పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49 నేషనల్ బార్డ్ – కారల్ శాండ్ బర్గ్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49

నేషనల్ బార్డ్ – కారల్  శాండ్ బర్గ్

‘’poetry is the synthesis of hyacinths and biscuits .poetry is the opening and closing of a door – a search for syllables to shoot at the barriers of the unknown and the unknowable ‘’ అని కవిత్వ లక్షణాలను నిర్వచించి దానికోసమే బతికిన వాడు కారల్ శాండ్  బర్గ్ .స్వీడిష్ జాతికి చెందిన ఈ కవి ఇలినాయిస్ రాష్ట్రం గేల్స్ బర్గ్ లో6-1-1878 లో పుట్టాడు .డబ్బు లేని కుటుంబం .మిల్క్ వాగన్ మీద  పని చేయటానికి  కు వెళ్ళే వాడు . పదిహేనవ ఏట బార్బర్ షాప్ లో ,దియేటర్ లో తెరలు లాగటం  ,ట్రాక్ డ్రైవర్ కు సహాయకుడిగా చిన్న చిన్న పనులు చేశాడు .పొలం పనులు ,హోటల్ సర్వర్ గా కూడా చేశాడు .స్పానిష్ అమెరికన్ యుద్ధం లో సైన్యం చేరి పోర్తారికా లో పని చేశాడు అమెరికా తిరిగి వచ్చి లాంబార్డ్ కాలేజి లో చేరాడు .కాలేజి పేపర్ కు ఎడిటర్ అయ్యాడు .బాస్కెట్ బాల్ టీం కెప్టెన్ అయ్యాడు .కాలేజి వదిలాక సేల్స్ మాన్ ,గ అడ్వేర్ టైజింగ్   మేనేజెర్ గా ,జర్నలిస్ట్ గా పని చేశాడు .

చిన్నప్పటి నుండే కవిత్వం చదవటం ఎలా రాయాలో కూడా తెలుసుకొన్నాడు .కొన్ని కవితలను పాతికేళ్ళ వయసులో ‘’ఇన్ రెక్ లెస్ ఎక్స్టసి ‘’పేర ముద్రించాడు .విట్మన్ రాసినట్లున్నాయవి .కవితా రీతిలో శాండ్ బర్గ్ ముద్ర ఉండేది .

‘’డౌన్ ఇన్ సథరన్ న్యూ జెర్సీ దే  మేక్ గ్లాస్ –బై డే అండ్ బై నైట్ ది ఫైర్ బర్న్స్ అం ది మిల్విల్లీ అండ్ బీడ్ ది శాండ్ లేట్ ఇన్ ది నైట్’’కవిత అచ్చయింది .ఇలా పత్రికలకు రాస్తూ బతుకుతున్నాడు .ఒక కవితా సంకలానికి ప్రైజ్ వచ్చింది .అమెరిక సాధారణ భాషనే కవిత్వానికి వాడాడు .’’చికాగో పోయెమ్స్ ‘’విడుదల చేస్తే దానిపై రగడ రేగింది .’’కూల్ టూమ్బ్’’ కవిత ఒక మచ్చు తునక .

‘’when Abraham Lincoln was shoveled into the tombs ,he forgot the copper heads and the assassin –in the dust in the cool tombs –and Ulysses Grant lost all thoughts of con men and wall street ,cash and collateral turned ashes —in the dust ,in the cool tombs ‘’

డెబ్భై ఏళ్ళు వచ్చేసరికి శాండ్ బర్గ్ ఎనిమిది సంపుటాల కవిత్వం జానపద గీతాలు  ది అమెరికన్ సాంగ్ బాగ్ ,రిమేమ్బ్రెంస్ రాక్ అనే ఆటోబయాగ్రఫీ  వగైరా రాసి ముద్రించాడు .యువకుల కోసం ఎన్నో కదా పుస్తకాలు రాశాడు .అబ్రహాం లింకన్ పై ఆరు భాగాల జీవిత చరిత్ర రాశాడు .చారిత్రిక రచన చేసినందుకు పులిట్జర్ బహుమతి లభించింది .ఇలినాయిస్ గవర్నర్ అడ్లాయిడ్ స్టీవెన్సన్ శాండ్ బర్గ్ డెబ్భై అయిదవ జన్మ దినాన్ని’’కారల్ శాండ్ బర్గ్ డే ‘’గా ప్రకటించి నిర్వహించి గౌరవించాడు .అభిమానులు స్నేహితులు వచ్చి కోలాహలం చేశారు .స్వీడెన్ రాజు ‘’ఆర్డర్ ఆఫ్ ది నార్దార్న్ నార్దర్న్ స్టార్   ‘’ను అందజేసి గౌర్వవించాడు .అమెరిక అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ సంస్థ బంగారు పతాకాన్ని ప్రదానం చేసింది .

