పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -52
ఊసర క్షేత్రాలు
మనో భావం బుద్ధి కన్నా గొప్పది అన్న లారెన్స్ ను సవాలు చేసి ,అతన్ని ఒంటరి వాడని ,అసంబద్ధ రచయిత అని తీసి పారేసి ఆడెన్ ,స్పెండర్ ,లేవిస్ ,ఎంప్సన్ లు కొత్త పధ్ధతి కి తెర దీశారు . దీనినే ఆధునిక కవిత్వమని ,కొత్త పదాల ,పలుకు బడుల కవిత్వమని ,బౌద్ధికం గా చురుకైన వాడికలదని అన్నారు .వీరికి కూడా ఒక ప్రణాళిక లేదు ,ఒక ఆలోచనా శాఖ లేదు .కాని వారికి ప్రత్యెక శైలి మాత్రం ఉంది .అందుకే వీరిని ‘’’శైలిస్ట్ కవులు ‘’అన్నారు .అందులో అగ్రభాగాన నిలిచిన వారు ఇద్దరు –ఎజ్రా పౌండ్ మరియు టి ఎస్ ఇలియట్ .
ఇమేజిస్ట్ కవి -ఎజ్రా పౌండ్
ఎజ్రా లూమిస్ పౌండ్ అమెరికాలో న్యు ఇంగ్లాండ్ లోని ఇడాహో లో హైలీ లో 30-10-1885 న పుట్టాడు తల్లికి లాంగ్ ఫెలోకవి బంధువు .తండ్రి ప్రభుత్వోద్యోగి .స్వశక్తి బుద్ధి తో హైలీ లో మొదటి ప్లాస్టర్ ఇంటిని నిర్మించాడు .పౌండ్ తూర్పున ఉన్న పెన్సిల్వేనియా యూని వర్సిటి లో విద్య నేర్చాడు . తర్వాత న్యు యార్క్ లోని హామిల్టన్ కాలేజి లో చేరి ,ఇరవైలో పెన్సిల్వేనియా యూని వర్సిటి డిగ్రీ పొందాడు .అందులోనే బోధించాడు .ఒక ఏడాది రిసెర్చ్ చేయటానికి స్పెయిన్ ,ఫ్రాన్స్ ,ఇటలీ లు తిరిగాడు .తిరిగొచ్చి ఇండియానాలోని కాఫోర్డ్స్ విల్ లోని వా బాష్ కాలేజి ఫాకల్టి లో చేరాడు .ఆ పట్నం మంచి విద్యకు విద్యా వేత్తలకు కేంద్రం .పౌండ్ మాత్రం అక్కడే’’ బెన్ హర్’’ రాసిన ‘’ల్యూ వాలెస్ ‘’చని పోయాడని అన్నాడు .పౌండ్ కున్న బోహిమియన్ భావాలు నచ్చక ఉద్యోగం పీకేశారు .
అసహనం తో యూరప్ వెళ్ళాడు . గ్రామాలలోని ఆర్టిస్ట్ లను నమ్మని ,వారికి వ్యతిరేకం గా మాట్లాడే అమెరికన్లకు బుద్ధి చెప్పాలని నిర్ణ యించుకొన్నాడు .తన మనో భావాలను ‘’ఏ ల్యూం స్పెంటో’’లో పొందు పరచి ఇటాలి లోని వెనిస్ లో పబ్లిష్ చేశాడు .లండన్లో నివాసముండి యువకులతో ఒక గ్రూప్ ను తయారు చేసి లీడర్ అయి ,చైనా ,జపాన్ కవిత్వ సేకరణకై ఏర్పడిన ‘’ఫెనో ల్లోసా ‘’కు సాహిత్య కార్య నిర్వహణాధి కారిగా నియమింప బడ్డాడు .చైనా కవిత్వం లోని క్లుప్తత స్పష్టత ,జపాన్ కవిత్వం లోని ‘’టాంకా ,’’హోక్కా ‘’,.లలోని లోతైన భావాలు ఆకర్షించాయి .అవే పౌండ్ తోలి కవితల్లో చోటు చేసుకున్నాయి .అరవైలో రాసిన ‘’కాంటో’’లలోను వదలక నిలిచే ఉన్నాయి .ఇరవై ఆరులో ఓరియంటల్ పోయెట్రి లోని సౌందర్యం నచ్చి ఆ ధోరణిలో రాశాడు .అందులో ఒక లైన్ –the apparition of these faces in a crowd –petals on a wet –black bough ‘’
