బ్రాహ్మణాల కదా కమామీషు -1
జూన్ తొమ్మిది సోమవారం మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,మా మనవడు ఛి సంకల్ప్ –అంటే మా పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు కలిసి ఆర్ టి సి వారి పాకేజ్ టూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి హైదరాబాద్ నుండి తిరుమల వెళ్ళారు .మంగళ వారం ఉదయం చేరి దర్శనం పూర్తీ చేసుకొన్నారు అన్నీ వాళ్ళే దగ్గరుండి తీసుకుని వెళ్లారట. ప్రసాదం లాడ్ద్దూలు కూడా వాళ్ళే కలెక్ట్ చేసి ఇచ్చారట .పద్మావతీ అమ్మవారి దర్శనం శ్రీ కాళ హస్తి చూపించి మళ్ళీ రాత్రికే బయల్దేరి బుధవారం ఉదయం హైదరాబాద్ చేరారు .తిరుమలలో దేవస్థానం బుక్ స్టాల్ కు వెళ్ళిన మా అమ్మాయికి అక్కడ కొత్తగా ప్రచురించిన ‘’బ్రాహ్మణాలు ‘’కానీ పించాయి ‘’నాన్న న్నిటి మీదా రాశారు కాని బ్రాహ్మణాల పై రాయలేదే ‘’అనుకోని ఒక పుస్తకం కొని తీసుకొని వచ్చింది నాకోసం .దీని ప్రధాన సంపాదకులుఆచార్య ఎస్ బి.రఘునాదా చార్య గారు . దాన్ని ఆ పూట నుంచే చదవటం మొదలు పెట్టి నాలుగు వందల యాభై పేజీలను అయిదు రోజుల్లో పూర్తిచేశాను .బాగా ఉంది .అంతకు ముందెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం అరణ్యకాలు చదివాను .ఇందులో కొన్ని కధలు బాగున్నాయి వాటినీ అందులోని విశేషాలను బ్రాహ్మణాల వైశిస్త్యాన్ని తెలియ జేయటానికి ‘’ఆరణ్యకాల కదా కమా మీషు ‘’శీర్షికతో రాయటం ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాను .నాకు తెలిసిన, నచ్చిన విషయాలను అందరికి అందివ్వటమే నా ఉద్దేశ్యం .ఇదొక దారి చూపే పనే కాని లోతులను తరచి చూపే పనికాదని సవినయం గా మనవి చేస్తూ ప్రారంభిస్తున్నాను .
బ్రాహ్మణాలు అంటే ఏమిటి ?
వేదాలు భగవంతుని నిశ్వాసాలు .అవి రుక్ ,యజు ,సామ అధర్వాలని నాలుగు .వీటి మూల గ్రంధాలను ‘’సంహితలు ‘’అంటారు .ఇవన్నీ దాదాపు ఛందో బద్ధమంత్రాలే .కనుక మంత్రభాగమనీ పేరు .దేవాతా స్తుతులు ,యజ్న యాగాది వైదిక కర్మలు ,ధార్మిక ప్రక్రియలు ,తాత్విక చింతనలు వేదాలలో ప్రతి పాదించ బడ్డాయి .మంత్రం ద్రస్టలైన మహర్షులు భావన లో వీటిని దర్శించారు .అందుకే వారు మంత్ర ద్రష్టలు అయ్యారు . వారు దర్శించిన మంత్రాలనుపయోగించి వివిధ దేవతారూపం లో ఉన్న భగవంతుని ఆరాధించటమే యజ్ఞం .యజ్ఞం చరా చర సృష్టికి సుఖ సంతోషాలను తుష్టిని పుస్టిని ఇస్తుంది .యజ్న యాగాలకు కొన్ని పద్ధతులున్నాయి .వాటిల్లో సామాజిక ద్రుష్టి ,తాత్విక చింతన ,ధర్మాసక్తి ఉంటాయి .సంహితను సరిగ్గా అర్ధం చేసుకుని అనేక కర్మలలో ఉపయోగించుకుంటూ ,అందు లోని సాంకేతిక పరిజ్ఞాన అర్ధాన్ని వివరిస్తూ ఏర్పడిన వాటినే ‘’బ్రాహ్మణాలు’’ అన్నారు .ఇవి గద్యం లో ఉంటాయి .వేద సంహితలకు ,ఆ తర్వాత వచ్చిన వాజ్మయానికి బ్రాహ్మణాలు వంతెనలాంటివి.యాగస్వరూపాన్ని వివరించటమే బ్రాహ్మాణాల ముఖ్య కర్తవ్యం.
