గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
217-అలభ్య నాటక రచయిత -మహా కవి చంద్ర (క్రీశ . 319 )
క్షేమేంద్రుడు కల్హణుడు మంఖ కవుల చేత గుర్తింపబడిన కవి మహాకవి చంద్ర క్రీ శ 319 లో కాశ్మీర్ పాలకుడు తుంజీర అని పిలువబడే రణాదిత్యుని కాలం వాడు .ఆయన రాసిన నాటకం అన్నితరగతుల ప్రజలనువిపరీతంగా ఆకర్షించిందని అభినవ గుప్తుడే చెప్పాడు కానీ అది అలభ్యం .ఆయన రాసినట్లు చెప్పబడే కొన్ని కవితలు కనిపిస్తాయి అందులో ఒకటి -ప్రేయసీ కాలం దుప్పిలాంటిది ఎగిరిపారిపోతే మళ్ళీ తిరిగిరాదు . ‘’కాశ్మీరం లో కుంకుమపువ్వు యెంత బాగా ఎక్కువగా పండుతుందో కవిత్వమూ అంత విస్తృతంగా అందంగా పండుతుంది ‘’అన్న బిల్హణకవి మాట పై కవితను చదివితే అర్ధమవుతుంది
218-కాశ్మీర్ లో సంస్కృత కావ్య రచన (650 -884 )
కాశ్మీర్ లో లభించిన మొట్టమొదటిరచన ‘’నీలకంఠ పురాణం ‘’.ఇదికావ్యం కాదు .క్రీశ 650 లో భూమాకుడు రాసిన ‘’అర్జున రావణీయం ‘’మొదటికావ్యం .ఇది భట్టికావ్యానికి అనుసరణం .ఉపోద్ఘాతం లో కవి దీన్ని మహాకావ్యం అని చెప్పుకొన్నా ఇందులో పాణినీయ వ్యాకరణ సూత్ర వివరణమే ఎక్కువ .ఇందులోని 18 సర్గలు పాణిని అష్టాధ్యాయిలోని 18 గాన కుటాది పాదం ,భూవాది పాదాలకు సరిసమానం కథ -రావణ కార్త వీర్యార్జున మే . 500 శ్లోకాలు భారవి కిరాతార్జునీయం శ్రీ తో మొదలైనట్లే ఈ కవీ అలానే చేశాడు . 8 వ శతాబ్దం దాకా కాశ్మీర సంస్కృత కవులు సృజన కంటే విమర్శనాత్మక రచనలకు ప్రాధాన్య మిచ్చారు .ఉద్భటకవి తో కాశ్మీర్ లో సంస్కృత సృజన రచన ప్రారంభమైందని అంటారు
జయాపీడని ఆస్థానకవి దామోదర గుప్త రచన ‘’కుట్టినీమతం ‘’అశ్లీల సాహిత్యం గా ముద్రపడింది . 1058 శ్లోకాల ఈ కావ్యం వారణాసికి చెందిన మాలతి సలహా సంప్రదింపులకు వికరల ను చేరటం అనేక ప్రేమ కిటుకులు ,మన్మధోత్సవం శృంగారం దట్టించిన ప్రేమకథ .కొన్ని శ్లోకాల భావాలు చూద్దాం -1-పుష్పహారం ధరించిన ఆమె స్రగ్ధర అంటే అందమైనాముఖం కలది .ఆమె సువదన,ప్రహర్షిణి ,తనుమధ్యమా ,రుచిరా ,సుభాషిణీ .ఈ పేర్లు అందానికి ఛందస్స్సు వైవిధ్యానికి సరిపోతోంది
8 వ శతాబ్దం లో సర్వజ్ఞ మిత్ర కవి ‘’స్రగ్ధరా స్తోత్రం ‘’లో 37 స్రగ్ధరా వృత్త శ్లోకాలున్నాయి . ప్రసన్నం చేసుకొనే దీనాక్ర0 దన శైలి లో పాపాలను క్షమించమనటం తన బలహీనతలను చెప్పుకోవటం కనిపిస్తుంది .ఒకశ్లోకం లో ‘’నా తప్పులు బలహీనతలు మోసం ద్రోహం నన్ను వెంటాడుతున్నాయి .రెండవ శ్లోకం లో -చావుకు దగ్గరైన వాడినీ మంచి వైద్యం తెలిసిన డా వైద్యుడు నిర్లక్ష్యంగా వదిలేసినట్లుంది నా పరిస్థితి
కవి సర్వజ్ఞ మిత్రుడు కాశ్మీరం లోపుట్టినా మగధలోని నలంద విశ్వ విద్యాలయం లో చదివి గొప్ప పండితుడు విజ్ఞానశాస్త్ర వేత్త అయి ‘’విక్రమ శీల మహా విహారాని’’కి ‘’రాజగురు ,పండిత భిక్షు ,జిన రక్షిత అయ్యాను ‘’అని చెప్పుకున్నాడని ‘’పాగ్సాన్ జాన్ స0గ్ ‘’అనే టిబెటన్ మత గురువు చెప్పాడు .సర్వజ్ఞ మిత్రుని భుజంగ స్తోత్రం కాశ్మీర్ లోనే కాక టిబెట్ లోని టాంగ్యూర్ లో కూడా ప్రార్ధనలో ప్రాచుర్యం లో ఉంది’
కాశ్మీర్ పండిత గురువు రవి గుప్తుని శ్లోకాలు ,శాక్య శ్రీ భద్రుని 21 అధ్యాయాలలో శ్లోకాలు టిబెట్ లోనూ బాగా ప్రచారమైనాయి
దేశం లో చాలా ప్రాంతాలలో మహా కావ్యాలహవా తగ్గిపోతున్నప్పుడు కాశ్మీర్ లో 9 వ శతాబ్దం లో అంటే 855-884 కాలపు రాజైన అవంతీ వర్మకాలం లో మహాకావ్య విజృంభణ సాగింది .జయాపీడని ఆస్థానకవి రత్నాకరుడు ‘’హరవిజయం ‘’మహాకావ్యం రాసి తనను ‘’శ్రీ బాల బృహస్పతి అనుజీవిని ‘’గా చెప్పుకున్నాడు .అవంతివర్మ రాజ్యానికి రాక ముందు శంకుక కవి ‘’భువనాభ్యుదయం ‘’తో మహాకావ్యాలు కొంత వెనక్కు తగ్గాయి .ఇందులో850 లో మమ్మ ,ఉత్పల మధ్య తీవ్ర పోరాట చరిత్ర ఉంది ఒక శ్లోక భావం -’’వితస్త ప్రవాహం యుద్ధభూమిలో చనిపోయిన వీర సైనికుల కళేబరాల భీభత్సానికి ఆగిపోయింది .ఇది చాలా విచార సంఘటన .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

