మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -6
71-భక్త్యా వందేమాతరం భోః ప్రసీద -యద్వా వచ్మ్యే వాహ మ౦గీ కురుష్వ
విద్యా పారోక్ష్యా పరోక్షత్వ యోర్వా -బాలత్వా బాలత్వ సంకేత ఈద్రుక్ ”
తా-”తల్లీ !భక్తీ నమస్కరించి అడుగుతున్నాం నువ్వు చెప్పక పొతే ,నాకుతోచింది చెబుతా అనుగ్రహించు .బాల అంటే పరోక్ష బ్రహ్మ విద్య .నీ పంచదశి ప్రత్యక్ష బ్రహ్మ విద్య .ఈ బాలత్వ ,అబాలత్వాలు ఒకటితక్కువ ,మరోటి ఎక్కువ అనే అర్ధాన్ని ఇవ్వటం లేదా ?
72-”మంత్రస్తే కూట త్రయాత్మా తటస్త -త్సార భ్రాజత్ర్యక్షరో స్యామనుశ్చ
తత్తా వచ్చిన్నో జయ మంగ ప్రబేదః -యద్వా హేతు స్తద్వి భూతో ర్విభాగః ”
తా-మూడు కూటాల నీ మంత్రం 15 అక్షరాలూ కలది .ఈ మూడు కూటాల సారమే మూడక్షరాల బాల మంత్రం .ఈ భేదం దీని నుంచి వచ్చిందా ?ఏక పాద్విభూత్య ధిస్టాత్రి బాల ,త్రిపాది విభూత్యధిస్టా త్రి బాల అనే విభూతులను బట్టి వచ్చిందా ?
73-”అస్మాదావిర్భావతః పూర్వ సిద్దే -రూపే వావాం మాత్రు పుత్రీ త్వ సిద్ధిం
ఊకారే నైవోత్తమా౦ గ౦ విచాల్య- దేహ్యాజ్ఞానం త్వం ప్రస్తుతో పక్రమాయ ”
తా-ఇక్కడ అవతరించటానికి ముందు సిద్ధమైన మీ రూపాలలో తల్లీ కూతురు గా ఉండి ,అదే ఇక్కడ కొన సాగుతోందా ?నువ్వేం కస్టపడద్దు .”ఊ ”కొట్టు చాలు .లేదా తల ఊపు అంతే.ఏదో రకంగా నువ్వు ఔనను .ఇక కధలోకి వెడ దా౦.
74-”ప్రాక్సర్వేశానో తర రాజాది రాజః -రాజ్ఞీ తస్యే హాస్తి కామేశ్వరీయం
బాలా బాలాయు వ రాజ్యేభి శిక్తా -పర్యావ వ్రుశ్శక్తి సేనా న్సమంతాత్ ”
తా-పూర్వం సర్వేశ్వరుడైన కామేశ్వరుడు జగజ్జనకుడు .రాజాది రాజు .ఆయనభార్య కామేశ్వరి ,ఇక్కడ రాణి ఉన్నది .ప్రౌఢ అయిన బాల యౌవ రాజ్యానికి అభిషేకింప బడింది .శక్తి సేన అంతటా విస్తరించింది .
75–”బాహ్యాన్తర్ద్రుష్టి శ్శివో దూత భూతః -మన్త్రిన్యంబా మంత్ర యత్యర్ధ జాతం
శ్రీపూశ్చక్రం దుర్గమం దుర్ని రూపం -తత్రత్యానాం భీర్న సిద్ధామ్రుతాత్తి”
తా -బహిరంతర్ముఖుడైన శివ దేవుడు రాచకార్యాలలో దూతగా పని చేస్తాడు .మంత్రిణీ శక్తి మంత్రాలోచన చేస్తుంది .చక్ర రూపం లో ఉన్న శ్రీ పురం నిరూపించ టానికి వీలుకాట్టిది .ఇతరులు అక్కడికి చేరుకోలేరు .అక్కడి వారికి భయం లేదు .అమ్రుతానుభవం సిద్దించేది .
