విశ్వనాధ సాహిత్య యుగ దశలు
విశ్వనాధ సాహిత్య యాత్రాను గమనిస్తే అందులో విభిన్న దశలున్నట్లు కనిపిస్తాయి పరిశీలకులు అందులో ముఖ్యమైన నాలుగు దశలను గుర్తించారు విశ్వనాధ కూడా వాటిని అంగీకరించాడు .వాటి వివరాలూ ఆయనే చెప్పాడు .వాటిని గురించి ఇప్పుడు తెలుసుకొందాం .
విశ్వనాధ సాహిత్య యుగం లో మొదటి దశ ‘’బాల్యావస్థ ‘’ప్రయత్నాలు చేయటం అధ్యయనాలు సాగించటం ,ప్రయోగాలు చేయటం ఇందులో ముఖ్యమైనవి .
ఆయన సాహిత్య యుగపు రెండవ దశ ‘’యోగ వంతమైన కాలం ‘’అని ఆయనే చెప్పుకొన్నాడు .ఆ దశలో సంస్కృతం ఇంగ్లీషు బాగా చదివాడు .ఈకాలం లో మచిలీపట్నం హిందూకాలేజీ లోను గుంటూరు ఏ సి కాలేజీ లోను లెక్చరర్ గా పని చేశాడు .అప్పుడే సంస్క్రుత కావ్యాధ్యయనం చేస్తూ సంస్కృత ,నాటకాలను ,ఆంగ్ల రచనలను కూలంకషంగా అభ్యసించారు .
మూడవ దశ 1938లో ప్రారంభమైనట్లు ఆయనే చెప్పాడు .ఆకాలం లోనే విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఉపన్యాసకునిగా చేరాడు .19 34లోనే రామాయణ కల్ప వృక్ష రచన ప్రారంభించి రెండు వేల పద్యాలలో పదహారు వందల పద్యాలు పూర్తీ చేశాడు కాని పుస్తకం పూర్తీ అయితే ఎలా అచ్చువేయాలో ఆయనకు తెలియలేదు .’’నేను నిత్య చైతన్యం గల రచయితను .నా పుస్తకాలను సరిగా పరిచయం చేయగల పండితుడు నాకు లభించటం చాలా అరుదు .నా పుస్తకాలలోని పదాలను తెరచి చూపగల వాడు నాకు దొరకడం లేదు .నాకు తెలియని అందాలను కూడా చూపించే సమర్ధుడు అలభ్యం ‘’అన్నాడు విశ్వనాధ .
ఆయన కవితాలు చాలాభాగం ప్రచురితమై ఆయన్ను కవిగా చేసి కూచోబెట్టాయి .అప్పటికి ఆయన్ను పాక్షికంగా కొందరే అంగీకరిస్తున్నారు .తనకు ఫాలోయింగ్ బాగా తక్కువగానే ఉన్నట్లు భావించాడు .రామాయణాన్ని పూర్తిగా ప్రచురిస్తే అందులోని గూఢమైన విషయాలు గుర్తించకుండా పోతాయేమోనని వ్యధ కూడా చెందాడు .రామాయణ ప్రచురణకు ఎవరైనా స్పాన్సర్ గా వస్తారేమో నని ఎదురు చూపులో ఉన్నాడు.తనకు సహాయం కావాలని తనను విస్తృతంగా చదవాలని కోరుకున్నాడు ‘’ప్రజలు నా కవిత్వాన్ని ,నా కళా వైదగ్ధ్యాన్ని అర్ధం చేసుకోలేరు .నేను వచనం లో రాస్తే వారు బాగా అర్ధం చేసుకో గలుగుతారు ‘’ఇలా ఆయన ఆలోచనలు సాగుతున్నాయి .
అదేసమయం లో వేయిపడగలు ఒకవార పత్రికలో ధారా వాహికంగా ప్రచురిస్తామని విశ్వనాధ విద్యార్ధి అయిన దాని సంపాదకుడు తన పత్రికలో ప్రచురిస్తానని కోరాడు .దీనినైనా అర్ధం చేసుకోగలుగుతారా అనే అనుమానం ఆయన్ను వదలలేదు వెంటాడుతూనే ఉంది .దాన్ని అర్ధం చేసుకోవటానికి క్షున్నమైన సంస్క్రుతజ్ఞానం ఉండాలి అంటాడు విశ్వనాధ ముందుగా రెండు నవలలు రాసి పాఠకుల స్థాయిని పెంచి వేయిపడగలు చదివి అర్ధం చేసుకొనే స్థాయి కల్పిస్తానని ఆ సంపాదకుడిని అడిగాడు .ఆయన ఒప్పుకున్నాడు .అప్పుడే ‘’మా బాబు ‘’నవల చాలా ఇళ్ళల్లో సామాన్యం గా అర్ధం చేసుకొనే వ్యవహారిక భాషలో రాశాడు .కాని దీనివలన శత్రు వర్గం పెరిగింది ‘’నేను సనాతన కాలపు రచయితనని ,కొత్త పరిణామాలను ప్రతిఘటించే వ్యక్తినని ముద్ర పడి పోయింది ‘’అని చెప్పాడు విశ్వనాధ .
