పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50 ఇంగ్లాండ్ ధోరణులు జార్జియన్ కవిత్వం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50

ఇంగ్లాండ్ ధోరణులు

జార్జియన్ కవిత్వం

ఇప్పటి వరకు అమెరికా ధోరణుల లో వచ్చిన మార్పులు తెలుసుకోన్న్నాం .ఇప్పుడు ఇంగ్లాండ్ ఎలా స్పందిస్తోందో చూద్దాం .ఇరవై వ శతాబ్ది మొదటి పదేళ్ళలో దాదాపు పాతిక మంది ఇంగ్లీష్ కవులు ఒక తేలిక పాటి బృందం గా ఏర్పడి వరుసగా అనేక రచనలు చేసి ‘’జార్జియన్ పోయిట్రీ ‘’అని పేరు పెట్టు కొన్నారు . ఎడ్వర్డ్ మార్ష్ ఎడిటర్ గా వచ్చిన ఈ కవిత్వం పై కొత్త బలం అందాన్ని తెచ్చామని చెప్పాడు .ఒకే విధానానికి కట్టు బడి వారు రాయక పోయినా శక్తి,అందం కలిగించామని చెప్పుకొన్నారు .తమ చుట్టూ ఉన్న ప్రపంచ పరిస్తితులపై స్పందించి రాశారు .వాస్తవ పలుకు బడులను ప్రవేశ పెట్టారు .విరుద్ధ భావాల కవులయిన వీరే లాసిలాస్ ఆబెర్ క్రోమ్బీ ,గార్డన్ బాటం లి ,రూపర్ట్ బ్రూక్ ,జి కే చేస్టర్ టన్ , డబ్ల్యు హెచ్ డేవిస్ ,వాల్టర్ డీ లామేర్ ,జాన్ డ్రింక్ వాటర్ ,జేమ్స్ ఎల్లే ఫ్లేకేర్ ,విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్ ,రాబర్ట్ గ్రేవ్స్ ,రాల్ఫ్ హాద్గాన్ ,ది హెచ్ లారెన్స్ ప్రభ్రుతులు .

ఇందులో కొద్ది మంది సమకాలీన ద్రుశ్యాలనే ఎంచుకొని కవిత్వం రాశారు .మేస్ ఫీల్డ్ నావికుల, ,,దిన కూలీల వేటగాళ్ళ హత్య చేసే వాళ్ళ గురించి రాశాడు .గిబ్సన్ రాళ్ళు  పగల కొట్టేవారిని ,వడ్రంగులను , ,రైతులను  ,ఫెర్రె నడిపే వారిని కవిత్వం లో ద్రమతైజ్ చేస్తూ రాశాడు .ది హెచ్ లారెన్స్ మాత్రం తన పుట్టిన గడ్డ నార్త్ అంప్ షైర్ కూలీల గురించి అధిక శ్రమ చేస్తున్న వారి జీవితాల గురించి కవిత్వం రాశాడు .పట్నం లో చీకటి లో మగ్గే వారి గురించి ,పల్లె ప్రజల అమాయకత్వాన్ని గురించి కూడా రాశాడు .’’జార్జియన్ గ్రూప్ ఎక్కువ కాలం బతక లేదు .అయిదు కవితా సంపుటాలు రెండేళ్ళ కోసారి తెచ్చారు ఇందులో వారిలో వారికి ఉన్న భేదాలు ప్రస్పుతమైనాయి .ఒకళ్ళని ఒకళ్ళు తిట్టి పోసుకున్నారు .రొమాంటిక్ యువతకు చిహ్నమైన రాబర్ట్ బ్రూక్ ఇరవై ఎదేల్లకే చని పోయాడు .ఫ్లేకర్ ముప్ఫై ఒకటికి ,చనిపోయారు మేస్ ఫీల్డ్ మళ్ళీ సాధారణ విషయాలపై రాశాడు .గిబ్సన్ సెమి రూరల్ స్టీరియో టైప్ కవితలల్లాడు .లారెన్స్ జార్జియన్ తత్త్వం ఉన్నవాడు కాకపోయినా అన్  కాన్షస్ తో  కవిత్వం రాశాడు ఆబార్ క్రోమ్బీ రాయటమే తగ్గించేశాడు .ఉద్యమం గా పిలువా బడిన జార్జియనిజం పలాయన వాదామే అయింది .జార్జియన్ తత్త్వం కొద్దిగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రక్రుతి పై రాస్తూ అది ఏంటో దయ ప్రేమ తమపై చూపిస్తోందని తృప్తి పడ్డారు .ప్రకృతికి దగ్గరగా మానవుడు ఉండాలని కోరారు .ఇక్కడే మాధ్యూ ఆర్నోల్డ్ కవి ప్రక్రుతి ఆరాధకులకు చేసిన  సూచన గమనిద్దాం –

