వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -51
మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -3
మల్లినాథునికున్న సంస్కృత భాషా,సాహిత్య పాండిత్యం అద్వితీయం,అనన్య సామాన్యం ,అనితర సాధ్యం .తన వ్యాఖ్యానాలను అనేక ఉల్లేఖనాల (కొటేషన్స్ )తో సుసంపన్నం చేశాడు .ఆయన వ్యాఖ్యానాలు అనేక సంస్కృత పుష్ప నవ సుగంధాలను స్రవిస్తాయి .దండి ,క్షీరస్వామి ,దక్ష ,జయమంగళాకార ,ధన్వంతరి ,నిరుక్తకార ,న్యాసాకార ,భట్టా మల్ల,భరత , భాష్యకార ,భోజ ,యాజ్ఞవల్క్య ,వాగ్భట ,వామన ,వార్తికార , సబర ,సాకటా యన ,శ్రీధర ,సుబోధి నికార హేమ చంద్ర ,మొదలైన అఖండ ప్రజ్ఞా వంతుల ప్రసిద్ధ రచనలనుండి ఉదాహరణలు ఇచ్చి ,ప్రముఖ సంస్కృత సాహిత్య సరస్వతీ స్వ రూపులైన కేశవ ,కయ్యాట ,దండి ,వాగ్భట ,భట్ట మల్ల ,భరత,యాజ్ఞ్యవల్క్య ,వల్లభ ,సంబర ,హేమ చంద్రుల సారస్వతం నుండి అవసరమైన చోట్ల ఉల్లేఖనాలు జోడించి తన వ్యాఖ్యానాలు నిండుదనం పరిపుష్టి సాధికారత కలిపించాడు సూరి .
మల్లినాథుని ప్రవాహ శైలి ఆయన విశ్లేషణలో కూడా దర్శనమిస్తుంది .పదాలు ,వాటి దిగుమతి ,చాలా చోట్ల పునరావృత్తమౌతాయి .ఆయన చేసే పునరావృత్తికి ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి సరదాగా చేయడు ..వాటికి పరస్పరాశ్రయాలు (కారిలేటివ్స్ )లేక సమానార్ధకాలు ఉంటాయి .కనుక ఇవి భావాన్ని వ్యాప్తి చెందించటానికి బాగా ఉపయోగపడతాయి .ఒక భావం లేక వ్యక్తీకరణపై వెలుగు ప్రసరింపజేస్తాయి .సమానార్ధక పదాల ను పునరుక్తి మాత్రమే చేశాడు ..
బ్రూక్స్ అండ్ వారెన్ లు ఈ సమానార్ధకాలను బాగా ‘’ఫండమెంటల్స్ ఆఫ్ గుడ్ రైటింగ్ ‘’లో సమర్ధించారు.ఛందస్సులో వ్యాకరణ నిర్మాణ సర్దుబాటు అతి సరళ పదవిన్యాసం లో సమాంతర పదాలు అర్ధాలకంటే మరింత బలీయమై నిర్మాణానికి ఖచ్చిత అ వసరాలౌతాయి -.ఇవి కవితలలో అవసరం అయినా వ్యాఖ్యా సాహిత్యం లో కూడా అవి చోటు పొంది రాణించాయి . మరింత శక్తి వంతంగా భావాన్ని ఇవి తెలియ జేస్తాయి ..మల్లినాథుని వ్యాఖ్యానాలతో సమా0 తర పదాలులేక మార్పులు మూలానికే గొప్ప వన్నె తెచ్చాయి .మోర్గాన్ ‘’రైటింగ్ అండ్ రివైసింగ్ ‘’గ్రంధం లో ‘’modifiers are words that limit the meaning of other words ..A djectives modify nouns or pronouns ‘’అన్నాడు .మల్లినాథుడు ఈ మార్పులు చేశాక తనమార్పులకు నిఘంటుకారులనుండి ఉల్లేఖనాలు ఇచ్చి సమర్ధించుకొన్నాడు .ఆయన వ్యాఖ్యానాలతో ఇవి గొప్ప నిధులు .కొన్ని ఉదాహరణలు -శిశుపాల వద్ద లో -తస్య రావణస్య నర్మ సచివ్య0 -క్రీడా సంబంధ కారిత్వే సచేస్ట త్వం-లీలా క్రీడా చ నర్మ చ ఇత్యమరః ‘’