ఇరవై తొమ్మిదిలో డోరోతి షేక్స్ పియర్ ను పెళ్లి చేసుకుని కొడుకును కన్నాడు .అప్పటికే అయిదు చిన్న కవితా పుస్తకాలు రాసిన రచయితఅయినాడు .చివరి నాలుగు ‘’పెర్సానే ,ఎక్సుల్టే షన్స్ ,’’కాన్జోని ‘’,రిపోస్టెస్’’అని భావ గర్భితం గా పేర్లు పెట్ట్టుకున్నాడు .ఇవన్నీ ప్రాంతీయ ,పురాతన ఫ్రెంచి ,విక్టోరియన్ చివరి కాల ప్రభావం కలవే .బ్రౌనింగ్ ,మారిస్ ,ప్రీ రాఫెలడైట్స్ ఆవహించగా రాసిన కలగూర గంప కవితలే .దీని తర్వాతే స్పష్టమైన ఆలోచనా భావ ప్రకటన ఏర్పడ్డాయి .బాలడ్స్ ,సేష్టినాలు రాస్తూ ఫ్రెంచ్ ఫారంస్ ను వదిలేసి రిలీఫ్ పొందాడు .మనస్పూర్తి పరవళ్ళు తొక్కి ‘’ .come ,my songs ,let us speak of perfection –we shall get ourselves rather dislike –the gilded phaloi of the crouses –are thrusting at spring air ‘’అంటూ ఆవేశ పడ్డాడు బహుసా మన శ్రీ శ్రీ ‘’కవితా ఓ కవితా ‘’కూడా ఇలాంటిదే .
వాల్ట్ విట్మన్ భావాలను వ్యతిరేకించినా కవికి దగ్గరయ్యాడు పౌండ్ .’’it was you that broke the new wood ‘’అని మెచ్చాడు .తన ప్రత్యేకతను రుజువు చేసుకున్నాడు .కాని ఆంగ్ల కవులు ఆదరించలేదు .పైగా విన్దర్ హాం లేవిస్ ‘’ఈ రెడ్డిష్ బ్రౌన్ అమెరికన్- గ్లాసు నీళ్ళలో ఆయిల్ చుక్క .తమాషా ఏమిటంటే అందులో కలవాలని కోరుకోడు.ఊరికే ఊరిస్తాడు ‘’అన్నాడు .కానీ పౌండ్ అహంకారం గర్వమే అతన్ని లెజెండ్ ను చేశాయి .సాహిత్యం కళ లపై స్పందన కలిగించే ఉపన్యాస సునామీ సృష్టించాడు .ఇంగ్లీష్ వాయిద్యం బ్లాస్ట్ ను బ్లాస్ట్ చేసే ధోరణిలో తీవ్రం గా భావోద్రేకం గా గుండెల్ని చీల్చి దూరేలా మాట్లాడాడు ,చరిత్రే సృష్టించాడు .చికాగో లో యెర్ర గడ్డం తో ,ఊగి పోతూ విప్లవ కారుడై విజ్రుమ్భించాడు .పౌండ్ సలహా పై తను రాసిన ‘’వేస్ట్ లాండ్ ‘’కవితలను సగంమాత్రమె ముద్రించి ఇలియట్ ఎజ్రా పౌండ్ కే అంకితమిచ్చాడు స్వామి భక్తిగా .
