|
మత సహనం లోపిస్తే భారతదేశ సమగ్రతకు ప్రమాదం ఉందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట అక్షరాలా నిజం. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, తాను మాట్లాడే మాటపై పూర్తిగా నియంత్రణ ఉన్న వ్యక్తి. ఏ మతాన్నీ ప్రత్యేకించి చెప్పకుండా అన్ని మతాలూ అలా వ్యవహరిస్తున్నాయని చెప్పాడు. మతసహనం ఎవరికి లోపించింది, అది ఎలా ప్రమాదకరం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది మన వంతు.
ఖీ.ఖి.ఉజూజీ్టౌ అనే అమెరికన్ కవి తాను రాసిన ఖీజ్ఛి గ్చిట్ట్ఛ ఔ్చుఽఛీ అనే పద్యంలో బృహదారణ్యక ఉపనిషత్తులోని కథను ప్రస్తావించాడు. సృష్టికర్త అయిన ప్రజాపతి వద్దకు దేవతలు, మనుష్యులు, రాక్షసులు ముగ్గురూ వెళ్లారట. ప్రజాపతి వారికి కేవలం ‘ద’ అని బోధించి పంపించాడు. ఈ ‘ద’ అర్థమేమిటో తెలుసుకోవడం వాళ్ళ వంతు అయింది. అయినా ఆ కాలంలో అంతరాత్మ ప్రబోధం, న్యాయబుద్ధి ఉన్న వాళ్లు కాబట్టి తమలో ఉన్న తప్పు ఏమిటో దాన్ని ప్రజాపతి సూచించాడని అనుకున్నారు. ‘ద’ అంటే దమము అని దేవతలు అనుకున్నారు. మేమెప్పుడూ ఇంద్రియ సుఖాల్లో మునిగి ఉంటాం. దాన్ని తగ్గించుకోమని ప్రజాపతి చెప్పాడని వారు అనుకున్నారు. ‘ద’ అంటే దానం చేయడమని మనుష్యులు అనుకున్నారు. తాము కేవలం స్వార్థపరులై ఉన్నామని ప్రజాపతి భావన అని వారు అనుకున్నారు. రాక్షసులు కూడా అలాగే న్యాయంగా ఆలోచించారు. ‘ద’ అంటే దయ. మేము ఇతరుల్ని పీడిస్తూంటాం. దాన్ని తగ్గించుకోమని ప్రజాపతి చెప్పాడని వారు అనుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు కూడా ప్రజాపతిలాగనే మాట్లాడారు. పోతే మనవాళ్ళు తమలో ఉన్న లోపాల్ని గూర్చి ఆలోచించలేదు. ఆయన చెప్పిన మాట మాకు వర్తించదు. ఇతరులకే వర్తిస్తుంది అన్నట్టుగా అర్థం తీసుకున్నారు. మత అసహనం అంటే కేవలం ప్రభుత్వ పార్టీకి మాత్రమే ఉంది. మరెవరికీ లేదు అన్నట్లు వ్యవహరించారు. భారతీయ మేధావులు వెంటనే కొరడా తీసుకుని ప్రభుత్వ పార్టీ వీపుపై బాదడం, ప్రభుత్వం ఇబ్బందికరంగా వ్యవహరించడం చూశాం.
తన మాటల్ని ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో అమెరికా అధ్యక్షుడు గమనించాడు. ఆయన ఎంతో విజ్ఞుడు కాబట్టి తన దేశం తిరిగి వెళ్లిన వెంటనే ఒక బ్రేక్ ఫాస్ట్ మీటింగులో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ‘‘భారతదేశం ఎంతో అందమైన దేశం. ఎంతో వైవిధ్యం ఉన్న దేశం. కానీ ఇటీవల అన్ని మతాలవారూ ఇతర మతాలపై అసహనాన్ని చూపిస్తున్నారు. వీటిని చూస్తే గాంధీ మహాత్ముడు ఎంతో క్షోభ చెందేవాడు.’’ ఇంకా మాట్లాడుతూ తమ మతాన్ని గూర్చి కూడా ఇలా అన్నాడు. ‘‘ఖ్ఛఝ్ఛఝఛ్ఛట ్టజ్చ్టి ఛీఠటజీుఽజ ్టజ్ఛి ఛిటఠట్చఛ్ఛీట ్చుఽఛీ ్టజ్ఛి ఐుఽ్ఞఠజీటజ్టీజీౌుఽ ఞ్ఛౌఞజ్ఛూ ఛిౌఝఝజ్ట్ట్ఛీఛీ ్ట్ఛటటజీఛజ్ఛూ ఛ్ఛ్ఛీఛీట జీుఽ ్టజ్ఛి ుఽ్చఝ్ఛ ౌజ ఇజిటజీట్ట… ఐుఽ ౌఠట జిౌఝ్ఛ, ఛిౌఠుఽ్టటడ, టజ్చూఠ్ఛిటడ ్చుఽఛీ ్జజీఝ ఇటౌఠీ(ట్చఛిజ్చీజూ ట్ఛజట్ఛజ్చ్టజీౌుఽ జ్చూఠీట) ్చజూజూ ్టౌౌ ౌజ్ట్ఛుఽ ఠ్ఛీట్ఛ ్జఠట్టజీజజ్ఛీఛీ జీుఽ ్టజ్ఛి ుఽ్చఝ్ఛ ౌజ ఇజిటజీట్ట’’ అన్నాడు. నల్లవాళ్లందరూ బానిసలుగా ఉండాలని శాపం పొందినవాళ్లని చెబుతూ వారిని చాలాకాలం బానిసత్వంలో ఉంచడాన్ని ఆయన గుర్తు చేశాడు. అమెరికన్ మీడియా ఆయనపై మండిపడింది. ఐట ౖఛ్చఝ్చ ్చ కఠటజూజీఝ? అనే శీర్షికతో పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి. విద్యావంతులూ దేశాన్ని గూర్చి ఆలోచించేవారూ చరిత్ర చదవడం చాలా అవసరమని మనం మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాలి.
గత వ్యాసాల్లో ఒక చోట రాజీవ్ మల్హోత్రా అనే రచయిత రాసిన ‘‘బ్రేకింగ్ ఇండియా’’ అనే పుస్తకం గూర్చి ప్రస్తావించాను. భారతదేశ సమగ్రత గూర్చి అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాటల్ని పై పుస్తకంలో చెప్పిన విషయాల నేపథ్యంలో చూడడం అవసరం. అమెరికా అధ్యక్షుడు ఛాందసవాది కాదు. మతమార్పిడి సంస్థలు మన సమాజంలో సృష్టిస్తున్న వేర్పాటువాదాల గురించి అతనికి బాగా తెలుసు. భారతదేశాన్ని విడదీయటానికి మతం ఒక ఆయుధంగా ఎలా మారింది, ఆ ఆయుధాన్ని ఎవరు ఎలా వాడుతున్నారు అన్న విషయాన్ని రాజీవ్ మల్హోత్రా కూడా తన పుస్తకంలో వివరించాడు. ప్రపంచమంతటా తమ సంస్కృతే ఉండాలి అని భావించే వారు మన దేశంలో ఎలా విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, అలా రెచ్చగొట్టడానికి మతాన్ని ఎలా వాడుకుంటున్నారు అని ఆయన బాగా విశ్లేషించాడు. అలా రెచ్చగొట్టేవారిని కూడా అమెరికా అధ్యక్షుడు తప్పకుండా తన మాటల్లో ప్రస్తావించాడని అనుకోవచ్చు. అతని మాటల్ని నిజాయితీతో చేసిన వ్యాఖ్యలుగానూ, ఒక ముందు జాగ్రత్తతో చేసిన హెచ్చరికగానూ భావించవచ్చు.