‘’man must begin ,know this ,where nature ends –nature and man can never be fast friends ‘’

వీధి కవి-  డబ్ల్యు హెచ్ డేవీస్

జార్జి బెర్నార్డ్ షా డేవీస్ ని గుర్తించి ఉండక పోయి నట్లయితే సంచారిగా చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ బతికే వాడు .మాంట్ మౌత్ షైర్లో న్యు పోర్ట్ లో ఉన్న చర్చ్ హౌస్ లో 20-4- 1871లో పుట్టాడు .వెల్ష్ జాతి వాడు .తండ్రి తక్కువ ఆదాయం వచ్చే ఇన్ కీపర్ .చదివించటానికి డబ్బులు లేవు కనుక కొడుకును వ్యవసాయం పనులకు పంపాడు .దాని మీద శ్రద్ధ లేక పోవటం వలన వదిలేసి జులాయి గా తిరిగాడు .ఇర్వి కి న్యూయార్క్ చేరాడు .అక్కడ అడుక్కు తినటం లో ఒక ఘనుడు ట్రిక్కులు నేర్పించాడు  .లివర్ పూల్ బాల్టిమోర్ ల మధ్య పశువులబోటు పై చాలా సార్లు తిరిగాడు .ట్రైన్ లోంచి దూకటం నేర్చి దూకుతూ కుడి కాలు పోగొట్టు కొన్నాడు .

లండన్ తిరిగొచ్చి కూడా బెట్టుకోన్న్న డబ్బు దాదాపు ఖర్చు చేసి ఇక కవిత్వం శరణం గచ్చామి అనుకొన్నాడు .ఒక రాత్రికి ఆరు పెన్నీలిచ్చి గదుల్లో బతికాడు .చిల్లర వస్తువులమ్మి పొట్ట పోసుకొనే వాడు .’’ది సోల్స్ దిస్ట్రాయర్ ‘’అనే చిన్న కవితా సంకలనం తెచ్చాడు .ఇది బెర్నార్డ్ షా కంట పడింది .షా డేవీస్ ఆత్మా కధకు ఉపోద్ఘాతం రాస్తూ ఈ విషయం చెప్పాడు .వెంటనే చిల్లర అమ్మకాలు మానేసి గౌరవం గా బతకాలని భావించి మెట్రో పాలిటన్ రచయితల తో కలవ కుండా వేరుగా ఉన్నాడు .ఇరవై ఆరు కవితా సంకలనాలు పది వచన సంపుటాలు  మొత్తం ముప్ఫై ఆరు రాశాడు .డెబ్భై వ ఏట 26-9-1940న ఈ ‘’వీధి కవి ‘’ వినువీదికి చేరాడు .

ఒక రకం గా డేవీస్ చాలా రాసి నట్లే .విపరీతమైన ధోరణి వేగం తో రాసేవాడు రాసిన రాశిలో వాసి ఏంతో కని  పెట్టటం కష్టం .జీవితం పై చక్కని కవితలు అల్లాడు .

‘’what is this life ,full of care –we have no time to stand and stare –no time to stand beneath the boughs –and stare as long as sheep or cows –no time to wait till her mouth can –enrich that smile her eyes began ‘’ఇలా కవితా ప్రవాహం  జాలు వారుస్తూనే ఉండేవాడు .

William Henry Davies.jpg

 

రాల్ఫ్ హాద్గ్ సన్

సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు పద్దెనిమిదో శతాబ్దపు విలువలతో కవిత్వం రాసిన వాడు రాల్ఫ్ హాద్గ్ సన్ .యార్క్ షైర్ లో 1871లో పుట్టాడు .ఒంటరిగా రహస్యం గా రెండు ప్రపంచాలలో జీవించాడు .నాణ్యమైన ఎద్దు లను తయారు చేయటం డాగ్ శో లకు జడ్జి గా ఉండటం చేసి డబ్బు సంపాదించాడు తర్వాత జర్నలిస్ట్ అయ్యాడు .లండన్ ఈవెనింగ్ పేపర్ కు డ్రాఫ్ట్స్ మాన్ అయ్యాడు ‘’ఫ్రైస్ ‘’మేగజైన్ ను ఎడిట్ చేశాడు .ముప్ఫై ఆరులో చిన్న కవితా సంకలనం ‘’ది లాస్ట్ బ్లాక్ బర్డ్ ‘’తెచ్చి సాహిత్య లోకం లో కవిగా ప్రత్యక్ష మయ్యాడు .ఫ్రాస్టర్ ,జాక్సన్ ల తో కలిసి ఒక ప్రెస్ కొని పాత పుస్తకాలు ముద్రించి అమ్మాడు .రాయల్ సొసైటీ చేత పోలిజాక్ అవార్డ్ పొందాడు .’’పోయెమ్స్ ‘’1917లో ‘’ది బుల్ ‘’,ది సాంగ్ ఆఫ్ ఆనర్ ‘’ఉన్నాయి .

