.G.D.P.-2(చివరి భాగం )
పెద్దల మాట పేద చెవిన పెడితే జరిగే అనర్ధమేమితో తెలుసా?2050నాటికి ఇండియాలో కార్లు అమెరికాలో కంటే ఎక్కువై పోతాయి .రద్దీ పెరిగి పోతుంది .అమెరికాలో చదరపు కిలో మీటర్ కు 32మంది ఉంటె ఇండియా లో 840అవుతారు .కారు పార్కింగ్ సంగతి దేవుడిదకెరుక కారు నడపటానికే స్థలం చాలదు .కార్లసంఖ్యతో శక్తి వనరుల వాడకం పెరిగి అడుగంటి పోయే ప్రమాదం ఉంది .ఇండియా చైనాలు చమురు విపరీతం గా వాడటం వల్లనే అంతర్జాతీయం గా చంరు ధరలకు రెక్క లోచ్చాయి .అమెరికా లాంటి అభి వృద్ధి చెందిన దేశాలు కూడా తమ విధానాలను మార్చుకోవాలి .ధనిక దేశాలు ఇండియా ఆయిల్ పై చేసే ఖర్చును చూస్తూ ఊరుకోలేవు . భరించి రక్షించే అభివృద్ధి అంటే ఇప్పటి అవసరాలకు తగినట్లుగా ,భవిష్యత్తుకు తరాల వారి కోరికలను కూడా తీర్చేది .ఇప్పటి జి డి పి అభివృద్ధి ప్రక్రుతి మీద ఒత్తిడి ఎక్కువ కలిపిస్తుంది .మన కోరికలను అవసరాలను మరొక్క సారి నిర్వచించుకొని ముందుకు సాగక పోతే ఆగామి తరాలకు చేటు తెచ్చే వాళ్ళం అవుతాము .
అలాగే వస్తువుల మీద మోజు కూడా ఇబ్బందే కలిగిస్తుంది .అన్నీ కొనాలనే కోరిక ,మనకే ఉండాలనే భావం తో కన్సూమరిజం అభివృద్ధి ఇంజెన్ కు శక్తి సమకూరుస్తున్దనుకోవటం పిచ్చి ఆలోచన .అలాగే స్వంత ఇల్లు ఆలోచన పెరిగిన కొద్దీ బ్యాంకులు ముందుకొచ్చి రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి .బ్రిటిష్ మేనేజ్ మెంట్ నిష్ణాతుడు చార్లెస్ హండి రాసిన ‘’ది హంగరీ స్పిరిట్ ‘’పుస్తకం లో ఇలా ప్రతిదీ కొని పారేస్తుంటే వందేళ్ళలో పదహారు రెట్లు వస్తువుల్ని కొని ఏం చేసుకోవాలో తెలీక ,పర్యావరణానికి భంగం కలిగించి దోషులమవుతామని చెప్పాడు .వినియోగం ఎక్కువై కొనుబడి పెరుగుతూంటే దౌర్జన్యాలు దొమ్మీలు ఎక్కువైనట్లు బ్రిటన్ చరిత్ర చెబుతోంది .ఇలా అయినకాడికి కొనటం ఆత్మ గౌరవం అని భావించటం వెర్రి ఆలోచనే .ఆశ ఎంతటి పనైనా చేయిస్తుంది .దురాశ దుఖానికి దారి .కోరిక వస్తువులను అనుభవించి పొందే ఆనందాన్ని సంతృప్తి చెందించదు .అగ్నికి ఆజ్యం పోస్తే చేల రేగినట్లు చేల రేగుతుంది అని గీతా చార్య తో బాటు మనువు కూడా ఉవాచ .సంపద ,కీర్తి ,ఇంద్రియ సుఖం లలో చివరిది పశ్చాత్తాపం తో పరిహరమౌతున్దికాని మొదటి రెండిటిని ఎప్పటికీ సంతృప్తి పరచలేము అని పదిహేడవ హతాబ్ది ఫిలాసఫర్ స్పినోజా చెప్పాడు .
క్రైస్తవం కూడా కోరిక ను తిరస్కరించింది .మధ్యయుగ మతాధికారులు దీన్ని అమలు చేయటానికి ఏంతో ఒత్తిడికి గురైనారు .జుడాదయిజం లో కూడా దురాశకు తావు లేదు .సంపద ,అధీనం లోని వస్తువులు అన్నీ భగవంతుని కృపగా భావించి ఒక సంస్థ ద్వారా వినియోగం లోకి తేవాలని జుడాయిజం కోరింది . కంజూ మరిజం మనస్తత్వం పెరిగితే భోపాల్ గాస్ దుర్ఘటనలెన్నో చోటు చేసుకొంటాయి . ఆవిష వాయువులోని కాంపోజిషన్ ఏమిటో యూనియన్ కార్బైడ్ చెప్పక పోవటం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం పోగొట్టుకోన్నాం .మనిషికి ,ప్రకృతికి మధ్య అనుబంధం ఎక్కువైతేనే భోపాల్ సంఘటనలు లాంటివి తగ్గించ గలం .దీర్ఘకాల జీవితం, ఆరోగ్యం అనేవి సాధించగలం ఐర్లాండ్ లో ఆర్ధికాభి వృద్ధి వేగం గా జరిగింది .జి డి పి కొలత సరైనదికాదని ఆ దేశపు ఆర్ధిక వేత్త ఫాదర్ సియాన్ హేర్లీ అన్నాడు .ఇంట్లో పిల్లాడిని పెంచే ఖర్చు జి డిపి లో భాగం కాదు .కాని ఒక తల్లి పనికి వెళ్లి తేనే జి డిపి పెరుగుతుంది .పిల్ల పెంపకానికి రెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఎక్కడైనా కేర్ లో పెడితే .కనుక ఇప్పుడు ఆమెకోచ్చే జీతం ఈ ఖర్చు జి డి పిలో భాగమవుతుందని ఫాదర్ చెప్పాడు .
