గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
156-భోజుని తండ్రి సింధు రాజ (950)
పారమార వంశ0 లో మొట్టమొదటి గొప్ప రాజు సింధూరాజా . భోజమహాకవి తండ్రి .మాళవ సింహాసనాన్ని సుమారు ఐదేళ్లు పాలించాడు -తమ్ముడు ముంజరాజు . భోజ శిలాశాసనాలలో తప్ప అతని గురించి వివరాలు తెలియవు .అతని ఆస్థానకవిపద్మ గుప్తుడు రాసిన ‘’నవసాహసాంక’’ చరిత్ర లో కొంత వివరం ఉంది .అయితే దీనికి చారిత్రిక ఆధారాలు లేవు . 4 వ శతాబ్ది కవి మే రుదత్తుడు రాసిన ‘’ప్రబంధ చింతామణి ‘’ప్రకారం సింహద0త భట్ట కుమారుడు .ముంజరాజు తండ్రికి పెంపుడుకొడుకు .ముంజరాజు అనంతరం సింధు రాజ రాజ్యానికి వచ్చాడు .సింధు రాజా కు’’ నవ నారాయణ ‘’,సాహసాంక ‘’బిరుదులున్నాయి .సింధుల సింధాల పేర్లు కూడా ఉన్నాయి .ఆయన్ను ‘’సింధు రాజ దేవ’’అని సంబోధిస్తారు
సింధురాజ చాళుక్య సత్యాశ్రయ రాజును ఓడించి ముంజరాజుతైలపుడికి కోల్పోయిన రాజ్యాలను తిరిగి స్వాధీనం చేసుకొని ,హూణ రాజునూ జయించాడని ‘’ఉదయ పూర్ ప్రశస్తి ‘’లో ఉన్నది .కొంకణా శిలహారాలపై కూడా దండయాత్ర చేశాడు .దక్షిణ గుజరాత్ లోని’’ లాట ‘’ను స్వాధీనం చేసుకొన్నాడు .సింధు రాజ మహా సేనాని మహా రాజే కాక మహాకవి కూడా .కళలను ,సాహిత్యాన్ని ప్రోత్సహించి కుమార భోజునికి ఆదర్శ ప్రాయమై నిలిచాడు ..భోజుడు తండ్రిని మించిన తనయుడిగా జగత్ ప్రసిద్ధమైన సంగతి మనకు తెలిసిందే ..
157-యజుర్వేద భాష్యం రాసిన -ఊవటుడు (1000 )
భోజుని ఆస్థానం లో ఊవటుడు అనే కాశ్మీర పండితుడుండేవాడు .ఈయన శుక్ల యజుర్వేదానికి భాష్యం రాశాడు
ఇతనితోపాటు ‘’చిత్తపకవి ‘’కూడా భోజ రాజాస్థానం లో ఉండేవాడని భోజుని సరస్వతీ కంఠాభరణం లో ,శృంగార ప్రకాశం లోను ఉన్నది
158-లోచన వ్యాఖ్యాన కర్త – అనంత దాసు -(1350)
సాహిత్య దర్పణం కర్త విశ్వనాధ కవిరాజు కపింజల గోత్రుడు .తండ్రి చంద్ర శేఖరుడు ఛ0దోవేత్త ,కవి 14 భాషలలో ప్రవీణుడు ..ఒరిస్సా గజపతిరాజుల ఆస్థానకవి .. విశ్వనాధుని కుమారుడు అనంత దాసు తండ్రి రాసిన సాహిత్య దర్పణం కు ‘’లోచనం ‘’అనే వ్యాఖ్యానం రాశాడు..ఇందులో తన తండ్రి ప్రతిభను ‘’కపింజల వంశ పయోనిధి రాకా చంద్రుడు ,త్రికళింగ పాలకుని అమాత్యుడు ,,పలుభాషా కోవిదుడు ,సాహిత్య పారావారాన్ని తరింపజేసే మార్గ దర్శి ,ధ్వని సిద్ధాంత నాయకమణి 18 భాషలలో దిట్ట ,అన్నిటికి మించి మహాకవి ‘’అని తెలిపాడు . .అనంత దాసు తన తండ్రి విశ్వనాథుడు విజయ నరసింహుని పై ఒక గ్రంధాన్ని రాశాడని చెప్పాడు -’’ఆహవే జగదుద్ధ0డ రాజా మండల రాహవే -శ్రీ నృసింహపాల స్వస్త్యస్తు తవ బాహవే ‘’.బహుశా ఈ పద్యం ఆగ్రంధం లోనిదే అయి ఉండవచ్చు .
159- మహా కవులైన విశ్వనాధ కవిరాజు తాత ,చిన తాత తండ్రి ,(1350)
విశ్వనాధుని కపింజల వంశం ఒరిస్సాలో సాహిత్య వ్యాసంగానికి ప్రసిద్ధి చెందింది .విశ్వనాధుని తాత నారాయణ దాసు జయదేవుని గీత గోవిందం కు ‘’సర్వాంగ సుందరి ‘’వ్యాఖ్య రాశాడు ..నారాయణ దాసు తమ్ముడు చండీదాసు ‘’కావ్య ప్రకాశానికి ‘’దీపికా ‘’అనే వ్యాఖ్యానం ,. ‘’ధ్వనిసిద్ధాంత సంగ్రహం ‘’లు రాశాడు .చండీ దాసు పెదనాన్న కూడా బహు గ్రంథ కర్త .
విశ్వనాధుని తండ్రి 14 భాషలో ప్రసిద్ధుడు .పుష్పమాల ‘’,భాషార్ణవం ‘’గ్రంధాలు రాసి నాట్లు సాహిత్య దర్పణం లో ఉంది .ఈయన రాసిన ఒక పద్యం లో ‘’ఉమా వల్లభ ‘’అనే పదం ఉన్నట్లు సాహిత్య దర్పణం లో ఉల్లేఖితమైంది .దీనికి రెండు అర్ధాలు ఉమా పతియైన శివుడు ,ఉమా అనే రాణి కి భర్త అయిన భామదేవ రాజు .ఇతడే మూడవ భానుదేవుడు 1352-1378 వరకు పాలించాడు
160-వాసుదేవ విజయ కర్త -వాసుదేవుడు (1600 )
1600 కాలానికి చెందిన వాసుదేవ కవి కేరళకు చెందినవాడు .’’వాసుదేవ విజయం’’ కావ్యం రాశాడు .ఇది శ్రీ కృష్ణునికధ మాత్రమేకాక వాసుదేవ కవి విజయం కూడా .పాణిని వ్యాకరణ సూత్రాలకు సందేశాత్మక ఉదాహరణలు తెలియ జేయటమే ఇందులో ముఖ్యోద్దేశ్యం .ఇది అసంపూర్తి రచనేకాని నారాయణీయం రాసిన మేలత్తూర్ నారాయణ భట్ట రాసిన దాతుకావ్యాలలో చోటు చేసుకొన్నది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-17- కాంప్-షార్లెట్-అమెరికా

