ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -12
6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -2
మేల్విల్లీ ‘’కానిబాల్స్ ‘’ఆటవిక జాతుల తో కలిసిపోయాడు .వాళ్ళ బట్టలే వేసుకొన్నాడు .వాళ్ళలాగే నగ్నం గా సముద్ర స్నానాలు చేసేవాడు .ఇవన్నీ ‘’టైపీ’’నవలలో అచ్చం గా జరిగింది జరిగినట్లు రాశాడు .ఈయన సమక్షం లో ఆ జాతివారు తమ నర మాంస భక్షణ చేయలేదు .వాళ్ళ పండుగా పబ్బాలలో వారిలాగే పాల్గొని ప్రవర్తించాడు .ఆ జాతి మనుషులు సౌందర్యారాధకులు .’’ సెక్సానందం ‘’లో నిష్ణాతులు .నిజం గా అదొక స్వప్న లోకమే అందులో ఉండిపోవాల్సి వచ్చింది మెల్ విల్లీ . ‘’బంగారు యుగం లో కంచుబంగారు మనుషుల’’ తో గడిపాడు .రెక్కాడితెకాని డొక్కాడని జీవులు వారు .వ్యాపారం వర్తకం తెలీని అమాయకులు .ఈ సంస్కృతిని మేల్విల్లీ ‘’స్నివిలై జేషన్ ‘’అన్నాడు సరదాగా .అదునాతన అమెరికా వాసి అనామక ఆటవిక జాతి మధ్య అదే ఆటవిక జీవితం గడపటం వింతల్లో వింత .ఇస్టపడే అక్కడ ఉన్నా ఇంటి బెంగ పట్టుకోంది కొంతకామైన తర్వాత . ..కాలికి గాయం అయి వాళ్ళు ఎన్నిరకాల మందులు వేసినా నయం కాక బాధ ఎక్కువైంది .వాళ్ళ విపరీతమైన ఆపేక్ష ,నిఘా లను ఎలాగో అలాగా వాళ్ళ మనిషి సాయం తోనే తప్పించుకొని బయటపడ్డాడు .అక్కడ నుండి ఆస్త్రేలియన్ వేలింగ్ షిప్ ‘’లూసీ ఆన్ ‘’ఎక్కి పారిపోయాడు .
ఈ నౌక ప్రయాణమూ మహా ఘోరంగానే ఉంది .కెప్టెన్ తాగు బోతు,జగడాల మారి .షిప్ –పాపిటే చేరగానే సిబ్బందిని అందర్నీ బందీలుగా పట్టుకొన్నారు .మేల్విల్లీని వదిలేశారు కాలిగాయం ఉండటం వలన .రెండు సార్ల సముద్రయానం ఏమీ లాభించాలేదని తిమింగిల వేటకు సిద్ధపడ్డాడు .చార్లెస్ అండ్ హెన్రి నౌకా ప్రయాణానికి రిజిస్టర్ చేయిన్చుకొన్నాడు .ఇది అతని మూడవ వేల్ హంట్ షిప్ .హవాయ్ చేరాక ఒక ఇంగ్లీష్ స్టోర్ కీపర్ దగ్గర గుమాస్తాగా చేశాడు .ఏదైనా చిలక కొట్టుడే కాని కాసుల వర్షం రాలలేదు .హోనోలూలు చేరాడు .అక్కడా అదృష్టం వెక్కిరించింది .వేల్ హంట్ బోర్ కొట్టింది .నాలుగు నెలలు హవాయి లో గడిపి అమెరికా ప్రయాణానికి బయల్దేరాడు .
పద్నాలుగు నెలలు నేవీ ‘’లో సైలర్ గా ఉండి మళ్ళీ మార్క్వేస్ దీవి మీదుగా దక్షిణ అమెరికా వెళ్ళాడు .అక్కడ శిధిల ,అవినీతిమయ మైన లిమా సిటీ చూశాడు .ఆ అనుభవం జీవితం లో ఎన్నడూ మరచిపోలేదు .కొద్ది మంది స్నేహితుల సాయం తో ఓడ ఎక్కాడు .నావికా సిబ్బంది పాశవికం గా ప్రవర్తించేవారు .1844అక్టోబర్ 3 న అమెరికా లోని బోస్టన్ చేరుకొన్నాడు .నేవీ సర్వీస్ నుండి విడుదలయ్యాడు .దాదాపు పాతికేళ్ళు ఏ రకమైనఉత్సాహ ప్రోత్సాహాలు ,స్తిరాదాయం లేకుండా గడిపాడు దుర్భర జీవితాన్ని ..
