—
205- వేదకాలం రుషులైన అంగీరస మహర్షి i
ఋగ్వేద మంత్ర ద్రష్ట -అధర్వ వేదాన్ని అధర్వ అంగీరసం అంటారు సప్తర్షులలో స్థానమున్నవాడు .ఋగ్వేదం లో అగ్ని ,ఇంద్ర ,రుబుష ,అశ్వినీ దేవతలు ,ఉష ,రుద్ర సూర్యులను స్తుతించే 1 మండలం లోని 101- నుంచి 115 మంత్రాలు ,2-1,5-35,36 ,8-2 ,9-9710 మండల మంత్రాల ద్రష్ట అంగీరసుడే ఋగ్వేదం లో 3-31 మంత్రం లో అంగీరసుడు అగ్ని హోత్రుని ఆరాధకునిగా చెప్పబడ్డాడు .ఆత్మ జ్ఞానం తో పరబ్రహ్మను గూర్చి తీవ్ర తపస్సుచేసి అనంత శక్తులు అనంతమైన విజ్ఞానం సాధించాడని పురాణ కధనం బ్రహ్మమానసపుత్రుడు ప్రజాపతులలో ఒకరు .
206-అధర్వ వేద ద్రష్ట -అధర్వ మహర్షి
అంగీరస మహర్షితో పాటు అధర్వ మహర్షి అధర్వ వేదాన్ని దర్శించాడు ..సప్తర్షులలో ఒకడు వేదకాలం లో మొట్టమొదటిసారిగా యిజం చేసినవాడు అధర్వ మహర్షి అంటారు .కర్దమ మహర్షి కుమార్తె శాంతి ని వివాహం చేసుకొని దధీచి మహర్షికి తండ్రి అయ్యాడు .వీరిది భృగు వంశం బ్రహ్మ మానస పుత్రులలో అధర్వ మహర్షి పెద్దవాడు
207-భృగు సంహిత జ్యోతిశ్శాస్త్ర కర్త –భృగు మహర్షి
సప్తర్షులలో ఒకరైన ప్రజాపతి భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు .భృగు సంహిత అనే మొట్టమొదటి జ్యోతిష శాస్త్రాన్ని రచించాడు .జాతక చక్రాలు వేయటం దాన్నిబట్టి బిడ్డ గుణగణాలు వృత్తి వ్యాపారాలు తెలియజేయటం వంటివి అన్నీ అందులో ఉన్నాయి మనువుకు సమకాలీనుడు .దక్షుని కుమార్తె ఖ్యాతి ని పెళ్ళాడి దాత ,విధాత అనే కుమారులను శ్రీ అంటే లక్ష్మేదేవి అనే కుమార్తెకు తండ్రి అయ్యాడు .శుక్రాచార్యుడు ,చ్యవన మహర్షి కూడా భృగుమహర్షి కుమారులే
208-సంజీవని విద్యా వేత్త -శుక్రాచార్యుడు
రాక్షస గురువైన శుక్రాచార్యుడు మృత సంజీవనీ విద్యా వేత్త .దేవగురువు బృహస్పతి కుమారుడు ,అంగీరసుని మనుమడు అయిన కచుని దేవతలు ప్రేరేపించి శుక్రునివద్ద మృతసంజీవినీ విద్య నేర్చుకొని రమ్మని పంపటం ,అతడు వచ్చి గురువు కుమార్తె దేవయాని ప్రేమలో పడటం శుక్రుడు బాగా మద్యం తాగి కచునిచితా భస్మాన్ని అందులో కలుపుకొని తాగటం ,అప్పుడతనికి మృతసంజీవనీ విద్య నేర్పి బయటికి వచ్చేట్లు చేసి దానితో తానూ మళ్ళీ బ్రతకటం ,అప్పటి నుంచి సురాపానం నిషిద్ధం చేయటం మనకు తెలిసిన కథ యే .కనుక మొట్టమొదటి మద్య నిషేధ శాసన కర్త శుక్రాచార్యుడే .
