గీర్వాణ కవులకవితా గీర్వాణం -3
257-సిద్ధాంత శిక్షా మణి గ్రంథ కర్త – జగద్గురువులు -శ్రీ రేణుకాచార్యులు (క్రీ.శ . 800 )
భారత దేశం లో వీరశైవ ధర్మం అతి ప్రాచీనమైనది .ప్రతియుగం లోనూ ఈ ధర్మం వర్ధిల్లుతుందని వారి నమ్మకం .శివ మహాదేవుని ఆదేశం ప్రకారం జగద్గురువులైన పంచా చార్యులుప్రతి యుగం లోను లింగాలనుండి జన్మించి వీరశైవ ధర్మ ప్రతిష్టాపన చేశారు .ఈ అయిదు పీఠాలు 1-కర్ణాటకలోని రంభాపురి లో 2ఉజ్జయిని 3-కేదారనాధ్ 4-శ్రీశైలం 5 కాశీ లో ఉన్నాయి . ఈ పీఠాలు ఆధ్యాత్మిక ప్రబోధం తోపాటు మానవ సంక్షేమానికి కూడా సేవలందిస్తున్నాయి .ఈ అయిదు వీరశైవ జాతీయ పీఠాలు .
రంభాపురి పీఠాధిపతి జగద్గురు రేణుకాచార్యులు పదివిడి సూత్రాన్ని అగస్త్య మహర్షికి ,అందజేశారు ఉజ్జయిని పీఠ జగద్గురువులు శ్రీ దారుకాచార్యులు ‘’వృష్టి సూత్రాన్ని ‘’దధీచి మహర్షికి ఇచ్చారు .కేదార పీఠ జగద్గురు లు శ్రీ ఘంట కర్ణాచార్యులు ‘’లంబన సూత్రాన్ని ‘’వ్యాసమహర్షికి ప్రదానం చేశారు .శ్రీశైల పీఠ జగద్గురువులు శ్రీ ధేనుకా చార్యులు ‘’ముక్తాగుచ్ఛ సూత్రాన్ని ‘’మహర్షి సనందునికి అందించారు .కాశీపీఠ జగద్గురువులు శ్రీ విశ్వ కర్ణాచార్యులు ‘’పంచ వర్ణ సూత్రాన్ని ‘’దూర్వాస మహర్షికి అందించారు . ఈ అయిదు సూత్రాలు వీరశైవ మత మూల సూత్రాలు .వీరశైవాన్ని శివాద్వైతం అంటారు .శైవాగమ చక్రవర్తి శ్రీ శివ యోగి శివాచార్య వేద వేదాంగాలలో నిష్ణాతులు ఆయనకు అగస్త్య మహర్షికి జరిగిన సంవాద సారమే వీర శైవ సిద్ధాంత సారం .ఇది వేదం ఉపనిషత్తులు 28 శైవాగమాల సారాంశం .ఈ విషయాలన్నీ నిక్షిప్తం చేయబడిన గ్రంధం ‘’సిద్ధాంత శిక్షామణి ‘’.ఇదే వీర శై వానికి మూల గ్రంధం .ఇది 101 స్థలాలుగా ఉన్న అష్టావర్ణ ,పంచాచారాలను వివరించే ‘’శతస్థల సిద్ధాంతం ‘’గా రేణుకా చార్యుల అమృత వాణి నుండి వెలువడి ‘’ప్రసాద వాణి ‘’గా పిలువ బడుతోంది .దీనికే’’ ప్రసాదిక ‘’అని మరోపేరుంది దీన్ని కంఠస్తం చేసినవారికి,అధ్యయనం చేసినవారికి ధనకనక వస్తువాహనాలతోపాటు మోక్షాన్ని కూడా పొందుతారని విశ్వాసం.ఇది పలుభాషలలోకి అనువాదం పొందింది . ఇందులో మొదటి శ్లోకం –
‘’త్రైలోక్య సంపదాలేఖ్యా సముల్లేఖన భిత్తయే -సచ్చిదానంద రూపాయ శివాయ గురవే నమః ‘’
258-వీర శైవ ఉద్గ్రంధ ప్రచురణ కర్త -ఉజ్జయిని వీరశైవ జగద్గురు శ్రీ సిద్ధేశ్వర శివాచార్య (1890
ఉజ్జయిని వీరశైవ పీఠ జగద్గురువులుగా ఉన్న సిద్దేశ్వర శివా చార్య కాలం లో అత్యంత వైభవం గా వర్ధిల్లింది .1890 లో కర్ణాటక చిత్ర దుర్గ జిల్లా జగలూరు తాలూకా బంగానహళ్లి గ్రామం లో జన్మించారు .తలిదండ్రులు చిన్న బసవాచార్య ,గురు సిద్దాంబే .సిద్ధలింగ పేరుతొ అందరూ పిలిచేవారు 13 వ ఏటఉజ్జయినిలో మరుల సిద్దేశ్వర స్వామిని మొదటిసారిగా దర్శించారు .అక్కడి రధోత్సవం కన్నులపండువు అనిపించింది .తలిదండ్రులు తమకుమారుడు జగద్గురువు అవుతాడని ఊహించనేలేదు .ఉజ్జయినిలోశివ పీఠం లో ఆయనకు శివ దీక్ష నిచ్చారు .మారుల సిద్దేశ్వర స్వామి దర్శనం చేసి తలిదండ్రులతో స్వగ్రామం కు తిరిగివచ్చారు
జగద్గురువులు మరుల సిద్ధ శివా చార్యులు చిన్నారి సిద్ధ లింగనిలో అనేక మహిమలు విభూతి చూశారు .ఈ పిల్లవాడిని పిలిపించి 1906 లో 16 వ ఏటనే ఉజ్జయిని ‘’సద్ధర్మ పీఠా నికి పీఠాధిపతి ని చేసి శ్రీ జగద్గురు సిద్ధలింగ శివాచార్య దీక్షానామ ధేయమిచ్చారు ఈ యువ జగద్గురువు సంస్కృత ,శాస్త్ర ,తర్క వేదాంత వ్యాకరణాలను శ్రీ వేద బసవప్ప శాస్త్రి మొదలైనవారు వద్ద నేర్చుకొన్నారు .వీరశైవ వేదాగమాలతో సహా సర్వ శాస్త్ర పారంగతులయ్యారు . అన్నిమతాలవారు ఈస్వామికి ఆప్తులయ్యారు అందరిపై అనుగ్రహం ప్రసరింపజేసి అందరికి అందుబాటులోకి పీఠాన్ని తెచ్చారు .నుదుట ధరించే విభూ తికి పరమ వైభవాన్ని తెచ్చారు. పాఠశాల గోశాల ,భోజనశాల గ్రంధాలయం
నిర్మించారు . న0దే భద్రే సురభి,సుశీల సుమన వంటి గోవులను ప్రత్యేకంగా పెంచారు .ఆవుపేడతోనే విభూతి తయారు చేయించేవారు .
తాము సంస్కృతం లో మహా నిష్ణాతులైనందున వీరశైవ ధరానుష్టానికి సంస్కృతం యొక్క ఆవశ్యకత గుర్తించి ఆభాషకు విశేష సేవలు చేశారు . 1920 లో పీఠం లోనే సంస్కృత వైదిక పాఠశాల ఏర్పాటు చేశారు .మద్రాస్ లోని వీరశైవ విద్యార్ధక ఫండ్ కు 5 వేల రూపాయలు విరాళమిచ్చారు అనేక పాఠశాలలు స్థాపించారు .శ్రీవారికి మహా రాష్ట్ర భక్తులు మంచి ఆత్మీయులైనారు. 1922 లో సద్ధర్మ జ్ఞానగురు విద్యాపీఠం నెలకొల్పి శివాగమాలపై శిక్షణ నిస్తూ వేదం, శాస్త్ర, శైవ గ్రంథ ప్రచురణ చేశారు .శ్రీపీఠం లోను శాఖామఠ ము లలోను వేదం ,సంగీత పాఠశాలలు ఏర్పాటు చేశారు .ఇదంతా ఒక అద్భుత గురుకులం అనుభూతిని కలిగిస్తుంది .పండితులను కళాకారులను విద్యావేత్తలు ఆహ్వానించి సత్కరించి నగదు పారితోషికమిచ్చేవారు . 27ఏళ్ళు అత్యంత సమర్ధవంతంగా సంప్రదాయ బద్ధంగా పీఠాధిపత్యం నిర్వహించి సమాజానికి బహువిధ సేవలు అందించారు .వారి ముఖ్యోద్దేశ్యం భక్త రక్షణ,వారి బాగోగులు .తమ పీఠమేకాక మిగిలిన నాలుగు పీఠాలసర్వతోముఖాభి వృద్ధికి కృషి చేసిన మహానుభావులు శ్రీ సిద్ధ లింగ శివాచార్య జగద్గురువులు .ఉత్తరాధిపతిగా శ్రీ శివానంద శివ చార్యులను ప్రతిటించి 1936 లో శివైక్యమయ్యారు
259-రక్ష రుద్రాక్ష చంద్ర మార్తాండ కర్త -శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రి (1876-1948 )
శ్రౌత శివాద్వైత వేదాంత నిష్ణాతులు శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రిగారు 1876 లో గుంటూరు జిల్లా తిక్కన కొండ గ్రామం లో జన్మించారు .అగోరనాధ్యాయ జ్వాలాంబికల కుమారుడు .కుటుంబమంతా వేద వేదాంగ తర్క వ్యాకరణ ఆయుర్వేద జ్యోతిష శాస్త్ర శిరోమణులే .అనేక శివాలయాలలో శివలింగ ప్రతిష్టాపన చేసిన సమర్దులే .కృష్ణాజిల్లా పమిడిముక్కలలోని మల్లంపల్లి వీరేశలింగారాధ్యులవద్ద కొంతకాలం చదివి శ్రీకాళహస్తి చేరి 15 వ ఏట అపరపతంజలి శ్రీనివాస శాస్త్రి వద్ద పాణినీయం నేర్చి సంస్కృతం లో విద్వావంసుడై ,19 వ ఏట తమిళనాడు లోని నదుక్ఖావేరి వెళ్లి తర్క మీమాంస నీలకంఠ ,శంకర రామానుజ మధ్వా చార్య భాష్యాలు గ్రహించి ,అప్పయ్య దీక్షిత నీలకంఠ దీక్షితుల శైవాగమాలన్నీ అవలోడనం చేసి, శంకర పద వాక్యప్రమాణ సాధికారత సాధించారు .సంస్కృత తమిళాలలో వీరశైవ గ్రంథాలెన్నో రాశారు ‘’.శైవ విద్యాపత్రిక’’కు సంపాదకులైనారు .గురువుతో 28 శైవ ఆగమనాలను క్షుణ్ణంగా చర్చించారు .ఆ లేత వయసులోనే సంస్కృతం లో ‘’రక్షా రుద్రాక్ష చంద్ర మార్తాండం ‘’ఉద్గ్రంధం రాశారు .దీనిని తమిళం లోను రాసి గురుదేవునికి అంకితమిచ్చారు .గురువు శ్రీ శ్రీనివాస శాస్త్రి అనుగ్రహం తో నాగ లింగ శాస్త్రిగారికి శైవ సిద్ధాంత గ్రంధం ‘’నీలకంఠ భాష్య ‘’తాటాకుల ప్రతిని బహుకరించారు
నాగ లింగ శాస్త్రిగారు ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి ‘’శ్రౌత శైవ ప్రకాశిక ‘’పత్రికను నడుపుతూ అనేక సంస్కృత తెలుగు గ్రంధాలు ముద్రించారు .అప్పయ్య దీక్షితుల ‘’బ్రహ్మ తర్క స్తవం ,భారత ,రామాయణాలు ,చతుర్వేద తాత్పర్య సంగ్రహం ,శివ కర్ణామృతం ,పంచ రత్న స్తుతి లను విస్తృత సంస్కృత వ్యాఖ్యానాలతో ప్రచురించారు .ఇవికాక అయిదు సంస్కృత రచనలు చేసి వాటికి సంస్కృత ఆంధ్రాలలో వ్యాఖ్యానం రాసి ప్రచురించారు -అవే 1-శైవ సిద్ధాంత సంగ్రహం 2-శివ ఏవ కారణం 3- శ్రౌతమేవాహి శైవ చిహ్నవి 4-శ్రౌతమేవాహి ధరణం -లింగస్య 5-శిష్ట సర్వే శివమ్ ప్రపంన్నాహ్ .ఇవన్నీ 1900-3 లో మూడేళ్ళలో ప్రచురితాలు .ఇవి శివజ్ఞానలహరి పేరిట ఆంగ్లాను వాదం పొందాయి పవిత్ర శైవ క్షేత్ర సందర్శనం చేసి శైవ మత ప్రచారమూ చేశారు శాస్త్రిగారు .మొత్తం 100 కుపైగా శైవ సిద్ధాంత గ్రంధాలు రాశారు నాగ లింగ శాస్త్రిగారు నీలకంఠ భాష్యానికి ‘’శివ చింతామణి ప్రభ ‘’వ్యాఖ్య రాశారు . 1930 లో అప్పయ్య దీక్షితుల ‘’శివార్క మణి దీపిక’’ను వేద వ్యాసమహర్షి చెప్పిన 545 బ్రహ్మ సూత్రాలతో సంస్కృతం లో రాస్తే దీన్ని వీరి మరణానంతరం శిష్యుడు శ్రీ ముదిగొండ వీరేశలింగ శాస్త్రి 1950 లో ప్రచురించారు .ఈ సంస్కృత భాష్యం తెలుగు మళయాళ తమిళ,కన్నడ భాషలలో లభ్యంగా ఉంది .ఈ భాష్యం ఇంగ్లిష్ అనువాదం పొంది ‘’తత్వ త్రయం ‘’అయిన జీవ, జగత్, ఈశ్వర తత్త్వం ప్రపంచమంతా వ్యాపించాలని శాస్త్రిగారు భావించారు
1937 లో నాగ లింగ శాస్త్రి గారికి విజయవాడలో దుర్గా కళా కళామందిరం ఎదురుగా ఉన్న శైవ మహా పీఠం లో షష్ట్యబ్దిపూర్తి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు .శాస్త్రిగారు 1930 నుంచి 1948 మరణ పర్యంతం ఎన్నో వ్యాసాలూ వ్యాఖ్యాన గ్రంధాలుశైవ సిద్ధాంతం పై రాశారు .ఈకాలం లోనే 545 బ్రహ్మ సూత్రాలపై విపులమైన వ్యాఖ్యానం రాశారు వీటినన్నిటిని శ్రీ ముదిగొండ వీరేశలింగ శాస్త్రిగారు ఆ తర్వాత ప్రచురించారు .మచిలీపట్నం లోని శ్రీ కాశీనాధుని వీరేశలింగం అయ్యవారు శాస్త్రిగారి మరణానికి సంతాప సందేశం పంపుతూ He was a learned man with whom, one can discuss the sastras, to one’s satisfaction, imbibed with all good qualities, a great poet, one who understood the essence of the vedas, one who worshipped Siva with great Devotion, a great commentator of the Veda Vagmayam without compromise or contradiction. May he alone bear this Bharatiya samskruti like the thousand hooded serpent king Sesha, bearing the weight of this entire universe and inspire the younger generations, on Indian values for years to come”అని చంపకమాల శ్లోకాలలో ప్రస్తుతించారు
260-నృసింహ స్తుతి కర్త -శ్రీ శ్రీ విశ్వపతి తీర్ధ
ఉడిపి లోని పెజావర్ మఠ స్థాపకులు శ్రీ అధోక్షజ తీర్ధ శ్రీ మధ్వాచార్యుల శిష్యులలో ఒకరు .ఇక్కడి దైవం శ్రీ విఠలుడు .ఆచార్య పరంపరలో 18 వ ఆచార్యులు శ్రీ విజయధ్వజ తీర్ధ . వీరు భాగవత పురాణానికి వ్యాఖ్య రాశారు అది ‘’విజయధ్వజ తీర్దీయం ‘’గా ప్రసిద్ధి చెందింది . 18వ ఆచార్య శ్రీ విశ్వపతి తీర్ధ నృసింహ స్తుతి కాక మధ్వ విజయం పై వ్యాఖ్యానం రాశారు .
ప్రస్తుత పీఠాధిపతి 32 వ వారైన శ్రీ విశ్వేశ తీర్థులు 1931 లో జన్మించి 1938 లో సన్యాసదీక్షపొందారు . 1953లో అఖిల భారత మధ్వ సమ్మేళనాన్ని ఉడిపిలో భారీఎత్తున నిర్వహించారు .కృష్ణ దేవాలయ గోడ ,రాజంగానే గ్రామం లో విశాలమైన ఆడిటోరియం నిర్మించారు .శ్రీ విశ్వ ప్రసన్న తీర్ధను ఉత్తరాధికారిగా నియమించారు . అన్ని ధార్మిక సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు .ప్రాధాని మోడీ వీరిని సందర్శించారు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా

