స్వర్గీయ కొల్లూరికి శ్రద్ధాంజలి గా సరస భారతి ప్రత్యెక కార్యక్రమం
విద్యారంగ అభి వృద్ధికి అవిరళ కృషి చేసి ,ఉపాధ్యాయ ,అధ్యాపక సమస్యా పరిష్కారాలకు నాయకత్వం వహించి ,విద్యార్ధి దశలోనే ”తెలుగు విద్యార్ధి ”మాసపత్రికను స్థాపించి 61సంవత్సరాలుగా నిర్వహిస్తూ ,ఆంద్ర విశ్వ విద్యాలయం కు సెనేట్ సభ్యునిగా ,ఉపాధ్యాక నియోజక వర్గానికి కృష్ణా జిల్లా శాసన మండలి సభ్యునిగా 16ఏళ్ళు కృషి చేసి ,అందరికి మిత్రుడుగా మెలగుతూ ఉన్న శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారు 19-6-14న మరణించిన సందర్భం గా సరస భారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ కొల్లూరికి కి శ్రద్ధాంజలి ఘటించ టానికి ఈ రోజు 23-6-14 సోమవారం ప్రత్యెక కార్యక్రమాన్ని స్థానిక ఎ .సి లైబ్రరి లో సాయంత్రం 6గం లకు నిర్వ హిస్తోంది .ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు సాహిత్యాభిమానులు పాల్గొన వలసినదిగా విజ్ఞప్తి
జోశ్యుల శ్యామలా దేవి -మాదిరాజు శివ లక్ష్మి -జి వి రమణ -గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్క్షులు -సరసభారతి

