రాచరికం ఉండటం తో అన్ని అంతస్తుల స్త్రీలు అతని తో సంగమించి సంతృప్తి చెందేవారు .అందులో మేరీ కరోలిన్ లాంబ్ ఒకరు .ఆమెకు భర్త కాబోయే ప్రధాని .యవ్వనోద్రేకం లో ఉన్న ఆమెను భర్త సుఖ పెట్టలేక పోతున్నాడని బైరన్ చెంత చేరి శృంగార లీలా విలాసం సాగించి ‘’ఈ లాంబ్ ఆ సింహానికి’’ ఎర అయి పోయింది .’’that beautiful face is my fate –mad ,bad ,dangerous to know ‘’అని డైరీలో రాసుకొంది.ఆడ వాళ్ళ శృంగార సామ్రాట్ అయ్యాడు .వాళ్ళ రక్షణా ఏడుగడ తానె అనిపించాడు .సర్వ సౌఖ్యాలు పొందాడు ,పొందించాడు .అదో లోకం గా గడిపాడు ఆ దక్షిణ నాయకుడు ..పడేయ్యటం పడ వేయించుకోవటం ‘’వీజీ ‘’అయి పోయింది .’’నాటీ’’అని అందరూ ప్రేమగా ఆప్యాయం గా పిలిచేవారు ఈ ‘’లవ్ లార్డ్ బైర’న్ ‘’ను .’’అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం –‘’తరం తరం నిరంతరం ఈ అందం ‘’గా గడిచి పోతోంది .కరోలిన్ ను యెంత దూరం చేయాలనీ ప్రయత్నించినా అంత మీద పడి పోతోంది .ఇప్పటికి మన శ్రుంగార లార్డ్ వయసు పాతిక మాత్రమె .
ఏది చేసినా పధ్ధతి ప్రకారమే సాగించాడు .అన్న బెల్లా బైరాన్ కు సాయం చేసేది .కాని ఆమె ఇష్టం లేకుండా ముందుకు అడుగు వెయ్యలేక పోయాడు ఇంతలో లేడీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ జెం ఎలిజబెత్ అనేవివాహిత నలభై ఏళ్ళ పిల్లా జెల్లా తో ఉన్నావిడ బైరాన్ పై మోజు పడింది .ఎన్నో షరతులు పెడితే వదిలేశాడు .ఇంకా చాలా మంది గాలం వేస్తున్నారు మన’’కవి చేప’’ చిక్కటం లేదు .హాయిగా ప్రశాంతం గా గడపాలని కోరుకొన్నాడు .కవిత్వమే పరిష్కారం అని ఎంచుకొన్నాడు .1813లో ‘’ది జియనోర్ అండ్ ది బ్రిడ్ ఆఫ్ అబిదోస్ ‘’పబ్లిష్ చేశాడు .తర్వాత ‘’కార్సైర్ ‘’రాస్తే పన్నెండు వేల కాపీలు అమ్ముడు పోయాయి .న్యు స్తేడ్ ఆబ్బే ఎస్టేట్ ను లాభానికి అమ్మాడు .కాని కొనే వాడు పూర్తీ డబ్బు ఇవ్వలేక పోవటం తో బైరన్ కే దక్కింది .బిజీ బిజినెస్ మాన్ అయ్యాడు .ఒంటరితనం బాధిస్తోంది .
