ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -174
66-జీవిత చరిత్ర రచనలో కొత్త దారులు తొక్కిన బ్రిటిష్ రచయిత –లిట్టన్ స్ట్రాచీ
చారిత్రిక జీవిత చరిత్రలను విప్లవాత్మకంగా మార్చి కొత్త ప్రమాణాలు సృష్టించిన బ్రిటిష్ రచయిత లిట్టన్ స్ట్రాచీ.సిగ్గరి అయిన ఆయన ఎప్పుడూ తల్లిని అంటి పెట్టుకొనే ఉండేవాడు .గడకర్రలాగా బారుగా పూచిక పుల్లలాగా అతి సన్నంగా ఉండేవాడు .తమాషాగా ఉండే వెలవెల బోయే చర్మం ,తీక్ష్ణమైన దృక్కులు విలక్షణంగా ఉండి మరింత ఆశ్చర్యం కలిగించేవి .ఎడ్వర్డ్ లియర్ లిమరిక్కులు గుర్తుకొస్తాయి అతన్ని చూస్తె .కొందరు రచయితలతో ‘’బ్లూమ్స్ బరి గ్రూప్ ‘’ఏర్పడింది .అందులో సభ్యుడే అయినా పెద్దగా మాట్లాడకుండా ,శ్రద్ధగా వింటూ ‘’గూని వాడు ‘’లాగా ఒక మూల కూర్చునే వాడు .కళ్ళకు అద్దాలు గడ్డాలు మీసాలు తో ఎప్పుడూ వింటున్నా అవసరం వచ్చినప్పుడు యెగిరి గంతేసి అభిప్రాయం చెప్పేవాడు .కుటుంబ వ్యవస్థలో నే ఉండాలనుకోనేవాడే కాని అసలు పెళ్ళే చేసుకోలేదు .
లండన్ లో 1-3-1880న లండన్ లో లిట్టన్ స్ట్రాచీ ఒక అసాధారణ కుటుంబం లో జన్మించాడు .ఇండియన్ అడ్మిని స్ట్రెటర్అయిన జనరల్ సర్ రికార్డ్ స్ట్రాచీ కుమారుడు . ప్రఖ్యాత వ్యాస రచయిత అయిన లేడీ జెన్ స్ట్రాచీ ,స్పేక్టేటర్ పత్రిక సంపాదకుడు లో స్ట్రాచీ ,పొలిటికల్ ఎకనామిస్ట్ జాన్ స్ట్రాచీ ఆయన కజిన్స్ .కేంబ్రిడ్జి లో ట్రినిటి కాలేజి లో చేరి ,తాను రాసిన కవిత్వానికి బహుమతి రావటం తో ప్రసిద్ధుడయ్యాడు .అతని సంప్రదాయ బద్ధ కవిత్వం తో ముగ్ధులైన న్యాయ నిర్ణేతలు భవిష్యత్తు లో ఆ సంప్రదాయాన్ని తుత్తునియలు చేస్తాడని ఊహించలేదు .గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే నాజూకైన సంప్రాదాయ కవిత్వాన్ని వదిలేసి కత్తిపొట్ల వంటి వచనం రాయటం మొదలెట్టాడు .రాసింది ప్రతిదీ ఆలోచనాత్మకంగా ఉండేది.మొదటి పుస్తకం అచ్చు అయ్యే నాటికి అతనికి 32 ఏళ్ళు .40వ ఏట ఆతను రాసిన వ్యాసాలన్నీ కలిపి .’’ఎమినేంట్ విక్టోరియన్స్ ‘’పేరిట వెలువడ్డాయి .ఇది గోప్పకలవరాన్నే సృష్టించింది . వింత జీవిత చరిత్ర అధ్యయన వ్యాసాలే అవి .బాధాకర ,విచారణాత్మక ,కాపట్య ,ఆటవిక వ్యాసాలే .తిరుగు బాటు కుర్ర కారుకు హుషారు పుట్టించి ,ఆకర్షించాయి .ఇక్కడే ఆయనలోని విలక్షణ చరిత్రకారుడు బయటికొచ్చికళాత్మక జీవితచరిత్ర రచనకు ఆద్యుడయ్యాడు .సెన్సేషన్ సృష్టించి పాప్యులర్ అయ్యాడు .జీవిత చరిత్ర రచనా విధానానికి విస్తృత పరిధి కల్పించాడు .