యాభై లో జపాన్ లో స్సేన్దాల్ యూని వర్సిటి లో ఇంగ్లీష్ లిటరేచర్ పై ఉపన్యాసాలిమ్మని ఆహ్వానం వస్తే అంగీకరించాడు .వెళ్ళలేక పొతే రెండో సారీ పిలిచారు .అమెరికాఅమ్మాయిని పెళ్ళాడి  కు భార్య తో వెళ్ళాడు .ఒహాయో బయట మినర్వా లో  ఒక ఫారం హౌస్ కొని అందులో పక్షుల ఆవాసానికి సగం కేటాయించాడు .’’పాకింగ్ ట న్స్ పౌండ్ ‘’అనే చిన్న ప్రెస్ కొని అందులో చిన్న పుస్తకాలు ముద్రించి అందజేసేవాడు అందులో ‘’సిల్వర్ వెడ్డింగ్ ‘’,మ్యూజ్ అండ్ మాస్తిఫ్ ‘’పుస్తకాలున్నాయి .ఇంగ్లీష్ పల్లె బాలిక గురించి బాగా రాశాడు .3-11-1962న మరణించాడు

‘’eve ,with her basket ,was –deep in the bells and grass –wading in bells and grass –up to her knees –picking a dish of sweet –berries and plums to eat –down in the bells and grass –under the trees ‘’లో వర్ణ చిత్రం గీసి నట్లు ఆమె ను వర్ణించాడు .వాల్ట్ డీ లా మెర్ కు మంచి స్నేహితుడు .నిరంతరం మాట్లాడే వస పిట్ట అన్నాడు లా మెర్

Walter de la Mare by Lady Ottoline Morrell.jpgbv

 

.

సూపర్ నేచురల్ కవి –  వాల్టర్ డీ లామేర్

తన కాలం భాష లో ఆ నాటి ప్రపంచం లో ఒక ఊహా సామ్రాజ్యమే సృష్టించుకొని దెయ్యాలు భూతాలతో ,ఫైరీ టేల్స్ రాస్తూ ఈవిల్ షాడోస్ మధ్య గడుపుతూ ఉన్మాదానికి సరి హద్దు లో ఉంటూ రాసిన వాడు వాల్టర్ డీ లా మెర్ .అతని భావాలకు ప్రతీకగా ఒక కవిత –

‘’two worlds have we ,without within –but all that sense can mete and span –until it conformation win –from heart and soul ,is death to man ‘’

వాల్టర్ జాన్ డీ లా మెర్ కెంట్ లోని చార్లటాన్ లో 25-4-1873లో పుట్టాడు .తల్లి బ్రౌనిగ్ బంధువు తండ్రిపూర్వీకులు  హ్యూగో నాట్స్కు చెందినా వారు .సెయింట్ పాల కేధద్రిల్ స్కూల్ లో చదివి కాలేజి మానేశాడు .స్టాండర్డ్ ఆయిల్ కంపెని లో గుమాస్తా గా పని చేశాడు .ఇరవై ఏళ్ళు ఇందులోనే పని చేసి తర్వాత ఇంగ్లిష్ గ్రామీణ వాతావరణం లో ఉన్నాడు

‘’సాంగ్ ఆఫ్ చైల్డ్ హుడ్’’మొదటి పుస్తకం గా తెచ్చాడు .ముప్ఫై ఆరులో సివిల్ లిస్టు పెన్షన్ పొందాడు .కంపెనీ విధుల నుంచి విడుదల చేసి రచనకు అంకితమవ మని చెప్పింది .యాభై సంపుటాల కవిత్వం ,చిన్న కధలు ,వ్యాసాలూ నవలలు  వెలువ రించాడు .డెబ్భై అయిదులో ‘’కంపానియన్ ఆఫ్ ఆనర్ ‘’అయ్యాడు .ఎనభై లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్ పొందాడు .స్వంత ఇంట్లో ట్వికెన్ హాం లో ఎనభై మూడవ ఏట 22-6-1956న లా మెర్ ‘’నో మోర్ ‘’అయిపోయాడు . వర్తమానాన్ని వదిలి భూతకాలం లో జీవిస్తూ రచనలు చేశాడు .కవిత్వం ‘’మూడ్ ఆఫ్ మెమరి ‘’గా రాశాడు .అందులో అంతా మార్మికత ఎక్కువ . ‘’nature itself resembles a veil over some further reality of which the imagination in its visionary moments seems to acjeve a mere direct evidence ‘’అని తన గమ్యం గురించి చెప్పాడు .కవిత్వం లో గొప్ప శక్తి ఉండి ఆకర్షిస్తుంది .’’isled in the midnight air –musked with the dark;s faint bloom –out into glooming and secret haunts –the flame cries ‘’come ‘’.కధలు ఆన్తాలజీలు కళల శక్తికి నిదర్శానం గా ఉంటాయి  బయటి సంఘటనకు ,లోపలి చూపుకు సంఘర్షణ కని పించి మిస్టరి ని మిస్టరీ గా తెలియ జేస్తాయి .సైకలాజికల్ హారర్ కధలు రాసి గుమ్మరించాడు .కార్నెజీ మెడల్ ను బాల సాహిత్యానికి పొందాడు .సూపర్ నేచురలిజం లో అద్వితీయ ప్రతిభ కనపరచాడు .రామ్సే కాంప్ బెల్ వంటి వారికేందరికో ఆదర్శం .

 

Inline image 2

 

బ్రాంటే కు ప్రతిరూపమే –  షార్లెట్ మ్యు

ఎవరికీ అంతగా పరిచయం లేని రచయిత్రి షార్లెట్ మ్యు.సృజన శక్తి అమోఘం గా ఉన్న కొద్ది మంది స్త్రీ కవులలలో ఒకతే .బ్లూమ్స్ బరి లో 15-11-1869 న జన్మించింది .తండ్రి ఆర్కిటెక్ట్ ,బాల్యం లోనే తండ్రి చనిపోతే నలుగురు సంతానమ్ నానా అగచాట్లు పడుతూ దరిద్రం అనుభ వీస్తూ దుఖాన్ని  దిగ మింగు కుంటా బతికింది .అందులో ఒకమ్మాయి, అబ్బాయి పిచ్చి పట్టి శరణాలయం లోనే ఉండిపోయారు .ఉన్న ఇంటిలో సగం అద్దె కిచ్చి చీకటి గదిలో బతుకుతూ అద్దె డబ్బే ఆధారం గా జీవించారు తల్లి మిగిలిన ఇద్దరు పిల్లలు .వారాంతం లో వేసేక్స్ వెళ్లి థామస్ హార్డీ కి అతిధులుగా ఉండేవారు .మ్యు లోని కవితా శక్తిని హార్డీ గుర్తించి మెచ్చుకున్నాడు సివిల్ లిస్టు పెన్షన్ ఇప్పించాడు .వచ్చిన డెబ్భై పౌండ్లను జాగ్రత్త చేసి కాపాడుకోన్నది. చెల్లెలు అన్నే తరచూ అనారోగ్యం పాలై చని పోయింది .నర్సింగ్ హోమ్  కు వెడితే ఆదరణ లభించలేదు .దారిద్ర బాధ పడలేక విషం తీసుకొని ,డాక్టర్లు రక్షిద్దామని ప్రయత్నిస్తే ‘’don’t keep me –let me go ‘’అంటూ వారించి ప్రాణాలు వదిలేసింది .

బ్రాంటే సిస్టర్స్ మ్యూ సిస్టర్స్ గా పునర్జన్మ ఎత్త్తారని అనుకొంటారు .మ్యు తన రచనల్ని ఎన్నిటిని ధ్వంసం చేసిందో తెలియదుకాని అరవైకి పైగా కవితా సంకలనం వచ్చింది .’’బిసైద్ద్ ది బెడ్ ‘’కవితలో –‘’some one has shut the shining eyes ,straitened and folded –the wandering hands quietly covering the unquiet breast ‘’

‘’all night you have not turned to us or spoken –it is time for you to wake ,your dreams were never very deep –I for one have seen the  thin bright twisted threads of them dimmed suddenly and broken –this is only a most pretense of sleep ‘’అంతరంగాన్ని ఆవిష్కరించింది .విక్టోరియన్ కవిత్వానికి ఆధునిక కవిత్వానికి వారధి .’’బెస్ట్ వుమెన్ పోయేట్ ఆఫ్ ది డే ‘’అని హార్డీ మెచ్చాడు . she was ‘very good and quite unlike any one else ‘’ అని శ్లాఘించింది వర్జీనియా ఉల్ఫ్ ..

