పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43 క్రిస్మస్ గీత రచయిత్రి – క్రిస్టినా రోసేట్టి

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43

క్రిస్మస్ గీత రచయిత్రి –   క్రిస్టినా రోసేట్టి

క్రిస్టినా- రోసేట్టి కుటుంబం లో చిన్నది .5-12-1830లో లండన్ లో పుట్టింది .గాబ్రియల్ కు విరుద్ధం అందగత్తె కాదు .డాంటే గాబ్రియల్ రాసిన మొదటి  సినిమాలో వర్జిన్ గా నటించింది .కవిగా ,పైంటర్ గా వారసత్వాన్ని కాపాడుకోంది.ఇటాలియన్ నేపధ్యం ఉన్నందున విజయం రాలేదు .మగాళ్ళు వెంబడి పడే వారు .పద్దెనిమిదేళ్ళ పడుచు జేమ్స్ కాలింసన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకోంది. ప్రీ రాఫేలైట్ బ్రదర్ హుడ్ అయిన అతను రోమన్ కేధలిక్ గా మారగానే ‘’తూ నా బొడ్డు’’ అని కాన్సిల్ చేసింది.కాలిన్స్ ఆమె ప్రశాంత మానసిక స్తితిని అల్ల కల్లోలం చేశాడు .ముప్ఫై వ ఏట చార్లెస్ కాయిలీని ప్రేమించి జీవితాంతం అతని తో ఉంది . ‘’హేవెన్లి బ్రైడ్  గ్రూం’’కోసం కలలు కన్నది . హంగూ ఆర్భాటం లేకుండా నే ఆ తరం లో పేరెన్నిక గన్న కవి గా గుర్తింపు పొందింది .’’గార్బిన్ మార్కెట్ ‘’,దిప్రిన్సెస్ అండ్ ఆదర్ పోయెమ్స్’’’’ఏ పీజిఎంట్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’వరుసగా రాసి ప్రచురించింది .గుండె బలహీనత తో బాధ పడింది .అరవై లలో కేన్సర్ వచ్చి ఆపరేషన్ చేయించు కొన్నది .కాని ప్రార్ధనలోనే ప్రశాంతం గా 29-12-1894 లో చని పోయింది .దాదాపు వెయ్యి కవితలు రాసింది .అందులో ప్రి రాల్ఫెలైట్ భావాలు పోదిగింది . ‘’గోబిన్ మార్కెట్ ‘’కవిత కు మంచి పేరుంది .’’ఎల్లెన్ ఎలిఎన్ ‘’అనే మారు పేరుతో రాసేది .చని పోయిన తర్వాతే ప్రసిద్ధి పొందింది .ఆమె రాసిన క్రిస్మస్ గీతం ‘’బ్లీక్ మిడ్ వింటర్ ‘’అందరు పాడుకొంటారు .

‘’white and golden Lizzie stood –like a lily in a flood –like a rock of blue-veined stone –lashed by tides obstreperously –like a beacon left alone –in a hoary roaring sea –sending up a golden fire’’లా కవిత్వం సాగిపోతుంది .ప్రయోగాలు లేని భావుకత .విచారాన్ని ,లిరికిజం తో సమ్మేళనం చేసి రాసింది .

‘’when I am dead ,my dearest –sing no sad songs for me –plant thou no roses at my head –nor shady cypress tree ‘’—-‘’I shall not see shadows –I shall not feel the rain –I shall not hear the nightingale –sing on ,as if in pain –happly I may remember –and haply may forget ‘’

 

 

Inline image 1

.

ఎడ్గార్ అలెన్ పో తో సాటి -ఆల్గేర్నాన్ చార్లెస్ స్విన్ బర్న్

స్విన్ బర్న్4-5-1837లో లండన్ లో పుట్టాడు .  అరిస్తో క్రాటిక్ కుటుంబం .తండ్రి అడ్మిరల్. తాత లార్డ్ .ప్రీ రాఫలైట్ లను అధిగమించాలని ప్రయత్నించాడు స్విన్ బర్న్.ఇరవై అయిదులో ‘’ది క్వీన్ మదర్ అండ్ రోసమాండ్ ‘’అనే రెండు చారిత్రాత్మక ట్రాజెడీ నాటకాలు రాసి రోసేట్టి కి అంకితమిచ్చాడు .బ్లాంక్ వేర్స్ లో లిరిక్స్ రాశాడు .’’అట్లాంటా ఇన్ కాలిడాన్ ‘’రాసి సెన్సేషన్ సృష్టించాడు .బైరన్ రాసిన చైల్డీ హరాల్డ్ తర్వాతా అంతటి గొప్ప కవిత రాలేదు .భావాలు తీవ్రం గా ,ఆచారాలకు విరుద్ధం గా ఉండటం తో యువకుల గుండె చప్పుడు కు దగ్గరైంది .’’వెన్ ది హౌండ్స్ ఆఫ్ స్ప్రింగ్ ‘’లో దుమ్ము దులిపేశాడు .

