పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం )

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం )

హైదరాబాద్ లో ‘’కదా సమ్మే ళనాలలో ‘’పాల్గొన్నారు .అజంతా ఎల్లోరాలు చూసి ఆ నేపధ్యం తో కద రాశారు .శ్రీ కృష్ణ దేవా రాయా౦ధ్ర భాషా నిలయం లో బుచ్చి బాబు అధ్యక్షత జరిగిన తోలి కధక సమ్మేళనం లో పాల్గొని బుచ్చిబాబు చేత ‘’ఇంత వరకు సాహిత్య వారసులు లేని నాకు –వారసుడై వచ్చి –నన్ను మురిపిస్తున్న వీరుడు ఈ వీర్రాజు –ముందు ముందు నన్ను మరిపించినా మరి పించగలడు’’అని సభా ముఖం గా వీర్రాజు గారికి కితాబిచ్చాడు .ఆ మాటల్లో ‘’బలమైన ఇతి వృత్తం  దొరికి –కొత్తగా చెప్పగల నేర్పుంటేనే రాయటానికి ప్రయత్నిం చాలనే ‘’హెచ్చరిక కనిపించింది .తన కధలన్నీ కలిపి’’ చేతి  కందేవి  ఓ పిడికెడు మాత్రమె ‘’అని అన్నారు .తురగా దంపతులు ,వాకాటి పోరంకిలు ,సింగరాజు ,నిఖిలేశ్వర్ వగైరా సాహితీ మిత్రులతో కాలక్షేపం బాగానే ఉండేది .తనను తానూ చైతన్య పరచుకొని –ఆధునిక చిత్రాలు వేశాకే –భాగ్య నగర చిత్రకారులు వీర్రాజు గారిని గుర్తించారు .వడ్లమాని మధుసూదన రావు ప్రతిభ గల చిత్రకారుడు .ఆయన్ను గురించి ఆర్ట్ మేగజైన్ ‘’కళా రత్న ‘’లో ప్రశంసా వ్యాసం రాశారు .ఆయన ఒక సంస్థకు ఆఫీస్ బేరర్ గా ఉండి ఆర్ట్ ఎక్సి బిషన్ లో పాల్గొనడం నచ్చక చిన్న చురక కూడా వేశారు వ్యాసం లో .దానికి ఆయనకు కోపం కూడా వచ్చింది .ఇద్దరికీ షస్టాస్టకం అయి అకాడెమీ మెట్లేక్కడం మానేశారు వీరాజీ .

పుస్తకాలకు ముఖ చిత్రాలేసి తృణమో ఫణమో రాబడిపొందారు .అదే తన ‘’కళా మార్గమైంది ‘’.’’సాహిత్యం పడుగై –చిత్రలేఖనం పేకై –కలనేతగా జీవితాన్ని  అల్లుకున్నాయి ‘’.’’జీవితాన్ని కళాత్మకం గా తీర్చి దిద్దుకొనే మిత్రుడు దివి శ్రీధర బాబు పరిచయం తో సంగీతం లోనూ వేళ్ళు పెట్టి అది రాని విద్యని రూఢి చేసుకొన్నారు .’’భారత్ కళా పరిషత్ ‘’లో సంయుక్త కార్య దర్శి పదవి కట్టబెడితే సమర్ధ వంతం గా పనిచేసి సభలు ప్రదర్శనలు నిర్వహించి ‘’కళ’’వార్షిక సంచికలను సుందరంగా తీర్చి చిత్రకళా రంగం లో గ్రంధాలు లేని లోటు తీర్చారు వీర్రాజుగారు .ఈ సంచికల సంపాదకుడు చలసాని ప్రసాద రావు ‘’మాటలకు అంటిన రాగాన్ని తుడిచి –కవిత్వాన్ని అద్దిన వాడు ‘’సామాన్యుల బాధల గూళ్ళల్లోకి కవిత్వాన్ని లాక్కొచ్చిన వాడు –వచన కవిత్వ జెండాను ఎత్తు గా ఎగరేసిన వాడు ‘’వచన కవిత్వానికి కేటలిస్టై వ్యాప్తిని వేగవంతం చేసినవాడు’’గా  కుందుర్తిని కీర్తించారు .

