పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -2
దీపావళికి ‘’ఉప్పూ సూరేకారాలతో కలిపి ఉప్పు పొట్లాలు కట్టి –రాత్రంతా విష్ణు చక్రాల్లా ‘’తిప్పారు .శ్రీరామనవమికి ఎదోఅరుగుమీద ‘’గొనె బరకాలు కట్టి –చిట్టీ పొట్టీ నాటకాలు వేసి –అట్టకిరీటాలకు, కత్తులకీ మెరుపుల ముచ్చి రేకులు అతికించి ‘’మురిసేవారు వీర్రాజు గారు .’’పండగంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకొనే వేడుక కాదు .పది మంది కలిసి చేసే వేడుక ‘’అని చక్కని అర్ధం చెప్పారు .శివరాత్రి ఉత్సవాల్లో పౌరాణిక జానపద సాంఘిక నాటకాలాడటం చూశారు .తోలుబొమ్మలాట మొదటి సారి చూసి కేతిగాడు –బంగారక్క కడుపుబ్బా నవ్వించటం తో మురిసిపోయారు .’’గొనె పట్టాలు చంకనేసుకెళ్ళి ముందు వరుసలలో పరుచుకొని –చివరికంటా మేలుకొని చూశారు .
బంధువులతో ఉప్పాడ సముద్రం చూసి ‘’మా ఊరి గోదారినే తన చట్రాల్లో బిగిన్చుకోలేని కళ్ళు –ఇంత విశాల సముద్రాన్ని ని౦పు కోటానికి –దృశ్య దృశ్యాలుగా పలు ఫ్రేముల్లోకి కత్తి రించుకొన్నారు ‘’.అసలే ఇల్లు ఇరుకు అందులో పూర్వకాలపు భోషాణం సగం స్థలాన్ని ఆక్రమించేసింది .ఇక హాలె అందరికి శరణ్యం .వానా కాలం శీతాకాలం అందులోనే అందరూ ‘’నత్త గుల్లలు ‘అయ్యేవారట .పెదనాన్న గౌరవం ఆస్తితో బాటు ‘’అనులో మాను పాతమైంది ‘’అంటారు .ఉమ్మడికుటుంబం .ఇల్లు ఒక్కటే ‘’కాని కుంపట్లు వేరు ‘’పెదనాన్న గదిలో ఉన్న రవివర్మ ప్రింటులు సీనరీ పటాలు ,’’బట్టల్లేని ఆడామే పాల రాతి విగ్రహం ‘’పాతకాలపు అందమైన పాత్ర సామాను ఉండేదట .పెదనాన్న పెంచుకొనే నెమలిని చూసి వీర్రాజు గారిమనసు నాట్యమే చేసేది .దాన్ని పిల్లి కరిచి తినేస్తే ‘’మనాది ‘’తో మూడు రోజులు బడికి ఎగగోట్టారు .పెదనాన్న గదిలో బొమ్మలే ‘’మనసుకు దారేయ్యక పొతే –ఇప్పటి ఈ నాబొమ్మలకొలువు ఇంట్లో వెలసేదే కాదు ‘’అని ఆస్పూర్తికి కృతజ్ఞతలు ఘటించారు .
బుల్లి వీర్రాజు గారి నెత్తిన చేయి పెడితే అదొక గొప్ప శుభ సూచకమని అందరూ అభిమానం గా దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా హత్తుకోనేవారట . బల్లి పడిన దోష నివారణ చేసుకొనే వారట .కంచి బంగారు, వెండి బల్ల్లులను తన చిన్నారి చేతులతో తాకించిన ఫైలితమే ఇది అంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును గుర్తుకు చేసుకొని ఆరోజు ‘’ప్రతి చెట్టూ –త్రివర్ణ పతాకల ను పూసింది –ప్రతికొమ్మా –రంగుల తోరణాలను కాసింది ‘’అని భావ గర్భంగా చెప్పారు .కొత్త బట్టలు కట్టుకొని ,చొక్కాలకు జెండా బిళ్ళల్ని తగిలించుకొని ‘’కాగితం జెండాల్ని వెదురు బద్దల మీద ఎగరేసుకొంటూ బడికి వెళ్ళారు ‘’.
‘’ ఎదిగిన కొద్దీ ఎదురు దెబ్బలు తగిలి –అనుభవం పండిన కొద్దీ వాస్తవం తెలిసి వచ్చి –హైస్కూలు రోజుల్నాటికే –కళ్ళ ముందు –మేడిపండు కనిపించి వెక్కిరించింది ‘’అని జీవితం లోని బోలుతనాన్ని చెప్పారు .
