ప్రపంచీకరణ లో మన దారెటు ?
ప్రపంచీకరణ అనగానే అదొక దేవలోకం అని సకల అభీష్టాలు తీర్చే వ్రతమని కొందరనుకొంటే ,అది భయంకర దెయ్యం అని అంటరానిదని ,దాని పేరెత్తితేనే మహా పాపమని కమ్యూనిస్ట్ లు ఇంకా అనుకొంటూనే ఉన్నారు .ప్రపంచం ఒక కుగ్రామం అయి పోయింది కాని ఏదేశానికాదేశం కొన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాయి .అస్తిత్వం కాపాడు కొంటున్నాయి .ఇలాంటి పరిస్తితులలో భారత దేశం ఎటు వైపు వెళ్ళాలి ?ఏ విధానం అవలంబించాలి అని మేధావులు ,మతాధిపతులు సాంఘిక శాస్త్ర కోవిదులు సామాన్యులు ఆలోచించి తలలు బద్దలు కొట్టుకొంటున్నారు .ఈ సమస్య పూర్వా పరాలను ఒక సారి ఆలోచిద్దాం .
ఇవాళ ఆర్ధికం అన్నిటిని శాసిస్తోంది .మార్కెట్ కాపిటలిజం ,ప్రైవేట్ వ్యాపార సంస్థలు ప్రభుత్వం యొక్క శాసనాదికారాలకు దూరమై ఇస్టా రాజ్యం గా వ్యవహరిస్తున్నాయి .వాటిపై నియంత్రణను ప్రభుత్వం దాదాపు కోల్పోయి నట్లే .ఇప్పుడు విజయం అనేది జి డి పి .పెరుగుదల తో ముడి పెడుతున్నారు .సోషలిస్ట్ ఆర్ధిక వేత్తలు దేశ ప్రభుత్వాదికార సంస్థలకే అత్యధిక అధికారాలిచ్చారు .ప్రైవేట్ రంగాన్ని నమ్మనే లేదు .మార్కేట్ కేపిటలిజాన్ని తిరస్కరించారు .ఇప్పుడుత్రాసు సిబ్బెలు ఒక చివరి నుండి ఇంకో చివరికి ఊగిపోయాయి .ఆర్ధిక వేత్తలు మధ్యే మార్గాన్ని కనుక్కో లేక పోయారు .అదే ఇప్పుడు మనల్ని ఆదుకొనే దారి అని పిస్తోంది .సోషలిస్ట్ భావాలున్న మొదటి ప్రధాని నెహ్రు ప్రభుత్వ రంగ సంస్థలపైనే ఆధారపడ్డాడు .దిగుమతులపై ఆధారపడకుండా ఉత్పత్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు చేశాడు .నెమ్మదిగా సోపానాలు నిర్మిస్తూ ఆర్ధిక పరి పుష్టి సాధించే ప్రయత్నాలు అమలు చేశాడు .రష్యా దీన్ని సమర్ధించింది .దీనివల్ల బ్యూరాక్రసి పెరిగింది .వీరే ఆర్దికాన్ని నియంత్రించేవారు .రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్ లకు బాసులయ్యారు .ఇద్దరు కలిసి స్వంత ప్రయోజనాలకోసం ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారు .ఇందిరా గాంధి పాలన లో ఆర్ధికం మీద పట్టు సాధించింది .బ్యాంకులు జాతీయం చేయ బడ్డాయి .ఆమె ఆహారాన్ని జాతీయీకరణ చేసింది .దీనితో పరిస్తితి పెనం లో నుంచి పొయ్యిలో పడినట్లయింది .తప్పు తెలుసుకొని ‘’బాక్ టు పెవిలియన్’’ చేసి మళ్ళీ పాత విధానానికే పట్టం కట్టింది .ఆర్ధిక కట్టు బాట్లను సడలించింది .’’ఆర్ధిక శిఖరారోహణం ‘’పేరు తో ఆమె నిర్ణయాలు గా పబ్లిక్ యాజమాన్యం అప్పటికే బల పడింది .ఉత్పత్తిలో దాదాపు నలభై అయిదు శాతం ప్రభుత్వ రంగ సంస్థలే సాధించాయి .
సోషలిస్ట్ ల ‘’లైసెన్స్ పర్మిట్ రాజ్ ‘’రాజ్యం అధీనం లో లైసెన్సులు పర్మిట్ల సామ్రాజ్యమై పోయింది . ‘’ ఎంబాసిడర్ కారు ‘’ముతకగా ఉన్నా ఇండియా రోడ్ల మీద ‘’కింగ్ ‘’అయి విజయమైంది .దాని మన్నిక అందరికి నచ్చింది .హిందూ స్తాన్ మోటార్స్ సాధించిన సృష్టీ విజయం ఇది .దానికోసం జనం క్యూలు కట్టారు .సప్ప్లై కంటే డిమాండ్ ఎక్కువైంది .ఇతరదేశీయులు అంబా సిడ ర్ భారతే దేశ వెనక బడ్డ తనానికి చిహ్నం అని భావించి ఈసడించినా ఇది యదార్ధం ..ఇ ప్రపంచీకరణ తో అనేక మోడల్ కార్లు ఇండియా లో తయారవుతున్నాయి .సూక్ష్మ ఆర్ధిక సంక్షోభం తర్వాత ఆటో మొబైల్ పరిశ్రమ పది హేడు శాతం అభి వృద్ధి సాధించింది .ఇప్పుడు ఇండియా ‘’గ్లోబల్ ప్లేయర్ ‘’.అయింది .2016కు ఇండియా కార్లు తయారీ సంస్థలలో ప్రపంచం లోనే ఏడవ పెద్ద దేశం అవుతుంది . 34బిలియన్ డాలర్ల నుండి 145 బిలియన్ డాలర్ల టర్న్ ఓవర్ సాధించే దిశగా ఇండియా ప్లాన్ వేసింది .కాని లైసెన్స్ పర్మిట్ రాజ్ లోని లోపాల వలన అది సాధ్యం అవుతుందని పించటం లేదు .