బ్రహ్మ అనే శబ్దానికి అర్ధం అంటున్నది శాత పద బ్రాహ్మణం .నాలుగు వేదాలలోను ఉన్న మంత్రం భాగానికి వినియోగాన్ని విధిస్తూ ,వ్యాఖ్యానం గా ఏర్పడిన గ్రంధమే బ్రాహ్మణం .మంత్రాలు కాకుండా మిగిలిన వన్నీ బ బ్రాహ్మణాలే.ఇవి గొప్ప ప్రామాణిక గ్రంధాలు .
సంహితలు –బ్రాహ్మణాలు
సంహితలలో ప్రతి ముఖ్య శాఖ కు ఒక బ్రాహ్మణం ఉండేది .రుక్సంహితకు 21శాఖలున్నా ఆరు మాత్రమె కని పిస్తున్నాయి అవే ఐతరేయ బ్రాహ్మణం ,కౌశీతకి బ్రాహ్మణం ,పైంగి బ్రాహ్మణం ,బహ్వాచ బ్రాహ్మణం ,ఆశ్వలాయన బ్రాహ్మణం ,గాలవ బ్రాహ్మణం .
యజుస్సంహితకు రెండు ప్రధాన శాఖలున్నాయి .అందులో కృష్ణ యుజుర్వేదానికి తైత్తిరీయ శాఖలకు సంబంధించింది తైత్తిరీయ బ్రాహ్మణం .మాధ్యందిన –కాన్వ భేదం తో శుక్ల యజుర్వేదానికి రెండు శాఖలున్నాయి వీటికి విడి విడిగా మాధ్యందిన శత పద బ్రాహ్మణం ,కాన్వ శత పద బ్రాహ్మణం అని రెండున్నాయి ఇవికాక కాల గర్భం లో పన్నెండు కలిసి పోయాయి .
సామ సంహితకు మూడు ప్రధాన బ్రాహ్మణాలు తలవకార బ్రాహ్మణం ,తాండ్య బ్రాహ్మణం ,ఛాందోగ్య బ్రాహ్మణం ఉన్నాయి ఇవి కాక ఉప బ్రాహ్మణాలు –సామ విధాన బ్రాహ్మణం ,దేవతాధ్యాయ బ్రాహ్మణం ,వంశ బ్రాహ్మణం ,సంహితోపనిష బ్రాహ్మణం ఉన్నాయి
అధర్వ సంహితకు ఒకే ఒక బ్రాహ్మణం గోపద బ్రాహ్మణం ఉంది .
బ్రాహ్మణాలు వివిధ కాలాలో ఏర్పడ్డాయి. పంచ వింశ బ్రాహ్మణం ,తైత్తిరీయ బ్రాహ్మణం మిగిలిన వాటికంటే ప్రాచీన మైనవి .వీటి తర్వాత తలవకార లేక జైమినీయ బ్రాహ్మణం ఆ తర్వాత కౌశీతకి బ్రాహ్మణం ఏర్పడ్డాయి .దీనితర్వాత ఐతరేయం ఆ తర్వాత శత పధం ఏర్పడ్డాయని భావిస్తున్నారు .కృష్ణ ద్వైపాయన వ్యాసుని చేత కల్ప సూత్రాలతో బాటు నిర్మింప బడిన బ్రాహ్మణాలు ఆధునికమైనవి .అంతకు ముందున్న బ్రాహ్మణాలు ప్రాచీనమైనవి అని అనుకుంటారు .మొత్తం మీద ఐతరేయ ,పంచ వింశ ,తైత్తిరీయ బ్రాహ్మణాలు మిగిలిన వాటికంటే ప్రాచేనమైనవి శతపద బ్రాహ్మణం నవీనమైనది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-14-ఉయ్యూరు
