గీర్వాణ కవుల కవితా గీర్వాణం
నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ
—
ఇలా మొదలైంది–“సిద్ధయోగిపుంగవులు” మొదలుకొని , “మహిళామాణిక్యాలు” ,
“పుర్వాంగ్లకవుల ముచ్చట్లు”, “దర్శనీయ దైవక్షేత్రాలు” ఒకొక్కటీ ఎప్పటి కప్పుడు
శ్రీ దుర్గాప్రసాద్ గారు నాకు అంకితమివ్వాలనుకో వటo , నేను వాటి
స్వీకర్తులుగా సరియైనవారిని సూచించటం , వారు దానికి అంగీకరించటం
జరిగిపోయాయి . ఇప్పుడు “గీర్వాణకవుల కవితా గీర్వాణం” అంతర్జాలంలో
ధారావాహికంగా ప్రచురించిన దానిని నా ప్రమేయం లేకుండానే నాకు అంకిత
మివ్వటo నన్ను అమితాశ్చర్యాలకు గురిచేసింది . ఇంతటి పవిత్రమైన అమృతంలాoటి
రచనకు స్వీకర్త గా నాకున్న అర్హత శ్రీ దుర్గాప్రసాద్ గారికి నాయందున్న
అభిమానం మాత్రమే నని నా నిశ్చితాభిప్రాయం .
తదుపరి , ఈవిషయాన్ని గురించి మేనకోడలు జ్యోతి తో సంభాషిస్తున్న సందర్భంలో
, జ్యోతి ఉత్సాహానికి నా ప్రోత్సాహం తోడై ఈ మహోన్నత విలువైన రచనను
పుస్తకరూపంగా ప్రచురిoచాలని, అందుకు జ్యోతి తoడ్రి గా రైన , మా పెద్దబావగారు
డా : రాచకొండ నరసింహశర్మ గారి ఆశీస్సులతో ,అన్న సుధాకర్ , తమ్ముడు రమేష్,
చెల్లెలు సంధ్య(అంతా అమెరికా వాసులు ) లను కలుపుకొని సమిష్టిగా
ప్రాయోజకత్వం (స్పాన్సర్షిప్) వహించాలనుకొవటo , ఈసూచనకు శ్రీ
దుర్గాప్రసాద్ గారు పచ్చజెండా ఊపటం ఒకదానివెంట ఒకటి దైవనిర్ణ యాలు గా
జరిగిపోయాయి. వీరందరికీ నా ధన్యవాదాలు .
–మైనేని గోపాలకృష్ణ- హన్ట్స్ హిల్ -అలబామా -యు ఎస్ ఏ –

