గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
9-వేద వృత్తి ప్రకాశిక కర్త –క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ
27-10-1896 న బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాలలో హుగ్లీ జిల్లా నమ్ తా గ్రామం లో కులీన చట్టోపాధ్యాయ కుటుంబం లో జన్మించిన క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ వేద వ్యాకరణ ,పాళీ ,ప్రాకృత, ఫైలాలజీ లో మహా విద్వాంసుడు .బంకిం చంద్ర చటోపాధ్యాయ కుటుంబ వారసుడేకాక ఆయననుంచి పునరుజ్జీవన భావదారనూ అందిపుచ్చుకున్నాడు .కలకత్తా యూని వర్సిటి నుండి మెట్రిక్ పాసై ,ప్రెసిడెన్సి కాలేజి లో చేరి చదివి ఇంటర్ పాసయ్యాడు .తర్వాత ఆగ్రా ఔద్ యునైటెడ్ ప్రావిన్స్ కు ప్రవాసిగా వెళ్లి అలహాబాద్ యూని వర్సిటి నుండి బి ఏ .బెనారస్ యూని వర్సిటినుండి 1919 లోసంస్కృతం లో ఎం ఏ . పాసైనాడు .కలకత్తా యూని వర్సిటినుండి 1921 లో వేదం ,1922 లో వేదాంతం లలో ఎం ఏ .పాసయ్యాడు .కాలేజీలో చదివే రోజుల్లో నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కు అతి సన్నిహిత మిత్రుడుగా ఉన్నాడు. క్షేత్రేశ డా.గంగా నాద ఝా శిష్యుడు .
1924 లో అలహాబాద్ యూని వర్సిటిలో సంస్కృత లెక్చరర్ గా పని చేసి ,1950 లో రీడర్ గా పదోన్నతిపోంది ,195 6 లో ప్రొఫెసర్ అయి రెండేళ్ళు పని చేశాడు .తర్వాత బెనారస్ లో సంపూర్ణానంద యూని వర్సిటిలో రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ అయి విస్తృత పరిశోధనలకు అవకాశాలు కల్పించాడు . .సరస్వతి భవన గ్రంధ మాల ధారావాహిక గ్రంధాలకు సంపాదకత్వం వహించాడు .సరస్వతి సుసమ అనే పత్రికకు ఎడిటర్ గా ఉన్నాడు .కేంద్రవిద్యా శాఖ ఆధ్వర్యం లోని తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం లో’’ వేదం అవెస్తా’’ల తులనాత్మక అధ్యయనానికి స్పెషల్ స్కాలర్ గా ఎంపిక చేయబడినాడు .1960 లో కలకత్తా యూని వర్సిటి ఈయనను కంపారటివ్ రెలిజియన్ పై స్టీఫెన్ నిర్మలేందు ఘోష్ లెక్చరర్ గా నియమింప బడ్డాడు .
1924 డిసెంబర్ లో మద్రాస్ లో జరిగిన ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ లో క్రియా శీలక పాత్ర వహించాడు .19 37 లో త్రివేండ్రం లో వేదం,ఇండో ఆర్యన్ పై జరిగిన సభకు అధ్యక్షుడై నడిపాడు .1955 లో అన్నామలై యూని వర్సిటిలో 18 సెషన్ లో వేదం పై జరిగిన సభకుఆధ్యక్షం వహించాడు .1946 కరాచీ లో జరిగిన అఖిలభారతీయ హిందీ సాహిత్య సమ్మేళనం ఫైలాలజి సెక్షన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు .క్షేత్రేశుని సంస్కృత భాషా వైదుష్యానికి మెచ్చి 1966 లో రాష్ట్ర పతి పురస్కారం అందజేయబడింది ‘
ఈశ ,కేన ఉపనిషత్ ‘’వేదవృత్తి ప్రకాశిక ,స్టడీస్ ఇన్ వేదిక్ అండ్ ఇండో ఇండియన్ రెలిజియన్ అండ్ లిట రేచర్ గ్రంధాలను రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-16 –ఉయ్యూరు