‘’they gave him light in his ways –and love ,and a space for delight –and beauty and length of days –and night and sleep in the night –his speech is a burning fire –with his lips he traveileth –in his heart is a blind desire –in his eyes foreknowledge of death –‘’అంటూ నిప్పులు కక్కుకుంటూ ఎగిరాడు నింగికి .

ముప్ఫై లో ప్రసిద్ధ కవి అని పించుకొన్నాడు .కవే కాక  ‘’ కాంట్ర వర్సీ’’ కూడా అయ్యాడు .అతని కామం బూతు అందరికి జుగుప్స కల్గించాయి .నలభై లలో ‘’స్టేడి ఆఫ్ షేక్స్ పియర్ ‘’,సాంగ్స్ అండ్ స్ప్రిన్గ్సైడ్స్ ‘’మోడరన్ హేపతాల్జియా ‘’లు వరుసగా రాసి సంచలం సృష్టించాడు .విడువ కుండా రాస్తూనే ఉన్నాడు అయిదు పద్య నాటకాలు ,ఒక నవల ,పది వచన పుస్తకాలు రాసి ఏదీ వదలకుండా రాశాడని పించుకొన్నాడు .’’swinburne has now said not only all he has to say about every thing  but all he has to say about nothing ‘’ అని ఎస్టిమేట్ చేశారు .ఆలోచనా పరుడిగా కంటే ఆవేశ పరుడు .’’యెన్ సైక్లో పీడియా బ్రిటానికా –పదకొండవ ఎడిషన్ ‘’కు సహక  రించాడు .రెండు సార్లు నోబెల్ ప్రైజ్ కు ఎంపికైనాడు .కాని రాలేదు .’’the tumultuous out cry of the adjectives and head strong  rush of undisciplined sentences  are the index of the impatience and laziness  of a disorderly mind’’అని ఇలియట్ తీర్మానించాడు .ఎడ్గార్ అల్లెన్ పో తర్వాత ఇంగ్లాండ్ అమెరికాలలో నిజమైన కవి స్విన్ బర్న్ అన్నాడు హెచ్ పిలోక్రాఫ్ట్ .

Inline image 2

 

విక్టోరియన్ రియలిస్ట్ –  థామస్ హార్డీ

పందొమ్మిది ఇరవై శతాబ్దాలకు వారధి థామస్ హార్డీ .సగం రొమాంటిక్ సగం వాస్తవ వాది .రాసిన కవితలు ఆధునిక కవితలకు మార్గ నిర్దేశం చేశాయి .2-6-1840లో డార్సేట్ లోని డార్చెస్టర్ లో పుట్టాడు .రాసిన నవలకు ఇదే నేపధ్యం అయింది .అర్భకం గా పుట్టి తల్లి సంరక్షణ లో ఎనిమిదో ఏడు వరకు ఇంట్లోనే ఉన్నాడు .పదహారవ ఏట ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ దగ్గర సహాయకుడిగా చేరాడు .అప్పటికే కవితలు గిలుకుతున్నాడు .’రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్ ప్రైజ్ పొందాడు కార న్ వాల్ వెళ్లి వికార్ మరదల్ని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు .ఆర్కి టేక్చార్ లో నీతులున్నా ధన లక్ష్మి కనికరించలేదు .వదిలేసి ‘’ది పూర్ మాన్ అండ్ ది లేడీ ‘’రాసి ప్రచురిద్దామనుకొంటే అందులో ‘’సరుకు లేదు ‘’అని తిప్పి పంపేశారు .కసిగా ‘’డెస్పరేట్ రేమిడీస్ ‘’రాస్తే ఒక మాదిరి ప్రోత్సాహం వస్తే ఇక రాస్తూనే ఉన్నాడు .నవలా ప్రయత్నమూ చేసి చివరికి కవిత్వమే ఫుడ్డూ బెద్డూ అనుకోన్న్నాడు  .ముప్ఫై అయిదు నలభై మధ్యలో ఎనిమిది నవలలు దించాడు .ముప్ఫై కి పైగా చిన్న కధలు రాశాడు .ఇవన్నీ క్లిక్ అయి లక్ష్మీ ప్రసన్నం కలిగించాయి .’’టెస్ట్ ఆఫ్ ది డీ ఆర్బర్ విల్లీస్’’రాసి విమర్శకులను ఆకర్షించాడు .ఓవిడ్ ,టేరిస్ లను యవ్వనం లోనే చదివాడు .డార్విన్ ను ,స్టువార్ట్ మిల్ ను అధ్యయనమ చేశాడు .’’టేస్స్ ‘’రాశాడు .’’తుస్సు ‘’మంది .విమర్శకుల జడివానకు ప్రతిగా సమాధాన గొడుగు పట్టి నిరుత్తరుల్ని చేశాడు .పిచ్చి కోపం తో ఒకడు దాన్ని తగల బెట్టి బూడిద పార్సెల్ చేసి హార్డీకి పంపాడు

