బ్రాహ్మణాల కదా కమా మీషు -7
శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు
శుక్ల యజుర్వేదానికి చెందిన శత పద బ్రాహ్మణం లో అనేకు ఉపాఖ్యానాలున్నా మచ్చుకి ఒకటి రెండు తెలుసు కొందాం .
సంజీవినీ విద్య
అధర్వ మహర్షి పుత్ర్తుడు ‘’దద్యాత్ ‘’ఈయన్నే దధ్యజాధ్వరుడు ‘’అనీ అంటారు .కొందరు అదర్వుడు అని పిలుస్తారు .ఈయన ప్రాపంచిక సుఖాలకు దూరమై ప్రశాంతం గా ఒక ఆశ్రమం లో ముని వ్రుత్తి తో జీవితాన్ని గడుపుతున్నాడు .తపస్సు, విద్యార్ధులకు అధ్యాపనం మాత్రమె ఆయన నిత్య కృత్యాలు .ఈ మహర్షి ధార్మిక జీవితాన్ని గమనించిన ఇంద్రుడు సంప్రీతుడై మహర్షి దగ్గరకు వచ్చి ,అతిధి పూజలందుకొని మహర్షి సచ్చీలత ,ధర్మ తత్పరత తనకు ఏంతో ఆనందాన్ని కల్గిన్చాయని వరం ఇవ్వాలని పిస్తోందని ఏదైనా వరం కోరుకోమని అన్నాడు .తనకు కాంతా కనకాలపై వ్యామోహం లేదు .కాని బతిమాలి ఇంద్రుడు వరం ఇస్తానంటే వద్దన రాదనుకొని బ్రహ్మ సాక్షాత్కారం పొందే ‘’మధు విద్య ‘’ను ఉపదేశించమని కోరాడు . ఇంద్రుడు సంకటం లో పడ్డాడు .అయినా మాట నిలబెట్టుకోవాలని విద్యను ఇంద్రుడు మహర్షికి ఉపదేశించాడు .ఆ మధువిద్య ను ఇంకెవరికైనా ఇస్తే మహర్షి శిరస్సును వజ్రాయుధం తో ఖండిన్చేస్తానని ఇంద్రుడు మహర్షిని హెచ్చరించి వెళ్లి పోయాడు .
కొంతకాలానికి ఇంద్రుడి చేత యజ్న భాగం లేకుండా బహిష్కరింప బడిన శ్వినీ దేవతలకీ విషయం తెలిసింది .పోయిన తమ ప్రాభవాన్ని మధు విద్య ద్వారా మళ్ళీ సాధించుకోవచ్చనే ఆశా కలిగి దధ్యజాచార్త్యుని చేరి మధు విద్యను ఉపదేశించమని కోరారు .ఇంద్రుని శాసనాన్ని మహర్షి వారికి తెలియ జేశాడు ..అప్పుడు అశ్వినులు ముందుగా మహర్షి తలను నరికి గుర్రపు తలను అతికిస్తామని ,విద్య ఉపదేశం చేసిన తర్వాత ఇంద్రుడు గుర్రం తలను ఖండిస్తాడని తర్వాత తాము మహర్షికి మామాలు తలను అంటించి సంజీవనీ విద్య తో బ్రతికిస్తామని తెలిపారు .సరిగ్గా అలానే జరిగింది .మహర్షి మధు విద్యను ఆశ్వనిలకు ఇస్తే ,ఇంద్రుడు వచ్చి మహర్షి శిరస్సు ఖండించినందుకు దుఃఖ పడ్డాడు మహర్షి ఇంద్రుడిని ఓదారుస్తాడు .కనుక విద్యలను అత్యంత గోప్యం గా కాపాడుకోవాలని ఈ ఉపాఖ్యానం తెలియ జేస్తోంది .అలాగే పాత్రల నెరిగి విద్యాదానం చేయాలనే సూచనా ఉంది .