నెహ్రు హయాం లో భారీ పరిశ్రమలకే అగ్ర తాంబూలం .అవి అనుబంధ సంస్థలకు దారి ఏర్పరచాయి .నెహ్రు తర్వాత ‘’హరిత విప్లవం ‘’సాధించింది ఇండియా .రైతులకు అనేక ఇన్సెంటివ్ లనిచ్చి ప్రభుత్వం ఆదుకోన్నది .అధిక రాబడి విత్తనాలను కనీ పెట్టి రైతులకు సబ్సిడీ గా అందించింది క్రిమి సంహారక మందుల్ని ,రసాయనిక ఎరువులను తక్కువ ధరకు అంద జేసి రైతుకు ప్రోత్సాహాలనిచ్చింది .సాగు నీటిని సమృద్ధిగా అందించింది .దీని ప్రభావం 1970తో పూర్తయింది .ఇందిరా విధానాలను బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ గమనించి ‘’కొంచెం అతివాద ధోరణి ‘’అంది .కాని ‘’తాచరమ్మే’’1981లో జపాన్ ,జెర్మని ఫ్రాన్స్ లు సాధించిన ఆర్ధిక విజయాలను మెచ్చుకోంది.కాని ఈ మూడు దేశాల ఆర్ధిక వ్యవస్థలను పూర్తీ నియంత్రణలో ఉన్నాయన్న సత్యాన్ని గుర్తించలేక పోయింది .టోనీ బ్లెయిర్ ప్రధాని గా బ్రిటన్ కు ఉన్న కాలం లో తమ సోషలిస్ట్ భావాలను ‘’న్యూ లేబర్ ‘’గా పేరు పెట్టుకొన్నాడు .’’తాచరిసం ‘’ను అత్యున్నత స్తాయికి తీసుకు వెళ్లి నట్లు గొప్పలు చెప్పుకొన్నాడు .
2003లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ‘’ఇరవై వ శతాబ్ది మధ్యలో కేంద్ర ప్లానింగ్ ,సాంఘిక నియంత్రణ అనే దగ్గర మార్గం వల్లనే జాతీయతః బల పడుతుంది .సంక్షేమం ,సౌభాగ్యం సాంఘిక ప్రాణప్రద వ్యవస్థ ప్రజల స్వేచ్చా స్వాతంత్రాల మీదే ఆధారపడి ఉంటాయి .స్వేచ్చ గౌరవాన్నిస్తుంది .మానవ సృజన శక్తికి దోహదం చేస్తుంది .సృజన దేశం ,జాతి యొక్క శక్తిని ,సౌభాగ్యాన్ని నిర్ణయిస్తుంది .స్వేచ్చ అనేది మానవునికి భగవంతుడిచ్చిన ప్రణాళిక ,మాత్రమే కాదు ఈ భూమి మీద అభి వృద్ధికి ఆశ కూడా ‘’ అన్నాడు .నోబెల్ ప్రైజ్ విన్నర్ ,ఆర్ధిక వేత్త జోసెఫ్ ష్టిగ్లిచ్ ప్రభుత్వవిధాన నిర్ణయాలపై పై మార్కెట్ ఎకనామిక్స్ ప్రభావాన్నిఅధ్యయనం చేసి ‘’దిరోరింగ్ నైన్టీస్ ‘’అనే పుస్తకం రాశాడు .అందులో అమెరికా సాధించిన ఆర్ధిక వృద్ధి విశ్లేషించాడు .పూర్తిగా ప్రభుత్వ నిర్బంధం ఉండకుండా నూ, పూర్తిగా లేకుండా ఉండ కుం డాను ఉండే మధ్యే మార్గమే కారణం అన్నాడు .దీనినే ‘’విజన్ ‘’అన్నాడు .ఇది బిల్ క్లింటన్ అన్న ‘’ది ఎకానమీ స్టుపిడ్ ‘’కాదు .అన్నిటికీ మధ్యే మార్గం .
1980లో ఇండియా తన మార్గాన్ని మార్చుకొంది.సోషలిస్ట్ సంకెళ్ళను చేదించింది .అమ్మో కొంప మునిగి పోతుందని గుండెలు బాదుకొన్నారు సోషలిస్ట్ లు కమ్మీలూ .బీదలకు వ్యతిరేకం అన్నారు .రాజకీయ నాయకులు తమ అధికారాలను కోల్పోవటానికి ఇష్టపడలేదు .ప్రభుత్వ అధీనం లో ఉన్న ఆర్ధికం తో వారంతా పండగ చేసుకొని బాగు పడ్డ వాళ్ళేకదా .అందుకే వద్దని వాదించారు .
సశేషం
ఆధారం –శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు చదవమని పంపిన పుస్తకం – India;s un ending journey –by Mark Tully
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-14-ఉయ్యూరు