వాల్ట్ విట్మన్ తరువాత ఇంత గౌరవం పొందిన వాడు శాండ్ బర్గ్ ఒక్కడే .పంటపొలాలు  ప ,ఆకాశ హర్మ్యాలు ,స్టీలు మిల్లులు అతని కవితా వస్తువులై వాటిల్లో ఆత్మాన్వేషణ చేశాడు .’’ది పీపుల్ ‘’లో సామాన్య మానవుడిని అద్భుతం గా ఫోకస్ చేశాడు .ఇల్లినాయి స్ లో  చిన్న   గ్రామీణ వాతావరణం నుండి  నార్త్ కరోలినా లోని ఫ్లాట్ రాక్ కు చేరాడు ఉన్నతమైన దానిని మంచి దానిని సమాదరించాడు ,స్పూన్ లివర్ ఆన్తాలజి ని వ్యతిరేకించాడు .పొడుగ్గా నవ్వుతూ తెల్ల జుట్టు కళ్ళ మీదకు దూకుతూ కని  పించేవాడు .’’నేషనల్ బార్డ్ ‘’అని పించుకొన్నాడు శాండ్ బర్గ్ .  “indubitably an American in every pulse-beat”.అన్నారు .శతాబ్ది ఉత్సవానికి ప్రత్యెక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు .అతని ‘’రూటా బాగా’’కధలు చిన్నపిల్లల్ని బాగా ఆకట్టుకొన్నాయి .

 

Carl Sandburg NYWTS.jpg

 

 

ప్రయరి ట్రూబడోర్ —  వాచల్  లిండ్ సే

జాజ్ పద్ధతిలో కవిత్వాన్ని,గాస్పెల్ ఆఫ్ బ్యూటీ ని  మెగా ఫోన్ ద్వారా వినిపించిన  ఇవాన్జేలిస్ట్  వాచల్ ల్ లిండ్ సే .10-11-1879లో ఇలినాయిస్ లోని స్ప్రింగ్ ఫీల్డ్ లో జన్మించాడు .లింకన్ పుట్టిన స్ప్రింగ్ ఫీల్డ్ అంటే వీరాభిమానం .అది అమెరికాకు భవిష్యత్  రాజ దాని కావాలని మనసారా కోరుకొన్నాడు .దీనినే ‘’గోల్డెన్ బుక్ ఆఫ్ స్ప్రింగ్ ఫీల్డ్ ‘’పుస్తకం లో తెలియ జేశాడు .ఇక్కడే అమరుడైన గవర్నర్ ఆల్తెల్జ్ స్మరిస్తూ ‘’ది ఈగిల్ దట్ ఈజ్ ఫర్గాట్టేన్ ‘’కవిత రాశాడు .రచయితా గా కంటే ఆర్టిస్ట్ గా దీనికి వైభవం తేవాలని ఆశించాడు .ఒహాయోలోని హిరం కాలేజి లో చదివి చికాగో ఆర్ట్ కాలేజిలో చేరి  న్యు యార్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో కళ లో నిష్ణాతుడైనాడు .బ్లేక్ లాగా క్రూసేడ్ ల తయారీలో మునిగిపోయాడు .మద్య నిషేదాన్ని సమర్ధించి ప్రచారం చేశాడు ‘’యాంటి సేలూల్ లీగ్ ‘’పై అనేక ఉపన్యాసాలిచ్చాడు .’’విలేజ్ మేగ జైన్ ‘’నిర్వహించి ఎక్కడికి వెళ్ళినా ప్రతులను ప్రజలకు అంద జేసే వాడు .’’రైమ్స్ టు బి ట్రేడేడ్ ఫర్ బ్రెడ్ ‘’పై కరపటం తయారు చేసి ఇంటింటికీ తిరిగి ఇచ్చేవాడు .రైతులతో మాట్లాడుతూ తన కవితలు వినిపిస్తూ ఉత్సాహ పరచే వాడు .పిల్లలకు కధలు చెప్పి దగ్గరాకు తీసుకొనే వాడు .రాత్రి  ఏదో ఇంటిలో ఆతిధ్యం పొంది అక్కడే నిద్ర పోయేవాడు .

