పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -42
విదరింగ్ హైట్స్ నవలా కారిణి – ఎమిలి బ్రాంట్
టెన్నిసన్ కు భిన్నం గా ఎమిలీ బ్రాంట్ జీవవించింది .ఐరిష్ తండ్రికి జన్మించింది .తండ్రి చిత్రకళ నేర్చుకొందామనుకొన్నాడు కానీ యవ్వనం లో నే మరణించాడు .ఎమిలీ బ్రాంట్ 1818-1848కున్న అక్కలు మంచి రచయిత్రులే .అయితే ఎమిలీ అక్కల్ని మించి పోయింది .దాదాపు చదువు అంతా ఇంటి వద్దే నేర్చింది .క్లేర్జి డాటర్స్ స్కూల్ లో చేరింది అక్కడి పరిస్తితులు ఆహారం దారుణం .సోదరి షార్లెట్ తోకలిసి బ్రసెల్స్ వెళ్లి ,అక్కడా ఇమడలేక వచ్చేసింది .ఆమె రచనల్లో స్వీయ చరిత్ర ఏంతో తెలుసుకోవటం కష్టమే .’’బ్రాన్ టేస్ వెబ్ ఆఫ్ చైల్డ్ హుడ్ ‘’అనే పుస్తకం లో ఫన్నీ ఎలిజబెత్ ఇచ్చిన వివరణే అందరికి ఆధారం .
ఎమిలీ సోదరీమణులు ఒక ఊహా గ్రామాన్ని నిర్మించుకొన్నారు దానికి ‘’గొండాల్ ‘’అని పేరు పెట్టారు .ఇది ఫసిఫిక్ దీవుల్లో ఉందనిమాపులు తయారు చేశారు .కవిత్వం లో ఫిక్షన్ ,ఎలిగరి ,స్వీయ చరిత్రా అన్నీ కల గలిపి ‘’ది ఓల్డ్ స్తాయిక్ ‘’లో రాసింది ఎమిలీ పాత్రలు ‘’.గొండాల్ సాగా’’ గా సాగిపోతాయి .’’cold in the earth ,and the deep snow piled above thee –far ,far removed ,cold in the dreary grave –have I forgotten ,my only love ,to love thee –severed at last by Time;s all wearing wave ‘’అంటూ సాగే కవిత్వం అది .ఈ అక్క చెల్లెళ్ళ పేరిట ఒకే ఒక పుస్తకం వెలువడింది వాళ్ళ అస్తిత్వాన్ని దాచేసుకొన్నారు .తాము ఆడవాళ్లమని చెప్పుకోదలచ లేదని అన్నారు .స్వంత ఖర్చుతో పుస్తకం ముద్రించి లాభా పేక్ష లేకుండా విడుదల చేశారు .రెండు కాపీలే అమ్ముడు పోయాయి మిగిలినవి ట్రంకు పెట్టెల్లో మూలుగుతున్నాయి .’’ఎల్లీస్ బెల్స్ ‘’అనే మారు పేరుతోనే రాసేది .ఆమె రాసిన గొప్ప నవల ‘’విదరింగ్ హైట్స్’’ఆదే ఆమె పేరుకు ,ప్రభావానికి కారణ మైంది .
బ్రాంటీ కుటుంబాన్ని క్షయ వ్యాధి పీడించింది అక్కలు చనిపోయారు ఎమిలీ ఎలాగో తట్టుకొని బతికింది .ముప్ఫై వ ఏట ఎమిలి కి దగ్గు జలుబు పట్టి క్షీణించింది మగాడి లా ధైర్యం గా జబ్బుతో పోరాడింది కాని విధికి లొంగి 19-12-1848న మరణించింది .’’షిర్లీ ‘’కవిత లో హీరోయిన్ ను ధైర్య వంతురాలిగా చూపింది .ఇరవై రెండేళ్ళ వయసులో రాసిన ‘’ది ఓల్డ్ స్తాయిక్ ‘’కవితలో యెమిలీ అసాధారణ ధైర్యం వ్యక్తిత్వం కని పిస్తుంది .ఒక సారి తొంగి చూద్దాం –
‘’riches I hold in high esteem –and love I laugh to scorn –and lust of fame was but a dream –that vanished with the morn ‘’-and if I pray ,the only prayer –that moves my lips for me –is ‘’leave the heart that now I bear –and give me liberty ‘’ సంగీత ,శబ్ద శక్తి కి ఎమిలీని మెచ్చుకొంటారు .ఒకే ఒక్క నవలతో నవలా మణిగా వెలిగిపోయింది .1850దాకా ఆమె అసలు పేరు వెలుగు లోకి రాలేదు .’’a peculiar mixture of timidity and sportan like character ‘’-she was painfully shy and physically brave to a surprising degree . తన విధి నుంచి అంగుళం కూడా ప్రక్కకు తొలగని దీక్షా పరురాలు ఎమిలీ .