‘’కొడిగట్టిన సూర్యుడు ‘’కి ఫ్రీ వర్ష ఫ్రంట్ అవార్డ్ రావటం వీర్రాజు గారి ‘’సాహిత్య జీవితానికి తోలి బహుమతి ‘’.అడక్కుండానే ఒకటీ అరా  ఆకాశ వాణి ప్రోగ్రాములు వర్షించాయి .ఆ వాణి తనకు ‘’రాదారి కాదు ‘’అని తెలుసుకొన్నారు .’’సిగరెట్ పాకెట్ తెమ్మన్న ‘’అధికారి ఆధిపత్యాన్ని కాదని వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఆకాశ వాణి మెట్లు ఎక్కనే లేదు అభిమానధనుడైన వీర్రాజుగారు .ఆయన మీదేకాదు ‘’ఆకాశ వాణిమీద సైతం అసహ్యం తుళ్ళి పడి ఇప్పటికీ నన్ను –నా కాళ్ళు  ఆ మెట్లు ఎక్కనివ్వలేదు ‘’అని సగర్వం గా చెప్పుకొన్నారు .ఆంద్ర ప్రదేశ్ పత్రిక చిత్రాలకోసం  కుందుర్తి ,గోపాల చక్ర వర్తి తో బాటు కాకతీయ చిత్ర వైభవాలను కళ్ళారా చూసి ,యాదగిరి లో నరసింహ స్వామి గుడిప్రదక్షిణ కోసంసం అవిటికాలి చక్రవర్తికి బుజాలు ఆసరాగా తానకు  ఇష్టం లేకున్నా తిరిగారు .స్నేహితుడి ఊరికి వెళ్లి ‘’ఒక్క కరెంటు తీగైనా ఊరిని అల్లుకోకపోవటం ‘’చూసి ఆశ్చర్య పోయారు .

సాహితీ సాంస్కృతిక సంస్థ  వారి’’ యువ భారతి ‘’లో ‘’నా ముఖ చిత్రాను బంధం –నాకో చిక్కని సాధనమై –సాహితీ వేత్తలకు మా ఇంటికి రహదారి మార్గమైంది ‘’అని సంతోషం తో ఉప్పొంగారు .అది ‘’తెరిచిన ద్వారమే ‘’అయింది అందులో వందకు పైగా ముఖ చిత్రాలు వేసిన ఘనత రాజు గారిది .’’సాహితీ వేత్తలకు నేనొక చిత్రకారుడిని మాత్రమె –కవులకు కధకుడిని –కధలకు  కవిని ‘’అని ఆవేదన చెందారు .ఎవరికి వారు వీర్రాజుగారిని వారి రంగం లో చొరబాటు దారునిగానే భావించారు .అదీ ఆశ్చర్యం .ఒరిస్సా లో భువనేశ్వర్ వెళ్లి అక్కడి కళా సంస్కృతికి నీరాజనాలు అందించారు ‘’కలింగ రాజుల దిల్ప కళాభిమానానికి –శిధిల భువనేశ్వరం ఒక నిదర్శనం ‘’అన్నారు .’’లింగ రాజుదేవాలయం ‘’ఒక దేవాలయ గుచ్చం ‘’అని ముగ్ధులయ్యారు .అవన్నీ స్కెచ్ బుక్ నిండా నింపుకొని సంతోష పడ్డారు .వాటిని దర్శించటానికి రెండుకళ్ళు చాలవు అన్నారు .

యెర్ర భావాలు మనసులో పరచుకొని కొత్తగా రాసింది అంతా వామపక్షం గానే కనిపించింది .మెల్లగా కద వెనక బడి కవిత్వం ముందుకు సాగింది ‘’.మైనా నవలకు అకాడెమీ పురస్కారం వచ్చినా ఆ ప్రభావం పడలేదు. కదా ,నవలా  మళ్ళీ  బలాన్ని పుంజు కోలేదు ‘’అని నిజాయితీగా చెప్పారు .దిగంబర కవులలో ఆరుగురి లో అయిదుగురు  తన ఆత్మీయ మిత్రులే అయినా ‘’యెంత మాత్రం వారి చర్యల్ని సమర్ధిం చని వాడిని .’’అన్నారు ‘’రాజ్యం మీద చూపాల్సిన కోపాన్ని –సమాజం మీద చూపటం సరికాదు ‘’అని తన మనసులో మాట బయట పెట్టారు .’’విరసం తెలుగు సాహిత్యాన్ని –ఒక మలుపు తిప్పింది ‘’అని నమ్మారు .’’విరసీయున్ని ‘’కావటానికి ప్రయత్ని౦చ లేదన్నారు .