1914లో పౌండ్ ఒక కవి బృందాన్ని తయారు చేసి సమకాలీన కవిత్వం లోని అతిని నిరసిస్తూ ఒక మేని ఫెస్టో తయారు చేసి ,తన గ్రూపుకు ‘’ఇమేజిస్ట్స్ ‘’ అని కొత్త పేరు పెట్టాడు .రోమాన్టిసిజానికి వ్యతిరేకం గా ,ప్రతీకలకు ప్రాదాన్యామిచ్చారు .వారి సిద్ధాంతాలు ముఖ్యం గా మూడు .1-సామాన్య భాషలోసరి అయిన మాటను ప్రయోగించి దానికి తళుకు బెళుకులు అద్ద కుండా రాయాలి , .2-రిధం ను పాత పద్ధతిలో ఛందో బద్ధం గా కాకుండా ,కొత్త రైమ్స్ ను కొత్త మూడ్స్ ననుసరించి ఫ్రీ వేర్స్ లో రాయాలి .3-కవిత్వ ఉత్పత్తి అస్పష్టం గా ఉండిపోవాలి .(ఇండేఫినిట్).అంతర్జాతీయ భావన పరమావధిగా రాయాలి .టెక్నిక్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు .కమ్యూని కేషన్ కంటే శైలికే అధిక ప్రాధాన్యం . ఈ సెటిల్ మెంట్ కల్లోలం సృష్టించింది .దీన్ని ‘’ఫ్రీ వేర్స్ ఫ్యూరోర్ ‘’అన్నారు .
అమెరికా లో ఇమేజిస్ట్ ఉద్యమానికి’’ ఆమి లోవెల్’’ పురుడు పోసింది .స్వయం గా ప్రచారం చేసింది .పౌండ్ కు తెలిసి ద్రోహం అన్నాడు .ముగ్గురు ఇంగ్లీష్ ఇమేజిస్టే లు రిచార్డ్ ఎడింగ్టన్ ,ఎఫ్ ఎస్ ఫ్లింట్ ,ది హెచ్ లారెన్స్ లను కిడ్నాప్ చేసి ,మరో ఇద్దరు అమెరికన్ కవులు జాన్ గోల్డ్ ఫ్ల్చేర్ ,హిల్డా డూ లిటిల్ (హెచ్ .డి)ల తో కలిసి ‘’సమ్ ఇమేజిస్ట్ పోఎట్స్ ‘’ను 1915 -16-17లను ఏర్పరచింది .ఈ బంది పోటు ‘’తనానికి నివ్వెర పోయి పౌండ్ అందులోంచి తప్పుకున్నాడు .’’ది లిటిల్ రివ్యు ‘’కు ఎడిటర్ అయ్యాడు .మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే పారిస్ వెళ్లి పోయాడు పౌండ్ .
పారిస్ లో తన సృజనతో అగ్నిపర్వత ప్రేలుడు భావాలతో చెలరేగి పోయాడు .కొత్త శైలిని వ్యంగ్యాత్మకం గా ,సంభాషణా పద్ధతిలో ఏర్పరచుకున్నాడు .’’హగ్ సెల్వి మాబెర్లి ‘’ని ముప్ఫై అయిదులో పబ్లిష్ చేశాడు .ఆధునిక ప్రపంచాన్ని సెటైర్ తో కొరడా ఝాలిపించాడు .’’a positive document of sensibility –is compact of the experience of a certain man in a certain place at a certain time and is also the document of an epoch ,a genuine tragedy and comedy ‘’అని పించి ఆర్నోల్డ్ మాటల్లో ‘’జీవిత విమర్శ ‘’(క్రిటిసిజం ఆఫ్ లైఫ్ )అయింది . కాంటోస్ కు విశేష ఆదరణ వచ్చింది .దాదాపు పాతికేళ్ళు రాశాడు దీనిని .వంద అధ్యాయాలున్న అతి పెద్ద గ్రంధం .చివరి పది అధ్యాయాలను పీసా లో అరెస్ట్ చేసి1945 లో జెయిల్ లో పెట్టినప్పుడు రాశాడు .’’రాక్ డ్రిల్ ‘’ను చదవాలని ప్రయత్నించిన వారికి నిరాశ ఎదురైంది అది కోడ్ భాషలో రాశాడు కొరుకుడు పడలేదు .పొరపాటు పడ్డారుకాని అది తప్పు కాదు .స్పష్టం గానే రాశాడు .అవన్నీ స్వీయానుభవాలు ,వ్యక్తీ గతాలు .’కాంటోస్’’కు రాసిన సూచికే మూడు వందల ఇరవై పేజీలుంది .ఇదంతా ;’’ స్ట్రీమ్ఆఫ్ కాన్షస్ ‘’(చైతన్య స్రవంతి )రచన అప్పటికి కొత్త .యేట్స్ కవి ‘’విషయం కంటే శైలి గొప్పగా ఉంది .ఇంత బాగా భావాన్ని స్పష్టం గా తెలియ జెప్పిన సమకాలీన కవి లేనే లేడు .కాని మధ్యమధ్యలో తెగిపోతూ అతుకులు పడుతూ ,మెలికలు తిరుగుతూ ,నరాల ఉద్రేకం కలిగిస్తూ ,దివా స్వప్నమై ,గందర గోళం గా ఉన్నది మాత్రం నిజం ‘’అన్నాడు .
