సాహైతీ బంధువులకు శుభ కామనలు అంతర్జాలం లో వెయ్యేళ్ళ ఆంగ్ల కవిత్వం లో సుప్రసిద్ధులైన ,ప్రభావ శీలురైన123మంది కవుల పై ”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘శీర్షిక తో నేను రాసిన ’55 ఎపిసోడ్ లను పుస్తక రూపం లో సరసభారతి 13వ ప్రచురణ గా తీసుకు రావటానికి సరస భారతికి అత్యంత ఆప్తులు ,అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ముందుకు వచ్చి ముద్రణ ఖర్చు కు పూర్తీ బాధ్యతను వహించారని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది . ఈ పుస్తకాన్ని మైనేని వారి అభ్యర్ధన మేరకు వారి బావ గారు ప్రముఖ ఆంధ్రాంగ్ల సాహితీ వేత్త,విశాఖ వాసి డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి (రావి శాస్త్రి గారి తమ్ముడు ) గారికి , శర్మ గారి90వ జన్మదినోత్సవం రోజున అంకిత మిచ్చి ఆవిష్కరణ చేస్తున్నాం .ఈ పుస్తకానికి ముందు మాట , సమీక్ష .రాయటానికి తమ విలువైన సమయాన్ని శర్మ గారిపై ఉన్న అభిమానం తో వెచ్చించటానికి ప్రముఖ వరంగల్ వైద్యులు ,ప్రసిద్ధ రచయిత డాక్టర్ శ్రీ లంకా శివ రామ ప్రసాద్ గారు అంగీకరించారని తెలియజేయటానికి ఇంకా సంతోషం గా ఉంది .పుస్తకమ్ తయారవుతోంది .వివరాలు తరువాత తెలియ జేస్తాను . మీ -దుర్గా ప్రసాద్

