ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం )
భారత దేశం లో 1991లో పి వి నరసింహా రావు ప్రధాని గా ఉన్నప్పుడు ఆర్ధిక సంస్కరణలు అమలు చేశాడు .అయన అది కారానికి వచ్చేసరికి భారతదేశంఆర్ధికం గా పూర్తీ గా దివాలా తీసింది .అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధానికి ఆర్దికంపై కంట్రోల్ లను సడలించే దాకా తాము ఏమాత్రం ఆదుకోలేమని చెప్పింది .అప్పటిదాకా అమలు లో ఉన్న సోషలిస్టు భావాలను పద్ధతుల్ని వదులుకోటానికి ఆయన మంత్రులు ఇష్టపడలేదు .అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న మన్ మోహన్ సింగ్ సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిస్తే తప్ప గండం గడవదు అని అర్ధం చేసుకొని ప్రధానికి చెప్పాడు ,పేద దేశమైన ఇండియా ప్రభుత్వానికి మార్కెట్ కు మధ్యే మార్గాన్ని అనుసరించి బయట పడాలని సూచించాడు .బంగారాన్ని అమ్మేసి ఆర్ధిక స్తితి మెరుగు పరచి సంస్కరణలు అమలు చేసి ఆర్ధికం గా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దారు ప్రధాని రావు మన మోహన్ .సింగ్ ప్రధాని అయి ఈ విధానాన్నే కోన సాగించాడు .గ్రామీణ ప్రజలకు పని కల్పించటం ,విద్యా విధానాలలో మార్పులు తేవటం ద్వారా కొంత మెరుగు పరచాడు సింగ్
సోషలిజం ఓడి పోవటం ,మార్కెట్ బల బడటం వలన మళ్ళీ ఆర్ధిక అసమానత్వం ఏర్పడింది .ప్రపంచీకరణ విజయమై ప్రపంచమంతా మార్కెట్ మయం అయింది.సోషలిజం పతనం తో బాటు ప్రపంచీకరణ ప్రాధాన్యత పెరిగింది .1991 తర్వాతా ఇతర దేశాలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి .కోకా కోలా సామ్రాజ్యం విస్తరించింది .జనతా ప్రభుత్వ హయాం లో దీన్ని నెట్టేశారు .’’కోక్ ను కిక్ చేయటం భారత దేశ స్వాతంత్రయానికి చిహ్నం ‘’అయిందప్పుడు .ఇప్పుడు మళ్ళీ వచ్చి తిష్ట వేసి ఇండియాను లొంగ దీసుకోంది.ఇండియా గ్లోబలై జేషన్ వలన లాభ పడింది ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ ,బిజినెస్ అవుట్ సోర్సింగ్ లకు అంతర్జాతీయ మార్కెట్ లభించింది .భారత్ కూడా ఉత్పత్తి లో ముందడుగు వేసి ‘’ఇంటర్నేషనల్ ప్లేయర్ ‘’ పాత్ర పోషిస్తోంది .ఇంతకీ ప్రపంచీకరణ పేదలకు ఏమి లాభం కలిగిస్తుంది అనే ఆలోచనా సాగింది .
సోవియట్ యూనియన్ పతనం తర్వాతా రష్యాలో ‘’బిగ్ బాంగ్ గ్లోబలైజేషన్ ‘’పెరిగి పోయింది .రోరింగ్ నైన్ టీస్ పుస్తకంలో జోసెఫ్ స్తిగ్లిజ్ ‘’ఆర్ధిక ప్రపంచీకరణ రాజకీయ ప్రపంచీకరణ ను తోసి రాజైంది ‘’అన్నాడు .’’ఆన్ గ్లోబలైజేషన్ ‘’పుస్తకం లో ఫైనాన్సేర్ ,దాత అయిన జార్జ్ సారోస్ ‘’మార్కెట్ ఫండ మెంటలిస్టూలకు అంటి గ్లోబలైజేషన్ కార్య కర్తలకు మధ్య ఒక తమాషా ఒడంబడిక కుదిరింది .ఇది శుభ పరిణామం .అంతర్జాతీయ సంస్థలు బలోపేతం గా ఉండాలి .సంస్కరణలకు అంగీకరించే వారితో జతకలవాలి .అంతర్జాతీయ పద్ధతులు బలపడాలికాని బలహీన పడరాదు ‘’అన్నాడు .ఇవాళ గ్రామాలలో కూడా మనిషి తో చేసే వ్యవసాయం కంటే యంత్రం తో చేసేదే ఎక్కువైంది .అమెరికా వ్యవ సాయ దారులు కూడా ప్రభుత్వం తమకు సబ్సిడీలిచ్చి ఉత్పత్తికి సహకరించాలని కోరుతున్నారు .పంజాబ్ లాంటి రాష్ట్రాలలో భూమి ఉప్పు బారి పోయి పంటలకు అనుకూలమవ్వటం లేదు .వీరు తాయ్ ల్యాండ్ మొదలైన దేశాలలో బియ్యం మొదలైనవి హాయిగా పండించుకొనే ఆలోచనలో ఉన్నారు .