కాని పౌండ్ మాత్రం తానూ ‘’హ్యూమన్ కామెడీ ని అనేక గొంతుకలతో ,అనేక పరిమాణాలతో ,కోణాలలో చిత్రించాను ‘’అని స్పష్టం గా చెప్పాడు .ఒక నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చేసుకొనే రాశాడు .ఇందులో వస్తువు వ్యతిరేక వస్తువు ,చరిత్ర పునరావ్రుత్తాలు,సమకాలీన స్తితి గతులు కలిసి అలా అనిపిస్తాయి .మొదటి ప్రపంచ యుద్ద్ధాన్ని ‘’ఇంఫెర్నో ‘’లో డబ్బు బాంకింగ్ పాపాలను ‘’పర్జ్ టోరియో ‘’లో క్లైమాక్స్ ను ‘’పరాడిసో ‘’చిత్ర్రించాడు .కొన్ని కవితా పంక్తుల్ని చూద్దాం –
‘’hang it all Robert Browing –there can be but the one ‘’Sordello ‘’-but Sordello ,and my Sordello ?-lo sordels sifo di –Mantovana-so shu-churned in the sea ‘’
1924లో ఫ్రాన్స్ వదిలి రాపల్లో లో స్తిర పడ్డాడు .స్నేహితులు తగ్గి శత్రువులు పెరిగారు .అమెరికా ప్రెసిడెంట్ జెఫర్సన్ కంటే ఇటలీ నియంత ముస్సోలినీ ప్రజాస్వామ్యాన్ని మెచ్చి ఫాసిజం ను సమర్ధించాడు .రోమ్ నగరం రేడియో లో మాట్లాడుతూ అమెరికాను చెడ తిట్టాడు ‘’.తన అమెరికా’’ పై దాడి చేయమని ఫాసిస్టూలకు ఉపదేశించాడు .ఉద్రేకి చివరకు దేశ ద్రోహి అయ్యాడు .1945 మే లో అరెస్ట్ చేసి వాషింగ్ట న్ కు తీసుకొచ్చారు .మరణ శిక్ష పదేదే కాని డాక్టర్లు పౌండ్ మానసిక పరిస్తితి బాగా లేదని తేల్చారు .తొమ్మిది నెలల తర్వాత సెయింట్ ఎలిజ బెత్ మానసిక హాస్పిటల్ కు మార్చారు .పన్నెండేళ్ళు కేసు నడిచింది చివరికి పౌండ్ ఇక ఏ మాత్రమూ విచారణకు నిలబడ లేడని,ఇటలీ లో చేసిన రేడియో ప్రసంగం మానసిక పరిస్తితి సరిగ్గా లేనందున చేసిన దే నని తేల్చారు .ప్రజలు ,ప్రజా సంఘాలు రచయితలూ వాల్ట్ విట్మన్ నాయకత్వాన పెద్ద నిరసన తెలియ జేశారు .1958మే లో హాస్పిటల్ నుండి విడుదలై ఇటలీ వెళ్లి పోయాడు .ఇటలీని తన పెంపుడు తల్లి అంటూ ఫాసిస్ట్ పద్ధతిలో సాల్యూట్ చేసి ‘’అమెరికా ఒక పిచ్చి వాళ్ళ శరణాలయం ‘’అన్నాడు .