ఫ్లారెన్స్ నైటింగేల్ కు సెక్రెటరి -ఆర్ధర్ హగ్ క్లగ్
ఆర్ధర్ హగ్ క్లగ్ మారుతున్న ప్రపంచం లో పుట్టాడు .మార్పు నచ్చక పూర్వ భావనలే గోప్పవనే వాడు .భవిష్యత్తుపై నమ్మకం లేని వాడు .మొదటి నుంచి ఒడి దుడుకుల జీవితమే .1-1-1819న లివర్ పూల్ లో పుట్టి నాలుగవ ఏట సౌత్ కారోలిన్ చేరాడు తండ్రి తో .రగ్బీ స్కూల్ లో చేరి ప్రముఖ హెడ్ మాస్టర్ అయిన డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ శిష్యుడైనాడు .ఆక్స్ ఫర్డ్ కాలేజిలో చేరి ,ప్రపంచ పర్యటనకు బయల్దేరాడు .ఫ్రెంచ్ విప్లవ కాలం లో పారిస్ లో ఉన్నాడు .రోమ్ లో అమెరికా ఫిలాసఫర్ ఎమర్సన్ ను కలిశాడు .ఆయన వలన అమెరికాలో వారానికి ఆరుడాలర్ల జీతం తో బతకచ్చు అని తెలుసుకొని అమెరికా వెళ్ళిపోయాడు .అమెరికాలో ఉపన్యాసాలిస్తూ ,అనువాదాలు చేస్తూ గడిపాడు ..లాభం లేదని గ్రహించి ఇంగ్లాండ్ చేరుకొన్నాడు ..పెళ్లి చేసుకొని ఫారిన్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ కు సెక్రెటరి అయ్యాడు ..ఆరోగ్యం దెబ్బతిని మలేరియా సోకి ఫ్లారెన్స్ లో 13-11-1861న చనిపోయాడు
క్లగ్ జేవితం వాగ్దానాల మయమే తప్ప సాధించింది శూన్యం .సత్యాన్వేషకుడు గా మిగిలి పోయాడు బౌద్ధిక జ్ఞానం స్తిమితం లేకుండా చేసింది .కొన్ని కవితలు బాగా రాశాడు .’’thou shalt have one God only ,who –would be at the expense of two –no graven images may be –worshipped ,except the currency ‘’అతని ‘’ఆమర్స్ డీవాయెజ్ ‘’లో సెటైర్ తో బాటు సీరి యెస్ నేస్ కూడా ఉంది .ప్రేమ ,ప్రయాణం ,మతం పై అతని అభిప్రాయం తెలియదు కాని ఆత్మ అన్వేషణ కని పిస్తుంది .హెక్సా మీటర్లలో కవిత్వం రాశాడు .భార్య సోదరి ఫ్లారెన్స్ నైటింగేల్ కు యుద్ధ సమయం లో జీతం లేని సెక్రెటరి గా సేవలందించాడు .
![]()
ముని కవి – మాధ్యూ ఆర్నోల్డ్
ఆర్నోల్డ్ కూడా విక్టోరియన్ కవి .నమ్మకం ,అనుమానాల మధ్య ఊగిస లాడాడు .ఇంగ్లిష్ క్రిటిసిజం కు మూల భావాలుగా ఆయన మాటలుంటాయి .తండ్రి రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ .మాధ్యూ మిడిల్ సెక్స్ లోని లాలేహాం లో క్రిస్మస్ ఈవ్ నాడు 1822లో పుట్టాడు .రగ్బీ స్కూల్ లో చదివి కవిత్వం రాసి రాగ్బీ ప్రైజ్ సాధించాడు .ఇది ‘’అలారిక్ ఎట్ హోమ్’’గా ప్రసిద్ధం .ఎన్నో గౌరవాలు పొందాడు .బలోలి కాలేజికి స్కాలర్షిప్ వచ్చి చేరి హగ్ క్లగ్ కు హాస్టల్ మేట్అయ్యాడు .న్యుదిగేట్ ప్రైజ్ పొందాడు .
ఇరవై రెండులో డిగ్రీ పొంది రగ్బీ స్కూల్ లో పని చేసి ఒరిల్ కాలేజికి ఫెలోషిప్ సాధించాడు .లార్డ్ లాన్స్ డౌన్ కు పాతిక ఏళ్ళ కే సెక్రెటరి అయ్యాడు .వివాహం తో పొజిషన్ పెరిగి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అయ్యాడు .విదేశీయానం తరచూ ప్రయాణాం తనను ఇంటికి దూరం చేస్తున్నాయని బాధ పడేవాడు .’’ది స్త్రేయిడ్ రివీలర్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’ను ఇరవై ఏడవ ఏట పబ్లిష్ చేశాడు .రెండేళ్ళ తర్వాత ‘’ఎమ్పిడికిల్స్ ఆన్ యెత్నా ‘’రాసి ప్రచురించాడు అరవై అయిదేళ్ళు మంచి ఆరోగ్యం తో జీవించి కొద్ది పాటి అస్వత్తత తో 15-4-1888న చనిపోయాడు . రోమాం టిజానికి-మోడరనిజానికి వారది ఆర్నోల్డ్ .’’want of logic and thoroughness of thought’’కు ప్రాధాన్యత నిచ్చాడు .’’న్యు జర్నలిజం ‘’కు ఆద్యుడు ఆర్నోల్డ్ .ఆయన రాసిన వన్నీ ‘’కవర్ టు కవర్ ‘’చదివిస్తాయి .
ఆర్నోల్డ్ రాసిన సంస్కృతీ ,మతం వ్యాసాలూ బాగా ప్రసిద్ధి పొందాయి ‘’ఫైలిష్టినేస్ ‘’ను వ్యతిరేకించాడు .అంటే మధ్యతరగతి మనస్తత్వాన్ని వారి ఉదాసీనతను వ్యతిరేకించాడు .’’poetry had an ethical purpose ,that it should be ‘’a criticism of life’’and he believed that he believed that his own verse exemplified it .’’అని అభ్ప్రాయ పడ్డాడు .కవిత్వం అంటే జీవితానికి వ్యాఖ్యానం .దీన్ని కవి అందం గా శక్తి వంతం గా అన్వయించి చెప్పాలి .నీటికి వ్యతిరేకమైన కవిత్వం జీవితానికీ వ్యతిరేకమే అవుతుంది .నైతికత కు ఉదాసీనం గా ఉండే కవిత్వం జీవితానికీ వ్యతిరేకమే అంటాడు ఆర్నోల్డ్ మహా సహాయుడు .ఆర్నోల్డ్ కవిత్వాన్ని గౌరవిన్చారుకాని ప్రేమించ లేదు .అతని డవర్ బీచ్ కవితలోని కొన్ని పంక్తులలో ‘’eternal note of sadness ‘’కానీ పిస్తుంది .’’the sea of faith-was once too,at the full ,and round earth;s shore –lay like the folds of a bright girdle furled –but nowi only hear –its melancholy ,long withdrawing roar –retreating to the breath –of the night wind ,down the vast edge drear –and naked shingles of the world ‘’.
ప్రి రాఫెలైట్స్త్
మాధ్యూ ఆర్నోల్డ్ రాసింది పెసి మిస్టిక్ కవిత్వాన్నిఆదరించక పోయినా విక్టోరియన్ ప్రజలు ఫిట్జెరాల్డ్ రాసిన ‘’ఒమర్ ఖయ్యాం ‘’,ఫర్కార్ టప్పర్ రాసిన ‘’ప్రావేర్బియాల్ ఫిలాసఫీ ‘’ని లక్షలాది మంది చదివారు .పందొమ్మిదో శతాబ్ది మధ్యలో యాంటి విక్టోరియన్ గ్రూప్ ఒకటేర్పడింది .దీన్ని ప్రి రాఫెలైట్స్ బృందం ‘’అన్నారు .1850లో వీళ్ళు ఒక మేగజైన్ ను ‘’ది జేర్మ్’’పేరిట విడుదల చేశారు .అది ఒక పైన్తర్స్ ఉద్యమంగా మొదలైంది .యాంత్రిక యుగాన్ని విమర్శిస్తూ సమకాలీన జీవితాన్ని వ్యాఖ్యానించింది .కళకు కొత్త జవ జీవాలు,గౌరవ పరాభవాలు కల్పించాలని కోరింది .మన ఆలోచనలలో నిజాయితీ ఉండాలని కోరింది రాఫెల్ ,రినైసేన్స్ ల తర్వాత ‘’we must be early Christian-pre –Raphaelite’’అన్నారు .ఈ ఉద్యమం బాగా వ్యాపించి పైన్తర్లను కొంతమంది రచయితలను ప్రభావితం చేసింది .