రమ్యమైన అక్షర భారతి
శ్రీ చలపాక ప్రకాష్ సంపాదకత్వం లో మే –జులై రమ్య భారతి సంచిక ఉత్తరాంధ్ర మాండలిక రచయిత శ్రీ గంటేడ గౌరు నాయుడు ముఖ చిత్రం తో ,లోపల ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన చిన్నమాటలు చిన్న వాక్యాలతో చక్కగా వివరం గా ఆయన మాటల్లోనే వివరించి స్పూర్తి కలిగించారు .ఆయన అనుభవాలు ఆయనకు ప్రేరణ నిచ్చిన అప్పల నాయుడు ,వేసిన తోలి అడుగులు , ఎదిగిన విధానం ఆకర్షిస్తుంది . ప్రసిద్ధ నటుడు ,రచయిత ’’జెన్నీ ‘’(పోలాప్రగడ జనార్దన రావు )కద’’తోడూ –నీడ’’ఆరవ జాతీయ స్థాయి చిన్నకదల పోటీల్లో ‘’ప్రత్యెక సోమేపల్లి సాహితీ పురస్కారం ‘’పొందింది .ఆ కదను ఫన్నీ గా జెన్నీ రాస్తాడనుకొంటే కన్నీళ్లు, మానసిక ఆనందం ,’’ప్రేమించే గుణం ఉంటె ఆస్తి లేక పోయినా ఆరోగ్యం లేక పోయినా హాయిగా బతక వచ్చు’’అనే సత్యాన్ని ఆవిష్కరించి జెన్నీ కదా కధనానికి జోహార్ అన బుద్దేస్తుంది .’’యాభై ఏళ్ళ వాన ‘లో తడిసి ముద్ద అయిన కొప్పర్తి గురించి సజ్జా వెంకటేశ్వర్లు రాసిన విధానం బాగుంది .కవి ఆకాశాన్ని నల్లని గొడుగు గ విప్పెదేవరు ,వికీర్ణం చేసి చినుకుల్లా రాల్చేదేవరు ,అని ప్రశ్నించి ,వాన ఎప్పుడు కురిసినా నిండా ప్రేమ కురిసి నట్లే ఉందన్నారు .చీకటిని జయించటం మానవ నాగరకతా లక్షణం అని మూఢ నమ్మకాలను దూరం చేయమన్నారు .’’బుష్ ను వ్యతి రే కించ గలను కాని సద్దాం ను సమర్ధిం చ లేనన్నారు ‘తన భార్య గుణ సౌందర్యం ,కుటుంబ జీవనం అనురాగాంకి గుర్తుగా కొప్పర్తి కవిత ఆమె శ్రమ సౌందర్యానికి అద్దం పట్టింది .తటి వర్తి నాగేశ్వరి ‘’దాడి ‘’కదా ,పుస్తక సూక్ష్మ సమీక్ష నానీల వంటి కవితలు ,కొత్త ఆవిష్కరణ పుస్తక వివరం ,పాఠకుల చర్చా రమ్య భారతికి అదనపు ఆకర్షణలు .ప్రకాష్ అవిశ్రాంత అక్షరార్చనకు రమ్య భారతి సజీవ సాక్షాత్కారం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 29-6-14-ఉయ్యూరు