ముప్ఫై నాలుగవ ఏట మొదటి పుస్తకం ముద్రించాడు .’’జెనరల్ విలియం బూత్ ఎంటర్స్ ఇంటు హెవెన్ ‘’పుస్తకాన్ని మతం ,అభిమాన విషయాలు సమాజానికి అవసరమైనవి అన్నీ కలిపి రాశాడు ..తరువాత ‘’కాంగో అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’,ది చైనీస్ నైటింగేల్ ‘’ది గోల్డెన్ వేల్స్ ఆఫ్ కాలి ఫోర్నియా ‘’మొదలైన కవిత్వపు పుస్తకాలు వెలువరించాడు .ప్రజలకు తన కవిత్వాన్ని చదివి విని పించి కొత్త దారి తొక్కాడు .భావానికి తగ్గ పిచ్ ని ఉపయోగించి చక్కగా భావ గర్భితం గా పాడి మనసుల్ని గెలిచేవాడు .తలకాయను వివిధ భంగిమలలో తిప్పుతూ భలేగా గానం చేసేవాడు .కళ్ళు సగం మూసి అరగన్నులతో అభినయించి పాడుతుంటే జనం పరవశించి వినే వాళ్ళు .సమ్మోహనం లో ముంచి తేల్చే వాడు .చేతులాడిస్తూ వివిధ భంగిమలు పెడుతూ కవిత్వ గానం చేస్తుంటే మరో లోకం లో విహరించి నట్లుండేది .గ్రామీణ స్తాయి వాడే అయినా జాతీయ స్తాయి వాడయ్యాడు .’’హార్లీ బర్లీ’’ అమెరికా జీవిత విధానాలను కవితలో చూపాడు .

లిండ్ సే లెక్కలేనన్ని ప్రేమ పాటలు రాసిన సారా టీద్  సెల్ అనే అమ్మాయిని ప్రేమించి పదేడ్డామనుకొంటే ఆమె జారుకుంది . తర్వాత ఇరవై ఏళ్ళ స్కూల్ పిల్లను పెళ్లి చేసుకొన్నాడు .ఇద్దరు పిల్లలు పుట్టారు .కొన్ని తమాషా భావాలను బయట పెట్టాడు .’’క్రిష్టియానిటి కంటే బుద్ధిజం లో ఆకర్షణ ఎక్కువ అన్నాడు .బుద్ధుడు క్రీస్తుకన్నా అణకువ ,ప్రయోజనం ఉన్న వాడు కాదన్నాడు .తన హృదయం లో ఉత్తర నక్షత్ర గది ఉందని చెప్పాడు .అదీ మూసుకు పోయింది .ఇదివరకు ఎగబడి మూగి వినే జనం క్రమం గా దూరమైపోతున్నారు .అతనిలో కావలసినదేదో లోపించింది అనుకొన్నారు ..దరిద్రం తో మొదలైన జీవితం మళ్ళీ యాభైల్లో అదే పరిస్తితి ని తెచ్చింది. బీదరికం నిరాశా ఆవరించాయి భ్రమ భ్రాన్తులకు లోనయ్యాడు .యదార్ధానికి వ్యతిరేకి అయ్యాడు .భార్యతో నిత్యం తగాదా .మళ్ళీ యువకుడి నవుతాననే వాడు .చివరికి ఈ సంక్షోభం లో తట్టుకో లేక లైసాల్ తాగి 5-12-1931అర్ధ రాత్రి చనిపోయాడు .

అమెరికా లిండ్ సే ను సీరియస్ గా తీసుకో లేదు .సామాన్యులకు అసాధారణ హీరో అయిన లిండ్ సే అందరికి దూరమై పోయాడు .’’I am but the pioneer –voice of democracy –I am the gutter dream –I am the golden dream –listen to my g-o-l-d-e-n d-r-e-a-m’’అని కలకంటూ కల్లోల మనసుతో కాన రాని లోకాలకు చేరాడు .పెర్ఫార్మన్స్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందినకవి .

 

Nicholas Vachel Lindsay 1913.jpg

 

పర్యావరణ ఉద్యమ సారధి –  రాబిన్సన్ జెఫర్సన్

వెస్ట్ లో పుట్టి ఈస్ట్ లో రాబర్ట్ ఫ్రాస్ట్ పెరిగితే ఈస్ట్ లో పుట్టి వెస్ట్ లో పెరిగాడు రాబిన్సన్ జెఫర్సన్ . పెన్సిల్వేనియా లోని పిట్స్ బర్గ్ లో 10-1-1887న పుట్టి తండ్రితో యూరప్ పర్యటన చేసి జెర్మని ,స్విట్జెర్లాండ్ లలో చదివి ,అమెరికా లోని కాలిఫోర్నియా ,వాషింగ్టన్   లలో చదువు పూర్తీ చేశాడు .ఒక కజిన్ పేరణ తో జీవితాన్ని రచన కు అంకితం చేశాడు .’’ఫ్లాగాన్ అండ్ యాపిల్స్ ‘’పుస్తకాన్ని స్వంత ఖర్చులతో ముద్రించాడు.ఇరవై ఆరులో ఊనా కాల్ కస్టర్ ను పెళ్ళాడి ఇంగ్లాండ్ వెళ్ళాలను కొన్నాడు .మొదటి ప్రపంచ యుద్ధం మొదలై కాలి ఫోర్నియా లోనే ఉండి పోయారు .తమకు తెలియ కుండానే తాము ఉండాల్సిన ప్రదేశం నిర్ణయ మైంది అనుకొన్నారు .మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు ,కొత్త భార్య ,కవల కొడుకులతో కలిసి ఒక దుర్గం లాంటి ఇల్లు కట్టుకొని ఉండిపోయి అక్కడే 1962లో చనిపోయాడు .ఇరవై అయిదు ఇరవై ఆరు లో పద్దెనిమిది గ్రంధాలు రాసి ‘’ఆత్మ వినాశన ప్రేమ ‘’కుస్థానమిచ్చి రాశాడు .జీవిత పోరాటం వ్యర్ధమని ,విలువలకు అర్ధం లేదని సిద్ధాంతీకరించాడు. కవిగా ఫిలాసఫర్ గా ద్వంద్వ ప్రవ్రుత్తులతో జీవించాడు. సృజన ఉన్నా తీవ్రం గా కవిత్వం రాశాడు .భయంకరత్వ ఉద్యమం గా కవితలుంటాయి .క్రియా బాహుళ్యం భీభచ్చ ప్రధానం .కవితల్ని ప్రేమించలేము .చదివితే మర్చీ పోలేము . అదీ జెఫర్సన్ విధానం .ఎన్విరాన్ మెంటల్ పోయేట్ అని పిలిచారు .మహాకావ్య విధానం లో పకడ బందీగా కవిత్వం రాసేవాడు .’’ఇన్ హ్యూమనిజం ‘’అంటే అమానుషత్వం అనే మాటను కాయినేజ్ చేసింది జేఫర్సనే .ప్రపంచం లోని వస్తువలావు అందాన్ని చూడకుండా ఏదీ పట్టనట్టు స్వఫలా పేక్ష తో ఉండేదాన్ని ఇన్ హ్యూమనిజం అన్నాడు .టైంమేగజైన ప్రత్యెక సంచిక తెచ్చి గౌరవిస్తే ప్రత్యెక స్టాంపు తెచ్చి ప్రభుత్వం గౌరవించింది .అమెరికా పశ్చిమ ఫోటోగ్రాఫర్లకు ఐకాన్ గా ఉండేవాడు .ఎన్విరాన్ మెంటలిజం నే సోషలిజం అన్నాడు

Robinsonjeffers.jpg

 