-”సుధా సిన్దోర్మధ్యే సుర విటపి వాటీ పరివృతే -మణి ద్వీపే నీపోప వన వతి చింతామణి గృహే
శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం -భజన్తిత్వాం ధన్యాః కతి చన చిదానంద లహరీ ”
తా-అమృత సముద్ర మధ్య లో కడిమి తోటలో చింతామణి గృహం లో బ్రహ్మ రుద్ర ,ఈశాన,రూపాలలో ఉన్న మంచం పై సదాశివుని పర్యంకం పై నివశించి ఉన్న జ్ఞానానంద ప్రవాహమైన నిన్ను ఓ పర దేవీ అదృష్ట వంతులైన కొందరు మాత్రమె సేవించగలరు .(శ్రీ శంకరుల సౌందర్య లహరి )
76 -సంనద్దే త్ధం ప్రాహి ణోత్తం శివేశం -దౌత్యం కర్తుం దైత్య నాదాయ సద్యః
దౌష్ట్యం త్యక్త్వా దేవ భావే వనద్వం -నో చేద్ధన్యా౦ మూల కాషం కషిత్వా ”
తా-సర్వ సనద్దురలైన దేవి శివుడిని భండాసురుని వద్దకు దూతగా పంపిది ”.రాక్షస భావం వదలి దేవభావం తో లోకాలను బాధించకుండా ఉండు .లేక పొతే మొదటికే మోసం వస్తుంది ”అని చెప్పమని పంపిది
77 -”సోయం గత్వా భండ రక్ష స్సభాంతం -నిర్భీ రూచే వాచికం తద్యదోక్తం
క్రుద్ధ స్సంరద్దో ట్ట హాసం ప్రకుర్వన్ -జల్పన్నాల్పం హ్యాది దేశ స్వభ్రుత్యాన్ ”
తా-వాడి సభకు వెళ్లి దేవి చెప్పినట్లు శివుడు దూత వాక్యం పలికాడు .మండిన భండుడు భటులకు ఆజ్న ఇచ్చాడు .
78-”ఆభీలో హో కాల ఉచ్చా వచో సౌ -రామా మామాకార యతీ హి యుద్ధే
కర్తవ్యమ్ యత్త త్కరిష్యా మహేశ్వో -దూతం బధ్వా తాడయద్వం సమేతా ”
తా-ఏమి కాల వైపరీత్యం !ఒక ఆడది నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుందా ?వెంటనే ఈ దూతను బంధించండి ”అన్నాడు .
79-‘భర్త్రా జ్ఞాప్తా స్తేన సమీయు స్సమంతాత్-దండైః కాస్టై రశ్మ భిస్తాడ యంతః –
నాచే కిన్చిత్స స్మితాస్య శ్శి వోయం -స్థాణుస్సంరంభం తదీయ౦ హిసే హె”
తా-రాక్షస భటులు ప్రభు అజ్ఞ ప్రకారం కర్రలతో రాళ్ళతో , ఆయుధాలతో శివుడి చుట్టూ చేరారు .స్థాణు వైన పరమేశ్వరుడు చిరు నవ్వులు చిందిస్తూ ఉన్నాడు .వారి సంరంభాన్నంతటిని పురారి సహి౦చాడు .
80” ఆఘతాస్తా న్ఘాతు కానేవ జఘ్నుః-భిన్నా భిన్నా రక్త సిక్తాశ్చ పేతుః
చిత్రం చిత్రం చిత్ర మిత్యుచ్చ రంతం -నో చిత్రం సహ్యాంత రాత్మా జనానాం ”
తా-వాళ్ళు శివుడిని కొట్టే దెబ్బలు వాళ్ళనే బాధిస్తున్నాయి .ఒళ్ళు తిరిగి బ్రద్దలై ,రక్తం కారుతూ ”చిత్రం భళారే విచిత్రం ”అంటూ భరిస్తున్నారు .ఆయన అందరికి అంత రాత్మ యే కదా ”
రేపు మూలా నక్షత్రం -శ్రీ సరస్వతీ పూజ శుభా కాంక్షలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-15-కాంప్ -బాచుపల్లి -హైదరా బాద్
—