లేపాక్షి శిల్ప సౌందర్యాన్ని చూడటానికి వెడితే ‘’ఆరు బయట తాపీగా చతికిల బడి గత వైభవాన్ని నేమరేసుకొంటూ –ఇళ్ళ కప్పుల మీద నుంచే’’ మూపెత్తి’’స్వాగతం పలికాడు –నల్ల సేనాపు రాతి లేపాక్షి బసవయ్య ‘’.లేపాక్షి శిలా సంపదను కాపాడిన వాడు ‘’కల్లూరి సుబ్బారావు – అందుకాయనకు  తెలుగు  జాతి –రుణ పడి ఉండక తప్పదు ‘’అన్నారు .శ్రీధర బాబు జర్మనీ వెళ్లి అక్కడ వీర్రాజుగారి చిత్రాలను ‘’వన్ మాన్ షో  ‘’గా ఏర్పాటు చేయగా ‘’నా కళా జీవితానికి ఒక కలికితురాయి అయింది ‘’అని ఏంతో సంతృప్తి చెంది మిత్రునికి క్రుతజ్ఞాతాంజలి ఘటించారు .శ్రావణ  బెల్గోలా వగైరా దర్శించి రేఖల్లో చిత్రాలుగా మార్చుకొని లారీ ప్రయాణం లో ఆ ‘’చిత్ర సంపద ‘’క్రిష్ణార్పణ’’మై చేజారిపోయింది .గుర్తొచ్చినప్పుడల్లా అది ‘’మనసులో ముల్లై కలుక్కున –గుచ్చుకొని బాధిస్తూనే ఉంది ‘’అంటారు.

వీర్రాజు గారికి ‘’స్నేహం ఊపిరి –చైతన్య లహరి ‘’.’’కవితా జైత్ర యాత్రలో –రధం మీద రక్తం  సూర్యుడ్ని –జెండాగా పాతుకున్నకవి –కవిత్వాకాశం లో మధ్యందిన మార్తాండుడు ‘’కే శివారెడ్డి అని ఆయన తన సన్నిహిత మిత్రుడని చెప్పుకొన్నారు ‘’’స్వాతి మాస  పత్రికకి  -ఇంట్లోనే పురుడు పోసి –ఏడాదిపాటు సాకిన ‘సాహితీ చిత్రకళా మంత్రం సాని వీర్రాజుగారు  .’’నడిచే చదువుల చెట్టు-రోణంకి అప్పలస్వామి ‘’పట్ల గౌరవం తోబాటు మేన మామ కుటుంబం తో ఆయనకున్న సాన్నిహిత్యం మరీ దగ్గరకు చేర్చింది .ఉత్తరాయణం ప్రేమాయణం గా  మారి మేనమామ కూతురు ‘’ఉత్తరాల సుభద్రా దేవి ‘’తో వివాహం  అప్పలస్వామి గారి అధ్యక్షతన –వైదిక ఆచారాలకి –వేద మంత్రాలకీ  దూరం గా’’బంధు మిత్రుల చప్పట్లే –బాజా భజంత్రీలు బ్యాండ్ వాయిద్యాలుగా –సభా వివాహం గా ‘’జరిగింది .’’ఒకరికొకరు తోడుగా ఉండాలని –ఒకరి కొకరం నీడగా ఉండాలని –సమిష్టిగా నిర్ణయించుకొని –గట్టిగా చేతుల్ని పెనవేసుకొని –వ్యక్తీ నుంచి కుటుంబం లోకి –కుటుంబం నుంచి సమాజం లోకి –అడుగు తీసి అడుగు వేస్తూ –పరస్పరాభి రుచుల కల నేతగా –జీవితాన్ని నేయటానికి –శ్రీకారం చుట్టుకోన్నాం ‘’అని వీర్రాజు గారు వివాహ మహాత్మ్యాన్ని సింపుల్ గా వివరించి శుభం పలికారు .

శుభం భూయాత్

Inline image 1Inline image 2

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-2-15- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.