ఆతను రాసిన ‘’క్వీన్ విక్టోరియ ‘’,పోప్’’,ఎలిజ బెత్ అండ్ ఎస్సెక్స్ ‘’రచనలు విప్లవాత్మక ,మానసిక విశ్లేషణాత్మక రచనలు .అంతకు ముందు ఎవరూ వీటి జోలికి వెళ్ళ లేదు .అందుకే జీవిత చర్తిత్ర రచనలో ‘’ట్రెండ్ సెట్టర్ ‘’అయ్యాడు .వ్యంగ్యం ,హాస్యం హేళనా,అవహేలణా దట్టం గా రంగరించి మహా ఆకర్షణ కలిగించాడు .క్షణం వదలకుండా విపరీతంగా చది వించే లక్షణం అతని ప్రత్యేకత.ఎవరి మీదో కోపం ద్వేషం తో రాసినవి కావు .’’It was not with rude iconoclasm ,however but with a surgeon’s detachment and a scholar’s précision that he cut through the rigid pietism, the saddled sentiment and the prudish reticences ‘’అంటే ఒక శాస్త్ర చికిత్స వైద్యుడుగా తనకేమీ సంబంధం లేనట్లు ,ఒక విద్యా వేత్తకు౦ డాల్సిన ఖచ్చితత్వం తో,కఠిన పీటిజాన్ని,ఉయ్యాల లూగుతున్న సెంటి మెంట్ ను ,నంగనాచి అమాయకత్వాన్ని కోసి శుభ్రం చేశాడు .అనుమాన రహిత సత్యాలను వెలువరించాడు .ముగింపు బాధ్యతతీసుకోకుండా వదిలేశాడు .ఊహా గానాలకు ఎక్కువ అవకాశమిచ్చాడు .
ఫిక్షన్ లాగా బయాగ్రఫీ కూడా విపరీతంగా చదివించేది గా ఉండాలని స్ట్రాచీ ముఖ్య ఉద్దేశ్య౦.దీనితో ఆయన అనుకున్నది సాధించాడు .అతని నినాదాలు ‘’స్వచ్చ సంక్షిప్తత ‘’,నిష్పాక్షిక నిజం ‘’,విమర్శ విచారణకు స్వేచ్చ ‘’.ఇవి బాగా క్లిక్ అయ్యాయి .ఇవన్నీ ఒక కొత్త ఆలోచనా రచనా విధానానికి మానిఫెస్టో అయాయి .కవిత్వం తో కూర్చిన రచనా విన్యాసం తో వ్యక్తిని పేజీ పై ఆవిష్కరింప జేశాడు .కవి పోప్ రాసిన సందర్భోచిత కవితా వాక్యాలను శీర్షికలుగా పెట్టి మాంచి ఊపు ,ఉత్సాహం కలిగించి చదివింప జేశాడు .
అయితే స్ట్రాచీ పై చాలా అభియోగాలు వచ్చాయి .చరిత్రను నవలలాగా తిరగ రాశాడుఅన్నది ఒక అభియోగం .చని పోయిన వాళ్ళు రాసినట్లుగా ఉత్తరాలు అందులో రాసి ,వాళ్ళెవరూ డిఫెన్స్ చేసుకోలేరు కదా అనే ధర్యం తో పేజీలు నింపాడు అన్నది మరొకటి .కలాన్ని క్రూర నిర్హేతుక ఇంకులో ముంచి గిలికాడు అన్నది వేరొకటి .అతనిది ద్వేషం కాదు ,వినాశనమూ కాదు .ఎక్కడ మంచి ఉన్నా గ్రహించాడు .దానిని గీటు రాయితో పరీక్షించి పదును పెట్టిరాశాడు .ఒక ప్రత్యేక శైలి కోసమే శైలి అవలంబించాడు .సాహిత్యం లో ప్రాణం చూశాడు .కేరక్టర్ లను కారి కేచర్(వ్యంగ్య పాత్రలు ) లుగా మార్చాడు .అదొక ఆర్ట్ . తాను రాసిన ప్రతి పాత్రనూ అమితంగా అభిమానించి ప్రేమించి ఆరాధించి మాత్రమే రాశాడు .మొదట్లో క్వీన్ విక్టోరియా ను చాలా పొడి పొడి మాటలతో ,హేళనగా రాశాడు .తర్వాత సరదాగా మొదలుపెట్టి ,క్రమంగా గౌరవ ,అభిమాన ఆరాధనలతో పూర్తీ చేశాడు .
1944లో మాక్స్ బీర్ బొమ్ స్ట్రాచీ లోని రచనా సామర్ధ్యాన్ని గూర్చి మాట్లాడుతూ ‘’his pioneering irony ,his dramatic and at times melodramatic effectiveness ‘’బాగా ఆకర్షించింది అన్నాడు .చదివేప్పుడు గోప్పఆనందాన్ని కల్గించే లక్షణం స్ట్రాచీ లో ఉందనటం పూర్తీ సత్యం .ఆతను ప్రవేశ పెట్టిన మేనరిజం లు కూడా తమాషా గా ఉంటాయి .అతని ‘’పోర్త్రైట్స్ అండ్ మినీ ఎచర్స్ అండ్ బుక్స్ అండ్ కేరక్టర్స్’’అనే చిన్న రచనలను చదవటానికి ఎక్కువ ఇష్ట పడతారు .’లేడీ హెస్టర్ స్టాన్హాప్ మరో ప్రత్యేకమైనది .1932లో స్ట్రాచీ 52వ ఏట చనిపోయే నాటికి అతని ప్రభావం ప్రపంచమంతా వ్యాపించి ఉంది .’’Strachey ‘s power of revaluation ,incisive skepticism ,and challenging imagination ,he not only changed the biographers approach ,but also made the reader look for the living men and women too often buried in the solidly official biographies ‘’అని చెప్పిన రచయిత లూయీ అంటర్ మేయర్ మాటలు స్టాలు .
ఫ్రాయిడ్ ప్రభావం స్ట్రాచీ రచనలపై బాగా ఉంది .డాస్టోవిస్కీ ప్రభావం మరీ ఎక్కువ .1916లో లండన్ తిరిగి వచ్చి తల్లితోనే ఉన్నాడు .తన గ్రూప్ బ్లూమ్స్ బెరీ సభ్యులతో తానూ హోమో సెక్సువల్ అని తరచుగా చెప్పుకోనేవాడు .పాట్రిడ్జ్ అనే వాడితో మరి కొందరితో ఆ సంబంధాన్ని సాగించాడు కూడా ..అందులో సభ్యురాలైనపెయింటర్ డోరాకారింగ్ టన్ తో అసాధారణ సాన్నిహిత్యం ఉండేది .ఇద్దరూ కలిసి నాలుగేళ్ళు స్ట్రాచీ1921 మరణం వరకు జీవించారు కూడా . 1921లో ఆమె రాల్ఫ్ ను పెళ్లి చేసుకోవాలను కొన్నది .ప్రేమ తోకాదు,రక్షణ కోసమే .స్ట్రాచీ చనిపోయిన రెండు నెలలకే ఆత్మా హత్య చేసుకొన్నది .
స్ట్రాచీ బ్రతికి ఉండగానే ఆరుపుస్తకాలు –లాండ్ మార్క్స్ ఇన్ ఫ్రెంచ్ లిటరేచర్ ,ఎమినేంట్ విక్టోరియన్స్ ,క్వీన్ విక్టోరియ ,బుక్స్ అండ్ కారక్టేర్స్,ఎలిజబెత్ అండ్ ఎస్సెక్స్ ,పోర్త్రైట్స్ అండ్ మినీ యేచర్స్ ప్రచురింప బడ్డాయి .చనిపోయాక 8పుస్తకాలు –కారేక్టర్స్ అండ్ కామే౦టరీస్,స్పెక్టే టోరియల్ ఎస్సేస్ ,ఎర్మిట్రూడ్అండ్ ఎస్మేరాల్డా ,లిట్టన్ స్ట్రాచీ బై హింసెల్ఫ్ ,ది రియల్లీ ఇంటరెస్టింగ్ క్వేస్చన్ ,ది షార్టర్ స్ట్రాచీ ,లెటర్స్ ఆఫ్ లిట్టన్ స్ట్రాచీ ,అన్ పబ్లిషేడ్ వర్క్స్ ఆఫ్ స్ట్రాచీ వచ్చాయి .
His biographical creed was to paint a picture of the person from the author’s viewpoint—never mind the scholarly inhibitions, never mind the search to find “the truth” of any human situation so far as is possible. He had a “laughing admiration” for the satirists of the 18th century, like Voltaire (1694-1778). He saw religion as Voltaire saw it, as a “ludicrous anachronism.” Careers in public service were mainly full of political intrigue. But human relationships were the nexus of life itself. Strachey eschewed the standard “two fat volumes” of Victorian biographies (he saw these tomes as “hagiographies”: treatment of the illustrious dead). He favored for himself brief biographies, the art of which rested on the subject’s motive and personality as he saw it.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-6-16-ఉయ్యూరు