c కధా కమా మీషు- 3
బ్రాహ్మణాల లోని మహర్షులు
బ్రాహ్మణాలలో వేద ద్రస్టలైన మహర్షుల పేర్లే కాకుండా మరి కొందరు మహర్షుల పేర్లు కని పిస్తాయి .ఇందులో సప్తర్షులే కాక కుత్స ,అత్రి ,రేభ ,అగస్త్య ,కుశిక గణ ,వసిష్ట,వ్యస్వ మహర్షుల పేర్లున్నాయి .బృహదారన్యకోపనిషత్ లో గౌతమ ,భరద్వాజ ,విశ్వా మిత్ర ,జమదగ్ని ,విశిష్ట కశ్యప ,అత్రి మహర్షుల ను పేర్కొన్నది .అధర్వ వేదం లో అదనం గా ఆంగీరస ,గనిస్తికర ,కక్షీ వంత , కణ్వ మేదాటిది ,త్రిషాక ,ఉశనా ,కావ్య ముద్గల ఋషుల పేర్లు కని పిస్తాయి .ఋగ్వేదం తర్వాతి వాగ్మయం సప్తర్షి నక్షత్ర మండలానికి సప్తర్షులకు ఉన్న సంబంధాన్ని చర్చించింది .సాయనుడు నక్షత్రానికి ఉన్న ‘’రుక్ష ‘’శబ్దానికి సప్తర్షులు అనే అర్ధం చెప్పింది .ఇప్పుడు ఆయా ఋషుల గురించి వివరాలు తెలుసు కొందాం .
అగస్త్యడు –ఈయన్నే ఆగస్తి అనీ అంటారు .ఈయన మరుద్దేవతలను వృషభాలను ప్రోక్షించి పూజ చేశాడు .అక్కడి పశువుల్ని ఇంద్రుడు అపహరించుకు పోగా మరుద్దేవతలు వజ్ర ధారులై ఇంద్రుని చంపటానికి వచ్చారు .అప్పుడు ఇంద్రుడు ,అగస్త్యుడు ‘’ కయా శుభీయ ‘’అనే సామ వేదం మంత్రాన్ని చదివి వారిని శాంతింప జేశారు .ఇంద్రుని బుద్ధి విశేషాన్ని గుర్తించి అగస్త్యుడు బ్రహ్మ జ్ఞానాన్ని మొట్టమొదటి సారిగా ఉపదేశించాడు .
కణ్వుడు—ఈయన వంశీకులే కణ్వులు లేక కాన్వులు.ఈయన్నే ‘’సౌశ్ర వసువులు ‘’అనీ బహువచనం లో పిలుస్తారు .అత్రి ,కన్వవంశాలకు సంబంధం ఉంది .
గౌతముడు –ఇది రుషి గోత్రం పేరు .ఈ గోత్రీకులకు ఆంగిరసులకు సన్నిహిత సంబంధాలున్నాయి .జనక ,యాజ్న్య వల్క్యులకు సమకాలికుడు .ఒక ఋగ్వేద స్తుతి ‘’స్తోమానికి ‘’ప్రణేత ‘’.విదేహ రాజు మాధవుడు వైశ్వానరాగ్ని ని తన నోటిలో ధరించాడు .రాజుకు పురోహితుడైన గౌతముడు అగ్నిని పిలిచాడు . బదులు పలికితే బయట పడతానేమో నని భయం తో పలక లేదు .ఎలాగైనా అగ్నిని బయటికి రప్పించాలని గౌతముడు ఋగ్వేద మంత్రాలతో అగ్నిని స్తోత్రం చేశాడు .అయినా రాజు కాని అగ్ని కాని పలక నే లేదు .రుషి మళ్ళీ దీర్ఘం గా తీవ్రం గా క్రోధం గా అగ్నిని పిలిచాడు .ఊహూ అగ్ని జాడే లేదు .అప్పుడు గౌతముడు ‘’తన్వ్యాఘ్రుత స్రవీ మహె ‘’అనే ఋగ్వేద మంత్రాన్ని పలికాడు. మంత్రం లో ఉన్న ‘’ఘ్రుత ‘’(నెయ్యి)శబ్దం వినపడగానే అగ్ని ఊర్ధ్వ ముఖం గా ప్రజ్వరిల్లాడు .రాజు అగ్నిని భరించలేక పోయాడు .అప్పుడా అగ్ని భూమి మీదకు చేరింది .అగ్నిని నోటిలో భరించటం వలన ఏర్పడిన తాపాన్ని పోగొట్టుకోవటానికి రాజు సరస్వతీ నదిలో మునిగాడు .అప్పుడు అగ్ని తూర్పు దిక్కు గా ప్రజ్వ రిల్లుతూ భూమి అంతటా వ్యాపించింది .గౌతమర్షి మండుతున్న అగ్నిని వెంబ డించాడు .అగ్ని భూమి పై ఉన్న నదులన్నిటిని ఎండింప జేసింది .అందువలననే ‘’మిత్ర విందా యష్టి ‘’విదేహ రాజైన జనకుని ఉద్దేశించి ఏర్పాటైంది .దాన్ని ఇతను చూశాడు .
కశ్యపుడు –విశ్వ కర్మ ‘’సర్వ మేధా యాగం ‘’చేశాడు .కశ్యపునికి భూదానం చేయాలను కున్నాడు విశ్వ కర్మ .భూమి అంగీకరించలేదు .కష్యపునికి దితి ,అదితి అనే ఇద్దరు భార్యలున్నారు .కశ్యపుడు బ్రహ్మ పుత్రుడైన మరీచి కొడుకు .కనుక దేవతలకు అసురులకు ,సర్వ ప్రాణి కోటికి కశ్యపుడు తండ్రి అన్నమాట .అదితి తో పాటు పన్నెండు మంది దక్ష పుత్రికలను పెళ్లి చేసుకొన్నాడు .వారి వలన ఎంతో ప్రాణి కోటిని సృష్టించాడు కశ్యపుడు .కశ్యపుడు ప్రజాపతి గోత్ర ఋషీకూడా .సామ వేదం లో నిక్షిప్తమైన జ్ఞానం మొదటి సారిగా ఇంద్రుని నుంచి అగ్నికి తర్వాత కశ్యపుడికి సంక్రమించింది .
అత్రి –రుషి గోత్రం .పరి వార రూపం గా ప్రియ మేధులు ,కణ్వులు ,గౌతమ ,కక్షీ వంత గుణాలతో అత్రి గణం ఏర్పడింది .అత్రి జమదగ్ని ,గౌతములు క్రిమి సంహారకులు అని ఛాందోగ్య బ్రాహ్మణం తెలియ జేస్తోంది .
యాజ్న్య వల్క్యుడు –శత పద బ్రాహ్మణాన్ని రచించింది యాజ్న్య వల్క్యుడే .మైత్రేయి కాత్యాయిని ఇతని భార్యలు .మైత్రేయి పైన అధిక ప్రేమ ఉండటం తో కాత్యాయినిని ‘’ఇతర ‘’అన్నాడు .ఇతర పుత్రుడే ‘’మహీదాస ఐత రేయుడు ‘’ఐత రేయ బ్రాహ్మణ రచయిత .వైశంపాయన శిష్యులలో యాజ్న్య వల్క్యుడొకడు .ఒక సారి జనక రాజు యజ్ఞం లో ‘’అందరి కంటే గొప్ప బ్రహ్మ జ్ఞానికి పది వేల గోవుల్ని ‘’ఇస్తానని ప్రకటించాడు .అక్కడే ఉన్న అశ్వల ,యార్త భాగ ,ఉషాస్తి ,ఆహోల ,ఉద్దాలక ,గార్గి మొదలైన రుషులతోను ,రుశషికల తోను వాదం చేసి గేలు పొంది ,రాజు ప్రకటించిన పది వేల ఆవులను తోలుకు పోయిన ధీశాలి .
ఒక సారి ఉపనిషత్ పురుషుని స్పష్టం గా ఆవిష్కరించమని ,లేక పొతే శిరస్సు తెగి పడుతుందని దేవ మిత్ర శాకల్యుని ప్రశ్నించాడు .శాకల్యుడు చెప్ప లేక పోయాడు .అంతే శిరస్సు తెగి పడి పోయింది .జనకుడు యాజ్న్య వల్క్యుని వలన బ్రహ్మ జ్ఞాన ఫలాన్ని పొంది రాజ్య సర్వస్వాన్ని గురు దక్షిణ గా సమర్పించాడు .యాజ్న్య వల్క్యుడు ఒద్దని చెప్పి జనకుడినే రాజ్యం ఏలుకోమ ని ఇచ్చేశాడు .సన్యాసం తీసుకుంటూ తన సంపదను భార్య లిద్దరికీ పంచేశాడు .మైత్రేయి ఆత్మ సంపదను అడిగి పొందితే ,కాత్యాయని భౌతిక సంపదను వాంచించి పొందింది .
భ్రుగువు –వరుణ పుత్రుడు భ్రుగువు అని శత పద బ్రాహ్మణం చెప్పింది .తైత్తిరీయం లో దీనికో కద ఉంది .భ్రుగు గణం ద్రుహ్యులకు పురోహితులుగా ఉండేవారు .వీరికి అన్గిరసులతో సంబంధం ఉంది .చ్యవనుడికి భార్గవుడని అన్గిరసుడని పేర్లున్నాయి .వీరిపై ఆక్రమణ ఫాలితం గా సృంజయ ,వైతహవ్యులు సర్వ నాశన మైపోయారు .
భరద్వాజుడు –గోత్ర రుషి .దివోదాసుని పురోహితుడు .మంత్ర ప్రణేత ,ద్రష్ట .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-14-ఉయ్యూరు