రాజ కీయం గా తప్పుడు దోవలో నడిచినా కవిత్వ పరం గా ప్రయోగాలు చేసి కొత్త వరవడి పద బంధం ,సామెతలు సృష్టించి నూతన శైలికి మార్గ దర్శి అయి ,ఎందరినో ప్రభావితం చేశాడు ఎజ్రా పౌండ్ .అనుయాయులు పౌండ్ మార్గాన్ని ఇంకా నిగ్గు తేల్చారు .’’ Pound could not teach his followers what to say ,but he had a great talent for showing them how to say it ‘’కవిత్వాన్ని సంగీతం లో రంగ రించి రాశాడు . possessed of a sense of sound, an “ear” for words, imbuing his poetry with melopoeia. .’’కౌంటర్ పాయింట్ కు ప్రాధాన్యం ఇచ్చాడు .’’సాంద్ర’’ కవిత్వాన్నే రాశాడు .ఎన్నో అనువాదాలు చేసి పేరు పొందాడు . as a translator, Pound was a pioneer with a great gift of language and an incisive intelligenc.e The leitmotifs in Pound’s literary criticism are recurrent patterns found in historical events, which, he believed, through the use of judicious juxtapositions illuminate truth; and in them he reveals forgotten writers and cultures.. he sought to emphasize the value of art and to “aestheticize the political . He rejected traditional rhetoric and created his own. 1967 conversation with Allen Ginsberg, Pound told the young poet, “my poems don’t make sense.” He went on to call himself a moron, to characterize his writing as stupid and ignorant, “a mess”. Ginsberg reassured Pound that he “had shown us the way”, but Pound refused to be mollified. Any good I’ve done has been spoiled by bad intentions – the preoccupation with irrelevant and stupid things,’ [he] replied. Then very slowly, with emphasis, surely conscious of Ginsberg’s being Jewish: ‘But the worst mistake I made was that stupid, suburban prejudice of anti-semitism.’
మన చలం లాగా చివరికి లెంప లేసుకున్నాడు పౌండ్ .
![]()
ఆధునిక కవిత్వ మార్గ దర్శి – టి.ఎస్ ఇలియట్
ఎజ్రా పౌండ్, ఇలియట్ లను జంట గానే సాహిత్య చరిత్ర కారులు భావిస్తారు .గురు శిష్యులే .థామస్ స్ష్టియార్న్ ఇలియట్ ఆంగ్ల రచయితలపై విశేష ప్రభావం ఉన్న వాడు .తనకవిత్వం లో బ్రిటిష్ కంటే అమెరిక కరెంట్ ఉందన్నాడు .ఇంగ్లాండ్ లోనే ఎక్కువ కాలం ఉన్నాడు . అమెరికా లోని మిస్సోరిలో సెయింట్ లూయీస్ లో 26-9-1888 న జన్మించాడు .పూర్ర్వీకులు న్యు ఇంగ్లాండ్ కు చెందిన ప్యూరిటన్ లు .తాత బోస్టన్ యూని వర్సిటి ని,సెయింట్ లూయిస్ లో మొదటి యూని టేరియన్ చర్చ్ ని స్థాపించాడు .మిల్టన్ అకాడెమి లో చదివాడు. ఇరవై ఒకటిలో బి ఏ తర్వాత ఎం ఏ పాసై ఇంగ్లాండ్ వెళ్లి ఆక్స ఫర్డ్ లో మేర్తాన్ కాలేజి లో స్కూల్ మేస్టర్ అయి బాంక్ క్లెర్క్ గా పని చేశాడు .ఎనిమిదేళ్ళ తర్వాత లండన్ పబ్లిషింగ్ హౌస్ లో చేరి పూర్తీ భాగస్వామి అయ్యాడు నలభై లో బ్రిటిష్ పౌరసత్వం పొందాడు .’’ఆంగ్లో కేధలిక్ ‘’నని ప్రక టించు కొన్నాడు .రాజకీయాలలో రాయలిస్ట్ ను అన్నాడు .సాహిత్యం లో క్లాసిస్ట్ నన్నాడు .ఇరవై ఏడులో వివేన్నా హేగ్ ను పెళ్లి చేసుకున్నాడు .ఏడేళ్ళ కాపురం తర్వాత ఆమె చనిపోతే పదేళ్ళ తర్వాత తన సెక్రెటరి వాలెరీ ఫ్లెచర్ ను వివాహమాడాడు .
పందొమ్మిదేళ్ళ వయసులో సంప్రాదాయ పద్ధతిలో కవిత్వం రాశాడు .గ్రాడ్యుయేట్ కాకపూర్వమే ఫ్రెంచ్ సింబాలిజం అర్ధం చేసుకొన్నాడు .లా ఫోర్జ్ ను ఆదర్శం గా తీసుకున్నాడు .అప్పుడున్న కాల మాన పరిస్తితులకు అసహనం చూపాడు .కొత్త శైలిలో దాన్ని కవిత్వీకరించాడు స్నేహితులు దీన్ని ‘’ ఎలిప్టి కల్ స్కూల్ ‘’అన్నారు .ఇడియం ను ఇంకా పదును బెడుతూనే ఉన్నాడు .ఇరవై మూడులో ‘’ది లవ్ సాంగ్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ ఫ్రూ ఫోర్క్’’అనే మొదటి ముఖ్యమైన కవిత రాశాడు .కంటికి కని పించిన ప్రతి దాన్ని ఇమేజరిగా వివరించాడు .దీనితో ఇంగ్లీష్ ప్రజల్లో దడ పుట్టించాడు .డాంటే రాసిన కొటేషన్ తో దీన్ని ప్రారంభించి రాశాడు అది చదివిన వారికే ఇది అర్ధమవుతుంది అదీ ఫిటింగ్.అసందిగ్ధం గా ,నిర్ణయాత్మక రహితం గా సాగిన కవిత అది .ఘనీభవించిన సమాజానికి ,వంధ్యత్వం పొందిన సంఘానికి అది ప్రతీక .’’let us go then if you and I –when the evening is spread out against the sky ‘’అంటూ సాగే కవిత అది . ‘’my life is measured by coffee spoons ‘’అంటాడు .’’do I dare –disturb the universe ?-and should I then presume ?-and how should I begin?అని ప్రశ్నించాడు .
ముప్ఫై నాలుగు లో రాసిన ‘’వేస్ట్ ల్యాండ్ ‘’కవితలలో బోర్ డం ,హారర్ ,కీర్తి లను ప్రతిస్టించాడు .ఇందులో జ్ఞాపకాలు ,కోరికలు ఉన్నాయి .క్రిష్టియానిటి చాలెంజి కి సమాధానం అన్నారు .లండన్ నగర జనజీవితం లో ఉన్న ‘’ఊసర క్షేత్ర’’ దర్శనమే ఇది .ప్రతి చోటా ఉన్న చావు ను కనిపెట్టాడు .కవితను ముక్కలు ముక్కలుగా చేసి రాశాడు అందులోని క్రియా సౌభాగ్యానికి మురిసిన వారున్నారు .ఇందులో శిధిల చిహ్నాలున్నాయి .’’బోలు మనుషుల ‘’నిజ రూపం చూడ గలం.అన్నీ కోల్పోయిన ప్రపంచాన్ని చూస్తాం .’’paralysed force ,gesture without motion ,men figures stuffed with straw ,gather on stony soil in a valley of dying stars ‘’అని కదలలేని కుళ్ళిన కంపు కొడుతున్న ,ధ్యేయం లేని సమాజాన్ని చూపించాడు .’’this is the way the world ends –this is the way the world ends –this is the way the world ends –not with a bang but a whimper ‘’అని మూడు మాటలు గంట కొట్టి ప్రపంచ పరిసమాప్తిని చెప్పాడు .