John Edward Masefield in 1916.jpg

 

ఆస్థాన కవి -జాన్ మాస్ ఫీల్డ్

డెబ్భై ఐదో ఏట  జాన్ మాస్ ఫీల్డ్ ఆత్మా కద’’సో లాంగ్ టు లేరన్ ‘’పేర రాసుకొన్నాడు .హియర్ ఫోర్డ్ షైర్లో 1-6-1878లో సొలిసిటర్ కొడుకుగా పుట్టాడు .వార్విక్ స్కూల్ లో చదివి మర్చంట్ సర్విస్ లో యువకులకు శిక్షణ నిచ్చే ‘’కాన్ వే ‘’లో చదివాడు .కేప్ హార్న్ కు వెళ్ళే షిప్ కు అసిస్టంట్  విండ్ జామర్ గా పని చేశాడు .ఇరవైయేళ్ళు కష్టపడ్డాడు .తాను  సహజ సముద్ర మనిషి కాదు .అమెరికా చేరి ఈ ఉద్యోగం మానేశాడు .బేకరి ,గుర్రపు శాల ,కార్పెట్ ఫాక్టరీ లలో పని చేశాడు న్యూయార్క్ యాంకర్స్ లలో .ఇంగ్లాండ్ కు 1897 చేరటానికి ముందు చాసర్ రాసిన కాంటర్ బారీ కధలు చదివాడు .లండన్ కు తిరిగి వచ్చి మాంచెస్టర్ గార్డియన్ పత్రికలో కాలమ్స్ రాశాడు .’’సాల్ట్ వాటర్ బాలడ్స్ ‘’పుస్తకాన్ని సెంటిమెంట్  హాస్యం తో నింపి రాశాడు .’’ది విడో ఇన్ ది బై స్ట్రీట్ ‘’,డాబర్ ,ది డాఫోడిల్ ఫీల్డ్స్ ‘’లను ముప్ఫై లలో రాశాడు .

మొదటి ప్రపంచ యుద్ధం అతని సృజనకు అవకాశం కల్పించింది .రెడ్ క్రాస్ లో సేవలందించాడు .’’లోల్లిగ్దన్ దౌన్స్ ‘’,రైట్ రాయల్ ‘’’’రేనార్డ్ ది ఫాక్స్ ‘’మొదలైన కవితా పుస్తకాలు ప రాసి ప్రచురించాడు .చివరిదానిలో కవిత్వం పక్వమైంది .రూరల్ స్పిరిట్ ఆఫ్ ఇంగ్లాండ్ కు అద్దం పట్టే రచనలే చేశాడు 1930లో రాబర్ట్ బ్రిడ్జెస్ మరణం తర్వాత ఆస్థానకవి అయ్యాడు .ఇంగ్లాండ్ సిల్వర్ జూబిలీ ఉత్సవాలలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ పొందాడు .అయిదవ జార్జి మరణం పై ఫనేరల్ ట్రిబ్యూట్ రాశాడు .ఆస్తానపదవి అడ్డు పడిందో కవితా ప్రవాహం ఆగి పోయిందో కాని తర్వాత రాసింది తక్కువే .డెబ్భై ఏళ్ళకు తొంభై రచనలు పూర్తీ నిశ్చయం తో తగ్గిన కవితా ప్రతిభ తో రాసి ప్రచురించాడు . ఇప్పుడు విస్మృత కవే అయ్యాడుఫీల్డ్ .ఫీల్డ్ లో లేని కవి అనిపించాడు ఫీల్డ్ .

క్లాసిక్ చిల్ద్రెన్ నవలలు రాశాడు .’’ఎవర్  లాస్టింగ్  మెర్సి  ;;సి ఫీవర్ ‘’;కవితలు గొప్పవి .గౌరవ  డాక్త రేట్లు చాలా పొందాడు .అతని పేర పోయిట్రీ అసోసియేషన్స్ చాలా ఏర్పడ్డాయి .రాజాస్థాన సంగీత విద్వాంసులకు కవితలు రాశాడు .ప్రసిద్ధమైన సానేట్స్  రాశాడు .

 

 

 

‘’   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.