ఇండియా కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్ లకు ఆహ్వానం పలుకుతోంది .అంబాని వాల్ మార్ట్ టేస్కో లాంటి సంస్స్తలను ఆహ్వానించి మార్కెట్ రంగం లో దూసుకు పోయే ఆలోచన తో ఉన్నాడు .భారతీయ చిల్లర దుకాణాలు దీని వల్ల కనుమరుగౌతాయి .ఉపాధి పోతుంది .చిల్లర వర్తకులు స్వయం సమృద్ధి గా యాజమాన్యం వహించి కస్టమర్ల్ ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు .వీరి పొట్ట కొట్టటం భావ్యం కాదు .వీరంతా భారత జాతీయతకు వెన్నెముకలే .గ్లోబలై జేషన్ వలన జాతీయత దెబ్బ తింటుంది అని కొందరి వాదన .పాశ్చాత్య సంస్థలు ఇక్కడ బల పడితే భౌతిక నాగరకత పెరిగి ఆధ్యాత్మికత దెబ్బ తింటుందనే భయమూ ఉంది .
ఆస్ట్రేలియా కు చెందిన ఆర్ధిక వేత్త ,రాజకీయ శాస్త్రజ్ఞుడు క్లైవ్ హామిల్టన్ తన ‘’గ్రోత్ ఫిటీష్ ‘’పుస్తకం లో ప్రపంచీకరణ అంటే ఆపకుండా వృద్ధిని వ్యాపించ చేయటం ,వినియోగ దారుల పెట్టుబడిని అభివృద్ధి పరచటం ‘’అని అన్నాడు .గ్లోబలైజేషన్ అనేది సాంస్కృతిక పరం గా ఒక ప్రత్యెక సిద్ధాంతం ,మాత్రమేకాక ఒక స్వేచ్చా శక్తి కూడా ‘అన్నాడు రాస్ ..మీడియా లో ప్రకటనల జోరు వ్యాపారాలను బాగా పెపెంచింది .ఇండియాలోని ఒకప్పుడు మద్రాస్ కే పరిమిత మైన శరవణ భవన్ హోటల్ ఇవాళ చాలా దేశాల్లో స్తానం సాధించింది .ఢిల్లీ లోని కన్నాట్ సర్కస్ లో ఉన్న ఆ హోటల్ ముందు జనం క్యూలు కట్టి నిలబడతారు .పక్కనే ఉన్న మాక్దోనాల్ద్ స్టాల్ వెల వెల బోతూ కని పిస్తుంది .పాశ్చాత్య దేశాలలో గ్లోబల్ సంస్కృతీ తప్పని సరి అంతకంటే వారేమీ చేయలేరు .నియంత్రించనూ లేరు .
ఇండియా లో కమ్మ్యూనిస్ట్ లు మాత్రమె ప్రపంచీకరణ ను అడ్డుకొంటున్నారు .దీని వలన నష్టమే కాని లాభం లేదు .వారి వాదం కాలం చెల్లిన వాదమే అయి పోయింది .వీరు అధికారాలలో ఉన్న దేశాలలో ప్రపంచీకరణకు పెద్ద పీట వేస్తున్నారు .ఊరికే బయటి షో వారి ప్రదర్శనలూ స్లోగాన్లూ .మన్ మోహన్ సింగ్ మాట్లాడుతూ కాపిటలిజం ఇండియా కున్న అవసరాలను తీర్చేదిగా ,క్రమ విధానం లో ఒక దాని తర్వాతా ఒకటిగా పని చేయాలన్నాడు .మోరల్ ఎకనామిక్స్ విషయం లో నిస్పృహ చెందరాదన్నాడు .ఇవాళ సోషలిస్ట్ ఏకనా మిస్ట్ లే ఒంటరి వారై పోయారని చెప్పాడు సింగ్ .మోరల్ ఎకనామిజం వస్తే మార్కెట్ ఎకనామిజం వెనకడుగేస్తుందని నమ్మకం గా చెప్పాడు .
