ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -7
4- సామ్య వాద మహర్షి –కారల్ మార్క్స్
జీవితం లో ఎక్కువ భాగం లైబ్రరీలలో గడిపి ,యదార్ధ వాదాన్ని రొమాంటిక్ వాదానికి వ్యతిరేకం గా వ్యాప్తి చేసి ,తన జీవితాన్ని మాత్రం ‘’నిత్య పెళ్లి కొడుకు ‘’గా అనుభవించిన వాడు కారల్ మార్క్స్ .హృదయం లేని వాడు ,అవతల వాడి గోడు పట్టించుకోని రకం .తన భావాలను వ్యతిరేకించే వారిని సహించని మనస్తత్వం .మధ్య తరగతి మహా రచయిత,ఆలోచనా పరుడు .ఏనాడూ కనీసం కూలి పనికూడా చేయని కార్మిక నాయకుడు .మొదటి ప్రపంచ కార్మిక సంఘానికి అధ్యక్షుడు .పుట్టింది జర్మనీలో అయినా ఎక్కువకాలం జీవితాన్ని గడిపింది ఇంగ్లాండ్ లో .ఇన్ని వైరుధ్యాలున్న మనిషి మార్క్స్ .ఆయన ప్రభావం రష్యాలోను దూర ప్రాచ్య దేశాలలో ను ఎక్కువ .అయన రాసినఉద్గ్రంధం ఆధునిక చరిత్రను మలుపు తిప్పింది .కాని దాన్ని ఎవరూ చదివిన దాఖలాలు లేవు .
అసలుపేరు హీన్రిచ్ కారల్ మార్క్స్ .యూదు కుటుంబం .లా చదివినా వారికి కోర్టులో ప్రవేశం లేకపోవటం తో క్రైస్తవం తీసుకొన్నారు .పెద్దకుటుంబం లో రెండవ వాడు .కొడుకు కవి గా వెలగాలని కోరుకొన్నాడు .బాన్ యూనివర్సిటీలో చేరి గురువు గార్గ్ విత్లెం హెగెల్ ప్రేరణతో దియాలజీ తీసుకొన్నాడు .మతం కంటే న్యాయ శాస్త్రం మీద మక్కువెక్కువ .తీసుకొన్న చాయిస్, గురూజీ సెలెక్షన్ రెండూ నచ్చలేదని పించింది ..యుక్త వయసు రాక ముందే చిన్న నాటి స్నేహితురాలు అందకత్తె తనకంటే నాలుగేళ్ళ పెద్ద అమ్మాయి ని వలచి ,ఆమె ప్రేమకూ లైన్ క్లియర్ తెచ్చుకొన్నాడు .ఆమె ఎందరో ప్రేమికుల్ని ఇతనికోసం వదిలేసింది .కాని ఆమె తండ్రికి ఇష్టం లేక పోవటం తో ఆరేళ్ళు ఆగి ఆయనా పచ్చజెండా ఊపిన తర్వాత పెళ్లి చేసుకోన్నారిద్దరూ .
