పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5
యువజనోత్సవాలలో గీసిన చిత్రాలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాటిని చూసి రాజమండ్రి సబ్ కలెక్టర్ ‘’పెంకులు విరిగిపడి ,గోడలు పెచ్చులూడి –రోగిష్టి రూపు తేరిన ‘’వీర్రాజుగారింటికి వస్తే ఆశ్చర్యం తో నమస్కారమైనా చేశాడో లేదో తెలీని అయోమయం లోపడ్డారు .చిత్రాలు చూసి రెండుకోనుక్కొని వెళ్ళారు .హైదరాబద్ వస్తే కలవమని చెప్పారు .’’చిత్రకళలోనూ ,చదువు లోను విద్యార్ధి దశ దాటని నన్ను –వెతుక్కుంటూ వచ్చిన ఆ కళాభిమాని కి –కప్పూ సాసర్లు మంచివి లేవని –కాఫీ నీళ్ళయినా ఇవ్వనందుకు ‘’సిగ్గుపడ్డారు .కాని ‘’విరిగిన కప్పులనైనా ఆత్మీయం గా అందుకొనే ఆయన హృదయ సౌందర్యాన్ని –గుర్తించని గుడ్డి వాడి నయినందుకు ‘’–మరింత సిగ్గు తో కుంచించుకు పోయారు .
పోటీల ఇన్ చార్జి లెక్చరర్ రెబ్బా ప్రగడ సూర్య నారాయణ మూర్తిగారు ‘’వాటర్ బరీస్ కాంపౌండ్ టానిక్ ‘’ఇంటికొచ్చి మరీ చేతిలో పెడితే ఆయన అభిమానాన్ని వెర్రిగా భావించి ఫ్రెండ్స్ తో కలిసి పకపకా నవ్వుకున్నారు.కాని వారం తిరక్కుండా అనారోగ్యం పాలై పొడి దగ్గుతో బాధ పదడి డాక్టర్ కు చూపిస్తే అర్భకుడైన ఆయనకు బలమైన ఆహారం అవసరం అని చెప్పితే కాని లెక్చరర్ గారి ఔదార్యం తెలిసిరాలేదు .తెలిసి ఎన్నో సార్లు కనిపించినపుడు చేతులెత్తి నమ్స్కరించారో తెలీదు .రోగం సంగతి కప్పిపెట్టి ఇంట్లో ఎవరికి చెప్పలేదు .రాసిన ప్రతి దానికీ డబ్బు రాలేదుకాని గీసిన ప్రతిదీ డబ్బు సంపాదించి ఇచ్చింది .ఆంద్ర ప్రభ వీక్లీ లో’’ పిల్లల బొమ్మల జాతకకధ’’లకు ముప్ఫై వారాలపాటు చిత్రాలు గీసి రెగ్యులర్ ఆదాయం పొందారు .మూడోపుస్తకం అమ్ముడై ,నవల ఒక ప్రసిద్ధ పత్రికలో సీరియల్ గా వచ్చింది .
కాకినాడ కరెంటాఫీసులో ఉద్యోగం వచ్చినా చేరకుండా హైదరాబద్ లో కృష్ణా పత్రిక లో ఉద్యోగానికే మొగ్గుచూపారు .పర్మనెంట్ ఉద్యోగం కాకపోయినా అభిరుచి అటు లాక్కెళ్ళింది .గోదావరి తీరాన్ని వదిలి ‘’మూసీ కే కినారే’’ కి చేరారు .’’నెలకు ఒకటిన్నర పచ్చ నోట్ల జీతం ‘’.’’అర్ధ రాత్రి దాటేవరకూ మేలుకొని –ఉదయం బారెడు పోద్దేక్కే దాక లేవక పోవటం –నవాబుల నగరానికి అలవాటు ‘’అని వచ్చిన రోజే గ్రహించారు .తోలి జీతం ఇంటికి పంపి తృప్తి చెందారు .కృష్ణా పత్రిక కాంట్రాక్ట్ కంట్రీబ్యూటర్ రావూరి భరద్వాజ .ఆయన రాస్తున్న సీరియల్ ‘’పరిస్తితుల వారసులు ‘’పత్రికలో వస్తోంది ‘’ఇప్పటికీ నాకు గుర్తుండిపోయిన మంచికద ‘’అని మెచ్చారు .’’మంజు శ్రీ గా లబ్ధ ప్రతిస్తుడైన అక్కిరాజు రమాకాంతరావు ‘’రిసేర్చ కుడు .‘’ నగ్నముని అయిన కేశవ రావు పుస్తక భా౦ డాగారుడు .రామడుగు రాదా కృష్ణ మూర్తీ మిత్రులయ్యారు
