అక్షరం లోక రక్షకం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు –ఆహ్వానం
76 వ సమావేశం –నమూనా ఆహ్వాన పత్రిక
శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలను సరసభారతి 76వ సమావేశం గా ఉగాదికి(మార్చ్ 21) ఆరు రోజులముందు అంటే 15-3-15 ఆదివారం సాయంత్రం 3-30 గం కు ఏ .సి . లైబ్రరీలో నిర్వహిస్తోంది .సాహిత్యా భిమానులు ,కవులు పాల్గొని జయప్రదం చేయప్రార్ధన .ఇందులో పేర్కొన బడిన వారు కాకుండా మరో ఇద్దరు ప్రముఖుల తో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం .వారి అంగీకారం తెలియ గానే పూర్తీ వివరాలతో ఆహ్వాన పత్రిక ను ఫిబ్రవరి 23 వ తేదీ తర్వాత అంద జేస్తాము .దాన్ని బట్టి వేదిక కూడా మారవచ్చు .
పాల్గొను అతిధులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి మాజీ సభ్యులు
శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు –ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్
శ్రీ చలసాని రాజేంద్ర ప్రసాద్ –ఆంద్ర జ్యోతి ఇన్ చార్జ్ –విజయవాడ
డా. శ్రీ జి వి పూర్ణ చంద్-కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి
శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి పత్రిక సంపాదకులు
కార్యక్రమం
1-కవి సమ్మేళనం –జిల్లాలోని ప్రముఖ కవులందరు పాల్గొంటారు –విషయం –‘’నవ్యాంధ్ర ప్రదేశ్ -మరియు హుద్ హు ద్ తుఫాను’’ .-కవిత 10 పంక్తులకు మించ రాదని మనవి .
2-పుస్తకాల ఆవిష్కరణ
1- శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచన –‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’(2000 ఏళ్ళ సంస్కృత సాహిత్యం లో 145 మంది ప్రముఖ కవుల సాహిత్య పరామర్శ )-
అంకితం –శ్రీ మైనేని గోపాల కృష్ణ(అమెరికా) గారికి –గ్రంధ ప్రాయోజకులు (స్పాన్సర్స్)- శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి మేనకోడలు -డా జ్యోతి ,ఆమె సోదర , సోదరీమణులు (అమెరికా).
‘’పేరడీలు ‘’ రచన – ప్రముఖ హాస్య రచయిత-శ్రీ తాడిమేటి సత్యనారాయణ –అంకితం –స్వర్గీయ బాపు –రమణ లకు – ప్రచురణ –సరసభారతి
3-స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కార ప్రదానం
పురస్కార గ్రహీతలు -1.శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ –రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ –ఆకాశ వాణి-హైదరాబాద్
2-డా.శ్రీ శలాక రఘునాధ శర్మ –విశ్రాంత సంస్కృత ఆచార్యులు –శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం –రాజమండ్రి
3-శ్రీ గుత్తికొండ సుబ్బారావు –కృష్ణా జిలా రచయితల సంఘం –అధ్యక్షులు –మచిలీపట్నం
4-డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ –విశ్రాంత తెలుగు అధ్యాపకులు –గుంటూరు
4-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల ఉగాది ప్రోత్సాహక పురస్కార ప్రదానం
1-‘’స్వయం సిద్ధ ‘’ప్రత్యక పురస్కారంప్రదానం –
పురస్కార గ్రహీత –శ్రీమతి పెద్దిభొట్ల సౌభాగ్య లక్ష్మి –తెలుగు పండిట్ –ఉయ్యూరు .
2- వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి పురస్కార ప్రదానం –
పురస్కార గ్రహీతలు – 1-శ్రీ కళాసాగర్ –‘ప్రముఖ చిత్రకారులు ‘’64 కళలు ‘’మాసపత్రిక సంపాదకులు – విజయవాడ
2-శ్రీమతి చలపాక శిరీష –డి.టి పి స్పెషలిస్ట్ –విజయవాడ
3-శ్రీ పాషా –ఈనాడు –విలేకరి –ఉయ్యూరు
4-శ్రీ రాజా –‘’మనచానల్ ‘’రిపోర్టర్ –ఉయ్యూరు
5- శ్రీ గూడవల్లి రామా రావు –పోస్ట్ మాస్టర్ –ఉయ్యూరు
6-శ్రీ జి వి.రమణ –మేనేజింగ్ డైరెక్టర్ –జాగృతి పొదుపు సహకార సంస్థ –ఉయ్యూరు
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివలక్ష్మి గబ్బిట వెంకట రమణ వి బి జి. రావు గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి సాంకేతిక నిపుణులు సరసభారతి అధ్యక్షులు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
12-2-15 –ఉయ్యూరు

