|
మనిషి శాసీ్త్రయ పద్ధతిలో నిరూపించలేని విషయాల గూర్చి, ఎవరూ చూడలేని విషయాల గూర్చి మత ప్రచారకులు వాదులాడుతుంటారని మనకు తెలిసిన విషయమే. అలాంటి వాటిలో కర్మ ఒకటి. హిందూమతంలో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రజల్ని బానిసత్వంలో ఉంచే ఉద్దేశంతో చెప్పబడింది అనే వాదన ఇటీవలి కాలంలో వచ్చింది. ఒక సామాజిక వర్గం వారు ఇలాంటి పనిచేశారు అంటూ ఆ వర్గం పట్ల ద్వేషం రగిలించడం కూడా జరుగుతోంది. అందువల్ల దీన్ని తెలుసుకోవడం అవసరం.
కర్మ అంటే పని అని అర్థం. ఆఫీసుకు వెళ్లడం లేదా టీ తాగడం లాంటి పనులనే అర్థం కాదు. సమాజంలోని ఇతర వ్యక్తులతో వ్యవహరించడంలో మన ప్రవర్తనకు కర్మ అని పేరు. మన ప్రవర్తన నైతికంగా ఉండవచ్చు. అనైతికంగా ఉండవచ్చు. అసాంఘిక ప్రవర్తన అదుపు చేయడానికి ప్రతి సమాజంలో చట్టాలు ఉంటాయి. కాని కొన్ని రకాల ప్రవర్తనకు చట్టం ప్రకారం శిక్ష లభించవచ్చు. కొన్ని చట్టపరిధిలోకి రాకపోవచ్చు. చట్టపరిధిలోకి రాని అనేక పనులు ఎదుటివాళ్ళను హింసించేటట్టు ఉండవచ్చు. ఇలాంటి పనులు జరగకుండా మేనేజ్ చేయడం, ప్రజలందరూ మంచి మార్గంలో నడిచేటట్టు చేయడం అందరు మత పెద్దల ముందున్న పెద్ద సమస్య. దీనికై మతాలు తమ తమ ధోరణిలో కొన్ని విశ్వాసాల్ని చెప్పాయి. ఫలానా పని చేయడం వల్ల స్వర్గం అనే బహుమతి పొందుతారనీ, మరో విధమైన పనివల్ల నరకం అనే శిక్షను పొందుతారనీ అన్ని మతాలూ చెబుతాయి. ఈ బహుమతి, శిక్ష అనేవి మనం చేసిన కర్మకు ఫలం. ఈ ఫలాన్ని కూడా కర్మ అనే పేరిట పిలుస్తూంటాం. కర్మను అనుభవించాల్సిందే అనే మాటను వాడుతూంటాం. కర్మఫలం మేనేజ్‌మెంట్‌పై అనేకులు అనేకరకాలుగా చెప్పారు. మంచి చేసేవాడికి మంచి ఫలితం రావాలి. చెడు చేసేవాడికి చెడ్డ ఫలితం రావాలి అనేది న్యాయసమ్మతం. ఈ విషయంలో మతాలు ముఖ్యంగా రెండు విధాలుగా చెప్పాయి. 1. ప్రతివ్యక్తీ కర్మఫలం తప్పక అనుభవించవలసిందే అని, మనం చేసే పనులు అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి అనేక జన్మలు ఉంటాయి అని చెప్పడం. 2. ఫలానా మతాన్ని నమ్మితే మీ పాపాలన్నీ దేవుడు తీసుకుంటాడని చెప్పడం మరో పద్ధతి. ఏది ఏమైనా కర్మఫలం ఉంటుందని దేవుణ్ణి నమ్మే వారందరూ ఒప్పుకున్న విషయమే. మనం చేసే మంచి, చెడు పనులన్నింటినీ లెక్కపెట్టడానికి దేవుడి వద్ద ఏదో ఒక విధానం ఉందని అన్ని మతాలూ చెబుతాయి. ఒక ఉర్దూ కవి ఇలా వాపోయాడు- పకడే జాతే హై ఫరిష్తోంకే లిఖే పర్ నా హక్ – అంటే కుడిభుజం పై కూర్చున్న దేవదూత పుణ్యకార్యాలన్నింటినీ నోట్ చేసుకుని, ఎడమ భుజంపై ఉన్న దేవదూత పాపకార్యాల్ని లెక్క వేసుకొని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు కానీ నా సంజాయిషీ వినడం లేదు అని ఆయన బాధ. కర్మ ఎకౌంటింగ్‌కుగాను యమలోకంలో చిత్రగుప్తుడు కంప్యూటర్‌లాగ లెక్క వేస్తాడని పురాణాల్లో చూస్తాం. ఒక వ్యక్తి తను చేసిన పనుల ఫలితాన్ని మరో జన్మలో అనుభవిస్తాడనీ, లేదా ఈ జన్మలో ఉన్న స్థితికి ఇంత క్రితం జన్మల్లో చేసిన పనులు కారణమనీ నమ్మడాన్ని కర్మసిద్ధాంతం అంటారు. కర్మ సిద్ధాంతాన్ని హిందూమతమే కాకుండా బౌద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ఆసియా మతాలన్నీ నమ్ముతాయి. బౌద్ధం, జైనం దేవుణ్ణి అంగీకరించకున్నా కర్మసిద్దాంతాన్ని నమ్ముతాయి. చైనా, జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక మొదలైన దేశాలన్నీ బౌద్ధదేశాలు. అంటే ప్రపంచంలో దాదాపు యాభైశాతం ప్రజలు జన్మ ఉందని నమ్ముతారు. బుద్ధుని జాతక కథలు, జైనుల తీర్థంకరుల కథలు ఇవన్నీ కర్మ, మరో జన్మను తెలుపుతాయి. భారతీయ సంస్కృతిలో కర్మ సిద్ధాంతాన్ని చెప్పడానికి కారణాల్ని ఇలా చెప్పారు. 1. మనిషి ఎన్నెన్నో పనులు చేస్తూంటాడు. వాటన్నింటికీ ఫలితం అతను బ్రతికుండగానే అనుభవించే అవకాశం ఉండదు. దీనికి మనం చాలా ఉదాహరణలు చూస్తూంటాం. ఇంత మంచి వ్యక్తి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడని లేదా ఇన్ని దుర్మార్గాలు చేసిన వ్యక్తి ఇంత సుఖంగా ఉన్నాడనో అనుకుంటూంటాం. దీన్ని పరిష్కరించడానికి మళ్ళీ జన్మ ఉంటుందని ఊహించాలి. అలా కాకుంటే ఒక వ్యక్తి తన చేయని తప్పుకు ఈ జన్మలో శిక్ష పొందుతున్నట్లు లేదా, చేయని పుణ్యానికి లాభం పొందుతున్నట్లు చెప్పవలసి వస్తుంది. 2.సృష్టి వైచిత్రి- అంటే ఛీజీఠ్ఛిటటజ్టీడ. ఒకరు రాజభోగాలతో పుడితే, మరొకడు కటిక పేదగా ఉంటాడు. ఒకడు ఆరోగ్యవంతుడిగా ఉంటే మరొకడు అవిటివాడుగా పుడతాడు. దీనికి కారణం చెప్పలేం. సృష్టి అనేది ఒక యాక్సిడెంట్ అనీ, యఽథాలాపంగా జరిగినది అని చెప్పాలి. లేదా దేవుడు కొంతమందిపై పక్షపాతబుద్ధి చూపాడని చెప్పాలి. కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే పై విధంగా చెప్పాల్సిన పనిలేదు. 3. సమాజంలో మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం. 