ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -8

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -8

5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్

పన్నెండు పేరు లేని కవితలతో వచ్చిన చిన్ని పుస్తకం ఒక సంస్కృతి బాటను  పూర్తిగా మార్చేసి  నూతన సంస్కృతి దారిపట్టించింది . ఈ చిన్ని పుస్తకం జులై 4 న  అమెరికా పరాయి పాలన నుండి విముక్తి చెంది స్వాతంత్ర్య డిక్లరేషన్  విడుదల చేసిన రోజునే  వెలువడటం యాద్రుచ్చికమే అయినా  ,అదే ప్రభావాన్ని సాహిత్యం లోనూ చూపటం విశేషం .అదే ప్రఖ్యాత అమెరికా కవి వాల్ట్ విట్మన్ రాసిన ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’కవితా సంపుటి .పాత సంప్రదాయాన్ని వదిలేసి కవిత్వం కొత్త సంప్రదాయాన్ని ఎన్నుకొని దారిచూపి ఆధునిక కవిత్వానికి మార్గ దర్శి అయ్యాడు విట్మన్ .అమెరికన్ దేశీయ కవిత్వం  విట్మన్ తో నే ప్రారంభమైంది .అప్పటిదాకా బ్రిటిష్ కవిత్వ ధోరణే అమెరికా కవిత్వం లో ప్రతిధ్వనించింది దీనితో పూర్తిగా స్వంత కాళ్ళపై అమెరికన్ కవిత్వం నిలబడింది. తన జాతి జీవనాన్ని జీవితాన్ని  ప్రపంచానికి చాటింది అందులోని జవసత్వాలను తెలియ జేసింది .అమెరికన్ ప్రజలే అందులో ప్రతిఫలించారు .వాళ్ళ వేషం భాషా అలవాట్లు వృత్తులు అన్నిటికీ ఆ కవిత్వం అద్దం పట్టింది . ఘన విజయాన్ని సాధించి అమెరికా జాతీయ కవిగా గుర్తింపు పొందాడు వాల్ట్ విట్మన్ .

తొమ్మిదిమంది సంతానం లో విట్మన్ రెండవ వాడు .తల్లి అంటే వీరాభిమానం ,ఆరాధన ఉన్నవాడు .క్వేకర్ ల మధ్య అమెరికా లాంగ్ ఐలాండ్ లో పెరిగాడు .సుఖమయ  బాల్యం గడపలేదు.తల్లి జబ్బు మనిషి .చదువులేనిది .తండ్రి ఇళ్ళు కట్టేవాడు   పెద్దగా అందులో బాగు పడిందేమీ లేదు . ఒక చెల్లెలు నరాల వ్యాధి తో బాధ పడేది .ఒక తమ్ముడు ప్రయోజకుడై ఇంజినీర్ అయ్యాడు .పదకొండేళ్ళకే స్కూలు చదువు అయిపొయింది .ఇక బతకటానికి ఏ పని దొరికితే అది చేసేవాడు .పన్నెండే ళ్ళకు ఒక ప్రింటర్ దగ్గర సహాయకుడి టైప్ చేయటం నేర్చాడు  .లాంగ్ ఐలాండ్ స్టార్ పత్రికలో ప్రెస్ లో కొద్దికాలం ఉన్నాడు .టీనేజి అంతా దొరికిన ప్రతి పనీ చేసి రేస్ట్లేస్ అయి ఊర్లు తిరగటం తో నే సరిపోయింది .తిరుగుడు వంట బట్టి జీవితమంతా అదే ధోరణిలో నడిచింది .’’బతకటం ‘’మాత్రమె తానూ చేస్తున్నానని చెప్పేవాడు .తర్వాత న్యు యార్క్ లో ప్రెస్ కంపోసిటర్ అయ్యాడు .ఇక జర్నలిజం మొహం మొత్తి టీచర్ కావలను కొన్నాడు . ఏడు పల్లెటూళ్ళ స్కూళ్ళలో చదువు చెప్పి యువ విట్మన్ ఆ బులపాటమూ తీర్చుకొన్నాడు .పిల్లల ఇంటిలోనే ఉండి భోజనం వసతి పొందేవాడు .