అమెరికన్ మహిళా బైరన్ -ఎడ్నాసెయింట్  విన్సెంట్ మిల్లె

పందొమ్మిది ఇరవై శతాబ్దాలలో మెల్లె కవిత్వం బాగా ప్రచారమైంది. వందలాది లిరిక్కులు సానేట్లూ రాసింది .అమెరికా లోని మెయిన్ రాష్ట్రం రాక్  లాండ్ లో22-2-1892 లో పుట్టి , .పందొమ్మిదో ఏట వంద లైన్ల కవితను అన్తాలజీ డిపార్ట్ మెంట్ పోటీ  నిర్వ హించిన ‘’ది లిరిక్ యియర్ ‘’కు పంపింది .బహుమతి రాక పోయినా ఆమె ‘’రేనేసేన్స్ ‘’కవిత అద్భుతం అనిపించి గుర్తుండి పోయింది .’’ all I could see from where I stood –was there long mountains and a wood –I turned and looked another way –and saw there islands in a bay ‘’అందులో ఒక పాదం ఇది .

మిల్లె అందం చందం కవిత్వం తిరుగు బాటు ధోరణి తో ఒక ‘’లెజెండ్ ‘’అయింది .వాసర్ కాలేజిలో చేరిన తర్వాతఈ లెజెండ్ గ్రీన్ విచ్ గ్రామం లో  ఒక చిహ్నమే అయింది .చిన్న కధలు రాసి జీవించింది .పాటలను అనువాదం చేసింది .ప్రావిన్స్ టౌన్ నటుల తో నటించి నాటక రచన చేస్తూ కవితలు రాసింది .మగాడికి సాటి అని నిరూపించింది అన్నిట్లో .చిలిపి ఈ చిన్నారి పెద్దలనే వణికించింది .ఆమె తెగువ ధైర్యం తెలివితేటలను చూసి ‘’అమెరిక మహిళా బైరన్ ‘’అన్నారు .అంతకు ముందు ఏ స్త్రీ ఇలా ప్రజా రంగం లో కాలు పెట్ట లేదు .

పదహారు గ్రంధాలు రాసినా మొదటి, రెండవది అయిన ‘’రేనాసేన్స్ ‘’సెకండ్ ఏప్రిల్ ‘’పుస్తకాలు మాత్రమె బాగా గుర్తింపు తెచ్చాయి .ఒక వ్యాపారిని వివాహ మాడింది .న్యు యార్క్ నుండి కాపురం బెర్క్ షైర్కు మార్చారు .ప్రజలు సంస్థల కోరిక పై బయటికి వెళ్లి తన కవితలను చదివి విని పించేది .ఉపన్యాసాలిచ్చేది .ఆమె ఉపన్యాసాలకు పిచ్చ క్రేజు ఉండేది .కాని ఆనారోగ్యం అడ్డు పడేది .చివరికి న్యూయార్క్ లోని పర్వత శిఖరం ఆస్తర్ లిజ్ లో ఉండేది .

రెడ్  హెడేడ్ రెబెల్ అయిన మిల్లె క్రమంగా ప్రజా కవిగా ,రాజకీయ ప్రచారకురాలిగా మారింది .చివరగా రాసిన ‘’వైన్ ఫ్రం దీస్ గ్రేప్స్ ‘’, హాంట్స్ మన్ న ,వాట్ కారీ ‘’రచనలు పాత చింతకాయ పచ్చడిలా ఉన్నాయి .భర్త చనిపోయిన ఏడాదికి 19-10-1950న ఆ ఒంటరి బంగళాలో ఒంటరిగా జీవిస్తూ చనిపోయింది .ఆమె లిరిక్కులు సానేట్లు ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉన్నాయి .’’ a figure of passionate feeling,she was a symbol of her age not only in her life but in the paradoxes of her poetry ‘’అని ఆమె కవిత్వాన్ని జీవితాన్ని అంచనా వేశారు . ఆ శతాబ్దం లో గొప్ప సానేట్లు రాసిన కవిగా గుర్తింపు పొందింది .ఫ్రాస్ట్ మెడల్ సాధించిన ఆరవ మహిళా .థామస్ హార్డీ ‘’అమెరికా లో రెండే రెండు ఆకర్షణలు  ఒకటి ఆకాశ హర్మ్యాలు రెండు ఎడ్నా మిల్లె కవిత్వం ‘’అన్నాడు .అప్పటికి రెండు సార్లు పులిట్జర్ బహుమతి పొందిన మహిళా గా చరిత్ర కెక్కింది .

Edna St. Vincent Millay.jpg

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.