అదొక మిశ్రమ సంస్థ అయింది .అందులో విలియం హాల్మాన్ హంట్ ,ఎడ్వర్డ్ బర్న్స్ జోన్స్ ,ఫోర్డ్ మదాక్స్ బ్రౌన్ ,జాన్ ఎవరెస్ట్ మిల్లేస్ వంటి పైన్తర్లున్నారు .దంటే గాబ్రియల్ రోసేట్టే పైంటర్ మాత్రమె కాక కవి కూడా .విలియం మోరిస్ ఒక కొత్త సంస్కృతికి దారి తీశాడు .గాజు కిటికీలను ,వస్తుసామగ్రిని ,కంబలీలను ,పరికరాలను కొత్త తరహాలో నిర్మించాడు .తనకాలం లో చిన్న బోయిన దాన్ని మళ్ళీ వైభవానికి తెచ్చాడు .దీన్ని యుటోపియన్ఆఫ్ ‘’న్యూస్ ఫ్రం నో వేర్ ‘’;గా తెలిపాడు
కోవెం ట్రీ పాట్ మోర్
జేర్మ్స్మేగజైన్ కు యధాశక్తి కృషి చేసిన వాడు కోవెంట్రీ పాట్ మోర్ .23-7-1823లో ఎప్పింగ్ ఫారెస్ట్ లో పుట్టి ,తండ్రి వద్దే అన్నీ నేర్చి ,తండ్రిలా పైంటర్ అవకుండా సాహిత్యానికే అంకితమయ్యాడు .థాకరే ‘’వికసిస్తున్న కవి మొగ్గ ‘’అన్నాడు .ఇరవై ఒకటిలో మొదటి సంకలనం ‘’యాన్ ఏంజెల్ ఇన్ ది హమ్ ‘’వదిలాడు బ్రిటిష్ మ్యూజియం కు అసిస్టంట్ లైబ్రేరియన్ అయ్యాడు .భార్య మరణం తో రోమన్ కేధలిక్ అయి ,ఒక ఎస్టేట్ కు అధిపతి అయ్యాడు .’’అన్ నొన్ ఈరోస్ ‘’రాసి అందులో గృహస్థ జీవితం ,ప్రేర్మలను కరిపించాడు .మొద్దో పెళ్లి చేసుకొని లిమింగ్ టన్లో ఉన్నాడు .26-11-1896న డెబ్భై మూడో ఏట చనిపోయాడు .అతని భాష అధిక తియ్యదనం ,విసుగుదనం తో ఉంటుంది .
కవి చిత్రకారుడు -డాంటే గేబ్రియల్ రోసేట్టి
విక్టోరియన్ కాలం లో రోసేట్టీలు ఫైన్ ఆర్ట్స్ కు గొప్ప సేవ చేశారు .తండ్రి ఇటాలియన్ తల్లి సగం ఇటాలియన్ .ఇల్లు అంతా నియో పోలిటన్లు టస్కాన్ సంస్కృతీ తో జీవించింది. పెద్ద కోడుకు డాంటే గాబ్రియల్ కవిగా పెయింటర్ గా ,నాయకుడు గా ఎదిగాడు 12-5-1828లో పుట్టిన గాబ్రియేల్ తన కవితలకు స్వయం గా బొమ్మలు వేసుకొని చిన్నతనం లోనే అందరిని ఆకర్షించాడు .ఇరవైలలో ఫోర్డ్ మడాక్స్ బ్రౌన్ అనే గొప్ప పైంటర్ దగ్గర చేరి మెళకువలు గ్రహించాడు .కొన్ని నెలల తర్వాతా ఇద్దరు మిత్రులతోకలిసి ‘’ప్రి రాఫెలైట్ బ్రదర్ హుడ్ ‘’ను స్థాపించాడు .విలియం మోరిస్ మొదలైన వారందరూ చేరి ఊపు తెచ్చారు .రోసేట్టి వేసిన చిత్రాలు ప్రి రాఫెలైట్స్ కు అద్డ్డం పడతాయి .జాన్ రస్కిన్ ఈ ముఠాపై విరుచుకు పడ్డాడు .రోసేట్టి సంపూర్ణ మోడల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి సాధించాడు .ఎలిజబెత్ సిద్దాల్ తో ప్రేమాయణం సాగించి ,పెళ్ళాడి తన కలల స్వరూపాన్ని పొందాడు .ఆమె ఎప్పుడూ జబ్బు పడే ఉండేది బాధ భరించలేక మత్తు మందుకు అలవాటు పడింది .ఒక రోజు డోసు ఎక్కువై నిద్రలోనే చనిపోయింది
భార్య చనిపోయిన తర్వాతా రోసేట్టి లండన్ లోని చాల్సియా లో ఉన్నాడు .రొమాంటిసిజం పై కొంత కాలం ఊగాడు .కీట్స్ పై ఆరాధన పెరిగింది ..’’బాలడ్స్ అండ్ సీన్స్ ‘’అనే అద్భుత కవితా సంకలనం తెచ్చి 9-4-1882న రోసేట్టీ మరణించాడు .యూరోపియన్ సింబాలిజం పై గొప్ప ప్రభావం చూపాడు .ఈస్థటిక్ ఉద్యమానికి ఊపిరిలూడాడు . పెయింటింగ్ లో డేకరేటివ్ ఆర్ట్ లో గొప్ప సాధన చేశాడు .
సశేషం
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -9-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