వీర్రాజు గారి పొడి దగ్గు క్షయ గా మారింది .’’’క్షయ పురుగులు ఊపిరి తిత్తుల్ని కావలించుకొని అల్లుకు పోయి,.మూడు చోట్ల కేవిటీలు (బొక్కలు)పెట్టాయి ‘’అని చెప్పుకొన్నారు .ఆదుకొని హాస్పిటల్ లో చేర్పించిన వాడు కళాభిమాని పంజాబీ సింగు గారు. ‘’నిజం గా పునర్జన్మ ప్రసాదించిన మహానుభావుడు ‘’అని సింగుకు వందనం చేశారుకవిత్వం లో .ఇంట్లో వారికి తెలీకుండా మేనేజ్ చేశారు .ఆస్పత్రి వాతావరణాన్ని వర్ణిస్తూ ‘’బంధువుల పరామర్శల పవన స్పర్శలు లేవు-ఆత్మీయుల సానుభూతి శీతల తుషారాలు లేవు—మిత్రుల స్నేహ కరచాలనలూ లేవు ‘’అని బాధపడ్డారు మరి ఉన్నదేమిటి ?’’నిశ్శబ్దాన్ని తూట్లు పొడిచే రోగుల మూల్గులు తప్ప ‘’—భయం చిలుము పట్టి వన్నె తరిగిన పీడాకార ముఖాలున్నతప్ప –కన్నీటి కెరటాల మీద తేలి పోయే రోగిష్టి శరీరాలు తప్ప –‘’అని ఆ భయంకర వాతావరణాన్ని తెలిపి ఇంకాస్త వివరంగా ‘’గుండె గుబురులో –గుబులు ముళ్ళ గాయానికి –చిరు నవ్వు లేపనాల చల్లని పూతల్లేని –సంతోష సరోవరం లో ఆహ్లాద వివరాల్లేని –కంటి రెప్పల వెనక సుందర స్వప్నాలు లేని –భయ పెట్టె కల్లోల సముద్రం లో –చిల్లు పడవ ప్రయాణం –ఇదీ ఇక్కడి జీవితం ‘’ ఈ విచిత్ర భయానక పరిస్తితులలో’’అందాలోలికే హాస్పిటల్ బిల్డింగ్ –‘’చిక్కటి చీకటి మధ్య తెల్లగా మెరిసిపోయే –సామూహిక సమాధి అవుతుంది ‘’అన్నారు .
ప్రక్రుతి ఎలాకనిపించింది ‘’చల్లగా కనిపించే మచ్చల చంద్రుడు –చీడ పట్టిన ఊపిరి తిత్తి అవుతాడు –నిద్ర పోయే ముందు కన్ను గీటి కవ్వించిన నక్షత్రాలు –మెరిసే గుడ్ల గూబల కళ్ళవుతాయి .’’అని చెప్పారు .రోగులెలా ఉంటారు ?’’ఒకరికొకరు మిత్రులై –ఒకరికొకరు ఆత్మీయులై –ఆప్తులై – యేకాంతాలను దాటుకొని తమ నుంచి తాము దూరం గా పారిపోతూ౦టారు ‘’అని క్షవ్యాదిగ్రస్తుల మనోభావాలను తెలిపారు .క్షయకు’’ స్త్రేప్టో మైసిన్ ‘సంజీవనిగా మందు వచ్చి నాలుగేళ్ళు అయినా ఇంకా జనాలలో భయం పోలేదన్నారు .’’ఒక్కన్నే-నే నోక్కన్నే-నాలో నేను చూసుకొంటూ –‘’గడిపానని చెప్పుకొన్నారు .పూర్తిగా వ్యాదినయమై ఇంటికి చేరారు ‘’తమ్ముళ్ళు చెల్లాయిల కళ్ళు పుచ్చపువ్వులయ్యాయి ‘’మిత్రులు కళ్ళతోనే చురకలేశారు .వీరాజీ మళ్ళీ జన జీవన స్రవంతిలో చేరిపోయారు .