ఊర్వశీ పురూరవులు
ఇళుడుఅనే మహా రాజు పార్వతీ దేవి శాపానికి గురై ఆరు నెలలు స్త్రీగా ఉండాల్సి వచ్చి ఇళాదేవి అయాడు .ఈమె మీద బుధుడి ద్రుష్టి పడి వారిద్దరి సంగమం తో పురూరవుడు జన్మించాడు .పురూరవుడు తలిదండ్రులను మించిన ప్రజ్ఞా శాలి .ఒక రోజు దేవ సభలో చక్ర వర్తి ఊర్వశిని చూసి మోహించాడు .ఆమెకూ అతనిపై ఆకర్షణ కలిగింది .మిత్రావరుణ శాపం వలన ఊర్వశి మానవ కాంత గా ఉండాల్సిన సమయమూ వచ్చింది .ఊర్వశి తాను ఎప్పుడూ నేతినే ఆహారం గా స్వీకరిస్తానని ,తనవద్ద ఎప్పుడూ ఒక మేకల జంట ఉండాలని ,పడకకు అవతల ఎప్పుడూ పురూరవుడు నగ్నం గా కని పించరాదని మూడు షరతులను పెట్టి,పురూరవ చక్ర వర్తి పట్టపు రాణిగా అతనితోకలిసి భూలోకానికి ఊర్వశి వచ్చింది .వారిద్దరి దాంపత్యం చాలా ఏళ్ళు ఆదర్శ వంతం గా గడచి పోయింది .గంధర్వుల మాయో పాయం వలన చివరి రెండు షరతులు భగ్నం అయ్యాయి. వెంటనే ఊర్వశి తానూ చెప్పిన మాటకు కట్టు బడి స్వర్గ లోకం చేరింది .విరహ వేదనతో జ్వలిస్తున్న పురూరవుడు నిర్మధనం ద్వారా అగ్ని సృష్టించి గార్హపత్యం ,ఆహవ నీయం ,దక్షిణాగ్ని స్థలాలలో త్రేతాగ్నులను అర్చించి స్వర్గానికి చేరి ఊర్వశి పొందు సౌఖ్యం పొందాడు .ఈ కధలో పురూరవుని నిష్కళంక ప్రేమ తెలుస్తుంది విధిని ఎవరూ తప్పించలేరని అర్ధమౌతుంది .వ్రుత్రాసురో పాఖ్యానం కూడా ఈ బ్రాహ్మణం లోనిదే .
జైమిని బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు
మేడిచెట్టు పుట్టుక
సామ వేదానికి చెందినా జైమిని బ్రాహ్మణం లో అసంఖ్యాక ఉపాఖ్యానాలున్నాయి .అందులో మేడి చెట్టు పుట్టుక కద తెలుసు కొందాం .మేడికి ‘’ఉదుంబర ‘’అని పేరు .ఇది చాలా సారవంతమైన వ్రుక్షం .ప్రజాపతి అన్నం సారాన్ని అంతటినీ ఒక చోట చేర్చి ప్రజలకు పంచటం ప్రారంభించాడు .అప్పుడు కొన్ని చుక్కలు నేల మీద పడి మేడి చెట్టు పుట్టిందట .అందుకే మేడి పండు మంచి పుష్టి నిచ్చేఆహారం అని ఆయుర్వేదం చెబుతోంది .
ప్రజా పతి ప్రజా సృష్టి చేయటం ,అగ్ని ని ముఖం నుండి సృష్టించటం ,.ప్రజా పతి ముఖం నుండి అగ్ని భయంకర జ్వాలలతో బయటకు వచ్చి ప్రజాపతి శిరస్సుకు హాని కలగటం ,దేవతలు ఈ అగ్నిని బృహస్పతి ద్వారా గ్రహించటం కూడా వివరింప బడింది .
తాండ్య బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు గురించి తరువాత తెలుసు కొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు

