మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -13

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -13

156-’’తన్మాయా మాయి ప్రతీక ప్రకారం –విశ్వం విశ్వం తావభివ్యాప్య సుస్థౌ

ఏతత్సర్వంస్థూల దేహేస్తిసౌక్ష్మాత్ –ప్రత్యక్షం తద్యోగిన స్సంవదంతి’’

తా-ఆ మాయ ,మాయి అవయవాల ప్రకృతే ఈ విశ్వం .ఆ ఇద్దరూ విశ్వమంతా నిండి ఉన్నారు .ఈ ప్రపంచంతా స్థూల దేహం లో సూక్ష్మం గా వ్యాపించి ఉంది .యోగ శాస్త్రానుభావం కలవారికి ఇది అనుభవైక వేద్యమే .అంటే ఈ శరీరం లో చూసి వారు సర్వ లోక వృత్తాంతాన్ని చెప్పగలరన్న మాట .

157-‘’ఆవిర్భూతా సైవ మాయా హ మత్రే-త్వం తర్జ్నానా ల్లోక మాతా శివావా

లక్ష్మీర్వాణీవాఫై యాకా చిదన్యా-సీతా దీనాంమాతృ తేత్ధం హి సిద్ధా’’

తా-ఆ మాయా దేవియే నేను .ఇప్పుడిక్కడ ఆవిర్భ వించాను అనే ఆనతరంగిక జ్ఞానం వలన పార్వతి అయినా ,లోక మాట కావచ్చు ,లక్ష్మీ దేవీ కావచ్చు నారోక రెవరైనా జగజ్జనని కావచ్చు .ఇలా సమన్వయము చేసుకొంటే సీతా ,రుక్మిణీ మొదలైన అవతార వ్యక్తులకు ,లోపాముద్రాది సిద్ధ స్త్రీ వ్యక్తులకు జగన్మాతృత్వం సిద్ధిస్తుంది .

158-‘’వైరాజీయా సృష్టి రేషాత్ర దృశ్యా –యుగ్మం వామస్తంబ పూర్వం స్వయం తత్

ఇచ్చా మాత్రా ఏష సృష్టిః పురాణీ-సూక్ష్మా సృష్టి ర్మాచ హైరణ్య  గర్భీ ‘’

తా-ఈ ప్రకరణం లో విరాట్ పురుషుని చేత చేయ బడిన సృష్టినే చూస్తున్నాం .మీ దాంపత్యం స్వయం సిద్ధమై ఆ రూపంగా పూర్వమే ఉంది .తలఛి నంతనే సంభ వించే పురాతన ఈశ్వర సృష్టి ,హిరణ్య గర్భుడు చేసిన సూక్ష్మ సృష్టి –రెండిటిలోనూ మీ దాంపత్యమే భాసిస్తోంది .

159-అస్మిన్పక్షే నిర్వివాదః ప్రసంగః –కాళీదాసో ప్యాహ పూర్వ ప్రసిద్ధం

మాతుర్భర్తా సౌ పితా భూత్పితుస్సా-పత్నీత్వా న్మాతా భవద్బ్రహ్మ శక్తిః’’

తా-ఇలా చేసిన ప్రసంగం అంటా వివాద రహితమైనది .కాళిదాస మహా కవి కూడా పూర్వ సృష్టి ప్రసిద్ధిని చెబుతూ తండ్రి భార్య తల్లి అనే చెప్పాడు .తల్లికి భర్త తండ్రి అవుతాడు .తండ్రిభార్య తల్లి అవుతుంది .అదే ఇక్కడ బ్రహ్మా, శక్తి.

160-‘’ఏకా మూర్తిస్సా త్రిదా భేద మాపే –త్యాహ స్మాసౌ కాళిదాస స్త్రి మూర్తీన్

తన్యాయే నైవాప సాపి త్రిదాత్వం –నానాత్వం వా నాత్ర చోద్యా వకాశః ‘’

తా-ఈ కాళిదాసే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గూర్చి చెబుతూ అదొక్కటే స్వరూపం మూడు విధాల వ్యక్తీ భేదాన్ని పొందింది .ఈ ముగ్గురిలో వారు చేసే పనులలో హెచ్చు తగ్గులు ఉండచ్చు కాని స్వయం గా భేదం లేనివారే అని చెప్పాడు .ఈ పద్ధతిలోనే శక్తి కూడా కార్య వశాత్తు మూడు రూపాలు లేక నానా రూపాలు పొందింది .ఇందులో ఎవరూ ప్రశ్నించటానికి ఏమీ లేదు .

161-‘’అస్మన్యాతా పూర్వ మూద్వా చితంసా –హ్యస్మాన్సూతా నిర్వివాదో యమర్ధః

పూర్వం ద్రస్ట్రూణా మభా వాదవిత్తః-తత్సద్భావా దద్యవేద్యో వివాహః

తా-ప్రస్తుతానికి వద్దాం –మా అమ్మ జగన్మాత చిద్రూపాన్ని ముందే వివాహమాడి ,తర్వాతే మమ్మల్ని అందర్నీ కన్నది .ఇది వివాద రహితం .అప్పటి వివాహానికి సాక్షులు లేరు .ఇప్పుడు చూసే సాక్షులున్నారు .కనుక పార్వతీ పరమేశ్వరులు ,లక్ష్మీ నారాయణులు ,మొదలైన వారందరి పెళ్ళిళ్ళు ఇప్పుడు తెలుస్తున్నాయి .

162-‘’భక్తోత్సాహా ద్వత్సరే వత్స రేవా –మాసే మాసే వాసరే వాసరేవా

మాతా పిత్రోర్నిత్య కల్యాణ మాసీత్ –అఘ్న్యే కస్మిం స్తచ్చతం వా సహస్రం ‘’

తా- ఆ దంపతులకు ఒక సారి పెళ్లి కాని ఇన్ని సార్లు పెళ్లిళ్ళా అనే అనుమానం వద్దు .భక్తుల ఉత్సాహం తో ప్రతి ఏడాది ,ప్రతి నెలా ,ప్రతి రోజూ ఆ పురాణ పుణ్య దంపతుల కు నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భక్తితో చేస్తున్నారు .ఒక్కో సారి వందా, వెయ్యి కల్యాణాలను కూడా చేస్తున్నారు .

163-‘’ఇత్ధం గాదాయాః పురాణ ప్రసిద్ధా –యోగాత్సా౦ఖ్యా ద్వా ద శారీర కార్దే

తాన్సర్వా న్సమ్యక్సమర్దా భవంతి –తద్ద్రుస్ట్యా ర్యై ర్ముక్త మన్వేతు మర్హాః’’

తా-ఇలా పురాణ ప్రసిద్ధ కధలు ఎన్నో ఉన్నాయి .ఇవన్నీ యోగ మతం ,సాంఖ్య మతం లను అనుసరించి ,జీవుల మోక్ష ప్రయోజనానికి సర్వవిధాలా చక్కగా సమర్ధనీయం అవుతున్నాయి .పూజ్యులైన పెద్దలచేత పురాణాలను అన్వయింప జేసుకోవాలి .ఇదే ఉత్తమ మార్గం .

164-‘’ఏవం మూలాధార సంస్థం గణేశం –సర్వజ్ఞో సా వర్చ యామాస శర్వః

స్వస్యోద్యా ద్వాహే కాల యోగా త్కుమారం –పశ్చాదా విర్భా వ యామాస గౌరీ ‘’

తా-ఈ విధంగా సృష్టికి మొదట్లో ప్రతి జీవి మూలాధార చక్రం లో గణపతిని సర్వజ్ఞుడైన పర మేశ్వరుడు తన వివాహ సమయం లో పూజించాడు .లోకాలకు అవసరమైనప్పుడు పార్వతీ దేవి అతడిని తన కుమారుడిగా స్థూల దృష్టిలో కనిపింప జేసింది .

165-‘’శ్రీ కృష్ణ ద్వైపాయనర్షే నమాంసి-పాణిభ్యాం పాదావు పాదాయ కుర్వే

యద్వాత్వద్వా త్పాదాంత భూమౌ నిపత్య –సాస్టాంగ స్పర్శం నమామి ప్రసీద ‘’

తా-కృష్ణ ద్వైపాయన ముని శ్రేస్టా !నా రెండు చేతులతో నీ రెండు పాదాలనంటి నమస్కరిస్తున్నాను .ఒక విధంగా నీ పాదాలకు దగ్గర భూమిపై పడుకొని కరచరణాది అవయవాలు ఎనిమిది భూమికి తాకేట్లు నమస్కరిస్తున్నాను .అనుగ్రహించు మహాను భావా !

166-‘’త్వద్వా గంబోదేః పరం పారమేతు౦ –కోప్యేకో ప్యాలోక్యతే నో సమర్దః

మాతా స్వప్నవ్యాజతో వాచ యన్మాం-బాలోక్తీసశ్శ్రో  తు౦ హి కౌతూహలేన’’

తా-ఓ గుగ్గురూ !పరమమునీ !నీ పురాణ వాగ్దోరణి అనే సముద్రం యొక్క అవతలి ఒడ్డును చేరటానికి ఈ లోకం లో ఒక్కడు కూడా సమర్ధుడు లేడు.నేను నీ పురాణాలమీద సిద్ధాంతం చెప్ప గలిగే సమర్దుడినా !పిల్లల వచ్చీ రాని  మాటలు వినాలనే వేడుక గల తల్లి ఐన పరాశక్తి ‘’కల ‘’అనే వంక తో నన్ను ఇట్లా వాగించావు కదూ !

167-‘’మౌనిన్ తే త్రాకారణం త్వే తదర్ధం –దోషం త్యక్త్వా భాషితం మే శ్రుణుష్వ

శ్రుత్వా స్యాయా శ్ష్రావయా సాదు సాధూ –భీతో మాతుస్త్వాం శరణ్యం భజామి ‘’

తా-మునిముఖ్యా వ్యాసా !ఈ చిన్న విషయానికే నన్ను వీడు నన్ను పిలిచాడా అని తప్పు పట్టకుండా నే చెప్పేది విను .మంచి చెడు తేల్చు .తల్లి వలన భయం తో చనువుగా నిన్ను రక్షకుడిగా భావించి వేడు కొంటున్నాను .

168-‘’వేదే వాదే త్వ త్పరీ వాద బాదే –బోధ ప్రాయాం శేముషీం మే ప్రదేహి

స్వర్గే మోక్షేవాన్యన్య జన్మ ప్రసంగే –సాధ్వధ్వానంప్రాపయాస్తు ప్రణామః ‘’

తా-వేదం విషయం లో వాదం వచ్చినా ,నీ పురాణాల విషయం లో ఆక్షేపించే వాళ్ళ మాటలు వినాల్సి బాధ పడేటప్పుడు గాని సత్యమైన అర్ధాన్ని తెలుసుకొనే సద్బుద్ధిని నాకు ఇవ్వు .స్వర్గ మోక్షాల విషయం లో ,ఉత్తరజన్మ విషయ ప్రసంగాలలో  మంచి మార్గం లో నన్ను నడిపించు .నేను నీకేమి ఇవ్వగలను ?ఒక్క నమస్కారం సమర్పించటం తప్ప ?

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-15-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.