అరవైలో ‘’వేసేక్స్ యెమ్స్ ‘’రాసి ప్రచురిస్తే ఎవరూ పట్టించుకో లేదు .మరో అయిదేళ్లకు ‘’పోయెమ్స్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ‘’విడుదల చేస్తే కొంత ఉత్సాహం వచ్చింది ‘’డైనాస్టీ’’మొదటి భాగం రాసి ప్రచురించాడు .నాలుగేళ్ల తర్వాతా ‘’నెపోలియన్ యుద్ధాలు ‘’ను మూడు పుస్తకాలలో పందొమ్మిది అంకాలుగా రాశాడు .నూట ముప్ఫై సీన్లున్నాయి .డెబ్భై రెండులో భార్య మరణించింది .తన సేక్రేటరినే పెళ్లి చేసుకొన్నాడు .సోమర్ సెట్ మాం రాసిన ‘’కేక్స్ అండ్ ఐల్స్ ‘’హార్డీ జీవితమే .మూడు గొప్ప కవితా పుస్తకాలను రాసి ముద్రించాడు .ఎనభై ఎనిమిదవ ఏట జలుబు చేసి తీవ్రమై .11-1-1928న హార్డీ మరణించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేసి ,అయన వీలునామా లో రాసిన దాని ప్రకారం గుండెను తనకు అతి ఇష్టమైన డార్చేస్తర్ గ్రామం లో సమాధి చేశారు .

డార్విన్ ను సమర్ధించినా విశ్వానికి కేంద్రం మానవుడు అన్న దాన్ని హార్డీ ఒప్పుకో లేదు .సైన్సు ను సాహిత్యం గా మార్చిన ఘనుడు .ప్రకృతిని వర్డ్స్ వర్త్ తో బాటు అర్ధం చేసుకొన్నాడు .ప్రపంచం దేవుడి ఓటమి అన్నాడు .విక్టోరియా యుగపు చివరివాడైనా కొత్త దనం కోసం ప్రయత్నించాడు .

‘’when the present has latched its postern behind my trermulous stay’’మొదలైనవి అతని కవితలు  -విక్టోరియన్ రియలిస్ట్ అంటారు .పతనమై పోతున్న విక్టోరియన్ సంఘం పై విమర్శ చేశాడు .లారెన్స్ ,వర్జీనియా ఉల్ఫ్ లకు ప్రేరణ .లిరిక్స్ సెటైర్ బాలడ్స్ ,డ్రమాటిక్ మొనోలోగ్స్ రాసి మెప్పించాడు .బోయేర్ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాలపై మంచి కవితలు రాశాడు .ప్రేమ జీవిత వైఫల్యాలపైనే ఎక్కువ గా రాశాడు .కవితల్లో ఐరనీ(పరిహాసమ్ ) పాలు ఎక్కువే .ఇరవయ్యవ శతాబ్ది గొప్ప కవుల్లో ఒకడుగా ప్రసిద్ధుడు .జంతు హింసకు వ్యతిరేకి .ఫ్రాస్ట్, ఆడెన్ మొదలైన వారిపై ప్రభావం చూపాడు .ఆక్స్ ఫర్డ్ బుక్ ఆఫ్ ట్వెంటి ఎత్ సెంచరి వెర్సెస్ ‘’లో హార్దీవి ఇరవై ఏడు కవితలను చేర్చి లార్కిన్ హార్డీ కవితా ప్రాభవానికి ప్రాచుర్యం కలిగించాడు .

Thomashardy restored.jpg

 

 

ఇంగ్లాండ్ దేశ పందొమ్మిదో శతాబ్ది  ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభ కవుల ముచ్చట్లు సమాప్తం .ఇక న్యూ ఇంగ్లాండ్ ‘’కొత్త ప్రపంచం ‘’అని పిలువ బడే అమెరికా కవుల ముచ్చట్లు తెలుసు కొందాం రేపటి నుంచి –

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-6-14- కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.