క్రమంగా అనుకోని మార్పులు ఇలిఎట్ లో కలిగాయి .నాటక రచయిత అయ్యాడు . ‘’ది రాక్ ‘’డ్రామా రాశాడు .మర్డర్ ఇన్ ది కేధడ్రిల్ ‘’ ను సెయింట్ థామస్ త్యాగాన్ని గుర్తు చేస్తూ రాశాడు .ఫామిలీ రి యూనియన్ ,కాక్ టైల్ పార్టీ ,ది కాన్ఫిడెం షియ ల్ క్లెర్క్ ,ది ఎల్డర్ స్టేట్స్ మన్ లు మనసులోకి దూసుకు పోయేట్లు ,బాధ వ్యధ కలిగిస్తూ ,హాస్యం చిప్పిలుతూ రాశాడు .అరవైలో ‘’కన్సేర్వేటివ్ ఎల్డర్ స్టేట్స్ మన్ ‘’అని పించుకొన్నాడు .కమ్మని స్పష్టమైన స్వరం తో తన కవితలను రికార్డ్ చేసుకున్నాడు .వి ఎస్ ప్రిచేట్ ఇలియట్ ను’’a trim anti Bohemian with black bowler and umbrella ,the well-known symbol of male respectability ,ushering us to our seats in hell ‘’వర్ణించాడు
యాభై సమీపిస్తుండగా ‘’ఫోర్ క్వార్టర్స్ ‘’విడుదల చేశాడు .గొప్ప ఫిలసాఫికల్ పోయెం అన్నాడు .కాని అంతగా పేల లేదు .ఒక డిజైన్ లో ఇంకో డిజైన్ కలిసి పోయి గజి బిజీ అయింది .’’ట్రాడీదిషన్ అండ్ ఇండి విడ్యువల్ టేలెంట్ ‘’లో సాహిత్య విమర్శ చేశాడు .అరవై లో ఆధునిక కవిత్వానికి మార్గ దర్శనం చేసినందుకు నోబెల్ ప్రైజ్ నిచ్చారు .నాలుగవ జార్జి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశాడు .’’the process of advancement is interesting .one seems to become a myth ,a fabulous creature that does not exist .one does not feel any different though .it is not you get bigger to fit the world ,the world gets smaller to fit you ‘’ అని ఫిలసాఫికల్ గా స్పందించాడు .డేబ్భైలో ఆయన పై ఒక సింపోజియం నిర్వహించారు .అతని ప్రభావం పై డజనుకు పైగా పుస్తకాలు తెచ్చారు .కొత్త క్రిటిక్స్ ను ‘’లెమన్ స్క్వీజేడ్ క్రిటిక్స్ ‘’అన్నారు .వీటిపై ‘’ good poetry must exhibit several qualities in proportion of which one is good sense ‘’అని కవిత్వ పరామావధి చెప్పాడు .మేధ తో పాటు మత భావాన్నీ జోడించాడు .’’సేలేక్టేడ్ ఎస్సేస్ ‘’లో కవిత్వాన్ని గురించి చాలా రాశాడు .’’కవిత్వం ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూపిస్తుంది .అందులో కొత్త భాగాలనూ తెలియ జేస్తుంది .ఎప్పటికప్పుడు లోతుల ఆవిష్కరణ చేస్తుంది .నిజం గానే దూసుకు పోయేట్లు చేయగల సమర్ధతా ఉంది’’ .ఇలియట్ సాహిత్య సర్వస్వం కొత్త శబ్ద సృష్టి తో ముడి పడింది .కొత్త ,చూడని లోక దర్శనం చేయిస్తుంది .ఆనదాన్ని మాత్రమె కాక ఎక్కువ జాగ్రుతికలిగి స్తుంది .
చివరికాలం లో ఆల్కహాలిక్ అయి’’రిం జిమ్ రిం జిమ్ ‘’అంటూ జిమ్ ను జాం మంటూతెగ తాగే వాడు. ఆయన ద్విశాతాబ్దికి లండన్ పోఎట్స్ కార్నర్ లో వెస్ట్ మినిస్టర్ ఆబే లో ఒక పెద్ద శిలను ఉంచి గౌరవించారు .వర్జీనియా ఉల్ఫ్ జేమ్స్ జాయిస్ మొదలైన వారిని ప్రభావితం చేశాడు .ఆధునిక కవిత్వ మార్గ దర్శి టి ఎస్ ఇలియట్ .భారతీయ వేదవిషయాలు ‘’దం ,దాంతం ధమద్వం’’మొదలైన పదాలను వేస్ట్ లాండ్ లో వాడాడు .
![]()
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్