శుక్రుడు నవగ్రహాలలో ఒకడు వివాహ కారకుడు .శుక్ర అంటే ప్రకాశం ,స్వచ్ఛత అని అర్ధం .బలి చక్రవరి వామనుడికి మూడడుగులు దానం చేస్తున్నప్పుడు వద్దని శుక్రుడు వారించినా ఒప్పుకోకపోతే రాజును రక్షించే నెపం తో కమండలం లోని నీటిలో దాగి ధార పడకుండా ఆపితే ,దర్భ పుల్లతో పొడిచి కన్ను పోగొట్టాడు వామనుడు అప్పటినుంచి శుక్రుడు ఒంటి కంటి వాడు -’’ఏకా కన్నయ్య ‘’అయ్యాడని మనకు తెలుసు
శుక్రాచార్యులు మానవ జీవితానికి కావాల్సిన పాటించాల్సిన నియమాలను చెప్పాడు దానినే ‘’శుక్ర నీతి శాస్త్రం ‘’అంటారు .అందులో కొన్ని -1-అమ్మాయి పేరు చెబితేనే వంకర్లు తిరిగిపోతారు అలాంటిది అందమైన అమ్మాయి కదిలించే కనురెప్పల సొగసు ఎందుకు చూడరు 2-తెలివైన మహిళ చక్కగా వంట చేసి హాయిగా తిని బాగా మాట్లాడి మగవాడి మనసు ఎందుకు దోచుకోదు ?3-పరస్త్రీ వ్యామోహం వినాశహేతువుకనుకనే ఇంద్ర ,నహుష రావణాదులు నశించారు . 4-రాజుకు పర స్త్రీ వ్యామోహం, పరధనాపేక్ష ,కోపం తో శిక్షించటం పనికిరావు .వ్యామోహం ,అపేక్ష క్రోదాలు పతన హేతువులు వగైరా
209-భక్తి సూత్ర కర్త -నారద మహర్షి
దేవఋషి నారదు విష్ణు మూర్తి కి మహా భక్తుడు త్రిలోక సంచారి మహతి ఆయన వీణ పేరు .భక్తిలో తరించటానికి ‘’నారద భక్తి సూత్రాలు ‘’చెప్పాడు .అవి అందరికి ఆచరణీయాలే .అజ్ఞానం లో ఉన్నవారికళ్ళు తెరిపించి జ్ఞానమార్గం లో పెట్టటమే ఆయన చేసేపని . ఆయన లేని పురాణం ఇతిహాసాలు లేవు .దివి భువి సంధానకర్త నారదుడు నారం దదాతి నారదః అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు .నారం అంటే నీరు అనే అర్ధమూ ఉంది విష్ణువుకు నారదునికి అభేదం
భక్తి ఉద్యమకారుడు నారదుడు .భక్తియోగం ఆయన చెప్పిన సిద్ధాంతం అందుకే భక్తి సూత్రాలు రాశాడు .ఇందులో నవవిధ భక్తిమార్గాలను తొమ్మిది అధ్యాయాలలో 84 శ్లోకాలలో తెలియ బరచాడు .కొన్ని శ్లోకాలు చూద్దాం –
1- ఆదాతో భక్తి వ్యాఖ్యాస్యామః -2-సా త్వస్మిన్ పరమ ప్రేమ రూపా 3-అమృతస్వ రూపాచ 4-యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి 5-యత్ప్రాప్యకించి ద్వా0ఛతి న శ్రోచ చతి ,న ద్వేష్టి న రమతే నొసమాహి భవతి ‘’
వీటన్నిటిభావం -భక్తి గురించి ఇప్పుడు తెలియజేస్తా.అది పరమపురుషుని తెలిపే గొప్ప ప్రేమ మార్గం. అలౌకికమైనది అది తెలిస్తే సంపుర్ణమై న సంతృప్తితో మోక్షం .ప్రేమను పొందినవాడు దేనినీ కోరడు ,,దీనిగురించి బాధపడడు దేనినీ ద్వేషించడు ,దేనితోనూ తృప్తి ఆనందం పొందడు .
భక్తి మార్గాన్వేషకులకు నారద భక్తి సూత్రాలు’’ భక్తి వేదమే ‘’.
210- -ఋభుగీత చెప్పిన -ఋభుడు
పరమ శివుడు తన అంతే వాసి ‘’ఋభు ‘’మహర్షికి ‘’శివరహస్యం’’చెప్పాడు దీనినే ‘’ఋభు గీత ‘’అంటారు .ఋభు గీతను ఋభుడు తన శిష్యుడు ‘’నిదాఘ మహర్షి ‘’కి బోధించాడు ఆయన శిష్యులకు బోధించగా అది లోకం లో వ్యాప్తి చెందింది . ఋభు గీత ను భగవాన్ రమణ మహర్షి తన ప్రవచనాలతో తరచుగా ప్రస్తావించేవారు . అదంటే ఆయనకు ప్రాణం . 122 శ్లోకాలున్న ఋభు గీత తమిళం లో ముందు తర్వాత హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషల్లోకి వ్యాఖ్యానాలతో వెలువడింది .అందులోని సారాంశం కొంత తెలుసుకొందాం -విశ్వం సృజింపబడింది ,అభి వ్యక్తమైంది నశించేది కాదు .పరిశుద్ధ చైతన్యం నిశ్చల మైనది . రూపాలు పేర్లూ అన్నీ ఛాయా మాత్రాలు విశ్వం లో ద్వంద్వాలున్నాయని కొందరు అంటారు .మనసుకు ఇంద్రియాలకు భేదం ఉన్నదా ?మనసు లేకుండా అవి పని చేయగలవా ?మనసు అంటే అనేక ఆలోచనల కట్ట యే కదా .అవి నిశ్చల సముద్ర తరంగాలులాగా నిశ్చల అద్వితీయచైతన్యం లో స్పందనలే అని తెలుసుకొంటే మనసు స్థిరంగా ఉంటుంది
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా

