శ్రీ రవీంద్రనాధ్ గారు ఎంతో శ్రమించి రచించిన – ప్రవచించిన ఫాదర్స్ డే అంశానికి అభినందనలు —– పితృ దినోత్సవం
నా భావమైన మరో కోణాన్ని వీక్షించి వ్యాఖ్యానించండి —
నాన్న !!!
పైపైకి ఎగరేసి – వున్నతముగా వుండమని – పడకుండా పట్టుకున్న నాన్న!
నా అనే అనుబంధానికి – అసలు రూపం నీవే నాన్న !
వేలు పట్టి నడిపించి – వెన్ను తట్టి ప్రోత్సహించి – లోకమంతా చూపించి
జ్ఞానమెంతో కలిగించి – అన్నీ నీవై నడిపించిన నాన్నా!
నీకు వందనం – పాదాభివందనం !
మీ ఆలన మాకు రక్ష – మీ పాలన మాకు భిక్ష !
బాధ్యతలను మోస్తూనే – బంధాలను బలపరుస్తు !
భాధలను భరిస్తూనే – భుజాలపై మమ్ము మోస్తూ !
మీ యొదనే – మాకు శయనించే పాన్పు చేస్తూ !
మీ అరచేతినే మా పాదాలకు రక్ష చేస్తు !
మా నవ్వులో మీ అలసట మరచారు !
మా మాటల్లో మీ వేదన తుడిచారు ! నాన్నా ! ఓ నాన్న!!
విద్యలో మాస్థాయికై – మీ ఆస్థులు తెగనమ్మారు !
మాకు వుద్యోగం వచ్చేందుకు – మీ స్వేదం చిందించారు !
మాకు జన్న నిచ్చి- బ్రతుక నేర్పిన నాన్నా !
మిమ్ము మరచిన క్షణమున్నదా ? – నాన్నా !
మిమ్ము వత్సరాని కొక్క రోజు తలవాలా ???
మాతృ దేవో భవా ! పితృ దేవో భవా ! అన్న భూమి మనది !
నా పిల్లలు – నీ పిల్లలు కలసి మన పిల్లలపై చేస్తున్న పోరాటంలో!
ఆరాటం – సంవత్సరానికొక్కమారు కలసి గడిపే ఫాదర్స్ డే కోసం !
ఆ ఫారినర్స్ జరుపుకునే “ఫాదర్స డే” మనకు కావాలా ?
నా పెళ్ళాం – నా పిల్లలు అనుకుంటూ – కన్నవారిని శరణాలయాలకు పంపితే ?
తాత గతే మీకు _ అని మా బిడ్డలు మాకు చెప్పరా !!
పుత్రుడైనా – పుత్రికైనా – నా – అన్నదే నాన్న భావం!
కలసి వుంటే కలదు సుఖమని మరువకు – కన్నవారిని కష్టాలలో విడువకు !
ఇది ! ఈ కర్మ భూమి పంచిన ధర్మం !!
ఇది ! మరో త్రికాల వేదం – ఈ బందా నాదం !!
—- బందా వేంకట రామా రావు, 9393483147.