దేనిలోనూ సరిగా ఇమడలేక తండ్రి మనసు బాధపెట్టాడు కారల్ .బెర్లిన్ పంపితే వెళ్లి ధర్మ శాస్త్రం (జూరిస్పుడేన్స్)చదివి ప్రాక్టిస్ చేయటం ఇష్టం లేక చరిత్ర ,తత్వ శాస్త్రం లో పడ్డాడు .క్రమంగా హెగెల్ చెప్పిన హేతువాదం పై ఆకర్షణ పెంచుకొన్నాడు .హెగెల్ భావ పరిధిని దాటి ముందుకు దూసుకు పోయాడు ‘’డయలేక్టిక్ మెటీరియలిజం’’ వ్యాప్తికి కారకుడయ్యాడు .జీవితం లో చావు దాక్కుని ఉంది అన్నది హెగెల్ భావన .దీన్ని ఆర్ధిక ,తాత్విక తత్వ శాస్త్రాలకు అనుసంధించాడు .భావాలను వాటిప్రభావాలను మరువలేదు .ఉన్నది ఉన్నట్లుగా నే ఉండాలి అన్న దానిపై పునరాలోచన చేశాడు .యేవో అస్పస్తాభావాలున్నాయికాని అవి స్పష్టం కావటం లేదు .కాని నోట్సుపుస్తకాలన్నీ తన ప్రియురాలిపై కవిత్వం తో మాత్రం నింపి పారేశాడు .టీచర్ అవాలనే కోరిక ఉండేది .తత్వ శాస్త్రం లో డాక్టరేట్ పొందాడు. కాని ఇతని విపరీత భావనలకు ఏ యూని వర్సిటీ అతనికి ఉద్యోగం ఇచ్చే సాహసం చేయలేదు .తత్వ శాస్త్రం కూడు గుడ్డ సమకూర్చదని గ్రహించి జర్నలిజం లో వేలుపెట్టాడు .రాడికల్ జర్నల్స్ ఆతను రాసినవి బాగానే ప్రచురించి వ్యాప్తి చెందించాయి .కాని తన సిద్ధాంతాలకు ఒక రూపం ఇవ్వాలనే తలంపుతో పారిస్ వెళ్ళాడు .
పారిస్ లో తనకన్నా రెండేళ్ళు చిన్న వాడైన ఫ్రెడరిక్ ఎంగెల్స్కు శిష్యుడైనాడు .కలిసిపని చేశాడు చివరికి మార్క్స్ మరణానంతర సాహిత్యాన్నిఏంగిల్స్ ప్రచురించాడుకూడా .ఎంగెల్స్ సంపన్నుడు .మార్క్స్ ఆలోచనా పరంపరకు మద్దతు నిచ్చి ప్రోత్సహించాడు .సంపన్నులు పేదకార్మికుల పోట్టకోడుతున్నారని ఇద్దరూ ఆలోచించారు.దీనికి భరత వాక్యంపలకాలని భావించారు .కారల్ మార్క్స్ ఇక్కడే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచన ప్రారంభించాడు .అందులో ప్రసిద్ధ వాక్యం ‘’All history is the history of class struggle ‘’.పారిస్ నగర జీవితం రాజకీయం గా అస్పష్టం గా ఇబ్బందిగా ఉంది .ఇక్కడే మొదటికూతురు పుట్టింది .పరిస్తితులు అనుకూలించక బ్రసెల్స్ వెళ్లి ఎంగెల్స్ నుకలిశాడు .జర్మన్ వర్కింగ్ మెన్ అసోసియేషన్ ఏర్పడటం లోఎంగేల్ కు భాగ స్వామి అయ్యాడు .మొదటిసారిగా కమ్యూనిస్ట్ మాని ఫెస్టో ‘’అంతర్జాతీయ సామ్యవాదం ‘’విడుదల చేశాడు .ఫ్రెంచ్ భాషలో ఫ్రెంచ్ ఆర్ధిక వేత్త ప్రౌధాన్ రాసిన ‘’ఫిలాసఫీ ఆఫ్ పావర్టి ‘’గ్రంధానికి జవాబుగా మార్క్స్ ఫ్రెంచ్ భాషలోనే ‘’ది పావర్టి ఆఫ్ ఫిలాసఫీ ‘’రాశాడు .
ఫ్రాన్స్ లో విప్లవం 1848లో అణగారిపోయింది .కాని రాజకీయ పరిస్తితులు దారుణమైనాయి.సోషలిస్టు భావ వ్యాప్తి చేసినవారిపై నిఘా పెరగటం తో అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ మాత్రమె శరణ్యం అయ్యాయి .బలీయ మైన ప్రష్యన్ సైన్యం అడుగడుగునా జల్లెడ పడుతోంది .మార్క్స్ తో సహా సోషలిస్టూలను అరెస్ట్ చేసి జైల్లో వేశారు .దేశ ద్రోహం నేరం మోపారు .కాని రుజువుకాక వదిలేసినా ప్రష్యా అధికారం లో ఉన్న భూమి నుండి బహిష్కరించారు .మళ్ళీ పారిసే గతి అయింది . ఏదో ఒక చిన్న ప్రాంతం లో ఉండటమో లేక ఫ్రాన్స్ వదిలే పెట్టి వెళ్ళటమో తేల్చుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది .గత్యంతరం లేక కుటుంబం తో ఇంగ్లాండ్ వెళ్లి జీవితాంతం అక్కడే ఉండిపోయాడు .
మార్క్స్ గొప్ప వక్త కాదు .నెమ్మదిగా పొడి పొడి వాక్యాలతో మాట్లాడేవాడు .అవతలివాడు చెప్పింది వినే తత్త్వం లేదు తను చెప్పిందే చివరిమాట అనే ధోరణిలో ప్రసంగాలు చేసేవాడు .’’దాస్ కాపిటల్ ‘’గ్రంధం రాసి 1867లో ప్రచురిస్తే మార్క్స్ మరణానంతరం ఎంగెల్స్ 1885లో మిగిలిన భాగాలను ప్రచురించాడు .మార్క్స్ ఒక’’ రాజకీ య ఆర్ధిక వేత్త’’.ఇంకోరకం గా ప్రాఫెట్ –దార్శనికుడు .తత్వ వేత్త మాత్రం కాదు. భార్య మరణం తో కుంగి పోయాడు . .పార్శ్వ నేప్పితో బాధ పడ్డాడు .లండన్ లో అరవై అయిదవ ఏట 14-3-1883 నమార్క్స్ మరణించాడు .జన్మ దినం 5-5-1818.
సత్యాన్వేషకుడు అని అనుయాయులు ఆరాధిస్తే ‘’అబద్దాల పిత ‘’ అని నిందించారు గిట్టనివాళ్ళు .కార్మికుల పాలిటి దేవుడు- మెసయ్యా అని కొందరంటే క్రైస్తవ విరోధి అన్నారు మరికొందరు .మార్క్సిస్టులు ‘’దాస్ కాపిటల్ ‘’ను’’ ఆధునిక టేస్తామేంట్ ‘’అన్నారు .అయిదవ భాగం బాగా రాయలేదన్నారు .అందులో పద్ధతీ పాడూ ఏమీ లేదన్నారు .కొందరు దాన్ని ‘’కార్మికుల బైబిల్ ‘అని ఆకాశానికి ఎత్తేశారు .భవిష్యత్తును బాగా ఊహించాడు అని అంటే ఆయన చెప్పింది ఇంగ్లాండ్ లోనే జరగలేదు అని చెవులు కొరుక్కున్నారు .రష్యాలోని బోల్షేవిక్కులు దాస్ కాపిటల్ ను తిరస్కరించారు .ఏమైనా ఆయన భావాలకు ‘’మార్క్సిజం ‘’అనే ముద్ర పడి సజీవం గా నే ఉన్నాయి .మానవ చరిత్రలో అత్యధిక ప్రభావ శీలి కారల్ మార్క్స్ అన్నది నిర్వివాదం .ప్రపంచ వ్యాప్త కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు మార్క్స్ ప్రభావానికి లోని పని చేశాయి ,చేస్తున్నాయి .
Communism is for us not a state of affairs which is to be established, an ideal to which reality will have to adjust itself. We call communism the real movement which abolishes the present state of things. The conditions of this movement result from the premises now in existence.”
అని కమ్యూనిజం గురించి మార్క్స్ వివరించాడు .మార్క్స్ ను ప్రభావితం చేసిన వారిలో హేగేల్స్ ,ఆడం స్మిత్ ,రూసో .మార్క్స్ ప్రభావితం చేయని రంగమే లేదు .మానవ ప్రకృతిని బాగా అర్ధం చేసుకొన్న వాడు మార్క్స్ .
మరో మహానుభావుడితో మళ్ళీ కలుద్దాం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-15-ఉయ్యూరు