4. వ్యక్తి హుందాగా తాను చేసిన పనికి తానే బాధ్యత వహించాలని చెప్పడం. భగవంతుడు ఎవరి పాపాల్ని గాని, పుణ్యాన్ని గానీ తీసుకోడు అని ధైర్యంగా చెబుతుంది. భగవద్గీత (5-15) ఆ తర్వాత 18 వ అధ్యాయంలో తాను అర్జునుణ్ణి అన్ని పాపపుణ్యాలనుండీ గట్టెక్కిస్తాననీ చెబుతాడు కృష్ణుడు. ఇలా చెప్పడం పైకి విరుద్ధంగా కనిపిస్తుంది. గత వ్యాసాలలో భగవంతుడి స్వరూపాన్ని గురించి చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుందాం. పరమాత్మ అంటే శుద్ధ చైతన్యమే. దీనికి ప్రపంచాన్ని సృష్టించటం, పోషించడం, పోలీసింగ్ చేయడం మొదలైన పనులేమీ ఉండవనీ తెలుసుకున్నాం. పై చైతన్యంలో ప్రకటమయ్యే ఒకనొక సృజనాత్మకశక్తి (ఛిట్ఛ్చ్టజీఠ్ఛి ఞౌఠ్ఛీట) నే మనం సృష్టికర్త. దేవుడు అని భావించుకుంటున్నామని తెలుసుకున్నాం. శుద్ధ చైతన్యానికి పుణ్యపాపాలతో సంబంధం లేదు. సృష్టికర్త అనే స్థాయిలో కూడా దేవుడు మనకు సరైన బుద్ధిని ప్రసాదిస్తాడు. అంతే కానీ పాపాల్ని మాఫీ చేయడు. దదామి బుద్ధి యోగం – అంటాడు కృష్ణుడు. మనిషే సరైన బుద్ధి ద్వారా పాపం, పుణ్యం అనే బంధాలనుండి తప్పుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడని దీని అర్థం. ఇటీవల మానసిక శాస్త్రవేత్తలు పునర్జన్మపై అనేక ప్రయోగాలు చేశారు. ఞ్చట్ట జూజీజ్ఛ ట్ఛజట్ఛటటజీౌుఽ అనే విషయంపై పరిశోధించి మనిషికి మరో జన్మ ఉన్నట్లు చెప్పిన అనేక పరిశోధనా వ్యాసాలను చూడగలం. కర్మసిద్ధాంతం అంటే మనిషి కర్మకు బానిస అని అర్థం కాదు. తను ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తన ఖర్మ. దీన్నుండి తప్పించుకోలేం అనుకోవడం జ్చ్ట్చజూజీటఝ అవుతుంది. మన సిద్దాంతం దీన్ని అంగీకరించదు. ఒక మనిషి పుట్టుక మాత్రమే (ధనవంతుడిగానో, ఆరోగ్యవంతుడిగానో) కర్మను బట్టి ఉంటుంది. ఆ తర్వాత మనకిష్టమైన పనిని ఎంచుకునే స్వాతంత్య్రం మన బుద్ధికి ఉంది. దీన్నే ఇంగ్లీషులో జట్ఛ్ఛ ఠీజీజూజూ అంటారు. ప్రతివ్యక్తి మంచి కర్మల్ని ఎంచుకుని జ్ఞానానికి అర్హుడు కాగలడనీ, మనుష్య మాత్రుడెవడైనా మోక్షానికర్హుడనీ మన సిద్దాంతం చెబుతుంది. మనుషుల్ని బానిసత్వంలో ఉంచడానికి ఇది చెప్పబడింది అనే హాస్యాస్పదమైన భావం మన పుస్తకాల్లో ఎక్కడ వెతికినా చూడలేం. కర్మ సిద్దాంతాన్ని నమ్మిన బౌద్ధమతాన్ని స్వీకరించిన అంబేద్కర్ తనంత తాను బానిసత్వంలోకి వెళ్లాడని చెప్పలేం కదా! డాక్టర్ కె. అరవిందరావు రిటైర్డు డీజీపీ ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.com పంపండి |