నేషనల్ అకౌంటింగ్ ను వ్యాప్తి లోకి తెచ్చిన సైమన్ కుజ్నెట్స్ ‘’సంక్షేమానికి జిడిపి కొలమానం పనికి రాదన్నాడు .1934లో కుజ్నెట్స్ అమెరికా కాంగ్రెస్ ను జాతీయ ఆదాయం తో అమెరికా సంక్షేమాన్ని ముడి పెట్ట వద్దు అని హెచ్చరించాడు .అమెరికా కాంగ్రెస్ కాని,ఏ రాష్ట్ర ప్రభుత్వం కాని ఆయన మాటలను పట్టించుకో లేదు .1962లో నేషనల్ అక్కౌంటింగ్ ను పునరాలోచించమని హితవు చెప్పాడు .అభి వృద్ధిలో క్వాలిటి కి క్వాంటిటికీ మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనించాలన్నాడు . దీర్ఘ కాల, స్వల్ప కాల ప్రయోజనాలను గమనించాలన్నాడు .అధిక వృద్ధి దేని కోసం? ఎందుకోసం? అని ప్రశ్నించుకొని విధానాలు ఎర్పరచుకోవాలన్నది ఆయన ఉద్దేశ్యం .
రాజీవ్ కుమార్ చెప్పినట్లు వృద్ధి అవసరమే కాని అదొక్కటే చాలదు .ఇలా వృద్ధి చేసుకొంటూనే పోవాలా ?ఎంతకాలం ?అనీ ఆలోచించాలి .సైన్సు ,టెక్నాలజీ అభివ్రుద్ధినివ్వటం నిజమే .టెక్నాలజీ లో ప్రతి ముందడుగు వెనక ఎత్తు పల్లాలున్నాయని గ్రహించాలి .న్యూక్లియర్ ఎనర్జీ ఎన్నోఅద్భుతాలను సాధించి ఇచ్చింది కాని న్యూక్లియర్ వేస్ట్ఒక పెద్ద సమస్య అయి దెయ్యం లా భయ పెడుతోంది .న్యూక్లియర్ ఆయుధాలు రాక్షణకే అయితే మంచిదే అవి టెర్రరిస్టుల, సంఘ వ్యతిరేక శక్తుల చేతిలోకి వస్తే యెంత ప్రమాదమో కూడా ఆలోచించాలి .టెక్నాలజీ ని సృస్తిస్తున్నాం కాని దాన్ని సమ తూకం లో ఉపయోగించలేక పోతున్నాం .ఇవాళ కారు మనమీద సవారీ చేస్తోంది .అదొక వ్యసనమైంది .అలాగే కమ్మ్యూనికేషన్ టెక్నాలజీ లో దూసుకు పోతూ ఏంతో ప్రగతి సాధిస్తున్నాం .సెల్ సోల్లుకే ఎక్కువ పయోగాపడటం దారుణం .కన్స్యూమరిజం ను విద్యా వైద్య , సాంఘికా కావసరాల సేవలో నియంత్రించి ఉపయోగించాలి .కిందికి కారటం ప్రారంభిస్తే అంతా ఖాళీయే .
గాంధి మహాత్ముడు చెప్పినట్లు మనం భారతీయులం మాత్రమె కాము ప్రపంచ పౌరులం అని మర్చి పోరాదు. ప్రపంచ అవగాహన తో అడుగులు వెయ్యాలి .మన్మోహన్ సింగ్ కన్జూమరిజం అక్కర్లేదు గాంధి గారి నిష్ట ఉంటె చాలన్నాడు .సాధారణ జీవితం గడిపితే సమస్యలే ఉండవన్నాడు .దీనికి మహాత్ముడే ఆదర్శం అన్నాడు .భారతీయులు పాశ్చాత్యం వైపు ద్రుష్టి పెట్టి ఇండియాలోని మనుష్యులను మర్చిపోతున్నారు .ఆర్దికాన్ని నమ్మవద్దని దానివలన నైతికత దెబ్బ తింటుందని గాంధీ ఉవాచ .ఇండియా గాంధీ మాటలను వల్లే వేస్తుంది కాని ఆచరించక పోవటమే అన్ని అనర్దాలకు మూలం .త్యాగం అంటే సంపద ,భార్యా పిల్లలు వద్దు అని కాదువాటితో అనుబంధం తగ్గించుకోమని అని గాంధి అన్నాడు .కాని దీన్ని పట్టించుకొన్న వారు తక్కువే .పాశ్చాత్య రాజకీయ వేత్తలు జీవిత ధర్మం లోనే స్వేచ్చ ఉందంటారు .భౌతిక సంపద మాత్రమే బాధల్ని పోగొట్టదు .వేస్త్రెన్ సైన్స్ ,ఎకనామిక్స్ బాధ లను పట్టించుకోవు .బిజినెస్ మోడల్స్ ఖరీదు గురింఛి ,లాభాలు ,షేర్ ల గురించే ఆలోచిస్తాయి .కనుక జి డి,పి. బలుపు అవ్వాలే కాని వాపుగా మార రాదనీ గ్రహించాలి .
ఆధారం –మార్క్ టుల్లి రాసిన ‘’ఇండియాస్ అన్ ఎండింగ్ జర్నీ ‘
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-14-ఉయ్యూరు

