ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-4
హాముల కమ్మ్యూనికేషన్ విధానం ఎలా ఉంటుంది ?
హామ్స్ కు కమ్మ్యూనికేషన్ విధానం లో గొప్ప విభిన్నత ఉంది ..ఎక్కువగా ‘’వాయిస్ ‘’ద్వారా కమ్మ్యూని కేషన్ చేస్తారు .కొందరు ఇంటర్నెట్,డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు .మరి కొందరు ఎమేచ్యూర్ టెలివిజన్ ద్వారా కూడామాట్లాడుకొంటారు .అంటే ఇందులో వాయిస్+టెక్స్ట్ +వీడియో కలిసి ఉంటాయన్నమాట .
కాల్ సైన్ అంటే ?
ప్రభుత్వ సంస్థలైన పోలీస్, మిలిటరీ,ఏవియేషన్ ,మరియు స్పేస్ వ్యవస్థలతో పాటు హామ్స్ కు కూడా తాము ఉపయోగించే రేడియో స్టేషన్ లను గుర్తించి కాల్ సైన్ ఇస్తుంది .ఇది లేకపోతె ఎవర్నీ గుర్తించటం కుదరదు .విమానం నడిపే పైలట్ కు కూడా ప్రభుత్వం కాల్ సైన్ వాడటానికి అర్హత పరీక్ష పెడుతుంది .
హాం క్లబ్ అంటే ?
యువత ప్రజోపకారం కోసం అనేక స్థానిక సమూహాలను పెట్టుకుంటారు వీటినే హాం క్లబ్ లంటారు .క్లబ్ లైసెన్స్ కు కూడా ఇరవై ఏళ్ళకు వెయ్యి రూపాయల ఫీజు మాత్రమె ఉంటుంది .ప్రతి స్కూలు కాలేజి ,లేక ఏ సంస్థ అయినా క్లబ్ లైసెన్స్ ను పొందచ్చు .హామ్స్ ,హాం క్లబ్స్ అంతర్జాతీయ సంబంధాలను (గుడ్విల్)విస్తరించటానికి ఉపయోగిస్తారు .ప్రసార నైపుణ్యం పెంపొందించుకొనే వారికి ఇదొక గొప్ప వరం .సామాజిక ఆర్ధికాభి వృద్ధికి హాం తోడ్పడుతుంది .ఎందరో హాం ప్రయోగాలవలన ఆర్ధికపుష్టి పొందారు .చాలామంది స్వంత ఇండస్ట్రి, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు . మోర్స్ కోడ్ ఉపయోగమేమిటి ?
మోర్స్ కోడ్ తో హాం రేడియో లో మాట్లాడుకొనటమేకాక ప్రయోగాలు చేస్తారు .ఇప్పుడు దాని అవసరం లేకుండానే వాయిస్ ద్వారా మాట్లాడుకోవటానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తోంది .ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ,విమానాల్లో వారికి నౌకల్లోని వారికి మోర్స్ కోడ్ ద్వారా సంకేతాలు పంపుతారు .
N .I .R.అంటే ?
ఇదొక జాతీయ సంస్థ .’’నేషనల్ ఇన్ ష్టి ట్యూషన్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో “’. శ్రీ సూరి శ్రీరామ మూర్తి హైదరాబాద్ లో స్థాపించారు .ప్రపంచం లోని అన్ని దేశాల వారూ దీన్ని గుర్తించారు .ఆహ్వానించి అవార్డులూ ,రివార్డులు అందజేశారు .చా;లా మంది సభ్యత్వం పొందారు .ఇండియాలో రేడియో ఔత్సాహికులకు ఇది ఒక పెద్ద ఆదర్శ సంస్థ .ప్రపంచం లో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ గుర్తించి ప్రభుత్వానికి ,ప్రజలకు ,విద్యా సంస్థలకు అందజేస్తుంది .N I r సభ్యులకు పుస్తకాలు సమాచారం ప్రత్యెక ఆపరేటింగ్ ఈవెంట్స్ అందిస్తుంది .నిరంతర విద్యా శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది .హామ్స్ భారీగా ప్రయోజనం పొందే కార్యక్రమాకు రూపకల్పన చేసి అమలు చేస్తుంది .రాష్ట్ర ప్రభుత్వాలు ,సంస్థలు కొన్ని ప్రోగ్రాములకోసం యెన్ ఐ ఆర్ ను ఉపయోగిస్తారు .హామ్స్ లో’’ ముదుళ్ళు’’అంటే సీనియర్స్ ను ‘’ఎల్మేర్ (Elmer)అంటారు .మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘’www.niar .org ‘’నుంచి పొందచ్చు .
హాం గోల ఏమిటి ?
మొదట్లో వైర్లెస్ ఆపరేటర్లు సముద్రం లో ప్రయాణం చేసే నౌకలు ,లేక కోస్తా స్టేషన్ల కార్యాలయాలకోసం దీన్ని ఉపయోగించేవారు .ఆ తొలి నాళ్లలో ప్రతి స్టేషన్ ,దాని విస్తృత స్పార్క్ సిగ్నల్ లోమొత్తం స్పెక్ట్రం ఆక్రమించింది . ప్రభుత్వాలు నౌకలు ,తీర స్టేషన్లు ఔత్సాహిక ఆపరేటర్లు ఎవరికి వారు ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు .ఔత్సాహిక కేంద్రాలు చాలా శక్తి వంతంగా ఉండేవి. ఔత్సాహికులు వారి పనితీరుతో వాణిజ్య ఆపరేటర్లకు చెమటలు పట్టించి నిరుత్సాహం కలిగించేవారు . .ఉడుకు మొట్టు తనం తో వాళ్ళు వీళ్ళని ‘’హామ్స్ ‘’అని ఎద్దేవాగా పిలవటం మొదలెట్టారు .ఆ తర్వాత ఫ్రీ క్వెన్సి ని కనుక్కున హెర్ట్జ్ ,కరెంట్ తో ప్రయోగాలు చేసిన ఆర్మ్ స్ట్రాంగ్ ,మొదటి వైర్లెస్ స్టేషన్ వార్తలు పంపిన మార్కొని శాస్త్రజ్ఞుల పేర్ల లోని మొదటి అక్షరాలను కలిపి ‘’H A M ‘’అన్నారు అంటే ‘’ఔత్సాహిక రేడియో ఆపరేటర్లు ‘’అని పిలిచారు .మొత్తం మీద మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే ‘’రేడియో తరంగాల ను ఉపయోగించి ఔత్సాహికం గా పయోగాలు చేసే వారందరినీ ‘’హామ్స్ ‘’అనవచ్చు .ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఇదే అర్ధాన్ని నమోదు చేసింది .
Hertz
Armstrong
Marconi
Suri Srirama Murthy
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-15-ఉయ్యూరు