వేయిపడగలు సీరియల్ ప్రారంభమైంది .ఇంకా అందులోని రహస్యాలను అర్ధం చేసుకోగల స్తితిలో చదువరులు లేరు అనే అభిప్రాయమే ఆయనది .’’ఒక పెద్ద కాన్వాసు పై చిత్రించిన విషయాన్ని అర్ధం చేసుకొనే స్థాయి పాఠకలలో రాలేదు.’’కొన్ని చివరలను కలిపి ఒక కధలో రహస్యం గా నేర్పుగా అల్లాను .దీన్ని చదివి నేను కరడుగట్టిన సనాతన వాదిని ‘అని గగ్గోలు పెట్టారు’’అని పాపం విశ్వనాధ నిర్వేదం చెందాడు .ఇవన్నీ 1938 కి ముందు .అప్పటిదాకా ఆయన నవలా రచయితకాడు .ముఖ్యంగా కవి మాత్రమె .’’ఏకవీర ‘’రాసి చాలాకాలమైంది ‘’భారతి ‘’లో ప్రచురితమైంది తనను విస్తృతంగా జనం చదవాలి అని కోరుకున్నాడు .
ఇక మొదలు పెట్టి వరుసగా నవలలు రాసిపారేశాడు .ముప్ఫై ఏళ్ళలో యాభై నవలలు రాశాడు .రాయటం ఒక వ్యసనం గా మారిపోయింది విశ్వనాధ కు .సమర్ధుడైన రాయసకాడు ఉంటె నవల చెబుతూ పది పదిహేను రోజుల్లో పూర్తీ చేసేవాడు .ముక్త్యాల రాజా ఆహ్వానిస్తే వెళ్లగా రచన పూర్తీ అయితే కల్ప వృక్షాన్ని అచ్చు వేయిస్తానని వాగ్దానం చేశాడు . . ఇంకా బాలకాండలో కొంత మిగిలిఉంది అప్పటికి .బాలకాన్డను ఆంద్ర దేశం లో చాలా చోట్ల చదివి వినిపించాడు విశ్వనాధ .సాహిత్య వర్గాలలో మంచి ప్రాచుర్యం పొందింది .బాలకాండ పూర్తీ చేసిన తర్వాత దాన్నిముక్త్యాలరాజా ముద్రించాడు .అయోధ్య మొదలెట్టి చాలాకాలమైనా సహాయం చేసేవారు కరువైనారు .అప్పటిదాకా ఆయన రచన ఏదీ పూర్తియిన తర్వాత ఇంట్లో నిద్రించి ఎరుగదు. హాట్ కేక్ లాగా ముద్రణ జరిగి పోయేది .
నాలుగవ దశ19 40 తోప్రారంభామై 61 వరకు సాగింది . 19 40 -50 కాలం లో నవలలే ఎక్కువ రాశాడు .61 వరకు ఇంతే 19 5 6 లో గుడివాడ కరీం నగర్ లలో షష్టిపూర్తిఉత్సవం జరిగింది 1957 బెజవాదకాలేజీ ఉద్యోగ విరమణ చేశారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి మొదటి ఉపాధ్యక్షులైనారు .1958లో శాసన మండలి సభ్యులైనారు .1959 -6 1 కరీం నగర్ కాలేజి ప్రిన్సిపాల్ .62 లోకల్ప వృక్షం పూర్తీ .6 3 లో మధ్యాక్కరాలకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వచ్చింది 64లో ఆంధ్రా యూని వర్సిటి నుండి ‘’కళా ప్రపూర్ణ ‘’అందుకున్నారు .1969 లో ఉత్తర ప్రదేశ్ పర్యటన . ..రామాయణ రచన కొనసాగుతూనే ఉంది మరికొన్ని కూడా రాస్తూనే ఉన్నాడు .విశ్వనాధకు దాబ్బు అవసరం ఎప్పుడూ ఉండేది .ఎవారైనా పుస్తకం రాయమని అడిగితె దాబ్బు తీసుకొని రాసి ఇచ్చేవాడు ‘’నాశత్రువులు ఆవేశం ప్రోద్బలం లేకుండా రాసే రచయితను ‘’అన్నారని విశ్వనాధ చెప్పాడు. కాని వారెవరూ వాటిని చెత్త పుస్తకాలని అనలేదట .సద్విమర్శకులు మాత్రం మంచి నవలలు అని మెచ్చుకొన్నారు .
