గిన్నీస్ బుక్ ఎక్కిన దర్శ కేంద్రుడు

గిన్నిస్బుక్‌ విజేత కావటం అద్భుతఘట్టం – కె. రాఘవేంద్రరావు

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల సినీ జీవితం గురించి సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ యు.వినాయకరావు రచించిన ‘గిన్నిస్బుక్‌ విజేత’ పుస్తకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. విజయనిర్మల పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తొలి కాపీని ఆవిష్కరించారు. హీరో కృష్ణ స్వీకరించారు. మలి ప్రతిని బి.ఏ.రాజు కొనుగోలు చేశారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘విజయనిర్మలగారు నాకు ఇష్టమైన నటి. ఓ మహిళా దర్శకురాలు గిన్నీ్‌సబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం సినిమా చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టం. ఆమెను స్పూర్తిగా తీసుకుని మరింత మంది మహిళా దర్శకులు పరిశ్రమకు రావాలి’’ అని అన్నారు. కృష్ణ మాట్లాడుతూ ‘‘విజయనిర్మలకు ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనది. ఆమె సినీ జీవితానికి సంబంధించి అన్ని అంశాలతో ఓ పుస్తకం రావడం ఆనందంగా ఉంది. వినాయకరావు చాలా విపులంగా రాశారు ఈ పుస్తకాన్ని. ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను’’ అని అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ ‘‘నా సినిమాలన్నింటి గురించి విపులంగా ఓ పుస్తక రూపంలో సమకూర్చిన వినాయకరావుగారికి కృతజ్ఞతలు. ఆసక్తికరంగా ఉందీ పుస్తకం’’ అని అన్నారు. వినాయకరావు మాట్లాడుతూ ‘‘భారత చలన చిత్ర రంగంలో ఏ దర్శకురాలికి దక్కని గిన్నీ్‌సబుక్‌ రికార్డ్‌ గౌరవం విజయ నిర్మలగారికి దక్కింది. ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. విజయనిర్మలగారి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు నేను ఇస్తున్న చిరు కానుక ఇది. ఏ హీరోకి రానన్ని పేజీలతో త్వరలోనే కృష్ణగారి మీద మరో పుస్తకాన్ని తీసుకురానున్నాను ’’ అని తెలిపారు. ‘‘చక్కని నటి, దర్శకురాలు, అంతకుమించి గొప్ప రైతు, సంఘ సంస్కర్త అయిన మా అమ్మ గురించి పుస్తకం రాయడానికి వినాయకరావు అర్హుడు’’ అని నరేశ్‌ అన్నారు. ఇంకా బి.జయ, పద్మాలయ మల్లయ్య, నవీన్‌ విజయకృష్ణ, గుండు సుదర్శన్‌, ఖాదర్‌గోరి, దిడ్డి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయనిర్మలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.