ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -16
8- ఆధునిక ప్రతీక వాద రచయిత -చార్లెస్ బాడేలేర్-2
ఇరవై ఏడవ ఏట డిప్రెషన్ నుంచి బయట పడ్డాడు బాడలేర్ .తనలాగే జీవితం లో దుఃఖ శోకాలనుభావించిన అమెరికా కవి బహుముఖ ప్రజ్ఞాశాలి ,రచయితా ‘’ఎడ్గార్ అలాన్ పో’’ ను రెండేళ్లక్రితమే చదివి ఆయన రచనలను ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా చేయాలనే మంచి కోరిక కలిగింది .’’నేనెందుకు పో ను అనువదిస్తున్నానో తెలుసా?అతని పోలికలు నాలో ఉన్నాయి , నామానసిక ఆధ్యాత్మిక బంధువు అనిపిస్తాడు .మొదటి సారి నేను ఆయన పుస్తకం తెరచి చదివి నప్పుడు దిగ్భ్రాంతికి లోనైనాను .నేను ఏ విషయాల పై రాయాలని కలలు కన్నానో ,ఏ వాక్యాలు ఎలా రాయాలనుకోన్నానో ,అవన్నీ పో మహానుభావుడే రాసేశాడు .’’అని తన ఆరాధనా భావాన్ని తెలియ జేసుకొన్నాడు .కేధలిక్ మత వారసుడిగా బాడేలేర్ కు అసలైన పాపం అంటే ఏమిటో తెలుసు .చెడు మానవ ప్రకృతిలో అంతర్గతమై ఉందని పో గుర్తించినట్లే ఈయనా గుర్తించాడు .ఆరేళ్ళు తీవ్రం గా కస్టపడి తన సృజనకు పదును పెట్టి పో కధలను అయిదు భాగాలుగా ఫ్రెంచ్ భాషలో కి అనువదించాడు .కాని ఒక్క కవిత జోలికి కూడా పోలేదు .ఒకే ఒక అమెరికన్ కవిత లాంగ్ ఫెలో రాసిన’’హయవాత ‘’మాత్రం ఫ్రెంచ్ లోకి అనువాదం చేశాడు .ఇలా పో కవితో తాదాత్మ్యం చెంది రచనా సృష్టి చేసిన తర్వాత తాను రాయాలను కొన్న విషయాలపై ద్రుష్టి పెట్టాడు .
శైలి మార్చుకొన్నాడు .కామ భావనలు తగ్గి శోక భావాలు పెరిగాయి .ప్రేమ కవిత్వం లో అంతకు ముందు ఎవరూ రాయనంత గొప్ప కవిత ‘’అన్ వాయెజ్ ఏ సైటర్ ‘’ రాశాడు . అందులో పిచ్చి మోహం పెల్లుబికింది .భయంకర భీభత్స భయానక౦ గా దాన్ని సమాప్తి చేశాడు .’’in thine isle O Venus ,I found only upthrust-A calvary symbol whereupon my image hung –Give me Lord God ,to look upon that dung –my body and my heart ,without disgust ‘’దీనిపై మాన్సేల్ జోన్స్ స్పందిస్తూ ‘’సాహిత్య ప్రభావం కోసం కాకుండా పాపం అనేది మానవ అంతరాత్మ స్వభావం ‘’అన్న విషయాన్ని బాడేలేర్ తెలియ జేశాడన్నాడు .కవితలో విశ్రుం ఖలత క్రమంగా తగ్గి బాలెన్స్ స్తితిలో ఉంటున్నాడు మనకవి .ఆత్మవిమర్శ చేసుకొని జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు .1857లో ‘’లెస్ ఫ్లుఎర్స్ డు మాల్ ‘’రాసి ప్రచురించాడు .దీన్ని అమ్మకానికి పెడితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని ఖండించగా ,,కాపీలన్నీ పోలీ సులు స్వాధీనం చేసుకొన్నారు .ఈ విషయం తల్లికి ఉత్తరం ద్వారా తెలిపాడు .ఆ పుస్తకం పై తన స్పందన తెలియ జేస్తూ ‘’I have put all my tenderness ,my hate ,and my religion into the book .Iam proud of having written a book that inspired nothing but fear and horror of evil ‘’అన్నాడు .పుస్తకం లో ఏదో కొద్దిగా చదివి నిర్ణయానికి రాకూడదని మొత్తం చదివి అర్ధం చేసుకోవాలని కోరాడు .కోర్ట్ కు వెళ్ళాడు కోర్టు అతనిపక్షమే తీర్పు చెప్పినా ఆ పుస్తకం లో దైవ దూషణ లేదని ,కాని బూతు అశ్లీలం ఉన్నాయని బహిరంగ అమ్మకానికి అనుమతించమని అందులోని లెస్బియన్ పై ఉన్న ఆరు కవితలను తీసేసి ప్రచురిస్తే అనుమతిస్తామని తీర్పు చెప్పారు .దీనికి ఒప్పుకొని అలానే చేసి మరో 35 కవితలు చేర్చి రెండవ ముద్రణ లో వాటిని తీసేసి ముద్రించాడు .కాని తానూ ఆశించిన పుస్తక శిల్ప నిర్మాణం(ఆర్కి టేక్చర్) దెబ్బ తిన్నాడని తెలుసుకొన్నాడు
బాడేలేర్ భావనలో కవిత్వ పరమార్ధం రెండు రకాలుగా ఉంటాయని ‘’the distinction between good and the beautiful ,the discerning of beauty in evil ‘’చెప్పాడు .’’no where in literature has there been found a more astonishing mixture of radiance and what Baudelaire called ‘’spleen ‘’of the macabre and the magnificent ‘’.కవిత్వం ,విమర్శ విరుద్ధమైనవికావు అని చాలామంది అన్నదానిని ఒప్పుకోలేదు .కవి గొప్ప విమర్శకుడు అన్నాడు .విమర్శకుడు కాకపొతే సగం కవి మాత్రమె అవుతాడు అన్నాడు . కవి భావాలను ప్రసారం చేసే వాడుమాత్రమేకాదు,అన్ని కళలను సమన్వయము చేసి అతీత శబ్దాలను సృష్టించేవాడు . సాహిత్య ,కళ ,సంగీతం ,సౌందర్యం లపై బాడేలేర్ రాసినవిషయాలన్నీ అతని సృజన శక్తి ,అన్వేషణ ఫలితాలే .అవి ఆనందాన్ని ఇస్తూనే జ్ఞానాన్ని పెంచేవే .’’the material objects exist in this world only because they have their origin in the world of spirit .the artist should decipher the hidden writings of nature and to interpret the mysteries of the universe .’’అని హితవు చెప్పాడు .కళ అనేది పరమ ఉత్క్రుస్టమైనది మాత్రమె కాకుండా ప్రపంచం లో అందాన్ని ప్రభావితం చేసేది .అందం అంటే మానసిక వాస్తవికత –దీనినే ఆర్టిస్ట్ సృష్టించి దర్శింప జేస్తాడు .ఆర్టిస్ట్ దృష్టిలో అందం వస్తువులోఉండదు ,దానికి ఆర్టిస్ట్ తెచ్చే అందం లోనే ఉంటుంది .
ప్రచురించిన పుస్తకం ఆర్ధికం గా లాభించక పోవటమేకాక ఆరోగ్యం పైనా ప్రభావం చూపి ,రెండో ముద్రణలోనూ ప్రోత్సాహం రాక కున్గిపోయాడు .ప్రచురణ కార్ట్ దివాలా తీసి అప్పుల వాళ్ళ బాధ పడలేక బెల్జియం పారిపోవటం మరీ బాధించింది . లెక్చర్లు దంచి డబ్బులు వెనకేసుకొందామని ప్రయత్నిస్తే అదీ దారుణం గా విఫలమైంది .బెల్జియం లో ఉండగా ఆరోగ్యం మరింత క్షీణించి మొదటిసారి ఎటాక్ వచ్చింది .యవ్వనం లో విలాసంగా అన్నిరకాల సుఖాన్ని అనుభవించటం తో సంక్రమించిన సుఖ వ్యాధి పీల్చి పిప్పి చేస్తోంది .శారీరక బాధలను మానసిక కుంగు బాటును మరిచిపోవటానికి నెమ్మదిగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు . భరించలేని పరిస్తితులలో ఆత్మహత్యకూ ప్రయత్నించాడు .దీనితో మానసిక స్థితి అదుపు తప్పి ‘’the wind of the wings of madness’’అనుభూతికి లోనయ్యాడు .43 ఏళ్ళ నది వయసులోనే ఈ సుఖాలు దుఖాలు బాధలూ అవమానాలు అన్నిటిని మరిచి పోయే శాశ్వత నిద్ర లోకి జారు కోవటానికి ముందు రెండేళ్ళు బెల్జియం లో దయనీయ స్తితిలో ఉండిపోయి ,నెమ్మదిగా పారిస్ చేరాడు బాడేలేర్ .ఇక్కడ కొత్తగా కండరాల బలహీనత ,విస్మృతి ఏర్పడ్డాయి .మాట్లాడలేక పోయేవాడు .శరీరభాగాలేవీ పని చేయక పక్షవాత స్తితిలో ఉండిపోయాడు .కాని మెదడు సురక్షితంగానే ఉంది .చివరికి మృత్యువే జయించి అతని బాధలన్నీ తీర్చి అక్కున చేర్చుకొని31-8-1867 నశాశ్వత విముక్తినిచ్చింది .