క్రమంగా బొమ్మలపై ఆసక్తి ‘’రేఖలతో బాటు –రంగుల్నీ రంగరించటం మొదలు పెట్టాయి వేళ్ళు ‘’.పిల్లల రాతపత్రిక ‘’బాల సేన ‘’లో బొమ్మల్ని గీసి గీసి –నా వేళ్ళు నడకలు నేర్చుకోన్నాయి ‘’అని తన ప్రోగ్రెస్ తెలిపారు .’’కుల వ్రుత్తి చేనేతకు –మినియేచర్ రూపం –నవారు నేత నేర్చుకుంటున్నప్పుడు –నారక్తం లో ఆ పని తనం ఇంకా ఇగిరిపోక –జీవించి ప్రవహిస్తూ ఉందేమో మరి ‘’అంటూ ‘’వెళ్ళు చక చకా సాగి లాంగ్ బెల్ కొట్టేసరికి –అడుగున్నర నవారు తయారైంది ‘’అని స్కూల్ లో క్రాఫ్ట్ పీరియడ్ లో నవారు నేత నేసిన అనుభవాన్ని కవిత్వీకరించారు .
‘’నా బడి పుస్తకాలు తప్ప –రామాయణ భారతాలైనా లేని ఇంట –జోలపాటలే తప్ప –ఊర్మిళాదేవి నిద్రాలూ ,రుక్మణీ కళ్యాణాలు –వినిపించే అవకాశం లేని చోట మేగజైన్లేకాదు –దినపత్రికలూ కలికానికి కూడా కనీ పించని ఇంట ‘’పుట్టిన తనకు పుస్తక పఠనం పిచ్చి ఎందుకు ఎలా పట్టిందో !అని ఆశ్చర్యపోయారు వీర్రాజు గారు .అర్ధణాకి అణాకి పిల్లల పుస్తకాలు కొని మిత్రులంతా వంతులవారీగా చదివే వారట .ఇక్కడే ‘’నా భవిష్యత్ సాహిత్య జీవితానికి –తోలి బీజంఇలా పడి ఉండచ్చు ‘’అని ఊహించారు .
వేసవి తీవ్రతను చెబుతూ ‘’చెమటలో తడిసి ముద్దయిన పగటిని –గోదారి గట్టున రైలింగ్స్ మీద ఆర బెట్టుకోవ టానికి –పనిగట్టుకు వచ్చే –వేలాది ఊరి జనానికి –గోదావరి –విసన కర్ర అయ్యేది ‘అద్భుత భావ చిత్రమిది .’’చల్లని చూపుల్తో స్వాగతం పలికే స్నేహ మూర్తి అయింది ‘’అని గోదావరిమాతకు క్రుతజ్ఞాతాంజలి పట్టారు కవిత్వం తో .సూర్యాస్తమయం ఆయనకు ఎలా ఉందొ తెలుసా?’’కొవ్వూరు కొబ్బరి తోటల గూట్లోకి –చల్లగా సూర్యుడు దూరి తలుపేసుకోన్నట్లు ‘’ఉంది వేసవి గోదావరి వర్షాకాల గోదారి ఎలా కన్పించాయి వీర్రాజుగారికి ?’’వేసవిలో మన్ను తిన్న జెర్రి గొడ్డైన గోదావరి –వర్షాకాలం వచ్చేసరికి –కోడె తాచై బుసలుకోట్టేది ‘’వరద గోదారి భీభత్సాన్ని వర్ణిస్తూ ‘’గట్లని ఢీకొని –మట్టిని కరగించుకొని –యెగిరి పడుతూ –సుళ్ళు తిరుగుతూ –కూకటి వేళ్ళతో కూల్చిన చెట్లని –జుత్తట్టుకొని ఈడ్చుకు పోతోంది .‘మనుషుల శవాల్ని సైతం –సాగర శ్మశానానికి మోసుకుపోయే’’శవ వాహికగా కనిపించింది .చూడ వచ్చిన జనం తో తానూ ‘’గట్టున ప్రతిష్టించిన రాతి బొమ్మ ‘’అయ్యేవాడట .’’తాటేత్తు నీటిలో మునిగి-కలప దుంగలు నీటి వరవడికి –ఇళ్ళమీద విరుచుకు పడ్డప్పుడు –‘’విలాసాలు ‘’లేని దుంగలు వీదిజనాల పాలై –నాన్న వ్యాపారం గంగ పాలైంది ‘’అని మొత్తు కొన్నారు .పెదమామయ్య తన తండ్రికి డబ్బిచ్చి కిరాణా కొట్టు పెట్టిస్తే ఆరు నెలల్లో మూతపడింది .గోదావరి వరద మహాత్యం తో కుటుంబం ఆర్ధికం గా చితికి పోయింది .వెన్ను విరిగిపోయింది
బాల్యం లో ధవళేశ్వరం ఆనకట్ట చూసి భావ కవిత్వం మనసులో పొంగి ‘’నీలం రంగు పులుముకొన్న నీలాకాశం –పై నించి కిందికి దిగి వచ్చి –ఆకాశమూ భూమీ ఒకటై –కళ్ళ ముందంతా –ఒకే రంగు పరచుకొని –కళ్ళల్లో ప్రతిఫలించిన నీలం రంగుకి –మా కళ్ళే నీలాలై మెరిసిపోయాయి ‘’మరో కృష్ణ శాస్త్రి మనకిక్కడ దర్శన మిస్తాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-15- ఉయ్యూరు