‘’నిస్వార్ధ స్నేహానికి ,నిజమైన మైత్రికి –శిల్పించిన చిహ్నమై ‘’న మల్లెశుకు ‘’రంగుటద్దాలు ‘’అంకితమిచ్చి అభిమానాని ప్రకటించుకొన్నారు .వినుకొండ నాగరాజు నవల ‘’తాగు బోతు’’కు ‘’ముందుమాట రాయించి –లేని గౌరవం కల్పించటం ‘’అతని ఆత్మీయతకు చిహ్నం అని చెప్పుకొన్నారు .అరవై దశకం లోనే రెండు నవలలను పూర్తిగా ‘’చైతన్య స్రవంతి ‘’ శిల్పం లో చెక్కాడు నాగరాజు .’’ఎనిమిది నెలల శ్రమ ఫలితం గా ‘’మైనా ‘’నవల యెగిరి వచ్చింది .ఆ నవలను ఆంధ్రపత్రికకు పంపిస్తే ‘’పాఠకులకు శైలీ ,ఇతి వృత్తాలు అందుబాటులో లేవు ‘’ అని తిరస్కరించి పంపిన నవల మైనా అవార్డ్ విన్నర్ అయింది తర్వాత..నగరం లోని సాహితీ వేత్తలకు పరిచయం చేశాడు వీర్రాజుగార్ని శ్రీ వాత్సవ .’’కొత్త ఆలోచనలకు అవకాశం లేని –చాదస్తాల ముక్క వాసనల మధ్య –ఊపిరి సలపక ‘’కృష్ణా పత్రిక ‘’నుండి వైదొలగారు .పరిచయాలు స్నేహాలతో –సాహిత్య వాతావరణాన్ని నా చుట్టూ అల్లుకొని –నన్ను నేనే వెలిగించుకొంటూ –నాకు నేనే ప్రోత్సాహం ఇ చ్చుకొంటూ ‘’ మరోనవలకు శ్రీకారం చుట్టారు .
సమాచార శాఖలో ద్యోగం ఉందని చెప్పి బోయి భీమన్న ప్రభుతోద్యోగానికి ఇష్టపడని వీర్రాజుగారిని ఒప్పించి దరఖాస్తు చేయించారు .ఇంటర్వ్యు లో సెలక్ట్ అయి ‘’సహాయ అనువాదకుడు ‘’గా చేరారు .’’ఆంద్ర ప్రదేశ్ ‘’మాసపత్రికకు ఎడిటర్ వడ్లమూడి గోపాల క్రిష్నయ్య సంతకం కింద ఎప్పుడూ ‘’వాజ్మయ మహాధ్యక్ష ‘’అని చేర్చి రాయటం అలవాటున్నవాడు .తన నీడను చూసి తానె భయపడే వింత మనిషి .ఆయనకున్న బ్రాహ్మణ ద్వేషమే వీర్రాజు ను దగ్గరకు తీసిందట ‘’విజ్ఞానం తో వికసిం చాల్సిన బుద్ధి కుం చిం చుకు పోవటానికి హేతువు అక్కర్లేడుకదా “’అంటారు విశాల హృదయం తో .కుందుర్తి ఆంజనేయులు గోపాల చక్రవర్తి ‘’సమాచార శాఖకు కవితాలంకారులు ‘’అన్నారు .ఏడాది తర్వాత కవిత్వాన్ని మోసుకెల్లి కుందుర్తి కి చూపి దగ్గరయ్యారు ‘’ఇదేనోయ్ నేను కోరేదీ –నాకు కావాల్సిందీ ‘’అని మెప్పుకూడా లభించింది .ఆయన ‘’అభినందన చూపులతో ఆలింగనం చేసుకొంటే-ఆనంద బాష్ప దారనై కారిపోయాను నేను –దూదిపింజనై తేలిపోయాను ‘’ అని ఆ ఆత్మీయతకు కవితాత్మ చేర్చి పొంగిపోయారు .’’కవుల దారిలో చొరబాటు దారుడిని నేను ‘’కసురుకోకుండా మెచ్చుకున్నందుకు మురిసిపోయారు .కుందుర్తి పీఠికతో ‘’కొడిగట్టిన సూర్యుడు ‘’రాస్తే శ్రీపతి అచ్చేసి జనం ముందు నిలబెట్టాడు .

సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-2-15-ఉయ్యూరు

