మినీ ద్విపద్స్-3
21-ఓడిన ఒక ఎన్నిక కే’’ మోడీ ‘’
బావురుమని అయ్యాడు ‘’మూడీ ‘’
22-నాగార్జున నీటికి’’ తాళం ‘’
తెలుగోళ్ళ మద్య ఇదేం ‘’మేళం?’’
23-ఇవాళ ‘’వేలంటైన్ డే’’
రేపు’’ విడాకుల డే?’’
24-పచ్చనిపోలాల్లో రాజదానేమిటి ?
ఉండవల్లి అసహనం ఇప్పుడా ఏమిటి?
25- నాలుగేళ్ళు గడ్డుకాలమే’’డిగ్గీ ‘’
హస్తానికి ఆయనే పెట్టాడు’’ బుగ్గి ‘’
26-సామాన్యుని పట్టాభిషేకం’’ నేడే ‘’
ఏడాది చెర నేటితో ‘’వీడే’’ .
27-నేడే వరల్డ్ కప్ ‘’టెంపర్ ‘’
ప్లేయర్స్ కు ఆఫర్ ‘’బంపర్ ‘’.
28- సాహితీ’’ వేత్త’’ సంజీవవయ్య ‘’
విలువల సి .ఏం. గా ‘’.అయ్యే ‘’.
29-ఐ ఎస్ ఐ పై ఒబామా ‘’దూకుడు’’
ప్రతిస్ట కోసం పాపం’’ పాకుడు ‘’
30-తెలుగు సాహితీ ‘హెమింగ్వే ‘’
కేశవ రెడ్డి ని అయ్యో కేన్సర్ ‘’మింగే ‘’.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-2-15- ఉయ్యూరు