తన టర్కిష్ కద ఆధారం గా ‘’ది బ్రిడ్ ఆఫ్ అబిదోస్ ‘’ఇద్దరు విఫల ప్రేమికుల కదరాశాడు విషాద ‘’ఎపిజిల్ తు ఆగస్తా ‘’రాసాడు .బిడ్డను కన బోయే ముందు లేడీ మేల్బోర్న్ అనే అమ్మాయిని ప్రేమించి ఆమె చెల్లెలిని తీసుకొని యూరప్ వెళ్లాడు .పాపం చేస్తున్నావని ఆమె చెప్పినా పేడ చెవిని పెట్టాడు .పెళ్లి చేసుకోమని మేల బోర్న్ కోరుతోంది ,అనబెల్లా మీద మనసు దూరం కావటం లేదు .ఎటూ పాలు పోనీ స్తితి .కాని సృజన శక్తి మాత్రం విజ్రుమ్భిస్తూనే ఉంది .చెల్లెలు ఆగస్తా మాత్రం పాదరస బుద్ధి ఉన్న అన్న గారి జీవితం ఏమై పోతుందో అని కల వర పడుతోంది .1815లో అనబెల్లాను పెళ్లి చేసుకొన్నాడు .చర్చి లోంచి బయటికి రాగానే ‘’నన్ను సంస్కరించేంత గోప్పదానివా నువ్వు “’అని గురుడు పెట్రేగి పోయి అన్నాడు .పక్కలో పడుకోవచ్చా అని అడిగితే యవ్వనం దాటేదాకా పడుకోమ్మన్నాడు .తన సోదరితో బైరన్ ప్రేమకలాపం సాగిస్తున్నాడన్న రూమర్లు విన్నది .కాని అవి అబద్ధాలని నమ్మింది
బైరన్ పరిస్తితి రోజు రోజుకూ కుంగి పోతోంది .డిప్రెషన్ లో పడిపోతే అనబెల్లా సేవ చేస్తోంది .డబ్బు చేతిలో ఆడటం లేదు మరీ ఉద్రేకం పెరిగింది .అప్పుల వాళ్ళు రోజూ వచ్చి చెవిలో రోద పెడుతున్నారు అనబెల్లా గర్భిణి .సాయం కోసం అగస్తా వచ్చింది .బైరాన్ ను ప్రశాంతం గా ఉంచగలిగింది సోదరి ఆగస్తా మాత్రమె అను బిడ్డ ను కన్నది .కాని బైరన్ కు ఇదేమీ పట్టలేదు .పిచ్చివాడై పోతున్నాడు .పిచ్చ పిచ్చగా భార్యను తిడుతున్నాడు బిడ్డ మీద ప్రేమే చూప లేదు కూతురికి ‘’అగస్తా ఆదా’’ పేరు పెట్టాడు .అగస్తాను పంపిడ్డామనుకొంటే ఆమె ఇక్కడే ఉండి పోయింది .బైరన్ ను ఎప్పుడూ ఎవరో ఒకరు కని పెట్టుకొని ఉండాల్సిన అవసరమేర్పడింది .అగస్తా తలిదండ్రులను చేరి మళ్ళీ తిరిగి రాలేదు .పెళ్లి సంబడం ఒక ఏడాది మాత్రమె .ఈ విడిపోవటం అనేక పుకార్లకు చోటు కల్పించింది .’’నాకు రెండొందల మంది తో సంబంధం ఉంది ‘’గర్వం గా చెప్పుకొనే మగధీరుడు అనేక అభియోగాల్లో చిక్కుకొన్నాడు .అగస్తా తో అక్రమ సంబంధం ఉందనీ చెవులు కొరుక్కున్నారు .కాని బైరన్ ఆమెలో తన తల్లినే చూసుకొన్నాడు. తల్లి ప్రేమ ను పొందలేని బైరాన్ ఆమె సన్నిధిలో ఆ మాతృప్రేమ రుచిని పొందుతున్నాడు .25-4-1816న మన లార్డ్ గారు సెమి రాయల్ దర్జాతో ముగ్గురు సేవకులు ,ఒక డాక్టర్ తో స్వయం గా ప్రవాస జీవితాన్ని ఎన్నుకొని లండన్ వదిలి వెళ్లి పోయాడు .కుళ్ళి కంపుకొట్టే ఈ సమాజానికి దూరం గా వెళ్తున్నానని చెప్పుకొన్నాడు బైరన్ .ఇరవై ఎనిమిదేళ్ళ ఈ కవి వీరుడు ఇంకా సాధించాల్సిన అద్భుతాలెన్నో ఉన్నాయి .
మరిన్ని బైరన్ సంగతులు ఈ సారి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-14-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