అపార అనుభవం మాత్రం వచ్చింది రాయటం మొదలు పెట్టాడు పదాలు దూసుకొచ్చి కాగితాలు నిండిపోతున్నాయి అదొక మానసిక చేతనా వస్థ.నూకు –హియా దీవి అనుభవాలతో’’ టైపీ’’నవల రాశాడు .ఇందులో మేల్విల్లీ జీవిత చిత్రణ ఏదో కల్పనా ఏదో తెలియ నంత అద్భుతం గా సాగి అందరికి నచ్చింది .’’Herman Melvillie is the morning of the imagination’’అన్నాడు లెవీస్ మంఫోర్డ్ .ఆయనే హెన్రి డేవిడ్ తోరో తో పోల్చాడు .ఇద్దరూ వాస్తవానికి రూపు కట్టించారని మెచ్చాడు .నేటివిటి కి ప్రాణం పోశారిద్దరూఅనాగరక జాతుల మధ్య తిరిగినా అమెరికా మామూలు సంస్కృతీ సంప్రదాయం లోకి చేరారు .అమెరికా నిత్య జీవితాన్ని కొంత ఏవ గింపు తో అక్షరబద్ధం చేసిన రచయితలూ ఈ ఇద్దరు .టైపీ నవల సెన్సేషనల్ హిట్ కొట్టింది .విపరీతమైన క్రేజ్ తో జనం కొని చదివి ఆనందించారు ,రచయితను బాగా ప్రోత్సహించారు .టిప్సీ జాతి మనుసుల మధ్య మేల్విల్లీ గడిపిన ఈవితం ఏంతో ఆసక్తిగా ఉండటం అలా అంతకు ముందు ఏ రచయితా ఆ జాతి జీవుల గురించి ఆచార వ్యవహారాల గురించి రాయకపోవటం చదువరులను ఏంతో బాగా ఆకర్షించి అభిమానులయ్యారు మేల్విల్లీకి .సూపర్ డూపర్ హిట్ అయింది టైపీ .ఇరవై ఎనిమిదేళ్ళనాటికే ఈ అపూర్వ విజయం హెర్మాన్ కు దక్కింది . రెండో పుస్తకం బిల్లీ బాడ్ రాసి ప్రచురించాడు
క్రమం గా మేల్విల్లీ కి సాహిత్యాభిమానులు స్నేహితులు ఏర్పడ్డారు .వారు అతన్ని ఒక ‘’ఐకాన్ ‘’గ భావించారు .గతాన్ని హాయిగా మర్చి పోయి కొత్త ఉత్సాహం తో ముందుకు దూసుకొని వెళ్ళే అవకాశం నమ్మకం వచ్చింది .ఎలిజ బెత్ షా అనే చిన్న నాటి నుండి తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .అందంగా లేకపోయినా అభిమాన వతి అయిన భార్య .భర్తపై ఆరాధనా భావం ఉన్నభార్య .రచనే తన జీవితా సర్వస్వం అని మేల్విల్లీ భావించి రాస్తున్నాడు అతని దృక్పధాన్ని అర్ధం చేసుకొని ఆమె సహకరిస్తోంది .డబ్బు అప్పుతెచ్చో నగలు అమ్మో అతని రచనా వ్యాసంగానికి ఇబ్బంది లేకుండా సంసారం గడుపుతోంది .భార్య పై మేల్విల్లీకి అమిత ఆపేక్ష ,ప్రేమ స్నేహభావం .ఆమెతో రోజూ వాకింగ్ చేసేవాడు .తను రాసింది చదివి వినిపించేవాడు .హడావిడి హనీమూన్ పూర్తీ చేసుకొని మళ్ళీ పూర్తిగా రచనలో మునిగిపోయాడు మేల్విల్లీ .భర్తకు అవసరమైన కొత్త రాతబల్లా కుర్చీలు సౌకర్యాలు ఆమె చూసేది .
మేల్విల్లీ మూడో నవల ‘ మెర్డి’’ప్రచురించాడు .తాను ఇరవై తొమ్మిదో ఏడు దాకా మహాకవి షేక్స్పియర్ గురించి తెలుసుకోనందుకు బాధ పడ్డారు .ఆయన జీసస్ తో సమానం అని భావించాడు .మహాకవి రాచనలన్నీ చదివి జీర్ణించుకొన్నాడు .ఇప్పుడు రాసే దానిలో ఆయన ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది .మార్డి నవల ఒక సెటైర్ వేదాంతం గా ,కవితగా ,దృష్టాంతం గా కలగలుపుగా సాగింది .దీని నేపధ్యం దక్షిణ సముద్రమే .అందులోని మితికల్ దోమినారో ఇంగ్లాండ్ కు ,ప్రాఫెర్రో .ఈజిప్ట్ కు ,ఫ్రాంకో ఫ్రాన్స్ కు వివెంజా అమెరికాకు చెందిన పాత్రలు .మార్డి విమర్శకులను అప్రతిభులను చేసింది కాని రీడర్స్ ను చేర లేక పోయింది .నిరాశ మిగిల్చింది .మళ్ళీ సముద్రయాన సాహసాల కధలు రాయటం మొదలు పెట్టాడు .’’రెడ్ బరన్ ‘’పేరిట మొదటి యూరాప్ పర్యటన లో షిప్ బాయ్ గా అనుభవాలు రాశాడు .అంతగా’’ పేలలేదు’’కాని సముద్ర ప్రయాణ జీవితం బాగా వచ్చింది .డబ్బుకోసమే దీన్ని రాశానని చెప్పుకొన్నాడు .కొడుకు పుట్టాడు ఖర్చులు పెరిగాయి పొగాకు కొనుక్కోవటానికైనా డబ్బు లోస్తాయని రాశానన్నాడు .అందులో మేల్విల్లీ నిజాయితీ అడుగడుగునా ప్రత్యక్షమై విపరీతమైన సానుభూతి వచ్చి మార్డీ నవల కంటే రెట్టింపు అమ్మకాలు జరిగాయి .తర్వాత ‘’వైట్ జాకెట్ ‘’ మూడుభాగాలుగా రాశాడు .ఇందులో యునైటెడ్ స్టేట్స్ ‘’అనే నౌక పై తన నేవీ అనుభవాలను రాశాడు .కొంత సింబాలిజం కూడా జోడించి వైట్ జాకెట్ వండాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ .14-2-15 –ఉయ్యూరు