మత అసహనం అంటే ఏమిటి అని నిష్పాక్షికంగా మనం ఆలోచించాలి. మన సొంత మతం పట్ల, సిద్ధాంతం పట్ల విశ్వాసం. గౌరవం కలిగి ఉండటం సామాన్యస్థాయి. మన మతమే సరైనది, మిగతా మార్గాలన్నీ తప్పు మార్గాలు అనుకోవడం ఛాందసవాదం(జఠుఽఛ్చీఝ్ఛుఽ్ట్చజూజీటఝ) అనుకోవచ్చు. ఇది రెండవ స్థాయి. ఈ వాదం మరీ బలంగా మారి ప్రపంచమంతా మా మతమే ఉండాలి మరొక మతం ఉండటానికి వీల్లేదు. ఇతర మతాల్లోని దేవుళ్లు రాక్షసులతో సమానం అనడం ప్రమాదకరమైన మూడవస్థాయి. పై మూడింటిలో రెండవస్థాయి ఆలోచన భారతీయ మతాల్లో అప్పుడప్పుడు ఉన్నా మూడోవస్థాయి మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు. పై కథలో ప్రజాపతి వద్దకు వెళ్లిన వివిధ వర్గాల లాగ మనం మన మతగ్రంథాలు ఏమంటున్నాయో, మనం ఎలా వ్యవహరిస్తున్నామో కూడా ఆలోచించుకోవాలి.
ఎన్నో శతాబ్దాలుగా భారతదేశంలో అనేక సంస్కృతుల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసి ఉండడం చరిత్రలో చూడగలం. ఉదాహరణకు ప్రపంచంలోని అన్ని దేశాల్లో యూదులు మతహింసను అనుభవించారు. ఎంతో నాగరికత ఉందని భావించుకునే యూరోపియన్ దేశాల్లో ఆరు మిలియన్ల యూదులు ఎంతో ఆఽధునికమైన 20 వ శతాబ్దంలో చంపబడ్డారు. కేవలం భారతదేశంలో వారు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. అందుకే ఇజ్రాయిల్ రాజ్యం ఏర్పడినప్పుడు వారి పార్లమెంటులో మొట్టమొదటగా భారతదేశానికి కృతజ్ఞత చెప్పారు. ఇతర మత పెద్దలు మన దేశానికి వచ్చి మన దేశాన్నంతటినీ వారి మతంలోకి మారుస్తామని చెప్పారు. ఇంటర్నెట్‌లోని యూట్యూబ్‌లో ఖీట్చఛిజుజీుఽజ ఉఠ్చిుఽజ్ఛజూజీటఝ, ఉఠ్చిుఽజ్ఛజూజీటఝ గ్చ్టిఛిజి అనే వాటిని వెతికితే వందలాది వ్యాసాలూ, వీడియోలూ చూడగలం. అమాయక ప్రజల్ని ఎలా భయపెడుతున్నారో చూడగలం. మన స్వామీజీలు ఎప్పుడూ ఇతర దేశాలకు వెళ్లి వాళ్ళని మారుస్తామని చెప్పలేదు. ఇతర మతాల దేవుళ్ళకు సైతాను రూపాలంటూ నిందించలేదు.
శాంతిభద్రతల్ని కాపాడే విషయంలో ఒక నానుడి ఉంది. ‘‘అ ట్టజ్టీఛిజి జీుఽ ్టజీఝ్ఛ ట్చఠ్ఛిట ుఽజీుఽ్ఛ’’. అంటే ఒక గుడ్డ చిరగడం మొదలైనపుడు ఒక కుట్టు వేసి సరిచేయవచ్చు. ఊరక వదిలేస్తే తరువాత చాలా కుట్లు వేయాల్సివస్తుంది అని అర్థం. దేశభద్రత విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ‘‘సారపు ధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచే’’ అంటూ భారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయమిదే. కౌరవసభలో ద్రౌపది అవమానం జరిగినపుడు పెద్దలందరూ మౌనం వహించారు దాన్ని గుర్తుచేస్తూ కృష్ణుడు అన్న మాటలవి. అసత్యాలతో సత్యాన్ని కప్పి పుచ్చుతున్నప్పుడు జరుగుతున్న విషయాన్ని గుర్తించని పెద్దలందరూ తమ మౌనం వల్ల రాబోయే నష్టానికి బాధ్యులవుతారని భారతం బోధించే సత్యం.
|


చాలా బాగా చెప్పారు ..
మంచి విశ్లేషణ..
LikeLike