బుద్ధి మళ్ళీ మరి ఎడిటర్ అవ్వాలనిపించింది .ఒక చిన్న  ప్రెస్ కొని తన స్వగ్రామం హంటింగ్ టన్లో ‘’లాంగ్ ఐలాండర్ ‘’అనే స్వంత పత్రిక ప్రారంభించి నడిపాడు .కూర్పు ,ప్రింటింగ్ అన్నీ తానె చేసి పేపర్ రిలీజ్ చేసేవాడు .బోర్ కొట్టి చేతులుకాలి ఉద్యోగం కోసం వెతికాడు .ఆరేళ్ళు ఆరు వేర్వేరు పత్రికలలో పని చేసి బతకటానికి సంపాదించాడు .చివరికి ఎడిటర్ అవ్వాలన్న కోరిక  ఇరవై ఏడవ ఏట తీరి ‘’బ్రూక్లిన్ ఈగిల్ ‘’పత్రికా సంపాదకుడయ్యాడు .అప్పటికే ఏదో  కవిత్వమో వచనమో రాస్తూ ఉండేవాడు .అవి ప్రచురణ భాగ్యమూ పొందాయికూడా .వాటిశీర్షికలూ  తమాషాగా నే పెట్టాడు అందులోకొన్ని –‘’వన్  వికేడ్ ఇమ్పల్స్ ‘’,’’డెత్ ఇన్ ది స్కూల్ రూమ్ ‘’,రివెంజ్ అండ్ రిక్విటల్’’,ఏ టేల్ ఆఫ్ ఏ మర్దరార్ ఎస్కేపేడ్ ‘’వగైరా .చెత్త కవిత్వాలే ఇవి సంప్రదాయ రైమ్ లోనే  రాశాడు.సెంటిమెంట్ వండాడు .టెక్నిక్ అంటూ ఏమీలేదు .

ముప్ఫై ఏళ్ళు వచ్చాక తండ్రి బిల్డింగ్ పనుల్లో సాయం  చేస్తూ తోచిందేదో రాస్తూ కాలక్షేపం చేశాడు .నాటక శాలలకు ,ఒపెరాలకు వెళ్ళేవాడు .సెంటిమెంట్ థ్రిల్లర్స్ కొన్ని రాశాడు .ఈ వయసులో ‘’సోగ్గాడు’’గా వేషంలో ఉండేవాడు ఫ్రాక్ కోట్ వేసి ,ఎత్తైన టోపీ పెట్టి చేతిలో చిన్న బెత్తం పట్టుకొని చొక్కా గుండీ దగ్గర పువ్వు పెట్టుకొనే వాడు .తమ్ముడు జెఫ్ ను వెంటేసుకొని అమెరికా దక్షిణ ప్రాంతం ఆల్ఘేరీస్ ,ఒహాయో మిసిసిపి తిరిగొచ్చాడు .న్యు ఆర్లియాన్స్ లోను ,క్రేసేంట్ పత్రికలోను ఏదో మొక్కుబడి జర్నలిస్ట్ ఉద్యాగాలే చేశాడు .ఏదీ కడుపు నిండా తిండి పెట్టినవికావు .ఆ అసంతృప్తి పీడిస్తోంది .మళ్ళీ బ్రూక్లిన్ చేరి ‘’ఫ్రీమాన్ ‘’వార పత్రిక ఎడిటర్ అయ్యాడు విట్మన్ ..హోమో సెక్సువల్ అయి అనామక పిల్లలతో సెక్స్ జరిపాడని అభియోగం ఎదుర్కొన్నాడు .’’డార్క్ లేడీ ‘’ తో గడిపాడని పుకార్లు రేగాయి కాని ఏవీ నిజం కాదని తేలిందని విట్మన్ చరిత్రకారుడు రాశాడు .

ముదురు ముప్ఫై వ ఏట కవిత్వపు శైలి విట్మన్ కు అలవడింది .అది అప్పటి కాలం లో కొత్తదికాకపోయినా విట్మన్ కు మాత్రం కొత్తదే .తానూ ఇదివరకు రాసిన వాటికి పూర్తిగా భిన్నం గా ఇప్పుడు రాస్తున్నాడు .విషయం లో స్వేచ్చ ఉంది లయలో మార్పు ఉంది అంత్యాను నుప్రాస కు మంగళం పాడాడు  .చెవులకు కింగ్ జేమ్స్ రాసిన బైబిల్ పాదాలలాగా వినిపించాయి .హీబ్రూ కవిత్వపు పోకడలు కన్పించాయి .ఛందో నియమ౦  ఏమీ పాటి౦చనే లేదు .35వ ఏట ఈ ప్రయోగాలన్నీ ఒక రూపు దాల్చి వాల్ట్ విట్మన్ కవిత్వం గా ముద్ర వేసుకొని ఉప్పొంగి ప్రవహించింది .అప్పటిదాకా  ‘’వాల్టర్ విట్మన్ జూనియర్ ‘’  గా ఉన్న పేరునూ  ‘’వాల్ట్ విట్మన్ ‘’గా మార్చుకొని కవిత్వం తో పాటు పేరులోనూ నూతన వరవడి సృష్టించాడు .ఈ పేరే నిలిచిపోయింది చిర స్థాయిగా .తండ్రిలో కొంత అంశాన్ని తీసుకొని మిగిలినదంతా నూతన విధానాన్ని ఆవిష్కరింప జేసుకొన్నాడు .దీనితోనే ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’ను బ్రూక్లిన్ ప్రింట్ షాప్ లో ప్రింట్ చేసి దేశం మీదికి వదిలాడు .అమెరికా ఆత్మ తో మమేకం అయి ప్రజాస్వామ్య పచ్చిక మొలిపించాడు. ప్రజాస్వామ్య మూలికల దివ్యౌషధం  (డెమోక్రాటిక్ హీర్బెజ్) జనాలకు అందజేశాడు .ఈ పుస్తకం ముఖ చిత్రం లోనూ విట్మన్ కవి బాహ్య స్వరూపం పూర్తిగా మారిపోయింది .ఫ్రాక్ కోట్ ,చేతిలో బెత్తం మాయమైనాయి .ముతక కార్మికుల బట్టలేసుకొన్నాడు .ట్రౌజర్కు బెల్ట్ పెట్టుకొన్నాడు .హిప్ బూట్లు ధరించాడు .కేర్లెస్ పోజ్ తో కోటు లేకుండా మెడ దగ్గర చొక్కా ఓపెన్ అయి ,లోపలి రంగు అండర్ షర్ట్ కనిపిస్తూ  బెఫర్వాగా దర్శన మిచ్చాడు .దీనితో’’ వాల్ట్ విట్మన్ కల్చర్ ‘’ప్రారంభమైంది ఆరాధనీయుడయ్యాడు . ఐడల్ అనిపించుకొన్నాడు.రోల్ మోడల్ గా మారాడు .కవిత్వం తోబాటు వేష భాషలన్నిటి లోనూ సమూలమైన మార్పు మార్పు రావాలని చెప్పటమే కాదు తానూ ఆచరించి చూపి మార్గ దర్శి అయ్యాడు విట్మన్ .అదీ’’విట్మనీయం ‘’.

తాను  కార్మిక సోదరుడిని చేలికాడిని స్నేహితుడిని అని చెప్పుకొన్నాడు .అక్షరజ్ఞానం లేని వారి సహచరుడిని అని ప్రకటించుకొన్నాడు .వారి ఆత్మీయుడిని అన్నాడు .తనను తానూ పరిచయం చేసుకొంటూ ‘’of pure American breed ,large and lusty –age thirty six years –never once using medicine-never dressed in black ,always dressed freshly ,and cleanly in strong clothes –neck open ,shirt collar flat ,and broad ,red beard with white hair ike hay beloved and looked toward especially by young men and the illiterate –one who does not associate with literary people –never on platforms amid the crowds of clergy men or aldermen or professors ,rather down ni the bay with fishers in the fishing smacks or riding on Broadway omnibus ,side by side with the driver or with a band of loungers over the open grounds of the country .Has the easy fascination of what is homely and accustomed –as of something you knew before and waiting for –there you have Walt Whitman ,the begetter of a new offspring in literature ‘’అని తెలియ జేసుకొన్నాడు .ఇది చదివి జనాల ‘’మైండ్ బ్లాక్ ‘’అయింది .తమవాడు ,తాము కావాలనుకొన్నవాడు ,తమకోసం వచ్చాడని మురిసిపోయారు .అదీ విట్మన్ సాధించిన నూతనత్వం .ఇప్పటిదాకా కార్మిక కర్షక వర్గాన్ని పట్టించుకొన్న అమెరికన్ కవే లేడు .ఇప్పుడు వారి బాధలను గాధుగా చెప్పెఆత్మీయుడు  లభించాడన్న పరమానందాన్ని ప్రజలు పొందారు ఆరాధించారు .తమ కోసమే కలంపట్టిన వీరుడని కీర్తించారు .ఇదొక చారిత్రాత్మక విప్లవమే అమెరికన్ సాహిత్యం లో ముఖ్యం గా కవిత్వం లో .

If you are American, then Walt Whitman is your imaginative father and mother, even if, like myself, you have never composed a line of verse. You can nominate a fair number of literary works as candidates for the secular Scripture of the United States. They might include Melville’s Moby-DickTwain’sAdventures of Huckleberry Finn, and Emerson’s two series of Essays and The Conduct of Life. None of those, not even Emerson’s, are as central as the first edition of Leaves of Grass.

అని ప్రముఖ అమెరికన్ విమర్శకుడు హోరాల్ద్ బ్లూమ్ విట్మన్ ను ఆవిష్కరించి సాహిత్యం లో ఆయన స్థానం ఏమిటో తెలియ జేశాడు .

Walt Whitman - George Collins Cox.jpg

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-2-15 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.