19 34 నుండి విశ్వనాధ సాహిత్య యుగం లో అయిదవది అయిన ఉచ్చదశ .వందల సంఖ్యలో గౌరవాలు సన్మానాలు అందుకొన్నాడు విశ్వనాధ .బొంబాయి కలకత్తా ,లక్నో ,మద్రాస్ నగరాలు ఆహ్వానించి గౌరవించాయి .ఉత్తర రాష్ట్రాలలో ప్రముఖ మైన అన్ని పట్నాలలో సన్మానాలు జరిగాయి .’’మా గురువుగారు వెంకట శాస్త్రి గారికి ఎన్ని సన్మానాలు జరిగాయో శిష్యుడైన నాకూ అన్నీ జరిగాయి ‘’అని చెప్పుకొన్నాడు .తన యెడల అప్పటికీ రెండు ప్రవాహాలని ఒకటి తన మిత్రులు నడిపే స్వచ్చమైన గంగా ప్రవాహం అయితే రెండవది తన శత్రువుల కలుషిత నీటి ప్రవాహం అంటాడు .భువన విజయం లో ఆయన శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర పోషించేవాడు .1946 లో బెజవాడ పురపాలక సంఘ వజ్రోత్సవ ఉపన్యాసం చేశాడు .రామాయణ కల్ప వృక్ష కనకాభిషేకం బెజవాడ శ్రీ విజయేశ్వరాలయం లో శ్రీ మల్లాది కుటుంబ రాగారు జరిపించారు .196 7 లో అకాడెమీ ఫెలోషిప్ వచ్చింది. ఏకవీర నవల సినిమా తీస్తున్నందుకు డి ఎల్ నారాయణ విశ్వనాధకు రెండు వేల రూపాయలిచ్చాడు .1970 జనవరి 26న రిపబ్లిక్ డే నాడు పద్మ భూషణ్ ప్రకటించి 21-4-19 70 న రాష్ట్రపతి పద్మభూషణ్ ను ప్రదానం చేశారు . 1971 అక్టోబర్ లో ఆంద్ర ప్రభుత్వ ఆస్థానకవి ‘’పదవీ స్వీకారం చేశారు
16-11 -19 71 లో సాహిత్యం లో అత్యున్నత ‘’జ్ఞాన పీఠం’’పురస్కారం అందుకొని తొలితెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత గా రికార్డ్ స్థాపించాడు విశ్వనాధ .1971లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘’డాక్టరేట్ ‘’ప్రదానం చేసింది .
2 -1 -73 ‘’కోటి శివపంచాక్షరి ‘’ప్రారంభించి పూర్తీ చేశాడు .9 10- 74 మిమిక్రీ ఆర్టిస్ట్ వేణు మాధవ్ కు ‘’శివపురాణం ‘’అంకితమిచ్చాడు .7 -10-74 న విశ్వనాధ పుట్టిన రోజు పండుగను పిల్లలు ఆత్మీయంగా జరిపారు .19 10-7 5 ఉషశ్రీ శ్రీ సన్మాన సభకు అధ్యక్షత వహించారు .13 1 7 6 సహస్ర చంద్ర దర్శనమహోత్సవాన్ని శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరావు మొదలైన వారి సమక్షం లో 16- 9- 76 వరకు జరుపుకున్నారు . గుండె జబ్బురాగా గుంటూరు జనరల్ హాస్పిటల్ లో చేరి 18 -10-1977 కవిసామ్రాట్ ,పద్మభూషణ్ ,తొలి తెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డా.విశ్వనాధ సత్యనారాయణగారు తనునమ్మిన శ్రీ రాముడు పంచాక్షరి తారక మంత్రం చెవిలో చెబుతుండగా తను ఆరాధించిన శ్రీ విశ్వేశ్వర సన్నిధానం చేరారు .
విశ్వనాధ పై సీరియల్ వ్యాసాలు సమాప్తం
శ్రీ లాల్ బహదూర్ శాస్ట్రి జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