ఇండియా ఎకానమిస్ట్ రాజీవ్ కుమార్ మోరల్ ఎకనామిక్స్ పై అధారిటి .నక్సల్ భావాలు బాగా జీర్నిచుకు పోయిన వాడు .ఆయన ఆక్స్ ఫర్డ్ విద్యార్ధి గా ఉన్నప్పుడు ‘’డి సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ ‘’పుస్తకం చదివి ఏంతో మారిపోయానని చెప్పాడు .పదార్ధానికి అవతల ఏదో ఒక గొప్ప విషయం ఉంది .అదొక స్పిరిట్ ఆత్మా శక్తి అన్నాడు. మొక్కలు మాట్లాడుతాయని ,తెలుసుకోన్నానన్నాడు .ఆయన మోరల్ ఎకనామిజం గురించిచెబుతూ మార్కెట్ ను గాడిద తో పోల్చాడు .గాడిద వెనక ,అదే మన లీడర్ అనుకోని నడుస్తుంటే లాగి తంతుంది .మనం దాని మీద కూర్చుని స్వారి చేస్తూ దానికి దారి చూపిస్తే అది మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుస్తుంది .కనుక మనం పెట్టుకొనే రూల్స్ ,విధి విధానాలు పకడ్బందీ గా ఉంటె ఆహార వస్తు సరఫరా సవ్యం గా జరిగి ,సేవ అత్యున్నత నైపుణ్యం తో నిర్వహించ వచ్చు .మనకేమి కావాలో స్పష్టం గా మనకు తెలిస్తే ఆ దిశలో కృషి చేస్తే కావలసింది సిద్ధిస్తుంది .’’అని చెప్పాడు .జపాన్ కొరియాలు మార్కెట్ ద్వారా ప్రజలకు మంచివిద్య నిప్పిస్తున్నాయి .ఇండియా కూడా దీన్ని వాళ్ళ లాగే సాధించాలి .మార్కెట్ సేవను ముఖ్యం గా విద్యా రంగానికి ఉపయోగిస్తే సమస్య పరిష్కారమవుతుంది .మార్కెట్ తక్కువ ధరకు పేదవారికి అందు బాటు ధరలకు నాణ్యమైన వస్తువులను అందించాలి .ఎగుమతి కోసం ఖరీదైన వస్తువుల్ని తయారు చేసి అమ్ముకో వచ్చు .స్థానికం గా మాత్రం చీప్ అండ్ బెస్ట్ వి అందుబాటులోకి తేవాలి .
రోరింగ్ నైన్టీస్ లో జోసెఫ్ స్తిగ్లిజ్ ‘’మా అమెరికా విధానం లో ఇతర దేశాలలో అసమానత్వం ,కొన్ని సందర్భాలలో స్థానిక విలువలను సంస్కృతిని త్రునీకరించటం జరుగు తోంది ఇది మంచిది కాదు . గ్లోబల్ సోషల్ జస్టిస్ అంటేప్రాపంచిక సాంఘిక న్యాయం మీద ద్రుష్టి పెట్టాలి .ప్రభుత్వం ,మార్కెట్ కలిసి సమ తూకం లో పాత్ర నిర్వ హించాలి .దానికోసమే అందరి దృస్టీ కేంద్రీకరించాలి ‘’అన్నాడు .దీన్ని బట్టి మనకు తేలేది ఏమిటి?పూర్తిగా గుడ్డిగా ప్రపంచీకరణ ను త్రుణీక రించరాదు. ప్రపంచీకరణ లోచాలా దూరం ముందుకు వెళ్లాం ఇక వెనక్కి మరలే ప్రశక్తి లేదు .ఇప్పుడు సమస్య దాన్ని ఎలా మన అవసరాలకు పని చేయించుకోవాలి అన్నదే .నోబెల్ ప్రైజ్ విన్నర్ అమర్త్య సేన్ కూడా గ్లోబలైజేషన్ ను ,ట్రేడ్ ఎకనామిక్స్ ను ఇక ఆపలేము అన్నాడు .మరి గ్లోబలైజేషన్ ను ఎలా పని చేయించాలి?దీనికి ఒకటే పరిష్కార మార్గం ఉంది .విధాన నిర్ణయాలు గ్లోబల్ స్థాయలో తీసుకొని జాతీయ స్థాయిలోఅమలు జరపాలి . సమతుల్యతను సాధించాలి .దీనివల్ల అంతర్జాతీయ సంస్థలను బలీయం చేయాలి .మార్కెట్ మనల్ని ముక్కుపట్టుకొని ముందుకు లాక్కెళ్ళ కుండా జాగ్రత్త పడాలి .ప్రభుత్వము ,మార్కెట్ల పాత్రకూడా సమతుల్యం గా బాలన్స్ గా ఉండాలి .అలాంటి మధ్యేమార్గ సమతుల్యత సాధించాలంటే ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలు ,చర్చలు అర్ధవంతం గా అభివృద్ధికి మార్గ దర్శకం గా జరుగుతూ ఉండాలి .మార్కేట్ ఫండ మెంటలిస్టూలను, గ్లోబలైజేషన్ వ్యరిరేకులను ఒక కంట కని పెడుతూ వారి స్లోగన్ల కు అరుపులు కేకలకు అదరక బెదరక సమతుల్యతః తో మధ్యే మార్గాన్ని అనుసరిస్తే లక్ష్యాన్ని సాధించగలం .
ఆధారం –ఇండియా అన్ ఎండింగ్ జర్నీ –రచయిత మార్క్ టుల్లి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు
—