అతని అంత్య క్రియలు అత్యంత హీనంగా పదిమండి మాత్రమె హాజరవగా జరిగాయి .సాహిత్య సాంస్కృతిక సంఘాల వారెవరూ హాజరుకాలేదు .బాడేలేర్ పుస్తకాన్ని అంకితం పొందిన మహానుభావుడూ గైర్ హాజరయ్యాడు .సాహిత్య పత్రికలేవోకంటి తుడుపుగా నాలుగు ముక్కలు రాసి దులిపేసుకోన్నాయి .ఆతను జీవంచి ఉండగా వచ్చినమంచి రివ్యూ మూడుభాగాలు పాల్ వేర్లేన్ అనే 22ఏళ్ళ యువ కవి రాసింది పెద్దగా ప్రాచుర్యం లేని “”L Art’’మేగజైన్ లో వచ్చింది .బతికి ఉండగా పట్టించుకోకుండా వదిలేశారు అతన్ని .కాని చనిపోయాక నాలుగేళ్ళకు బాడేలేర్ కవితలందరి చేతులలో అలంకారా లైనాయి .ఇష్టపడి చదివి ఆరాధించటం మొదలు పెట్టారు .స్విన్ బరన్ కవి అతనిని ‘’ఫైర్ స్కార్ద్ స్పిరిట్ ‘’అన్నాడు .అతని కవితలు మన హృదయాలను మంటలతో తృప్తి పరుస్తాయన్నాడు .బాడేలేర్ కు స్మృతిగీతం రాస్తూ స్విన్ బరన్ ‘’thou sawest ,in thine own singing season ,brother –secrets and sorrows unbeheld of us –fierce loves ,and lovely leaf-buds poisonous –bare to thy subtler eye but for none other ‘’అంటూ నివాళులర్పించాడు .
సింబాలిక్ అనబడే ప్రతీక వాద కవులు బాడేలేర్ ను తమ మార్గ దర్శిగా భావించారు .కవిత్వాన్ని సాంకేతి కతతోను ,సంగీతం తోనూ సంపన్నం చేశాడని పరవశిస్తారు . రూపకాలంకారాలు ,భావ చిత్రాలు తో సింబాలిక్ గా విషయాన్ని చెప్పాడని మెచ్చారు .ఆధునికులు అతనిలో సృజన ,విధ్వంసం అనే రెండుకళలున్నాయన్నారు .మతాధికారులు ‘’he transformed a seemingly insatiabe appetite for sin into a hunger for spiritual sustenance ‘’అని విశ్లేషించారు .దాదాపు ఇరవైకి పైగా పుస్తకాలు రాశాడు .
అయితే ఇవాళ బాడేలేర్ ను ఏ భావ జాలం వాళ్ళు తమవాడు ,ప్రేరకుడు మార్గ దర్శి అని చెప్పటం లేదు .అతని ప్రభావం ,ప్రేరణ ఉత్తేజం అన్ని రకాల భావజాలాలోకి చొచ్చుకుపోయి కలిసి కరిగి పోయాయి .శృంగార విరాగాలలో కలిసి పోయాయి .బాడేలేర్ చెప్పిన అసలు సూక్తి ఏమిటి అంటే ‘heaven or Hell what does it matter .Let us plunge into the depths .In the very pit of the unknown ,we will find the New ‘’.మార్సెల్ ప్రాస్ట్ ,ఆల్ఫ్రెడ్ డీ విన్జీ మొదలైన ఫ్రెంచ్ కవులు అతని ప్రభావానికి లోనయ్యారు .ఇంగ్లీష్ కవులలో ఎడ్మండ్ విల్సన్ ,ఇలియట్ మొదలైన వాళ్ళు సింబాలిజాన్ని పోషించారు .సెక్స్ ను చావును గురించే ఎక్కువ చెప్పాడు .అవే ‘’ స్కాండలస్ సాహిత్యం’’ గా ముద్రపడ్డాయి .లెస్బియన్ శృంగారం చాలా పవిత్రమైనది ఆరోగ్యమైనది అని చెప్పాడు .ప్రేమ ఆరాధన గురించి ,రూప పరివర్తన ,శోకం ,నగరాలలో అవినీతి పైకవిత్వం రాశాడు .జీవించలేని దుర్భర పరిస్తితులను చూసి చాలించాడు . .If rape or arson, poison or the knife
Has wove no pleasing patterns in the stuff
Of this drab canvas we accept as life—
It is because we are not bold enough!
(Roy Campbell‘s translation)
![]()
![]()
మరో ప్రముఖునితో కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-15- ఉయ్యూరు

