‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1

1-‘’శ్రీ మాతా శ్రీ మహా రాజ్ఞీస్శ్రీమస్సి౦హాసనేశ్వరీ –స్వధ్యాసీనా దేహలీ-

-స్వప్నే దృష్టా ద్రుస్టతః కల్పవల్లీ –శిల్పానల్పా కల్ప బా భాసమానా ‘’

తాత్పర్యం –మంగళకరమైన తల్లి ,సహస్ర నామాది భూతమైన శ్రీ మాత్రు మంత్రానికి అధిదేవత ,సంపత్కారిణి ,శ్రీ విద్యా స్వరూపిణీ ,శ్రీ విద్యలో సర్వాధిస్టాత కామేశ్వర స్వామి పట్టపు దేవి అయిన ముత్తైదువు,పూజనీయ ,మా ఇంటి గడప మధ్య భాగం లో కూర్చుని ,కల్పలతలచే సృస్టింపబడిన అంతులేని శిల్ప ప్రావీణ్యం గల సర్వ ఆభరణాలచేత ప్రకాశించే నా తల్లి నా అదృష్ట వశాత్తు నాకు స్వప్నం లో కనిపించింది .

2-‘’సౌమంగల్య శ్రీ నిదానాంగ యస్టిం-తామీక్షిత్వా భూవ మస్మిస్మితాస్య

హేతుం ప్రుస్టోహంత యానైవ కించి –త్స్వాభావ్యా దేవేత్య వోచం వినీతః ‘’

తా –సౌందర్య సంపాదకు నివాసమైన యష్టివంటి శరీరం కల ఆతల్లిని చూసి నేను చిన్నగా నవ్వాను .ఎందుకు నవ్వావు అని ఆమె అడగగా ,ఆ ఏమీ లేదు స్వాభావికంగానే నవ్వా అని వినయం తో చెప్పా .

3-‘’భావోనోదీయుర్నిమిత్తం వినాక్వా-ప్యా చక్ష్వత్వం కిన్నిమిత్తం స్మితంతే

ఇత్థం ప్రుచ్చం త్యాంజనాన్యా మవోచ –మానేతవ్యో వ్యాస మౌన్యత్ర చేతి ‘’

తా-‘’నవ్వు ఊరికే రాదు .నీనవ్వుకు కారణం ఏమిటి ‘’?’’కారణం చెప్పాలంటే వేద వ్యాసమహర్షి ఇక్కడికి పిలి పించాల్సి ఉంటు౦దితల్లీ ‘’అన్నాను

4-‘’కిం కార్యం తే నాత్ర రేత్వం వదేతి –నిర్భార్త్యోక్తః ప్రాంజలి ప్రహ్వ భాస

సంతోషేణా స్యాంచ భక్తీ ప్రపత్యా –నామం నామం మాతరం వాచా మూచే ‘’

తా-‘’ఆయనతో నీకేం పని ?నవ్వుకు కారణం చెప్పు ‘’అని మాత గద్దించింది .అది సంతోష కారణమై భక్తితో మాటిమాటికీ నమస్కరిస్తూ నేను చెప్పటం మొదలు పెట్టాను .

5-‘’ప్రుచ్వా మిత్వా మాంబ సందేహ మేతం –న ప్రస్టవ్యం బాల భావాద వోచం

అస్మాన్సూత్వా సాధ్వి దేవం కిమూఢా –వోఢవేశానం మాతరస్మా న్ప్రసూతా ‘’

తా-అమ్మా !ఒకసందేహం వచ్చి నిన్ను అడుగుతున్నాను .న్యాయంగా అడగ కూడదనుకో .కుర్రచేస్టతో అడుగుతున్నా .పతివ్రతా తిలకమా !మమ్మల్ని అందర్నీ కన్న తర్వాత శివుడిని పెళ్లి చేసుకోన్నావా ?లేక కామేశ్వరుని పెళ్ళాడి మమ్మల్ని కన్నావా ?’’

6-‘’ప్రశ్న స్యాస్యా త్రాస్తియద్వానిమిత్తం –మాతర్జానే నైవ కించి ద్విమూఢః

ఆహూ యావాభ్యాంమహర్షి స్సుమేదా –వేదం వ్యాసో విష్ణు రేవా నుయోజ్యః ‘’

తా-ఈ కొంటె ప్రశ్న కు  కారణం ఏమిటి అని అడిగితె నాకేం తెలీదమ్మో-మనిద్దరికీ ఈ సందేహ నివృత్తి చేయగలాడు వ్యాసుడే .నన్నే పిలిచి అడగమంటే ఏను కుర్రాడిని .అంతటి మహర్షిని అడిగే దమ్ము,అధికారం  లేనివాడిని .నువ్వే పిలిచి అడగమనే రాజసమూ లేని వాడిని .క్షమించు .

7-మంత్రాద్రస్టాసౌ  పురాణేతి హాసాన్ –లక్షైర్లక్శైః శ్లోక జాలైః ప్రణీయ

కృత్వా కార్షీద్విశ్వ విశ్వోపకారం –త్వత్పాఠార్ధం నాలమాయు ర్జనానాం’’

తా-మంత్రం ద్రష్ట అంటే మంత్రాలను చూసినవాడు అలాంటి వ్యాస భగవానుడు పురాణ ఇతిహాసాలలో లక్షలకొద్దీ శ్లోకాలు రాసి లోకాలకు మేలు చేశాడు .అవన్నీ చదవాలంటే మనిషి ఆయుర్దాయం చాలదు .ఇక విమర్శించటానికి సమయమెక్కడిది తల్లీ !

8-కిన్చిత్కించి౦ చిత్తత్ర తత్తత్పఠిత్వా-సందేహాబ్దౌ మానవౌ ఘోనిమఘ్నః

ఆర్ష గ్రందేషూత్తరం ప్రశ్న దేశే –సంబద్ధంస్యాదిత్య నూచాన వాదః ‘’

తా- ఆ పురాణ  ఇతిహాసాలను కొంచెం కొంచెం చదివి మానవులు సందేహాలలో మునిగిపోయారు .అది రాసినవాడిదో గ్రందానిదో తప్పుకాదు .రుషి ప్రోక్తాలలో ప్రశ్న ఉన్న చోటేసమాదానమూ ఉంటుంది .ఆరు ప్రమాణాలతో మీమాంస శాస్త్రం పద్నాలుగు ప్రమాణాలతో అలంకార శాస్త్రం ద్వారా అర్ధం చేసు కోమని,గురుని ముఖతానేర్చుకోమని వేదం వేదాంగాలు చెప్పాయి .

9-‘’బ్రహ్మాండే శ్రీ లాలితాఖ్యాన బంధే –భంఢో నామ్నా మొహవద్దుర్ని వారః

ఆసీద్విశ్వం స్వాత్మ సాత్క్రుత్య కృత్యా –దక్షం రక్షః ప్రాణిజాలం బాబాధే ‘’

తా-బ్రహ్మాండ పురాణ లలితోపాఖ్యానం లో మూల అజ్ఞానం తో నివారింప లేని భండుడు అనే రాక్షసుడు ,ప్రయోగ దక్ష్టతతో ప్రపంచాన్ని అంతటిని తన స్వాధీనం లోకి తెచ్చుకొని ప్రాణులను విపరీతంగా హింసించాడు .

10-‘’ఏతస్యాసన్మ౦త్రిణస్సైనికాశ్చ –సేనా నాధాఃపుత్రా పౌత్ర ప్రవర్గాః

తై స్తై స్సాకం గ్రీష్మ వద్భీష్మ వచ్చ-చక్రే సర్వం తాప పర్యాకులం సః’’

తా-భండాసురుడు మంత్రి సేనా కుమారాదాలుతో కలిసి ఆరేడు లోకాలను గ్రీష్మ తాపంలాగా విజ్రుమ్భించి కలవరానికి గురి చేశాడు .

11-‘’భేదే దక్ష స్తస్య మంత్రీ విషంగః –జన్తోర్యోగం జంతునా నానుమంతా

ఉత్పన్నం శుక్రం వికర్షే ద్విశుక్రః –స్త్రీణాంపుంసాం దుర్బల స్తేన లోకః ‘’

తా-భేదోపాయం తెలిసిన వాదిమంత్రి విషంగుడు ఒకరితో మరొకరు కలవకుండా చేశాడు .స్త్రీ ,పురుషుల శుక్ర శ్రోణితాలనుదొంగతనం గా ఎత్తుకుపోయి దుర్బలులను చేస్తున్నాడు .ఇలా జగత్తు తల్లడిల్లుతోంది .

12-‘’ఆతార్ణం వ్యాప్నోతిచా బ్రాహ్మ లోకాత్ –నాస్తి త్రాతా కశ్చి దన్యోహ్య ముష్మాన్

విష్ణోర్భీతో నైతి వైకుంఠ మేష –స్వామీ నాప్యాయాతి-హిత్వా తదత్ర ‘’

తా-భండాసురిని బారి నుండి రక్షించేవాడేవ్వరూ గడ్డిపరకనుండి బ్రహ్మ లోకం వరకు కనిపించలేదు.విష్ణువు అంటే భయం తో విష్ణులోకానికి మాత్రం వెళ్ళలేదా రాక్షసుడు .

13-‘’తస్మిన్ కాలే నాదరో నిర్దరోపి-మౌనీ ప్రాపన్నారదో విష్ణు లోకం

స్తుత్వా దేవం సత్క్రుతస్తేన సో సౌ –లోక స్యార్దే పృష్ట ఏనం జగాద ‘’

తా-భయం అభయం రెండూ లేని నారదుడు విష్ణులోకానికి వెళ్లి ,ఆయన్ను స్తుతించి సత్కారం పొంది లోకం లోని విశేషాలేమిటి అని అడిగిన దేవ దేవునితో ఇలా చెప్పాడు .

సశేషం

నవ రాత్రి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-15-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.