మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారిచే ‘నవ్య నాద నీరాజనం’ (ప్రత్యేక వాయులీన-గాత్ర సంగీత విభావరి)
ప్రముఖ సాంస్కృతిక సంస్థలు యువ కళావాహిని,శ్రీ త్యాగరాయ గాన సభల ఆధ్వర్యవంలో ‘సంగీత జ్నానేశ్వర’.’లలిత సంగీత సుధాకర’
మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ఐ.బి.ఎస్ గారు నిర్వహించిన ‘నవ్య నాద నీరాజనం'(ప్రత్యేక వాయులీన- గాత్ర సంగీత విభావరి)
అత్యంత సమ్మోహనకరంగా సాగింది.
ఈ జంత్ర గాత్ర సమ్మేళనంలో ఆదిత్య ప్రసాద్ వయొలిన్ పై వినిపించిన’ఆశూభరీహై’. ‘జోరుమీదున్నావు తుమ్మెదా'(యమన్),’దమ్ భర్ జో ఉధర్'(ఆవారా),ప్యార్ కియా దిల్ నే కహావో తుమ్’ ఫిలింగీతాలకు శ్రోతలు విశేషంగా స్పందించారు.
‘మౌనమె నీ భాష'(గుప్పెడు మనసు), ‘మానస సంచరరే’
(సదాశివ బ్రహ్మేంద్ర),అన్నపూర్ణే విశాలాక్షీ'(దీక్షితార్) కీర్తనలు ఆలపిస్తూ. సామ రాగం 19,20,21 శతాబ్దాలలో ఎలా రూపాంతరత చెందినదీ పరిశోధనాత్మకంగా వివరిస్తున్నప్పుడు శ్రోతలు అత్యంత అశ్చర్యంతో విన్నారు.
‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’,
‘పిలచిన బిగువటరా’,’సారే జహాసే ఆఛ్ఛా’ పాటలు ‘కాపీ’ రాగంలో స్వర పరచ బడ్డాయని తెలిపి వయొలిన్ పై వినిపించినప్పుడు శ్రోతలు విశేషమైన ఆసక్తితో విన్నారు.
అలాగే ‘పాట పాడుమా కృష్ణా’, ‘జీవితమే సఫలము’ పాటలు భీంప్లాస్ రాగంలో స్వర పరచబడ్డాయని తెలిపి వయొలిన్ పై వినిపించినప్పుడు శ్రోతలు ఎంతో ఆనందంతో విన్నారు..
ఈ పాటలన్నింటినీ శ్రీ ఆదిత్య ప్రసాద్ తులనాత్మక పరిశోధనతో వ్యాఖ్యానించి విసిపించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ,యువ కళావాహిని ఆధ్యక్షులు వై.కె.నాగేశ్వర రావు,ప్రముఖ రచఇత్రి కె.వి.కృష్ణకుమారి, సంగీత విద్వాంసులు ఆయ్యగారి శ్యామ సుందరం, విన్నకోట మురళీ కృష్ణ, పాలగుమ్మి రాజగోపాల్ తదితరులు శ్రీ ఆదిత్య ప్రసాద్ ను ఆభినందించి ఘనంగా సత్కరించారు.