‘’తంత్ర వాపౌ స్వపర రాష్ట్ర చింతనం -అన్యత్ర తంత్రవాపం శాస్త్రోపధ ప్రయోగం చ వా యస్తేన తంత్ర వాపా దివా -తంత్రం స్వరాష్ట్ర చింతయామావాపః పర చింతనే -శాస్త్రో పధామ్ త ముఖ్యేషు మంత్రం ఇతి వైజయంతీ ‘’
తంత్రం అంటే తన దేశం లేక ఇతర దేశాల వ్యవహారాలపై ఆలోచన చేయటం .శా స్త్రాలను లేక మందును ప్రయోగించటం అనే అర్ధమూ ఉంది .విశ్వ జనీన ‘’మాటను సమర్ధించటానికి మల్లినాథుడు పాణిని సూత్రాలను ఉదహరించారు ఆధిక్యతా పదాన్నీ చక్కగా వివరించాడు .మహాకావ్య నిర్మాతలలో కాళిదాసమహాకవి కవిత్వమే సరళ సుందరం ..భారవి మాఘులు అందుబాటులో లేనికఠిన పదప్రయోగ కర్తలు . .మల్లినాథుడు వీటి విషయం లోనూ ఏమీ తక్కువ చేయలేదు వాటి సరైన అర్ధాలను వెతికి మరీ తెలియ జెసి న్యాయం చేశాడు .దీనికి మల్లినాథుని విపుల నిఘంటు పరిచయం తోడ్పడింది .వీటికి సమానార్థకపదాలు సులభంగా భావాన్ని తెలియ జేయగలవు .వీటి వ్యాకరణ నిర్మాణాన్ని పాణిని సూత్రాల నాధారంగా సూరి సాధించి తెలియ జేశాడు .-
చామరం ను వివరిస్తూ -జవాత్ ప్రకీర్ణో రిమిత ప్రకీర్ణకైహ్ -ప్రకీర్ణకి త్సామరైహ్ ‘’(శిశుపాల వద్ద )
కూబర పదానికి అమరం నుంచి ఉదాహరణ ఇచ్చాడు -’’పాదైహ్ పురః కూబరీణాం విదారితాః -కూబరీణాం స్థనం కూబరుస్తు యుగంధర ఇత్యమరః .
‘’గోమతల్లి కా’’అనే విచిత్ర పదానికి -’’ప్రశస్త గామ్ గోమాతల్లికామ్ .ప్రశస్తమైన ఆవును గోమతల్లి అంటారు .-’’భద్రా గోగోర్మతల్లికా -ఇత్యమరః అని చెప్పాడు .
బల్లికి’’ క్షుద్ర ‘’అంటారు దీన్ని సమర్ధిస్తూ సూరి -’’క్షుద్రాభి రక్షుద్ర తరాభి రాకులం అనే శిశుపాల వధలోని దానికి -క్షుద్రా వ్యం డగా నటీ వేశ్యా ,సరఘ ,కంటకారికా ,-ఇత్యమరః
కిరాతార్జునీయం లోని ‘ అర్ధం సాధిస్తూ -’’వసవన్నవాధి శివేపి దేశే ‘’-’’న తితిక్షా సమమస్తి సాధనం -తితిక్షా సమం క్షమా తుల్యం నాస్తి -క్షాన్ తిః క్షమా తితిక్షాచ ‘’ఇత్యమరః
పాణిని సూత్రాలతో -’’తి జ్ నిశానే ఇతి ధా తొహ్ గుప్తి జిక దభ్యహ్ సన్ ఇతి క్షమార్ధే సన్ ప్రత్యయహ్ ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా

